AP యానిమల్ హస్బెండరీ అసిస్టెంట్ పరీక్షకు సిద్ధమవుతున్న అభ్యర్ధులకి AP యానిమల్ హస్బెండరీ అసిస్టెంట్ గత సంవత్సరం ప్రశ్నాపత్రం ఒక దిక్సూచిలా పనిచేస్తుంది. ఏదైనా ఒక పరీక్షకి సన్నద్దమవ్వడం సవాలుతో కూడుకున్న పని దానికి సులువు చేసే మార్గాలు గత సంవత్సర ప్రశ్న పత్రాలు, మాక్ టెస్ట్లు, మెరుగైన ప్రణాళిక ఎందుకంటే ఇవి అభ్యర్థులు సిలబస్‌పై సమగ్ర అవగాహన మరియు పరీక్షా సరళిపై బలమైన అవగాహనని కల్పిస్తాయి. ఈ కధనం ద్వారా AP యానిమాల్ హస్బెండరీ అసిస్టెంట్ గత సంవత్సర ప్రశ్నాపత్రం PDFను ఉచితంగా డౌన్‌లోడ్ చేసుకోండి మరియు మీ ప్రిపరేషన్‌ని మెరుగుపరచుకొండి.
AP యానిమల్ హస్బెండరీ అసిస్టెంట్ గత సంవత్సరం ప్రశ్నాపత్రాలు
AP యానిమల్ హస్బెండరీ అసిస్టెంట్ మునుపటి సంవత్సరం పేపర్‌లు ప్రాక్టీస్ చేయడం వల్ల అన్ని విషయాలపై మీకున్న పరిజ్ఞానాన్ని తెలుసుకోడానికి సహాయపడతాయి. మీ ప్రణాళిక లో ఏదైనా అంశం పై మీ పరిజ్ఞానం పెంచుకోడానికి మరియు ప్రశ్నల శైలి ని అర్ధం చేసుకుని తయారు కావడానికి AP యానిమల్ హస్బెండరీ అసిస్టెంట్ గత సంవత్సరం ప్రశ్నపత్రాలు ఎంతగానో ఉపయోగపడతాయి. AP యానిమల్ హస్బెండరీ అసిస్టెంట్ మునుపటి సంవత్సరం పేపర్‌లతో అధ్యయనం చేయడం మరియు వాటిని తరచూ సాధన చేయడం ద్వారా, ఆశావహులు వారి బలాలు మరియు బలహీనతలను గుర్తించుకోగలుగుతారు మరియు వారి సమస్య పరిష్కార నైపుణ్యాలను అంచనా వేసుకోగలరు.ఒక నిర్దిష్ట అధ్యయన షెడ్యూల్‌ను రూపొందించుకుని అంశాలను ప్లాన్ చేసుకుని అధ్యయనం చేయడం వలన వారి లోటుపాట్లు సరిదిద్దుకుని ఉత్తీర్ణత సాధించే అవకాశాలు ఖచ్చితంగా పెరుగుతాయి. అందువల్ల, అభ్యర్థులు మునుపటి సంవత్సరం పేపర్‌లతో తమ ప్రిపరేషన్‌ను మెరుగుపరచుకోవచ్చు.
AP యానిమల్ హస్బెండరీ అసిస్టెంట్ గత సంవత్సరం ప్రశ్నాపత్రాలు అవలోకనం
AP యానిమల్ హస్బెండరీ అసిస్టెంట్ గత సంవత్సరం ప్రశ్నాపత్రాలు అవలోకనం | |
సంస్థ | ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పశు సంవర్ధక శాఖ |
పరీక్షా స్థాయి | రాష్ట్ర స్థాయి |
వర్గం | మునుపటి సంవత్సరం ప్రశ్న పత్రాలు |
పోస్ట్ | యానిమల్ హస్బెండరీ అసిస్టెంట్ |
ఎంపిక పక్రియ | CBT మరియు డాక్యుమెంట్ వెరిఫికేషన్ |
పరీక్షా విధానం | ఆబ్జెక్టివ్ విధానం |
పరీక్ష భాష | ఇంగ్లీష్, ఉర్దూ మరియు తెలుగు |
అధికారిక వెబ్సైట్ | ahd.aptonline.in or /apaha-recruitment.aptonline.in |
AP యానిమల్ హస్బెండరీ అసిస్టెంట్ గత సంవత్సరం ప్రశ్నాపత్రం PDF
AP యానిమల్ హస్బెండరీ అసిస్టెంట్ కి తయారయ్యే అభ్యర్థులు మునుపటి సంవత్సరం పేపర్‌లతో తమ ప్రిపరేషన్‌ను ఇంకా మెరుగుపరచుకోవచ్చు. అందువల్ల, AP యానిమల్ హస్బెండరీ అసిస్టెంట్ మునుపటి సంవత్సరంపేపర్‌లని pdf రూపంలో మేము ఈ కథనం ద్వారా అందించాము.
AP Animal Husbandry Assistant Previous Year Question Paper
AP యానిమల్ హస్బెండరీ అసిస్టెంట్ గతసంవత్సర ప్రశ్న పత్రాలు ఎందుకు చెయ్యాలి?
AP యానిమల్ హస్బెండరీ అసిస్టెంట్ మునుపటి సంవత్సరం ప్రశ్న పత్రాలను సమాధానం చేయడం వలన మీకు పరీక్షా శైలి మీకు అర్ధం అవుతుంది మరియు ఏ అంశాలకు ప్రాధాన్యత ఇవ్వాలి, సమాయపాలన, ఏకాగ్రతని పొందడంలో కూడా సహాయపడుతుంది. AP యానిమల్ హస్బెండరీ అసిస్టెంట్ అభ్యర్ధులు మునుపటి సంవత్సరం పేపర్లు సమాధానం చేయడం వలన అభ్యర్థులకు అనేక ఇతర ప్రయోజనాలను ఉన్నాయి అవి:
పరీక్షా శైలి పై అవగాహన: ఏ విభాగం నుంచి ప్రశ్నలు వస్తాయి, ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వాల్సిన అంశాలు, తక్కువ శ్రద్ధ చూపాల్సిన అంశాలు మరియు ప్రశ్నల క్లిష్టత వంటి ఎన్నో వివరాలు మునుపటి ప్రశ్న పాత్రల ద్వారా తెలుస్తాయి. తద్వారా ఎక్కువ మార్కులు పొందేందుకు అవకాశం కూడా ఉంది. కావున AP పశుసంవర్ధక శాఖ అసిస్టెంట్ కి సన్నద్దమయ్యే అభ్యర్ధులు AP పశుసంవర్ధక శాఖ అసిస్టెంట్ గత సంవత్సర ప్రశ్న పత్రాలు తప్పనిసరిగా చెయ్యాలి ఇది అసలు పరీక్ష సమయంలో వారి సమయాన్ని మెరుగ్గా నిర్వహించడంలో వారికి సహాయపడుతుంది.
సమయ నిర్వహణ: మునుపటి సంవత్సరం ప్రశ్న పత్రాలు పరీక్షని సులభంగా మరియు సమయానుకూలంగా పరిష్కరించడంలో ఉపయోగపడతాయి. క్లిష్ట సమయాలలో అభ్యర్థులు వారి సమయ నిర్వహణ నైపుణ్యాల వల్ల పరీక్షని ఇబ్బంది లేకుండా సమాధానం చేయగలుగుతారు. పరీక్షా సమయం లోపు అన్నీ ప్రశ్నలు పరిష్కరించడాన్ని ఎంతో ప్రాక్టీస్ అవసరం, ఇది మునుపటి ప్రశ్న పత్రాలు మాక్ టెస్ట్ లు చేయడం వలన కలుగుతుంది. తద్వారా అసలు పరీక్ష సమయంలో వారి వేగం మరియు ఖచ్చితత్వం పెరుగుతుంది.
ప్రశ్నల క్లిష్టత స్థాయి: మునుపటి సంవత్సరం ప్రశ్న పత్రాలు అభ్యర్థులు పరీక్షలో అడిగే వివిధ రకాల ప్రశ్నలను వాటి క్లిష్టత స్థాయిని అర్థం చేసుకోవడానికి వీలు కల్పిస్తుంది. దీనివలన వారు ముఖ్యమైన అంశాలను గుర్తించి, వాటిపై శ్రద్ధ పెడతారు మరియు నిర్దిష్ట ప్రశ్నల శైలి వలన వారు క్లిష్టమైన ప్రశ్నలు కూడా సులువుగా సమాధానం చేయగలరు.
అంశాల పై పట్టు: మునుపటి సంవత్సరం పేపర్‌లను విశ్లేషించి తద్వారా అభ్యర్ధులు పునరావృతమయ్యే విషయాలు లేదా తరచుగా అడిగే అంశాలకు ఎక్కువ ప్రాధాన్యతను ఇవ్వడానికి ఇవి ఎంతగానో సహాయపడతాయి. మెరుగైన ప్రణాళికా, అభ్యాసం, సమగ్రమైన ప్రిపరేషన్‌న్ని ముందుకు తీసుకుని వెళ్తాయి ఇవి అసలైన పరీక్షలో మెరుగైన మార్కులను అందిస్తాయి.
ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించుకోవడానికి: అభ్యర్థులు పరీక్ష సరళి, ప్రశ్నల నమూనాలు మరియు క్లిష్టత స్థాయిల పై అవగాహన మునుపటి సంవత్సరం ప్రశ్నపత్రాలను క్రమం తప్పకుండా ప్రాక్టీస్ చేయడం వల్ల కలుగుతుంది. ఇది మీపై మీకు విశ్వాసాన్ని పెంచి ఆందోళనను తగ్గిస్తుంది మరియు పరీక్షకి మీరు తయారుగా ఉన్నారు అనే ఆలోచనను కల్పిస్తుంది. తద్వారా మీరు అసలైన పరీక్ష రోజున మెరుగ్గా పనిచేస్తారు.
AP యానిమల్ హస్బెండరీ అసిస్టెంట్ పరీక్షా సరళి
AP ADA రిక్రూట్‌మెంట్ 2023కి సంబంధించిన పరీక్షా విధానం ఇక్కడ అందించాము. ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ పూర్తయిన తర్వాత దాదాపు 20 రోజుల్లో పరీక్ష నిర్వహించబడుతుంది అని అధికారులు తెలిపారు కాబట్టి అభ్యర్థులు ముందుగానే పరీక్షా సరళిని అర్ధం చేసుకుని పరీక్షకి తయారవ్వాలి. AP యానిమల్ హస్బెండరీ అసిస్టెంట్ పరీక్షా సరళి ఇక్కడ తనిఖీ చెయ్యండి.
AP యానిమల్ హస్బెండరీ అసిస్టెంట్ పరీక్షా సరళి |
||||
Part | విభాగం | ప్రశ్నల సంఖ్య | మార్కులు | వ్యవధి |
A | జనరల్ స్టడీస్ మరియు మెంటల్ ఎబిలిటీ | 50 | 50 | 50 నిమిషాలు |
B | పశుసంవర్ధకానికి సంబంధించిన సబ్జెక్టు | 100 | 100 | 100 నిమిషాలు |
మొత్తం | 150 | 150 | 150 నిమిషాలు |
వివరణాత్మక సిలబస్ ను ఇక్కడ తనిఖీ చేయండి
మరింత చదవండి | |
తాజా ఉద్యోగ ప్రకటనలు | ఇక్కడ క్లిక్ చేయండి |
ఉచిత స్టడీ మెటీరియల్ (APPSC, TSPSC) | ఇక్కడ క్లిక్ చేయండి |
ఉచిత మాక్ టెస్టులు | ఇక్కడ క్లిక్ చేయండి |
Adda247 తెలుగు APP | ఇక్కడ క్లిక్ చేయండి |