Telugu govt jobs   »   Current Affairs   »   AP CM Jagan Announced Insurance Scheme...

AP CM Jagan Announced Insurance Scheme for NRTS | ఏపీ సీఎం జగన్ ఎన్‌ఆర్‌టీఎస్‌కు బీమా పథకాన్ని ప్రకటించారు

AP CM Jagan Announced Insurance Scheme for NRTS | ఏపీ సీఎం జగన్ ఎన్‌ఆర్‌టీఎస్‌కు బీమా పథకాన్ని ప్రకటించారు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం విదేశాలలో ఉండే ప్రవాసాంద్రులకి రాయిటీతో బీమా సదుపాయం కల్పించింది. ఏపిఎన్‌ఆర్‌టీఎస్‌, ఆంధ్రప్రదేశ్ నుంచి విదేశాలకి వెళ్ళే ఉద్యోగులు, వలస కార్మికులకు 50% సబ్సిడీతో బీమా కల్పించనుంది. మరియు విధ్యార్ధులకు పూర్తి ఉచితంగా మొదటి 3 సంవత్సరాలకు బీమా అందించనుంది. ఉద్యోగులు, వలస కార్మికులు 3సంవత్సరాలకి 550 రూపాయలు మరియు విధ్యార్ధులు సంవత్సరానికి 180 రూపాయలు చెల్లించాలి కానీ ప్రభుత్వం విధ్యార్ధులకి పూర్తి రాయితీ మరియు ఇతరులకి 50% సబ్సిడీ అందించనుంది. న్యూ ఇండియా అష్యూరెన్స్ తో ఈ పధకాన్ని అందించనున్నారు. అర్హులందరు 26 డిసెంబర్ నుంచి 15 జనవరి 2024 లోగా నమోదుచేసుకోవాలి.
బీమా చేసుకున్న వారికి ప్రమాదం వల్ల మరణించినా, అంగవైకల్యంకి గురైనా 10 లక్షలు అందిస్తారు. ప్రమాదంలో గాయపడ్డావారికి, అనారోగ్య ఇబ్బందులకి ఆసుపత్రి ఖర్చులకు గరిష్టంగా 1లక్ష చెల్లిస్తారు. ప్రసూతి కార్చులకు మహిళా ఉద్యోగులకు రూ.50,000 చెల్లిస్తారు. నమోదు చేసుకునే అభ్యర్ధుల కోసం 24గంటల హెల్ప్లైన్ ని అందుబాటులోకి తెచ్చారు +91 863 2340678 లేదా +91 85000 27678 కి వాట్స్ అప్ ద్వారా సంప్రదించవచ్చు లేదా ఏపిఎన్‌ఆర్‌టీఎస్‌ అధికారిక వెబ్సైట్ ను సంప్రదించవచ్చు అని తెలిపారు.

Sharing is caring!