వైఎస్ఆర్ ఆసరా, చేయూత పథకాల అమలుకు మరియు జనవరి నుంచి వృద్ధాప్య సామాజిక భద్రత పింఛన్‌లను రూ.2,750 నుంచి రూ.3,000కు పెంచేందుకు రాష్ట్ర మంత్రివర్గం శుక్రవారం ఆమోదం తెలిపింది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ కింద ఉచిత వైద్య చికిత్స పరిమితిని రూ. 25 లక్షలకు పెంచనుంది అదికూడా వార్షిక ఆదాయం రూ.5 లక్షలు ఉన్న వారందరికీ ఇది వర్తిస్తుంది. ఈ చర్యతో దాదాపు 90శాతం కుటుంబాలకు ఖరీదైన వైద్యం అందనుంది. ఈ పధకంలో భాగంగా కొత్త ఆరోగ్యశ్రీ కార్డులను 18వ తేదీన జగన్ మోహన్ రెడ్డి లబ్ది దారులకు అందజేయనున్నారు. ఆరోగ్యశ్రీ పథకానికి ఏడాదికి రూ.4,400 కోట్లు కేటాయించారు 3,257 జబ్బులకు ఆరోగ్యశ్రీ ద్వారా ఉచితంగా వైద్యం అందించనున్నారు.
జనవరి 1, 2024 నుంచి వైఎస్ఆర్ పెన్షన్ కానుకగా ఇస్తున్న రూ.2750ను 3000 పెంచనున్నారు. దీని ద్వారా 65.33 లక్షలమంది వృద్దులకి, వితంతులకి మరియు పేదలకు ప్రభత్వం అండగా నిలవనుంది. పెన్షన్ కోసం దాదాపు 2 వేల కోట్లు ప్రభుత్వం ఖర్చు చేయనుంది. జనవరి 10 నుంచి 23 వరకు వైఎస్‌ఆర్ ఆసరా, జనవరి 29 నుంచి ఫిబ్రవరి 10 వరకు వైఎస్‌ఆర్ చేయూత కార్యక్రమాలు నిర్వహించనున్నారు. జనవరి 1 నుండి 8 వరకు. రూ.638 కోట్ల విలువైన దాదాపు 4.35 లక్షల AI-లోడెడ్ ట్యాబ్‌లు ముఖ్యమంత్రి పుట్టినరోజు సందర్భంగా డిసెంబర్ 21 నుండి 8వ తరగతి విద్యార్థులకు పంపిణీ చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.
Read More: | |
తెలుగులో వారపు కరెంట్ అఫైర్స్ 2023 | నెలవారీ కరెంట్ అఫైర్స్ 2023 తెలుగులో |
తెలుగులో డైలీ కరెంట్ అఫైర్స్ 2023 | స్టడీ మెటీరియల్ |
మరింత చదవండి | |
తాజా ఉద్యోగ ప్రకటనలు | ఇక్కడ క్లిక్ చేయండి |
ఉచిత స్టడీ మెటీరియల్ (APPSC, TSPSC) | ఇక్కడ క్లిక్ చేయండి |
ఉచిత మాక్ టెస్టులు | ఇక్కడ క్లిక్ చేయండి |
Adda247 తెలుగు APP | ఇక్కడ క్లిక్ చేయండి |