AP and Telangana State Weekly Current Affairs, ఏపీ, తెలంగాణ రాష్ట్రాల వారాంతపు కరెంట్ అఫైర్స్
Current affairs play a very important role in the competitive examinations and hence, aspirants have to give undivided attention to it while doing preparation for the government examinations. The banking or state govt examinations comprise a section of “General Awareness” to evaluate how much the aspirant is aware of the daily happenings taking place around the world. To complement your preparation, we are providing you with a compilation of the Current affairs of September 1st week.
AP and Telangana State Weekly Current Affairs, ఏపీ, తెలంగాణ రాష్ట్రాల వారాంతపు కరెంట్ అఫైర్స్
Weekly current Affairs PDF in Telugu : APPSC, TSPSC గ్రూప్స్ , SI మరియు కానిస్టేబుల్ పరీక్షలలో జనరల్ అవేర్‌నెస్ చాలా ముఖ్యమైన విభాగాలలో ఒకటి మరియు మీరు మీ సమయాన్ని హృదయపూర్వకంగా కేటాయించినట్లయితే ఈ అంశం నుండి చాలా మంచి మార్కులు సాధించగలరు. పరీక్షల ముందు అప్పటికప్పుడు ఈ అంశాన్ని చదువుకొని వెళ్ళడం ద్వారా ఎక్కువ మార్కులు సాధించడం అసాధ్యం. GA మీరు 10-15 రోజుల్లో పూర్తి చేయగల విభాగం కాదు. మీరు జనరల్ అవేర్నెస్ పై పట్టు సాధించడానికి ఉత్తమ మార్గం రోజూ వార్తాపత్రికలను చదవడం లేదా వారపు వార్తల ద్వారా వెళ్ళడం.
దీని ద్వారా నెలవారీ లేదా 6 నెలల వార్తల ద్వారా తెలుసుకొనే సమాచారం కంటే ఎక్కువ సమాచారం తెలుసుకోవచ్చు. ఇక్కడ మేము మీకు అన్ని వార్తాపత్రికల నుండి సమకాలీన అంశాల సారాంశాన్ని అందిస్తున్నాము, ఇది మీ సమయాన్ని ఆదా చేస్తుంది మరియు మీరు ఆ సమయాన్ని వారాంతపు సమకాలీన అంశాలు 2022 అధ్యయనం కోసం కేటాయించవచ్చు.
APPSC/TSPSC Sure shot Selection Group
Telangana State Weekly Current affairs
1. నాబార్డు తెలంగాణ సీజీఎంగా సుశీల

నేషనల్ బ్యాంక్ ఫర్ అగ్రి కల్చర్ అండ్ రూరల్ డెవలప్‌మెంట్ (నాబార్డు) చీఫ్ జనరల్ మేనేజర్‌గా సుశీల చింతల నియమితులయ్యారు. తెలంగాణ ప్రాంతీయ కార్యాలయంలో బాధ్యతలు స్వీకరించారు. గతంలో ఆమె కేరళ, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కర్ణాటక, పంజాబ్, హరియాణా, ఉత్తరప్రదేశ్ ప్రాంతీయ కార్యా లయాల్లో పని చేశారు.
తమిళనాడులో పని చేసిన సమయంలో ఆ రాష్ట్ర ఉమెన్ డెవలప్ మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ బోర్డులోనూ సుశీల ఉన్నారు. నాబార్డ్ మద్దతు ఇచ్చే ఇంక్యుబేషన్ సెంటర్లతోపాటు అగ్రి స్టార్టప్‌లతో చురుకుగా పనిచేసిన ఆమెకు.. వ్యవసాయం, గ్రామీణాభివృద్ధి ప్రాజెక్టులు, క్రెడిట్ ప్లానింగ్, పర్యవేక్షణ, ఫైనాన్స్, మైక్రో క్రెడిట్, సహకార సంఘాలు, ఆర్‌ఆర్‌బీల పర్యవేక్షణలో మూడున్నర దశాబ్దాల అనుభవం ఉంది.
2. బుద్ధవనంలో రూ.100 కోట్ల పెట్టుబడులు

నాగార్జునసాగర్ తీరంలో నిర్మించిన బుద్ధవనంలో పెట్టుబడులు పెట్టేందుకు తైవాన్ దేశానికి చెందిన సంస్థ ముందు కొచ్చింది. దీంతోపాటు బెంగళూరుకు చెందిన మరో సంస్థ కూడా పెట్టుబడులకు సిద్ధమని ప్రకటించింది.
ఈ రెండు సంస్థలు కలిసి రూ. 100 కోట్లతో ప్రాజెక్టులు చేపట్టేందుకు సంసిద్ధత వ్యక్తం చేశాయి. బుద్ధవనంలో తమకు 15 ఎకరాల స్థలాన్ని కేటాయిస్తే రూ.75 కోట్లతో అక్కడ బౌద్ధస్తూపం, ఆరామం, ధ్యానమందిరం, ఆధ్యాత్మిక విద్యాకేంద్రం, బౌద్ధ భిక్షువుల శిక్షణ కేంద్రం, ఆచార్య నాగార్జునుడికి సంబంధించిన పరిశోధన కేంద్రాన్ని ఏర్పాటు చేయనున్నట్లు తైవాన్‌కు చెందిన ఫొగంగ్‌షాన్ సంస్థ ప్రకటించింది. ఇక బెంగళూరు కేంద్రంగా పనిచేస్తున్న మహాబోధి సొసైటీ..పదెకరాల స్థలా న్ని కేటాయిస్తే రూ.25 కోట్లతో బౌద్ధస్తూపం, ఆరామం, గ్రంథాలయం, భిక్షు శిక్షణాలయం, ధ్యానమందిరాలను నిర్మించనున్నట్లు వెల్లడించింది.
3. రీజినల్ రింగ్ రోడ్డు (RRR) దక్షిణానికి కేంద్రం గ్రీన్ సిగ్నల్

రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న రీజినల్ రింగ్ రోడ్డు (ఆర్‌ఆర్‌ఆర్) దక్షిణ భాగానికి కూడా కేంద్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.
హైదరాబాద్‌కు చుట్టూ 60, 70 కిలోమీటర్ల అవతల తెలంగాణలోని పలు ప్రధాన జిల్లాల మీదుగా రీజనల్ రింగ్ రోడ్డు నిర్మాణాన్ని చేపడుతున్నారు. ఇందులో ఉత్తర భాగానికి కేంద్రం ఇప్పటికే అనుమతి ఇవ్వడంతోపాటు భూసేకరణ, ఇతర ప్రాథమిక ప్రక్రియలు మొదలయ్యాయి. తాజాగా దక్షిణ భాగానికి కేంద్రం పచ్చజెండా ఊపింది. దీనికి సంబంధించి ఢిల్లీ కేంద్రంగా పనిచేసే ‘ఇంటర్ కాంటినెంటల్ కన్సల్టెంట్స్ అండ్ టెక్నోక్రాట్స్ ప్రైవేట్ లిమిటెడ్’కు కన్సల్టెన్సీగా బాధ్యతలు అప్పగిస్తూ జాతీయ రహదారుల ప్రాధికార సంస్థ (ఎన్‌హెచ్‌ఏఐ) ఆదేశాలు జారీ చేసింది. రీజినల్ రింగ్ రోడ్డులోని ప్రతిపాదిత 182 కిలోమీటర్ల పొడవైన దక్షిణ భాగానికి సమగ్ర ప్రాజెక్టు నివేదిక (డీపీఆర్) రూపాందించాల్సిందిగా తాజాగా ఎన్‌హెచ్‌ఏఐ ఆ సంస్థను ఆదేశించింది. త్వరలో కన్సల్టెన్సీ సంస్థ హైదరాబాద్‌లో కార్యాలయాన్ని ప్రారంభించి, అలైన్‌మెంట్ తయారీ కసరత్తు ప్రారంభించబోతోంది. దీనితో మొత్తంగా ప్రతిష్టాత్మక రీజినల్ రింగ్ రోడ్డు పూర్తిస్థాయిలో నిర్మించేందుకు మార్గం సుగమమైంది.
హైదరాబాద్ రీజినల్ రింగు రోడ్డుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదనలు చేసి కేంద్రానికి పంపగా గతంలో ఓ కన్సల్టెన్సీతో తాత్కాలిక అలైన్‌మెంట్‌ను రూపొందించారు. మొత్తంగా 342 కిలోమీటర్ల పొడవుతో రింగ్ రోడ్డు ఉంటుందని అందులో ఉత్తర భాగం 160 కిలోమీటర్ల మేర.. దక్షిణ భాగం 182 కిలోమీటర్ల మేర ఉంటుందని అంచనా వేశారు. ఇందులో ఉత్తర భాగానికి కేంద్రం తొలుత గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. దానికి నాగ్‌పూర్ కేంద్రంగా పనిచేసే కే అండ్ జే సంస్థను కన్సల్టెన్సీగా నియమించగా.. ఆ సంస్థ సర్వే చేసి ఉత్తర భాగం పొడవును 158.62 కిలోమీటర్లుగా ఖరారు చేసింది.
Andhra Pradesh State Weekly Current Affairs
1. ఆంధ్రప్రదేశ్‌కు ‘ఇన్‌ఫ్రా ఫోకస్’ అవార్డు

తీరప్రాంత అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న కృషికి జాతీయ స్థాయిలో గుర్తింపు లభించింది. దేశీయ ఇన్‌ఫ్రా రంగంపై ప్రముఖ వాణిజ్య దినపత్రిక ఎకనామిక్ టైమ్స్ ఏటా ప్రకటించే అవార్డు ఏపీ పోర్టులకు దక్కింది. పోర్టు ఆధారిత మౌలిక వసతుల కల్పనలో రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న కృషి, అత్యుత్తమ ప్రగతికి గుర్తింపుగా ఇన్‌ఫ్రా ఫోకస్ అవార్డుకు ఎంపిక చేసినట్లు పరిశ్రమల శాఖ మంత్రి గుడివాడ అమర్‌నాథ్‌కు రాసిన లేఖలో ఎకనామిక్ టైమ్స్ పేర్కొంది.
సెప్టెంబర్ 27న ఢిల్లీలోని హయత్ రెసిడెన్సీలో జరిగే 7వ ఇన్‌ఫ్రా ఫోకస్ అవార్డుల కార్యక్రమంలో ఈ అవార్డును ప్రధానం చేయనున్నారు. ఈ కార్యక్రమానికి హాజరు కావాలని మంత్రి అమర్‌నాథ్‌ను టైమ్స్ గ్రూప్ ఆహ్వానించింది. నీతి ఆయోగ్ సలహాదారుడు సుధేందు జే సిన్హా అధ్యక్షతన ఏర్పాటైన జ్యూరీ అన్ని రాష్ట్రాలు అమలు చేస్తున్న వివిధ ఇన్‌ఫ్రా ప్రాజెక్టులను పరిశీలించి అవార్డుకు ఎంపిక చేసింది.
2. APలోని నాడు – నేడు స్ఫూర్తితో ‘పీఎం శ్రీ’ స్కూళ్లు

విద్యారంగ సంస్కరణల్లో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ప్రతిష్టాత్మక ‘మనబడి నాడు – నేడు’ కార్యక్రమం పలు రాష్ట్రాలకు ఆదర్శంగా నిలవగా తాజాగా కేంద్ర ప్రభుత్వానికీ స్ఫూర్తిదాయకమైంది.
నాడు – నేడు తరహాలో అన్ని సదుపాయాలతో ‘పీఎం శ్రీ’ పేరిట కొత్తగా స్కూళ్లను ప్రారంభించాలని తాజాగా కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. సెప్టెంబర్ 6 న జరిగిన కేంద్ర కేబినెట్ సమావేశంలో ఆమోదం తెలిపింది. దేశవ్యాప్తంగా 14,500 స్కూళ్లను ప్రారంభించనున్నారు. ప్రాజెక్టు ప్రాతిపదికన ఐదేళ్లపాటు కొనసాగనున్నాయి.
3. ఏపీ రాష్ట్రంలో రూ.1,26,622.23 కోట్లు పెట్టుబడులు

రాష్ట్ర పారిశ్రామిక రంగంలో నూతన శకాన్ని లిఖిస్తూ రూ.1,26,622.23 కోట్ల విలువైన పెట్టుబడులకు రాష్ట్ర పెట్టుబడుల ప్రోత్సాహక మండలి (ఎస్‌ఐపీబీ) ఆమోదం తెలిపింది. గ్రీన్ ఎనర్జీ, ఫార్మా, ఎలక్ట్రిక్ వాహనాలు, ఫుడ్ ప్రోసెసింగ్ రంగాలకు చెందిన వివిధ పెట్టుబడుల ప్రతిపాదనలకు ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి అధ్యక్షతన జరిగిన సెప్టెంబర్ 5 న తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో జరిగిన సమావేశంలో ఎస్‌ఐపీబీ ఆమోదం తెలిపింది. ఆయా కంపెనీల ఏర్పాటు ద్వారా 36,380 మందికి ఉపాధి లభించనుంది.
ఇందులో ఒక్క గ్రీన్ ఎనర్జీ రంగంలోనే రూ.81,043 కోట్ల పెట్టుబడులు ఉన్నాయి. ఇండోసోల్ సోలార్, ఆస్త్రా గ్రీన్, షిర్డీ సాయి ఎలక్ట్రికల్స్, అరబిందో రియాల్టీ అండ్ ఇన్‌ఫ్రా, ఏఎం గ్రీన్ ఎనర్జీ, గ్రీన్‌కో వంటి సంస్థలు పర్యావరణ ఉపయుక్తమైన ఆరు పంప్డ్ స్టోరేజ్ విద్యుత్ యూనిట్లను ఏర్పాటు చేస్తున్నాయి. ఈ ఆరు గ్రీన్ ఎనర్జీ పాంట్ల ద్వారా 17,930 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి కానుంది. ఈ యూనిట్ల ద్వారా 20,130 మందికి ఉపాధి లభిస్తుందని అంచనా. వీటితో పాటు నెల్లూరు జిల్లా రామాయపట్నం వద్ద ఇండోసోల్ సోలార్ కంపెనీ మరో రూ.43,143 కోట్లతో మెటలార్జికల్ గ్రేడ్ సిలికాన్, పాలీ సిలికాన్, ఫ్లోట్.. రోల్డ్ గ్లాసెస్ తయారీ యూనిట్‌తో పాటు సోలార్ విద్యుత్ ప్లాంట్‌ను ఏర్పాటు చేయనుంది. కాకినాడ సెజ్ వద్ద రూ.1,900 కోట్ల పెట్టుబడితో లైఫిజ్ ఫార్మా, వైఎస్సార్ జిల్లా కొప్పర్తి వద్ద కాసిస్ రూ.386.23 కోట్లతో ఎలక్ట్రిక్ బస్సుల తయారీ కేంద్రం, కృష్ణా జిల్లా మల్లవల్లి వద్ద రూ.150 కోట్లతో అవిశాఫుడ్స్ ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ ప్రతిపాదనలకు ఎస్‌ఐపీబీ ఆమోదం తెలిపింది.
4. మానవ అక్రమ రవాణా తగ్గడం శుభపరిణామం

ఆంధ్రప్రదేశ్‌లో మానవ అక్రమ రవాణా తగ్గుముఖం పట్టడం శుభపరిణామం అని, గతేడాది కాలంగా రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్న కట్టుదిట్టమైన చర్యలు మంచి ఫలితాలు ఇస్తున్నాయని అనేందుకు ఇదే సంకేతమని హెల్ప్ స్వచ్ఛంద సంస్థ రాష్ట్ర కార్యదర్శి రామమోహన్ నిమ్మరాజు స్పష్టం చేశారు. మానవ అక్రమ రవాణాకు వ్యతిరేకంగా స్వచ్ఛంద సంస్థ ద్వారా కొన్నేళ్లుగా కృషి చేస్తున్న రామమోహన్ జాతీయ నేర గణాంక సంస్థ (ఎన్‌సీఆర్‌బీ)–2021 నివేదికపై సెప్టెంబర్ 4 న స్పందించారు. గతేడాది ప్రతి జిల్లాకు ఒక మానవ అక్రమ రవాణా నిరోధక యూనిట్ (ఏహెచ్‌టీయూ) ఏర్పాటు చేసి అక్రమ రవాణా నిరోధానికి కఠిన చర్యలు తీసుకోవడం మంచి ఫలితాలు ఇచ్చిందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న చర్యల ఫలితంగా మానవ అక్రమ రవాణా కేసుల్లో 2020లో మూడో స్థానంలో ఉన్న ఆంధ్రప్రదేశ్ 2021లో ఐదో స్థానానికి తగ్గిందన్నారు. ఎన్‌సీఆర్‌బీ రిపోర్టు ప్రకారం మానవ అక్రమ రవాణాలో మొదటి స్థానంలో తెలంగాణ, రెండు, మూడు, నాలుగు స్థానాల్లో వరుసగా మహారాష్ట్ర, అస్సాం, కేరళ ఉన్నాయన్నారు. గతేడాది ఆంధ్రప్రదేశ్‌లో 99.3 శాతం కేసుల్లో పోలీసులు చార్జిషీట్ వేయడం, 757 మందిని అరెస్టు చేయడం ఒక రికార్డు అని రామమోహన్ వివరించారు.
5. NITI Aayog వర్కింగ్ గ్రూప్‌లో ఏపీకి చోటు

రానున్న ముప్పై ఏళ్లలో వ్యవసాయ విధానాల రూపకల్పన కోసం నీతి ఆయోగ్ పర్యవేక్షణలో ఏర్పాటు చేసిన జాతీయస్థాయి వర్కింగ్ గ్రూప్‌లో ఆంధ్రప్రదేశ్‌కు ప్రాతినిధ్యం కల్పిస్తూ కేంద్రం ఆదేశాలు జారీచేసింది.
విదేశాల నుంచి దిగుమతులపై ఆధారపడకుండా దేశీయంగా పెరుగుతున్న జనాభా అవసరాలకు తగినట్లుగా నాణ్యమైన ఆహార ఉత్పత్తుల దిగుబడులను పెంచుకునేందుకు అనుసరించాల్సిన కార్యాచరణపై పాలసీల రూపకల్పనలో ఈ కమిటీ క్రియాశీలకంగా వ్యవహరిస్తుంది. వ్యవసాయం, ఉద్యానం, పట్టు, పశుసంవర్థక, మత్స్య తదితర వ్యవసాయ అనుబంధ రంగాలను బలోపేతం చేసేందుకు ఈ కమిటీ రూపొందించే విధానాలను కేంద్రం అమలుచేస్తుంది.
6. E- Crop Registration : ఏపీ మోడల్‌గా, జాతీయ స్థాయిలో అమలుకు శ్రీకారం

ఆంధ్రప్రదేశ్‌లో ఈ–క్రాప్ నమోదు వల్ల రైతాంగానికి ఒనగూరుతున్న ప్రయోజనాలను ప్రత్యక్షంగా పరిశీలించిన కేంద్రం, ఈ విధానాన్ని దేశ వ్యాప్తంగా అమలు చేసేందుకు శ్రీకారం చుట్టింది.
ఏపీని మోడల్‌గా తీసుకొని, అగ్రిస్టాక్ డిజిటల్ అగ్రికల్చర్ (ఏడీఎ) పేరిట అన్ని రాష్ట్రాల్లో ఈ–క్రాప్ నమోదు చేయాలని కేంద్ర వ్యవసాయ, కుటుంబ సంక్షేమ శాఖ ఆదేశాలు జారీ చేసింది. సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఆలోచనల నుంచి పుట్టిన ఈ కార్యక్రమం మూడేళ్లుగా విజయవంతంగా అమలవుతోంది. జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో ప్రశంసలందుకుంటోంది. ఈ–క్రాప్ నమోదు ప్రామాణికంగా సబ్సిడీపై విత్తనాలు, ఎరువులు, పురుగుల మందులతో పాటు వైఎస్సార్ రైతు భరోసా కింద ఏటా రూ.13,500 చొప్పున పెట్టుబడి సాయం, స్కేల్ ఆఫ్ ఫైనాన్స్ ప్రకారం పంట రుణాలు, రూ.లక్ష లోపు పంట రుణాలు ఏడాది లోపు చెల్లించిన వారికి వైఎస్సార్ సున్నా వడ్డీ రాయితీ, ప్రకృతి వైపరీత్యాల వల్ల పంటలు నష్టపోయిన రైతులను ఆదుకునేందుకు సీజన్ ముగియకుండానే పంట నష్ట పరిహారం (ఇన్‌పుట్ సబ్సిడీ), వైఎస్సార్ ఉచిత పంటల బీమా పథకాలనందిస్తున్నారు.
భూ యజమానులకే కాకుండా, సెంటు భూమి లేని ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ కౌలుదారులకు కూడా ఈ క్రాప్ నమోదే అర్హతగా వైఎస్సార్ రైతు భరోసాతో సహా అన్ని రకాల పథకాలు అందిస్తున్నారు. ఈ క్రాప్ అమలులోకి వచ్చాక వ్యవసాయ, ఉద్యాన, పట్టు, పశుగ్రాసం, ఆక్వా పంటలన్నీ కలిపి ఖరీఫ్ 2020లో 124.92 లక్షల ఎకరాలు, రబీ 2020–21లో 83.77 లక్షల ఎకరాలు, ఖరీఫ్ 2021లో 112.26 లక్షల ఎకరాలు, రబీ 2021–22లో 82.59 లక్షల ఎకరాల్లో ఈ–క్రాప్ బుకింగ్ జరిగింది.
***************************************************************
మరింత చదవండి:
తాజా ఉద్యోగ ప్రకటనలు | ఇక్కడ క్లిక్ చేయండి |
ఉచిత స్టడీ మెటీరియల్ (APPSC, TSPSC) | ఇక్కడ క్లిక్ చేయండి |
ఉచిత మాక్ టెస్టులు | ఇక్కడ క్లిక్ చేయండి |