AP DSC 2024 విడుదల
ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రవ్యాప్తంగా నిరుద్యోగులకు శుభవార్త, ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న AP మెగా DSC 2024 కోసం అర్హులైన అభ్యర్థులను త్వరలో రిక్రూట్ చేయనున్నట్లు ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి శ్రీ చంద్రబాబు నాయుడు ప్రకటించారు. రాష్ట్రవ్యాప్తంగా ఖాళీగా ఉన్న 16347 టీచర్ ఖాళీలను ఆంధ్ర ప్రదేశ్ విద్యా శాఖ త్వరలోనే విడుదల చేయనునట్లు సమాచారం. రాష్ట్రంలో టీచింగ్ జాబ్ పరీక్షలకు సిద్ధమవుతున్న అభ్యర్థులకు ఈ నోటిఫికేషన్ మంచి అవకాశాన్ని అందిస్తుంది. ఈ కథనంలో మేము AP మెగా DSC 2024 కి సంబంధించిన అన్నీ వివరాలను అందించాము.
AP DSC నోటిఫికేషన్ 2024
AP DSC రిక్రూట్‌మెంట్ నోటిఫికేషన్ 2024: SGT, PET, TGT, PGT, స్కూల్ అసిస్టెంట్ & ప్రిన్సిపాల్ వంటి వివిధ పోస్టుల కోసం AP మెగా DSC నోటిఫికేషన్ 2024ను జూన్ 2024 చివరి వారంలోగా విడుదల చేయడానికి పాఠశాల విద్యా శాఖ, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సిద్ధంగా ఉంది. గతంలో 6,100 టీచర్ పోస్టుల నోటిఫికేషన్ ను రద్దు చేసి, కొత్త మెగా DSC నోటిఫికేషన్ ను విడుదల చేసే ఆలోచనలో ప్రభుత్వం ఉన్నట్లు సమాచారం. నోటిఫికేషన్ విడుదల అయిన తర్వతా, AP మెగా DSC 2024 కోసం దరఖాస్తు చేయడానికి విండో అధికారిక వెబ్‌సైట్ https://apdsc.apcfss.in/లో నాలుగు వారాల పాటు అందుబాటులో ఉండే అవకాశం ఉంది. AP DSC రిక్రూట్‌మెంట్ నోటిఫికేషన్ 2024 పూర్తి వివరాలు తెలుసుకోవడానికి ఈ పేజీ ని బుక్ మార్క్ చేసుకోండి.
Adda247 APP
AP DSC నోటిఫికేషన్ 2024 అవలోకనం
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం త్వరలో అధికారిక వెబ్‌సైట్ లో AP DSC రిక్రూట్‌మెంట్ నోటిఫికేషన్ 2024 ని విడుదల చేయనుంది. AP DSC రిక్రూట్‌మెంట్ నోటిఫికేషన్ 2024 అవలోకనం దిగువ పట్టికలో అందించాము.
AP DSC రిక్రూట్‌మెంట్ నోటిఫికేషన్ 2024 అవలోకనం |
|
సంస్థ | కమీషనర్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్, ఆంధ్రప్రదేశ్ (AP DSC) |
పోస్ట్స్ | SGT,TGT, PGT,SA టీచర్ |
ఖాళీలు | 16347 |
నోటిఫికేషన్ తేదీ | జూన్ 2024/ జులై 2024 |
దరఖాస్తు ప్రారంభ తేదీ | – |
అధికారిక వెబ్సైట్ | cse.ap.gov.in / apdsc.apcfss.in |
AP DSC నోటిఫికేషన్ 2024 Pdf డౌన్‌లోడ్
AP DSC 2024 ద్వారా SGT మరియు స్కూల్ అసిస్ట్ మరియు మ్యూజిక్ టీచర్స్ పోస్టుల కోసం ఆంధ్రప్రదేశ్‌లో టీచర్స్ రిక్రూట్‌మెంట్ టెస్ట్ 2024 కోసం నోటిఫికేషన్ ను త్వరలో విడుదల చేయబడుతుంది. అర్హులైన అభ్యర్థులు జిల్లా సెలక్షన్ కమిటీ ద్వారా రాష్ట్రంలోని ప్రభుత్వ, జిల్లా పరిషత్, మండల పరిషత్, మున్సిపల్ కార్పొరేషన్ పాఠశాలల్లోని స్కూల్ అసిస్టెంట్లు, సెకండరీ గ్రేడ్ టీచర్లు, సంగీత ఉపాధ్యాయుల పోస్టుల భర్తీకి ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. AP DSC రిక్రూట్‌మెంట్ 2024 పోస్ట్‌లకు దరఖాస్తు చేయడానికి ముందు నోటిఫికేషన్ pdfని జాగ్రత్తగా చదవండి. AP DSC రిక్రూట్‌మెంట్ 2024 నోటిఫికేషన్ PDF డౌన్‌లోడ్ చేయడానికి క్రింది లింక్‌ను క్లిక్ చేయండి. మేము అధికారిక AP DSC నోటిఫికేషన్ PDFని విడుదల చేసినప్పుడు ఇక్కడ అప్‌డేట్ చేస్తాము.
అభ్యర్ధుల అవగాహన కోసం మునుపటి AP DSC 2024 నోటిఫికేషన్ PDF లను ఇక్కడ పేర్కొన్నాము.
AP DSC 2024 నోటిఫికేషన్ PDF | |
Download AP DSC School Education DSC-2024-Notification | AP DSC School Education Notification 2024 |
Download AP DSC School Education DSC-2024-Bulletin | AP DSC School Edu Info Bulletin 2024 |
Download AP DSC Residential 2024 Information Bulletin | AP DSC Residential Information Bulletin |
Download AP DSC Residential 2024 Notification | AP DSC Residential Notification 2024 |
AP DSC నోటిఫికేషన్ ముఖ్యమైన తేదీలు
AP DSC రిక్రూట్‌మెంట్ నోటిఫికేషన్ 2024 కి సంబంధించిన ముఖ్యమైన తేదీల వివరాలు ఇక్కడ ఉన్నాయి.
AP DSC 2024 ఆన్లైన్ దరఖాస్తు ముఖ్యమైన తేదీలు | |
AP DSC రిక్రూట్‌మెంట్ నోటిఫికేషన్ 2024 | – |
AP DSC రిక్రూట్‌మెంట్ నోటిఫికేషన్ 2024 PDF | – |
AP DSC రిక్రూట్‌మెంట్ 2024 ఆన్లైన్ దరఖాస్తు మొదలు | – |
AP DSC రిక్రూట్‌మెంట్ 2024 ఆన్లైన్ దరఖాస్తు ఆఖరు | — |
AP DSC 2024 ఆన్లైన్ దరఖాస్తు ఫీజు చెల్లింపు మొదలు | – |
AP DSC 2024 ఆన్లైన్ దరఖాస్తు ఫీజు చెల్లింపు ఆఖరు | – |
AP DSC 2024 హాల్ టికెట్ | – |
AP DSC 2024 పరీక్షా తేదీ | – |
AP DSC రిక్రూట్‌మెంట్ 2024 ఆన్సర్ కీ | – |
AP DSC రిక్రూట్‌మెంట్ 2024 ఫలితాలు | – |
AP మెగా DSC నోటిఫికేషన్ 2024 ఖాళీలు
SGT, PET, TGT, PGT, స్కూల్ అసిస్టెంట్ మరియు ప్రిన్సిపాల్ పోస్టుల కోసం ఖాళీల సంఖ్యను పాఠశాల విద్యా శాఖ, ఆంధ్రప్రదేశ్ ప్రకటించింది. మొత్తం 16,347 ఖాళీలు ఉన్నాయి, వివరాలను తనిఖీ చేయండి.
AP మెగా DSC నోటిఫికేషన్ 2024 ఖాళీలు | |
పోస్ట్ పేరు | ఖాళీలు |
SGT | 6371 |
స్కూల్ అసిస్టెంట్ | 7725 |
TGT | 1781 |
PGT | 286 |
PET | 132 |
ప్రిన్సిపాల్ | 52 |
మొత్తం | 16347 |
AP DSC 2024 అర్హత ప్రమాణాలు
AP DSC రిక్రూట్‌మెంట్ నోటిఫికేషన్ 2024 దరఖాస్తు చేసుకోవడానికి నోటిఫికేషన్ లో విడుదల చేసిన అర్హతలు కలిగి ఉండాలి. AP DSC రిక్రూట్‌మెంట్ నోటిఫికేషన్ 2024 అర్హత ప్రమాణాలను దిగువ వివరించాము.
విద్యార్హతలు
పోస్ట్ పేరు | విద్యా అర్హతలు |
సెకండరీ గ్రేడ్ టీచర్ | AP యొక్క ఇంటర్మీడియట్ బోర్డ్ జారీ చేసిన ఇంటర్మీడియట్ సర్టిఫికేట్ లేదా ఇతర సమానమైన సర్టిఫికేట్ మరియు విద్యలో 2 సంవత్సరాల డిప్లొమా (D.Ed)/ D.EI.Ed కలిగి ఉండాలి. (లేదా) గ్రాడ్యుయేషన్ మరియు B.Ed కలిగి ఉండాలి |
స్కూల్ అసిస్టెంట్ | సంబంధిత సబ్జెక్టులో గ్రాడ్యుయేషన్ లేదా బ్యాచిలర్ డిగ్రీ లేదా BCA/ BBM, B.Ed కలిగి ఉండాలి |
సంగీత ఉపాధ్యాయుడు | 10వ తరగతి లేదా తత్సమాన పరీక్షలో ఉత్తీర్ణులై ఉండాలి మరియు 2 సంవత్సరాలు/ 6 సంవత్సరాల డిప్లొమాలో ఉత్తీర్ణులై ఉండాలి లేదా సంగీతంలో 4 సంవత్సరాల సర్టిఫికేట్ కోర్సులో ఉత్తీర్ణులై ఉండాలి |
వయోపరిమితి
- కనీస వయోపరిమితి 18 సంవత్సరాలు
- గరిష్ట వయోపరిమితి 44 సంవత్సరాలు
- రిజర్వ్‌డ్ కేటగిరీ అభ్యర్థులకు ప్రభుత్వ నిబంధనల ప్రకారం వయోపరిమితిలో సడలింపు ఉంటుంది.
- అయితే, SC/ST/BC అభ్యర్థుల విషయంలో గరిష్ట వయో పరిమితి 49 సంవత్సరాలు మరియు శారీరక ఛాలెంజ్డ్ అభ్యర్థులకు సంబంధించి గరిష్ట వయోపరిమితి 54 సంవత్సరాలు.
AP DSC నోటిఫికేషన్ ఎంపిక పక్రియ
వ్రాత పరీక్ష మరియు ప్రభుత్వం ఎప్పటికప్పుడు నిర్దేశించిన ఇతర ప్రమాణాలతో కూడిన ఎంపిక ప్రక్రియ ద్వారా నియామకం జరుగుతుంది.
- రాత పరీక్ష (CBT):- కంప్యూటర్ ఆధారిత పరీక్ష అన్ని జిల్లాల్లో నిర్వహించబడుతుంది. ఒక అభ్యర్థి అతను/ఆమె రిక్రూట్‌మెంట్ (లేదా) పొరుగు రాష్ట్రాల ప్రక్కనే ఉన్న జిల్లాలలో కంప్యూటర్ ఆధారిత పరీక్షకు హాజరు కావాలి.
- i. స్కూల్ అసిస్టెంట్లకు (SAS) మొత్తం మార్కులు 100, అందులో 80 మార్కులు వ్రాత పరీక్ష (TRT) మరియు మిగిలిన 20 మార్కులు APTET (20%) వెయిటేజీకి ఉంటాయి.
- ii. సంగీత ఉపాధ్యాయులకు మొత్తం 100 మార్కులు ఉండాలి, అందులో 70 మార్కులు రాత పరీక్ష (టిఆర్‌టి)కి మరియు మిగిలిన 30 మార్కులు స్కిల్ టెస్ట్‌కి ఉంటాయి.
- iii. సెకండరీ గ్రేడ్ టీచర్లకు (SGTS) రాత పరీక్షకు (TET కమ్ TRT) మొత్తం మార్కులు 100 ఉండాలి.
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అవలంబిస్తున్న ప్రస్తుత నిబంధనల ప్రకారం రిక్రూట్‌మెంట్ పూర్తిగా మెరిట్ కమ్ రోస్టర్ విధానంపై ఆధారపడి ఉంటుంది.
- పత్రాల ధృవీకరణ
మరింత చదవండి: | |
తాజా ఉద్యోగ ప్రకటనలు | ఇక్కడ క్లిక్ చేయండి |
ఉచిత స్టడీ మెటీరియల్ (APPSC, TSPSC) | ఇక్కడ క్లిక్ చేయండి |
ఉచిత మాక్ టెస్టులు | ఇక్కడ క్లిక్ చేయండి |