Telugu govt jobs   »   Notification   »   AP GENCO మేనేజ్మెంట్ ట్రైనీ నియామకం దరఖాస్తు...

AP GENCO మేనేజ్మెంట్ ట్రైనీ నియామకం చివరి తేదీ మరియు అప్లికేషన్ విధానం

ఆంధ్రప్రదేశ్ పవర్ జనరేషన్ కార్పొరేషన్ లిమిటెడ్ (APGENCO) అనేది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ఒక ముఖ్యమైన సంస్థ, ఇది విద్యుత్ శక్తి ఉత్పత్తిలో భాగంగా ఉంది. భారతీయ కంపెనీల చట్టం 1956 ప్రకారం పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వ కంపెనీగా స్థాపించబడిన APGENCO విద్యుత్ రంగంలో కీలక పాత్ర పోషిస్తోంది. పవర్ ప్లాంట్ల నిర్వహణలో దాని బాధ్యతలతో పాటు, కార్పొరేషన్ తన సామర్థ్య విస్తరణ కార్యక్రమంలో భాగంగా కొనసాగుతున్న మరియు కొత్త విద్యుత్ ప్రాజెక్టులను అమలు చేయడంలో చురుకుగా పాల్గొంటోంది. ఈ కథనంలో APGENCO నుండి తాజా రిక్రూట్‌మెంట్ నోటిఫికేషన్‌ కి సంబంధించిన అన్నీ వివరాలను అందిస్తాము.

APGENCO నుండి తాజా రిక్రూట్‌మెంట్ నోటిఫికేషన్‌ మేనేజ్మెంట్ ట్రైనీ నియమకనికి చివరి తేదీ 21 సెప్టెంబర్ 2023 కావున అభ్యర్ధులు ఈ రోజే అప్లై చేసుకోండి చివరి తేదీ వరకూ వేచి ఉండటం వలన అప్లికేషన్  తిరస్కరించే అవకాశం ఉంది ఇప్పుడే అప్లికేషన్ విధానం తనిఖీ చేసి APGENCO 2023 మేనేజ్మెంట్ ట్రైనీ కి దరఖాస్తు చేసుకోండి.

 

AP GENCO మేనేజ్మెంట్ ట్రైనీ నియామకం 2023: అవలోకనం

అభ్యర్థుల కోసం, మేము AP GENCO మేనేజ్మెంట్ ట్రైనీ నియామకం 2023కి సంబంధించిన ఉద్యోగ ప్రదేశం, ఎంపిక ప్రక్రియ, అప్లికేషన్ విధానం, ఖాళీల వివరాలు మొదలైన పూర్తి అవలోకనాన్ని అందించాము. ఈ దిగువ పట్టిక లో వివధ అంశాలను అందించాము.

AP GENCO మేనేజ్మెంట్ ట్రైనీ నియామకం 2023: అవలోకనం
సంస్థ AP GENCO
పోస్ట్ మేనేజ్మెంట్ ట్రైనీ
ఖాళీ 26
వర్గం ప్రభుత్వ ఉద్యోగం/ కాంట్రాక్ట్ ప్రాతిపదికన
ఉద్యోగ స్థానం జిల్లాల వారీగా
ఎంపిక ప్రక్రియ MSc. మార్కుల ఆధారంగా
అధికారిక వెబ్‌సైట్ https://apgenco.gov.in/

AP GENCO మేనేజ్మెంట్ ట్రైనీ: ముఖ్యమైన తేదీలు

అభ్యర్థులకు సులభమైన సూచనను అందించడానికి AP GENCO మేనేజ్మెంట్ ట్రైనీ నోటిఫికేషన్‌కు సంబంధించిన ముఖ్యమైన తేదీలు క్రింది పట్టికలో నవీకరించబడ్డాయి. AP GENCO మేనేజ్మెంట్ ట్రైనీ దరఖాస్తు కి చివరి తేదీ 21 సెప్టెంబర్ 2023 కావున అభ్యర్ధులు అప్లై చెయ్యాలి అనుకుంటే వెంటనే అప్లై చేసుకోండి చివరి తేదీ వరకూ వేచి ఉండొద్దు.

AP GENCO మేనేజ్మెంట్ ట్రైనీ: ముఖ్యమైన తేదీలు
AP GENCO మేనేజ్మెంట్ ట్రైనీ నోటిఫికేషన్ విడుదల 31 ఆగస్టు 2023
AP GENCO మేనేజ్మెంట్ ట్రైనీ నోటిఫికేషన్ ప్రారంభ తేదీ 1సెప్టెంబర్ 2023
AP GENCO మేనేజ్మెంట్ ట్రైనీ నోటిఫికేషన్ చివరి తేదీ 21 సెప్టెంబర్ 2023
దరఖాస్తు కాపీ AP GENCOకు అందించాల్సిన చివరి తేదీ 5:00 PM, 30 సెప్టెంబర్ 2023

AP GENCO మేనేజ్మెంట్ ట్రైనీ నోటిఫికేషన్ PDF

AP GENCO మేనేజ్మెంట్ ట్రైనీ నోటిఫికేషన్ ఆన్‌లైన్ వెబ్‌సైట్‌లో విడుదల చేయబడింది, మొత్తం 26 ఖాళీల కోసం వివరణాత్మక నోటిఫికేషన్ PDF విడుదల చేసింది. AP GENCOలో ఉద్యోగ అవకాశం చూస్తున్న ఆశవహులకు ఇది ఒక అద్భుతమైన అవకాశం. ఒప్పంద ప్రాతిపదికన నియమించనున్న మ్యానేజ్మెంట్ ట్రైనీ నియామకం MSc లో వచ్చిన మార్కుల ఆధారంగా ఎంపిక ప్రక్రియ ఉంటుంది అని తెలిపారు. కావున అభ్యర్ధులు తమ సర్టిఫికేట్లను సరిచూసుకుని దరఖాస్తు చేసుకోవాలి. ఇక్కడ, మేము AP GENCO మేనేజ్మెంట్ ట్రైనీ 2023 కోసం నోటిఫికేషన్ PDFని అందించాము.

AP GENCO మేనేజ్మెంట్ ట్రైనీ 2023 నోటిఫికేషన్ PDF

Telangana State GK MCQs Questions And Answers in Telugu |_70.1

APPSC/TSPSC Sure shot Selection Group

AP GENCO మేనేజ్మెంట్ ట్రైనీ 2023 ఖాళీలు

AP GENCO మేనేజ్మెంట్ ట్రైనీ కోసం మొత్తం 26 మంది అభ్యర్థులను ఎంపిక చేస్తారు. ఒక సంవత్సరం ఒప్పంద ప్రాతిపదిక తెలియజేసిన AP GENCO మేనేజ్మెంట్ ట్రైనీ కోసం ఖాళీలు మొత్తంగా ఉన్నాయి కానీ వారిని జిల్లాల వారీగా ఆంధ్ర, తెలంగాణా మరియు ఒడిస్సా లో నియమిస్తారు. AP GENCO మేనేజ్మెంట్ ట్రైనీ కోసం ఖాళీల వివరాలను ఈ కింద తనిఖీ చేయండి.

AP GENCO మేనేజ్మెంట్ ట్రైనీ 2023 ఖాళీలు
ఖాళీలు 26

AP GENCO మేనేజ్మెంట్ ట్రైనీ అర్హత ప్రమాణాలు

AP GENCO మేనేజ్మెంట్ ట్రైనీ అర్హత ప్రమాణాలు ఇక్కడ అందించాము. అభ్యర్థులు AP GENCO మేనేజ్మెంట్ ట్రైనీ అర్హత ప్రమాణాలను కలిగి ఉండాలి.

AP GENCO మేనేజ్మెంట్ ట్రైనీ విద్యా అర్హత

AP GENCO మేనేజ్మెంట్ ట్రైనీ నోటిఫికేషన్ కోసం దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు కింది విద్యార్హతలను తప్పక కలిగి ఉండాలి

అభ్యర్థులు UGC ద్వారా గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుండి M.Sc.(కెమిస్ట్రీ) మొదటి తరగతితో లేదా 3.1 CGPA / OGPA కి లేదా దానికి సమానమైన మార్కులు సాధించిన గ్రాడ్యుయేషన్ డిగ్రీని కలిగి ఉండాలి

AP GENCO మేనేజ్మెంట్ ట్రైనీ దరఖాస్తు విధానం

అభ్యర్ధుల సౌలభ్యం కోసం AP GENCO మేనేజ్మెంట్ ట్రైనీ దరఖాస్తు విధానం ఇక్కడ తెలియజేశాము:

AP GENCO మేనేజ్మెంట్ ట్రైనీ దరఖాస్తు కాలవసిన పత్రాలు

  • ఫోటో
  • సంతకం
  • పోస్ట్ గ్రాడ్యుయేషన్ మార్కుల జాబితా
  • SC/ ST/ BC/ EWS కుల దృవీకరణ
  • PwBD అభ్యర్థులకు వైకల్య ధృవీకరణ పత్రం

ఆన్‌లైన్ దరఖాస్తును పూరించే విధానం

  • దశ 1: అభ్యర్ధులు కింద అందించిన లింకుపై క్లిక్ చేస్తే నియామక పేజీ కి వెళతారు.
  • దశ 2: అభ్యర్ధి తన AADHAR నెంబర్ మరియు ఫోన్ నెంబర్ తో లాగిన్ అవ్వాల్సి ఉంటుంది.
  • దశ 3: అభ్యర్ధులు లాగిన్ అయిన తర్వాత నియామక ప్రకీయ కి సంబంధించి అప్లికేషన్ కనిపిస్తుంది. అప్లికేషన్ లో అభ్యర్ధి కి సంబంధించిన వివరాలు అన్నీ అందించి వారి ఫోటో మరియు వేలిముద్ర ని అప్లోడు చేయాల్సి ఉంటుంది.
  • దశ 4: అన్నీ వివరాలు సరి చూసుకుని ప్రివ్యూ పై క్లిక్ చేస్తే తదుపరి దశ కు వెళతారు
  • దశ 5: అన్నీ వివరాలు సరిపోల్చుకున్నాక సబ్మిట్ బటన్ క్లిక్ చెయ్యాలి.
  • చివరగా సిస్టమ్ రూపొందించిన ప్రత్యేక నమోదు సంఖ్యను పొందుతారు. దయచేసి ఈ నమోదు సంఖ్య ముఖ్యమైనదని మరియు ఎంపిక ప్రక్రియ అంతటా అన్ని భవిష్యత్ సూచనల కోసం అవసరమని గుర్తుంచుకోండి.
  • అభ్యర్థులు ఆన్‌లైన్ అప్లికేషన్ యొక్క ప్రింట్ అవుట్ తీసుకొని, “డిక్లరేషన్” క్రింద అందించిన స్థలంలో సంతకం చేసి సంబందిత దృవపత్రాలు పుట్టిన తేదీ, ఆధార్, విద్యార్హతలు,కుల దృవీకరణ, MSc యొక్క మార్కుల జాబితాతో సహా అన్ని సంబంధిత సర్టిఫికేట్‌ల యొక్క స్వీయ ధృవీకరించబడిన కాపీలతో పాటు హార్డ్ కాపీని సమర్పించాల్సి ఉంటుంది.

దరఖాస్తు చేసిన పోస్ట్‌ను సరిగ్గా సెప్టెంబర్ 30 తేదీ సాయంత్రం 5 గంటల లోపు మరియు AP GENCO కార్యాలయానికి అందేలా చూసుకోండి.

AP GENCO మేనేజ్మెంట్ ట్రైనీ దరఖాస్తు పంపించాల్సిన చిరునామా
చీఫ్ జనరల్ మేనేజర్ (Adm.,IS&ERP), 3వ అంతస్తు, విద్యుత్ సౌధ, APGENCO, విజయవాడ – 520 004 The Chief General Manager (Adm.,IS&ERP), 3rd Floor, Vidyut Soudha, APGENCO, Vijayawada – 520 004

AP GENCO మేనేజ్మెంట్ ట్రైనీ దరఖాస్తు లింకు

అభ్యర్ధుల సౌలభ్యం కోసం AP GENCO మేనేజ్మెంట్ ట్రైనీ దరఖాస్తు లింకు ఇక్కడ అందించాము. ఈ లింకు పై క్లిక్ చేసి అభ్యర్ధులు తన అప్లికేషన్ ను సమర్పించండి.

AP GENCO మేనేజ్మెంట్ ట్రైనీ దరఖాస్తు లింకు

వయో పరిమితి

AP GENCO మేనేజ్మెంట్ ట్రైనీ నోటిఫికేషన్ కోసం కనీస మరియు గరిష్ట వయో పరిమితి క్రింది పట్టికలో ఇవ్వబడింది.

AP GENCO మేనేజ్మెంట్ ట్రైనీ వయో పరిమితి
పోస్ట్ గరిష్ట వయస్సు
మేనేజ్మెంట్ ట్రైనీ 35 సంవత్సరాలు
  • SC/ST/BC అభ్యర్ధులకు వయోపరిమితి లో సడలింపు ఉంది

AP GENCO మేనేజ్మెంట్ ట్రైనీ జీతం

AP GENCO మేనేజ్మెంట్ ట్రైనీ గా ఎంపికైన అభ్యర్ధులకి నెలకి రూ. 25,000 వరకూ అందుకుంటారు

AP GENCO మేనేజ్మెంట్ ట్రైనీ నియామక ప్రదేశం

AP GENCO మేనేజ్మెంట్ ట్రైనీ లో మొత్తం 26 ఖాళీలకు దరఖాస్తులని AP GENCO ఆహ్వానించింది. ఎంపికైన అభ్యర్ధులు AP GENCO ఆద్వర్యంలో ఉన్న వివిధ థర్మల్ పవర్ ప్లాంట్ల వద్ద పనిచేయాల్సి ఉంటుంది:

  • ఇబ్రహ్మపట్నం, కృష్ణా జిల్లా.
  • V.V.రెడ్డి నగర్, YSR కడప జిల్లా.
  • నేలటూరు, SPSR నెల్లూరు జిల్లా.
  • MCL బొగ్గు గనులు, తాల్చేర్, ఒడిశా
  • SCCL బొగ్గు గనులు, యెల్లందు, మణుగూరు, తెలంగాణా, మొదలైనవి

Telangana Prime Test Pack 2023-2024 | Complete Bilingual Online Test Series by Adda247

మరింత చదవండి:
తాజా ఉద్యోగ ప్రకటనలు క్కడ క్లిక్ చేయండి
ఉచిత స్టడీ మెటీరియల్ (APPSC, TSPSC) ఇక్కడ క్లిక్ చేయండి
ఉచిత మాక్ టెస్టులు ఇక్కడ క్లిక్ చేయండి

Sharing is caring!

FAQs

AP GENCO మేనేజ్మెంట్ ట్రైనీ నియామకం కోసం ఎలా దరఖాస్తు చేసుకోవాలి?

AP GENCO మేనేజ్మెంట్ ట్రైనీ నియామకం కోసం ఆన్లైన్ లో అప్లికేషన్ పూర్తిచేసి సమబందిత దృవ పాత్రలతో పాటు అప్లికేషన్ కాపీ ని AP GENCO కి పంపించాలి.