Telugu govt jobs   »   Telugu Current Affairs   »   AP Assembly Budget Meetings from the...

AP అసెంబ్లీ బడ్జెట్‌ సమావేశాలు ఈ నెల 8 నుండి 25వ తేదీ వరకు, AP Assembly Budget Meetings from the 8th to the 25th of this month

అసెంబ్లీ బడ్జెట్‌ సమావేశాలను ఈ నెల 8 నుండి 25వ తేదీ వరకు నిర్వహించాలని శాసన సభ బీఏసీ (బిజినెస్‌ అడ్వైజరీ కమిటీ) నిర్ణయించింది. సోమవారం స్పీకర్‌ తమ్మినేని సీతారాం అధ్యక్షతన అసెంబ్లీ మీటింగ్‌ హాలులో జరిగిన ఈ సమావేశంలో మొత్తం 12 రోజులు సభ నిర్వహించాలని నిర్ణయించారు.

సభ షెడ్యూలు వివరాలు  

  •  8వ తేదీన దివంగత రాష్ట్ర మంత్రి గౌతమ్‌రెడ్డి మృతిపై ప్రభుత్వం తరఫున సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి సంతాప తీర్మానం ప్రవేశపెడతారు. సంతాపం తెలిపిన తర్వాత సభ వాయిదా
  • 9వ తేదీన గౌతమ్‌రెడ్డి మృతికి సంతాపంగా అసెంబ్లీకి సెలవు.
  •  10వ తేదీన గవర్నర్‌ ప్రసంగానికి ధన్యవాద తీర్మానం, చర్చ.
  •  11న ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌ బడ్జెట్‌ను ప్రవేశపెడతారు.
  •  12, 13 శని, ఆదివారాలు సెలవు.
  •  14, 15 తేదీల్లో బడ్జెట్‌పై చర్చ.
  •  16, 17 తేదీల్లో బడ్జెట్‌ డిమాండ్లపై చర్చ.
  • 18న హోలీ, 19, 20 శని, ఆదివారాలు సెలవు.
  •  21 నుంచి 24వ తేదీ వరకు బడ్జెట్‌ డిమాండ్లపై చర్చ.
  •  25న ప్రభుత్వం ద్రవ్య వినిమయ బిల్లును సభలో ప్రవేశపెడుతుంది శాసన మండలి సమావేశాలు కూడా ఇదే షెడ్యూల్‌ ప్రకారం జరుగుతాయి. మండలి చైర్మన్‌ కొయ్యే మోషేన్‌రాజు అధ్యక్షతన జరిగిన శాసన మండలి బీఏసీ సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు.
    AP అసెంబ్లీ బడ్జెట్‌ సమావేశాలు ఈ నెల 8 నుండి 25వ తేదీ వరకు, AP Assembly Budget Meetings from the 8th to the 25th of this monthమరింత చదవండి: 

    తాజా ఉద్యోగ ప్రకటనలు  ఇక్కడ క్లిక్ చేయండి
    ఉచిత స్టడీ మెటీరియల్ (APPSC, TSPSC) ఇక్కడ క్లిక్ చేయండి
    ఉచిత మాక్ టెస్టులు  ఇక్కడ క్లిక్ చేయండి

    ********************************************************************************************

    AP అసెంబ్లీ బడ్జెట్‌ సమావేశాలు ఈ నెల 8 నుండి 25వ తేదీ వరకు, AP Assembly Budget Meetings from the 8th to the 25th of this month

Sharing is caring!