Telugu govt jobs   »   AP-geography-pdf   »   AP-geography-pdf

AP Geography -Andhra Pradesh Forest and Animals PDF In Telugu (ఆంధ్ర ప్రదేశ్ –అడవులు- జంతుజాలం)

Andhra Pradesh Geography PDF In Telugu(ఆంధ్ర ప్రదేశ్ భూగోళశాస్త్రం) స్టడీ మెటీరియల్ PDF ఆంధ్ర ప్రదేశ్ లో అత్యంత ముఖ్యమైన మరియు ప్రతిష్టాత్మకమైన పరీక్షలు  APPSC గ్రూప్-1,2,3 ,4 , పోలీస్ , రెవెన్యూ  మొదలైన పరీక్షలకు చాలా మంది ఆశావహులు, ఈ  ప్రతిష్టాత్మక ఉద్యోగాల్లో కి ప్రవేశించడానికి ఆసక్తి చూపుతారు.దీనికి పోటీ ఎక్కువగా ఉండడం కారణంగా, అధిక వెయిటేజీ సంబంధిత సబ్జెక్టులను ఎంచుకుని స్మార్ట్ అధ్యయనంతో ఉద్యోగం పొందవచ్చు. ఈ పరీక్షలలో ముఖ్యమైన అంశాలు అయిన పౌర శాస్త్రం , చరిత్ర, భూగోళశాస్త్రం, ఆర్ధిక శాస్త్రం, సైన్సు మరియు విజ్ఞానం, సమకాలీన అంశాలు చాల ముఖ్యమైన పాత్ర పోషిస్తాయి. కాబట్టి ఈ APPSC గ్రూప్-1,2,3 ,4 , పోలీస్ , రెవెన్యూ  మొదలైన పరీక్షలపై ఆసక్తి ఉన్న అభ్యర్థుల కొరకు Adda247 Telugu, ఈ అంశాలలో ఒకటైన  Andhra Pradesh Geography (ఆంధ్ర ప్రదేశ్ భూగోళశాస్త్రం) కి సంబంధించిన కొన్ని ముఖ్యమైన అంశాలను PDF రూపంలో అందిస్తుంది.

Andhra Pradesh Geography PDF In Telugu (ఆంధ్ర ప్రదేశ్  భూగోళశాస్త్రం PDF తెలుగులో)

APPSC గ్రూప్స్, పోలీస్ ,రెవెన్యూ , వంటి అన్ని పరీక్షలలో అడిగే ప్రశ్నల సరళిని అనుసరించి అన్ని పోటీ పరీక్షలకు ఉపయోగపడే విధంగా సమగ్రమైన సిలబస్ తో కూడిన సమాచారం ఈ క్రింద ఇవ్వడం జరిగింది.

ఆంధ్రప్రదేశ్‌ అడవులు – జంతుజాలం

ఆంధ్రప్రదేశ్‌ సామాజిక ఆర్థిక సర్వే ప్రకారం (2015 – 16) రాష్ట్రంలో అడవులు 36,914.78

చ.కి.మీ. విస్తీర్ణంలో విస్తరించి ఉన్నాయి.

 •  రాష్ట్రం మొత్తం విస్తీర్ణంలో 23.04% అడవులు ఉన్నాయి.
 • దేశ అటవీ విస్తీర్ణంలో ఆంధ్రప్రదేశ్‌ 9వ స్థానాన్నిఆక్రమించింది.

భారత దేశంలో ముఖ్యమైన అటవీ సంస్థలు

 1. భారతీయ అటవీ పరిశోధనా సంస్థ – డెహ్రాడూన్‌
 2. శుష్క అటవీ పరిశోధనా సంస్థ – జోద్‌పూర్‌
 3. తేమ ఆకురాల్చు అటవీ పరిశోధనా సంస్థ – జోరాట్‌
 4. ఉష్ణ మండల అడవుల అటవీ పరిశోధనా సంస్థ – జబల్‌పూర్‌
 5. సమశీతల అటవీ పరిశోధనా సంస్థ – సిమ్లా
 6. సామాజిక అటవీ పరిశోధనా సంస్థ – అలహాబాద్‌
 7. ఫారెస్ట్‌ మేనేజ్‌మెంట్‌ సంస్థ – భోపాల్‌
 •  కోస్తాంధ్ర ప్రాంతంలో అటవీ వైశాల్యం 19,590 చ.కి.మీ. (30.67%)
 •  రాయలసీమలో అటవీ వైశాల్యం 14,996 చ.కి.మీ. (23.53%)

రాష్ట్రంలో నేలల స్వభావం, వర్షపాతం, ఉప్టోగ్రత ఆధారంగా అడవులను 4 రకాలుగా వర్గీకరించారు.అవి:

1) ఆర్ద్ర ఆకురాల్చు అడవులు

2) అనార్ద్ర ఆకురాల్చు అడవులు

3) చిట్టడవులు

4) తీర ప్రాంతపు అడవులు

ఆర్ద్ర ఆకురాల్చు అడవులు

సాధారణంగా వర్షపాతం ఎక్కువగా ఉండే (125 – 200 సెం.మీ.) ప్రాంతాల్లో ఈ తరహా

అడవులు అభివృద్ది చెంది ఉన్నాయి.

 •  జిల్లాలవారీగా పరిశీలిస్తే శ్రీకాకుళం, విశాఖపట్నం, తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి జిల్లాల్లో ఇలాంటి అడవులు అధికంగా వ్యాపించి ఉన్నాయి.
 •  విశాఖపట్నం, తూర్పు గోదావరి ఏజెన్సీ ప్రాంతాల్లో,రంపచోడవరం ప్రాంతంలో ఉన్న దట్టమైన అడవులు ఈ కోవకు చెందుతాయి.

ఈ అడవుల్లోని ముఖ్యమైన వృక్షాలు: వేగి, మద్ది, ఏగిస, సాల్‌, వెదురు, బండారు, జిట్టెగి,

పాల, కరక, సిరమాను లాంటి వృక్ష జాతులు పెరుగుతాయి

AP Geography -Andhra Pradesh Forest and Animals PDF In Telugu (ఆంధ్ర ప్రదేశ్ –అడవులు- జంతుజాలం) |_40.1

అనార్ద్ర ఆకురాల్చు అడవులు

 • సహజంగా వర్షపాతం తక్కువగా ఉండే ప్రాంతాల్లో (75-100 సెం.మీ. వర్షపాతం) ఈ అడవులు ఉంటాయి.
 •  కడప, కర్నూలు, చిత్తూరు, అనంతపురం, నెల్లూరు జిల్లాల్లో ఈ రకానికి చెందిన అడవులు ఎక్కువ వైశాల్యంలో ఉన్నాయి.
 •  ప్రపంచంలో ఎక్కడా దొరకని ఎర్రచందనం ఆంధ్రప్రదేశ్‌లోని కడప, చిత్తూరు, నెల్లూరు జిల్లాల్లోని అడవుల్లో మాత్రమే లబిస్తుంది.
 • ఎర్రచందనం కలపను రంగులు, జంత్ర వాయిద్యాలు,బొమ్మల తయారీకి ఉపయోగిస్తారు.
 •  ఎర్రచందనాన్ని మన రాష్ట్రం నుంచి చైనాకు ఎక్కువగ ఎగుమతి చేస్తున్నారు.
 •  ఎంతో విలువైన మంచి గంధం చెట్లు చిత్తూరు, అనంతపురం జిల్లాల్లోని అడవుల్లోఉన్నాయి.

ఈ అడవుల్లోని ముఖ్యమైన వృక్షాలు:  టేకు, ఏగిస, బండారు, చిరుమాను, ఎర్రచందనం, మంచిగంధం, నల్లమద్ది లాంటి వృక్షాలు పెరుగుతాయి.

చిట్టడవులు

 •  75 సెం.మీ.ల వర్షపాతం కంటే తక్కువ వర్షపాతం ఉన్న ప్రాంతాల్లో ఈ రకమైన అడవులు విస్తరించి ఉన్నాయి.
 •  చిత్తూరు, అనంతపురం, కడప, కర్నూలు జిల్లాల్లో విస్తరించి ఉన్నాయి.
 •  ఈ అడవుల్లో ముళ్లపొదలు ఎక్కువగా కనిపిస్తాయి.
 • రెల్లుగడ్డి అధికంగా ఉంటుంది.

ముఖ్య వృక్షజాతులు: తుమ్మ, కలబంద, బ్రహ్మజెముడు, నాగజెముడు, వేగు, చండ్ర, రేగు,బలుసు ముఖ్యమైన వృక్షజాతులు.

 

AP Geography -Andhra Pradesh Forest and Animals PDF In Telugu (ఆంధ్ర ప్రదేశ్ –అడవులు- జంతుజాలం) |_50.1

తీరప్రాంత అడవులు/ కార జలారణ్యాలు/ టైడల్‌ అడవులు

 • వీటిని పోటు, పాటు అరణ్యాలు లేదా మాంగ్రూవ్‌ అరణ్యాలు అని కూడా పిలుస్తారు.
 •  ఇవి ముఖ్యంగా నదీ ముఖ ద్వారాల్లో విస్తరించి ఉన్నాయి.
 •  కృష్ణా, గోదావరి డెల్టా ప్రాంతాల్లో ఈ అరణ్యాలు అత్యధికంగా విస్తరించి ఉన్నాయి.

ముఖ్య వృక్షాలు: ఉప్పు పొన్న, బొడ్డు పొన్న, ఊరడ, మడ, తెల్లమడ, గుండుమడ లాంటి వృక్షజాతులున్నాయి.

also read: APCOB  2021 సిలబస్

మరిన్ని ముఖ్యాంశాలు:

 •  ఆంధ్రప్రదేశ్‌లోని టైడల్‌ అరణ్యాలను కోరింగ అడవులు అని పిలుస్తారు. (తూర్పు గోదావరిలో)
 •  ఆంధ్రప్రదేశ్‌లో విస్తీర్ణ పరంగా అతిపెద్ద అడవులు – నల్లమల అడవులు
 •  అడవులు ఎక్కువగా ఉన్న జిల్లాలు – కడప, చిత్తూరు
 • రాష్ట్రంలో విస్తీర్ణసరంగా అడవులు తక్కువగా ఉన్న జిల్లాలు -కృష్ణా, శ్రీకాకుళం
 •  రాష్ట్రంలో అటవీ సాంద్రత ఎక్కువగా ఉన్న జిల్లాలు – విశాఖ, కడప
 • రాష్ట్రంలో అటవీ సాంద్రత తక్కువగా ఉన్న జిల్లాలు – కృష్ణా అనంతపురం
 •  టేకు అధికంగా లభించే జిల్లా – తూర్పు గోదావరి
 •  టేకును King of Forest  అని పిలుస్తారు.
 •  వెదురు అధికంగా లభించే జిల్లా – తూర్పు గోదావరి
 • వెదురును ‘పేదవాడి కలప’ అని పిలుస్తారు.
 •  ఇప్ప పువ్వు అధికంగా కర్నూలు జిల్లాలో లభిస్తుంది.

అటవీ సంరక్షణకు ప్రభుత్వం చేపట్టిన చర్యలు

 •  1952లో జాతీయ అటవీ తీర్మానాన్ని ప్రవేశపెట్టారు.
 • జాతీయ అటవీ తీర్మానం ప్రధాన లక్ష్యం దేశ విస్తీర్ణంలో 33% అడవులను పెంచడం.
 •  1980లో భారత ప్రభుత్వం అడవుల (రక్షణ) చట్టాన్ని ప్రవేశపెట్టింది.
 •  ఈ చట్టం వల్ల కేంద్రం అనుమతి లేనిదే అటవీ భూములను రాష్ట్ర ప్రభుత్వాలు ఇతర అవసరాలకు కేటాయించే అధికారం లేదు.
 • పోడు వ్యవసాయ పద్ధతులపై కూడా నిబంధనలు విధించారు.
 • అడవులను పునరుద్ధరించడానికి సామాజిక అడవుల కార్యక్రమాన్ని భారత ప్రభుత్వం 5వ పంచవర్ష ప్రణాళికలో ప్రారంభించింది. 6వ పంచవర్ష ప్రణాళికలో అధికంగా అమలైంది.

Also Read : (ఆంధ్రప్రదేశ్ – నైసర్గిక స్వరూపం)

అడవి జంతువులు

 •  ఆంధ్రప్రదేశ్‌లో అనేక రకాల జంతువులు అన్ని జిల్లాల్లో ఉన్నాయి.
 •  దుప్పి, కొండగొర్రె, కణతి, అడవి పంది, రకరకాల కోతులు, ముళ్ల పంది, సివంగి, చారల సివంగి, ఎలుగుబంటులు, జింకలు ఉన్నాయి
 • తెల్ల దున్నపోతులు ఎక్కువగా ఉత్తర సర్కారు (విజయనగరం, శ్రీకాకుళం,విశాఖపట్నం) జిల్లాల్లో కనిపిస్తాయి.
 • నాలుగు కొమ్ముల కొండగొర్రెలు, ఎక్కువగా రాయలసీమలోనే ఉంటాయి.
 •  శ్రీశైలం, నాగార్జునసాగర్‌ల వద్ద కృష్ణానదిలో మొసళ్లు ఉంటాయి…
 •  భారతదేశంలో ఎప్పుడో అంతరించి పోయిందనుకున్న బట్ట మేకపక్షి కర్నూలు జిల్లా రోళ్లపాడులో కనిపించింది.
 •  వన్యప్రాణుల సంరక్షణ లక్ష్యంగా ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం

రాష్ట్ర జంతువుగా – కృష్ణ జింకను

రాష్ట పక్షిగా – పాలపిట్టను

రాష్ట్ర వృక్షంగా – వేప చెట్టును ప్రకటించింది.

 • IUCN(International Union for Conservation of Nature ) సంస్థ ఇటీవల ఆంధ్రప్రదేశ్‌లో ఎర్రచందన వృక్షాన్ని అరుదైన వృక్షాల జాబితాలో చేర్చింది.
 •  అదేవిధంగా కడప జిల్లాలోని శ్రీ లంకమల్లేశ్వర వన్యమృగ సంరక్షణా కేంద్రంలో నివసించే కలివి కోడిని కూడా IUCN సంస్థ అరుదైన జంతువుల జాబితాలో చేర్చింది.
 • ఎర్రచందనాన్ని ఎర్ర బంగారం అని పిలుస్తారు.

AP Geography -Andhra Pradesh Forest and Animals PDF In Telugu (ఆంధ్ర ప్రదేశ్ –అడవులు- జంతుజాలం) |_60.1

రాష్ట్రంలోని వన్యప్రాణి సంరక్షణా కేంద్రాలు

2014 సామాజిక – ఆర్దిక సర్వే రిపోర్లు ప్రకారం రాష్టంలో మొత్తం 16 వన్యమృగ సంరక్షణా కేంద్రాలు, ౩ జాతీయ పార్కులు 7410 చ.కి.మీ.ల విస్తీర్ణంలో వ్యాపించి ఉన్నాయి. ఇందులో ఒక టైగర్‌ రిజర్వు, ఒక ఎలిఫెంట్‌ రిజర్వు, ఒక బయోస్ఫియర్‌ (శేషాచలం) ఉన్నాయి.

సంరక్షణాకేంద్రం ప్రాంతం సంరక్షణలోని జంతువులు/పక్షులు
కోరంగి (కోరింజ) కాకినాడ సమీపం (తూర్పు గోదావరి) మొసళ్లు
గుండ్ల బ్రహ్మశ్వరం కర్నూలు, ప్రకాశం
కొల్లేరు కృష్ణా, పశ్చిమ గోదావరి పక్షులు, పెలికాన్‌ కొంగలు
నాగార్జునసాగర్‌శ్రీశ్రైలం కృష్ణానది తీరంలో నాగార్జునసాగర్నుంచి శ్రీశైలం వరకు పులులు,చిరుతలు,దుప్పులు
నేలపట్టు సూళ్లూరుపేట (నెల్లూరు) బూడిదరంగు పెలికాన్స్‌
పాపికొండలు ఉభయగోదావరి జిల్లాలు(పాపికొండలు) పులులు, నక్కలు, వివిధ రకాల పక్షులు
పులికాట్‌ సూళ్లూరుపేట పెరిమిట్స్‌, బాతులు, నీటి కాకులు
శ్రీవేంకటేశ్వర చంద్రగిరి (చిత్తూరు) పులులు, హైనాలు,నక్కలు
రోళ్లపాడు కర్నూలు, ప్రకాశం బట్టమేకల పక్షి (దీన్ని గ్రేట్‌ఇండియన్‌ బస్సర్స్‌ అంటారు)
శ్రీలంక మల్లేశ్వర కడప కలివికోడి
శ్రీపెనుగుల నర్సింహా కడప, చిత్తూరు
కంబాల కొండ విశాఖపట్నం
శేషాచలం చిత్తూరు, కడప రాష్ట్రంలో తొలి బయోరిజర్వ్‌
కౌండిన్య చిత్తూరు ఏనుగులు
కృష్ణా వన్యప్రాణి కృష్ణా, గుంటూరు
కండలేరు జింకల పార్కు నెల్లూరు జింకలు
పులయం జింకలపార్కు కర్నూలు జింకలు

Download ఆంధ్ర ప్రదేశ్ –అడవులు- జంతుజాలం-PDF

 

AP Geography -Andhra Pradesh Forest and Animals PDF In Telugu (ఆంధ్ర ప్రదేశ్ –అడవులు- జంతుజాలం) |_70.1

Download Adda247 App

*******************************************************************************************                                                                                                                                       AP Geography -Andhra Pradesh Forest and Animals PDF In Telugu (ఆంధ్ర ప్రదేశ్ –అడవులు- జంతుజాలం) |_80.1

AP Geography -Andhra Pradesh Forest and Animals PDF In Telugu (ఆంధ్ర ప్రదేశ్ –అడవులు- జంతుజాలం) |_90.1

Latest Job Alerts in AP and Telangana
TS SI Exam Pattern & Syllabus
Monthly Current Affairs PDF All months
APPSC & TSPSC Notification 2021
State GK Study material
Telangana history Study material 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

Sharing is caring!

Download your free content now!

Congratulations!

AP Geography -Andhra Pradesh Forest and Animals PDF In Telugu (ఆంధ్ర ప్రదేశ్ –అడవులు- జంతుజాలం) |_110.1

కరెంట్ అఫైర్స్ -ఏప్రిల్ 2022 మాస పత్రిక

Download your free content now!

We have already received your details!

AP Geography -Andhra Pradesh Forest and Animals PDF In Telugu (ఆంధ్ర ప్రదేశ్ –అడవులు- జంతుజాలం) |_120.1

Please click download to receive Adda247's premium content on your email ID

Incorrect details? Fill the form again here

కరెంట్ అఫైర్స్ -ఏప్రిల్ 2022 మాస పత్రిక

Thank You, Your details have been submitted we will get back to you.