AP and Telangana State Weekly Current Affairs, ఏపీ, తెలంగాణ రాష్ట్రాల వారాంతపు కరెంట్ అఫైర్స్
Current affairs play a very important role in the competitive examinations and hence, aspirants have to give undivided attention to it while doing preparation for the government examinations. The banking or state govt examinations comprise a section of “General Awareness” to evaluate how much the aspirant is aware of the daily happenings taking place around the world. To complement your preparation, we are providing you with a compilation of the Current affairs of September 3rd week.
AP and Telangana State Weekly Current Affairs, ఏపీ, తెలంగాణ రాష్ట్రాల వారాంతపు కరెంట్ అఫైర్స్
Weekly current Affairs PDF in Telugu : APPSC, TSPSC గ్రూప్స్ , SI మరియు కానిస్టేబుల్ పరీక్షలలో జనరల్ అవేర్‌నెస్ చాలా ముఖ్యమైన విభాగాలలో ఒకటి మరియు మీరు మీ సమయాన్ని హృదయపూర్వకంగా కేటాయించినట్లయితే ఈ అంశం నుండి చాలా మంచి మార్కులు సాధించగలరు. పరీక్షల ముందు అప్పటికప్పుడు ఈ అంశాన్ని చదువుకొని వెళ్ళడం ద్వారా ఎక్కువ మార్కులు సాధించడం అసాధ్యం. GA మీరు 10-15 రోజుల్లో పూర్తి చేయగల విభాగం కాదు. మీరు జనరల్ అవేర్నెస్ పై పట్టు సాధించడానికి ఉత్తమ మార్గం రోజూ వార్తాపత్రికలను చదవడం లేదా వారపు వార్తల ద్వారా వెళ్ళడం.
దీని ద్వారా నెలవారీ లేదా 6 నెలల వార్తల ద్వారా తెలుసుకొనే సమాచారం కంటే ఎక్కువ సమాచారం తెలుసుకోవచ్చు. ఇక్కడ మేము మీకు అన్ని వార్తాపత్రికల నుండి సమకాలీన అంశాల సారాంశాన్ని అందిస్తున్నాము, ఇది మీ సమయాన్ని ఆదా చేస్తుంది మరియు మీరు ఆ సమయాన్ని వారాంతపు సమకాలీన అంశాలు 2022 అధ్యయనం కోసం కేటాయించవచ్చు.
APPSC/TSPSC Sure shot Selection Group
Telangana State Weekly Current affairs
1. హైదరాబాద్‌లో ఏడో జాతీయ డిజిటల్ పరివర్తన సదస్సు
ప్రపంచవ్యాప్తంగా డిజిటల్ రంగానికి ఉజ్వల భవిష్యత్తు ఉందని పలువురు వక్తలు తెలిపారు. హైదరాబాద్‌లో తెలంగాణ ఐటీ శాఖ ఆధ్వర్యంలో ఏడో జాతీయ పరివర్తన సదస్సు జరిగింది. దీనికి ఒడిశా మంత్రి తుషారకాంతి బెహరా, తెలంగాణ నవీన సాంకేతిక విభాగం సంచాలకురాలు రమాదేవి, హెచ్‌పీఈ సంస్థ కంట్రీ మేనేజర్ మయాంక్ చతుర్వేది, అమెజాన్ వెబ్ సర్వీస్ వాణిజ్య విభాగాధిపతి అజయ్‌కౌల్‌లు ముఖ్యఅతిథులుగా హాజరయ్యారు. వారు మాట్లాడుతూ మున్ముందు డిజిటల్ రంగం అద్భుతాలను సాధిస్తుందని ఆకాంక్షించారు. తెలంగాణలో డిజిటల్ రంగంలో సాధించిన ప్రగతిని రమాదేవి పవర్‌పాయింట్ ప్రజంటేషన్ ద్వారా వివరించారు.
2. రైతు బీమాకు రూ. 1,450 కోట్లు, ఒక్కో రైతుకు రూ.3,830 చెల్లింపు
ఈ ఏడాదికి సంబంధించిన రైతు బీమా ప్రీమియం సొమ్మును ఎల్‌ఐసీకి రాష్ట్ర ప్రభుత్వం చెల్లించింది. ఒక్కో రైతుకు రూ.3,830 చొప్పున మొత్తం రూ.1,450 కోట్లు చెల్లించింది.
గతేడాది కంటే ఎక్కువగా రైతులు ఈ పథకం కింద నమోదు అయ్యారు. గతేడాది 35.64 లక్షల మంది లబి్ధదారులు ఉంటే, ఈ ఏడాది ఆ సంఖ్య 37.77 లక్షలకు చేరినట్లు వ్యవసాయ శాఖ తెలిపింది. అంటే అదనంగా 2.13 లక్షల మంది రైతులు నమోదు చేసుకున్నారు.
2018 ఆగస్టు 14వ తేదీ నుంచి ఈ పథకం అమల్లోకి వచ్చింది. బీమా పరిధిలోని రైతు ఏ కారణంతో మరణించినా వారి కుటుంబాలకు (నామినీ) పరిహారంగా ఎల్‌ఐసీ రూ.5 లక్షలు అందజేస్తుంది.
3. దళితబంధు 600కోట్లు ఒక్కో కుటుంబానికి రూ.10 లక్షలు
ఈ పథకానికి ప్రభుత్వం తాజాగా రూ.600 కోట్లు విడుదల చేసింది. దీంతో చర్యలకు ఉపక్రమించిన ఎస్సీ కార్పొరేషన్, ఈ పథకం కింద ఇప్పటివరకు ఎంపికైన లబ్ధిదారులందరికీ ఆర్థిక సాయాన్ని వారి బ్యాంకు ఖాతాల్లో జమ చేసింది. రాష్ట్రవ్యాప్తంగా వివిధ కేటగిరీల్లో ఇప్పటివరకు 38,476 మంది లబ్ధిదారులు ఈ పథకం కింద ఎంపికయ్యారు. ప్రస్తుతం ఎంపికైన లబ్ధిదారుల ఖాతాల్లో రూ.3,847.6 కోట్లు ప్రభుత్వం జమ చేసింది.
హుజూరాబాద్‌తో ప్రారంభం
దళితబంధు పథకం ఇప్పటివరకు నాలుగు కేటగిరీల్లో అమలైంది. తొలుత కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ నియోజకవర్గంలో ఉన్న దళిత కుటుంబాలకు పూర్తిస్థాయిలో పథకాన్ని అమలు చేయాలని నిర్ణయించిన ప్రభుత్వం.. ఆ మేరకు లబ్ధిదారుల ఎంపిక మొదలుపెట్టింది. ఈ క్రమంలో ఆ నియోజకవర్గంలో మొత్తం 18,211 కుటుంబాలను గుర్తించిన యంత్రాంగం.. ఒక్కో కుటుంబానికి రూ.10 లక్షల చొప్పున అర్హులందరి ఖాతాల్లో నిధులను జమ చేసింది.
Andhra Pradesh State Weekly Current Affairs
1. ఏపీ శాసనసభలో స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖ చట్ట సవరణ బిల్లు
స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖ మరో కొత్త వసూలు విధానానికి ఉపక్రమించింది. జాతీయ, అంతర్జాతీయ సంస్థల మధ్య జరిగే లీజు ఒప్పందాలకు సంబంధించి స్టాంపు డ్యూటీని విధించింది. ఈ సంస్థలు తమ ఉత్పత్తులు, యంత్రాలు, పరికరాలు, ఆహార పదార్థాలు విక్రయించుకోడానికి అనుమతించే ఒప్పందాలకు స్టాంపు డ్యూటీ నిర్ణయించింది. తాజాగా రాష్ట్ర ప్రభుత్వం భారత స్టాంపు చట్టం – 1899ని సవరిస్తూ బిల్లును శాసనసభలో ప్రవేశపెట్టింది. ఇలాంటి లీజులపై ఏడాదికి రూ.1,000, ఏడాదికి మించి పదేళ్లలోపు ప్రతి ఏడాదికి రూ.1,000, పదేళ్ల కాలానికి మించితే రూ.25,000 స్టాంపు డ్యూటీ చెల్లించాల్సి ఉంటుంది. ట్రేడింగ్ కేటగిరిలోనూ, మేధో సంపత్తి బదలాయింపులోనూ ఇదే విధానంలో స్టాంపు డ్యూటీ చెల్లించాలి.
2. ‘రీ-సర్వే’పై నల్సార్‌తో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఒప్పందం
భూముల రీ-సర్వేపై రైతుల్లో అవగాహన కల్పించేందుకు, పరిశోధనల నిర్వహణకు హైదరాబాద్‌లోని నల్సార్ న్యాయ విశ్వవిద్యాలయం, ఆంధ్ర రాష్ట్ర సర్వే శాఖల మధ్య ఒప్పందం జరిగింది. హైదరాబాదులో జరిగిన ఒప్పంద కార్యక్రమంలో విశ్వవిద్యాలయం ఉపకులపతి ఆచార్య బాలకిష్టారెడ్డి, సర్వే శాఖ శిక్షణ సంస్థ వైస్ ప్రిన్సిపల్ కుమార్ అవగాహన పత్రాలను మార్చుకున్నారు. ఈ సందర్భంగా సర్వే శాఖ కమిషనర్ సిద్దార్థజైన్ ఓ ప్రకటన విడుదల చేశారు. సీఎం జగన్ రీ-సర్వే నిర్వహణలో నల్సార్ న్యాయ విశ్వవిద్యాలయాన్ని భాగస్వామ్యం చేయాలని ఆదేశించిన మేరకు చర్యలు తీసుకున్నాం. రైతులకు రీ-సర్వేపై అవగాహన, చట్టపర హక్కులపై స్పష్టత కల్పించడం వంటి అంశాలు ఈ ఒప్పందంలో క్రియాశీలకంగా ఉంటాయి. ఈ ఒప్పందం ద్వారా రీ-సర్వేలో పాల్గొనే భాగస్వాములకు విశ్వవిద్యాలయం ద్వారా శిక్షణ అందుతుంది. రీ-సర్వే నిర్వహణలో పార్టీలు పరస్పర అంగీకారం, ఇతర అంశాలపైనా విశ్వవిద్యాలయం తనవంతు సహకారాన్ని అందిస్తుంది. రాష్ట్రంలో రూ.వెయ్యి కోట్లతో చేపట్టిన రీ-సర్వే 2023 సెప్టెంబరు నాటికి పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు వివరించారు.
3. YSR ఆరోగ్య విశ్వ విద్యాలయంగా మార్చేందుకు రాష్ట్ర ఉభయ సభలు ఆమోదం
డాక్టర్ ఎన్టీఆర్ ఆరోగ్య విశ్వ విద్యాలయం పేరును డాక్టర్ వైఎస్సార్ ఆరోగ్య విశ్వ విద్యాలయంగా మార్చేందుకు రాష్ట్ర ఉభయ సభలు ఆమోదం తెలిపాయి. డాక్టర్ ఎన్టీఆర్ ఆరోగ్య విజ్ఞాన శాస్త్రాల విశ్వవిద్యాలయం సవరణ బిల్లు–2022ను ఉభయ సభల్లో వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి విడదల రజిని ప్రవేశపెట్టారు.
1986 నవంబర్ 1వ తేదీన ఏపీ యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్ పేరిట ఆరోగ్య విశ్వవిద్యాలయం ఏర్పాటు చేశారు. 1998 జనవరి 8వ తేదీన ఎన్టీఆర్ ఆరోగ్య విశ్వ విద్యాలయంగా పేరు మార్చారు. ప్రస్తుతం దానిని డాక్టర్ వైఎస్సార్ ఆరోగ్య విశ్వ విద్యాలయంగా మార్చేందుకు ప్రవేశ పెట్టిన బిల్లుకు ఏకగ్రీవంగా ఆమోదం లభించింది.
4. విశాఖలో దేశంలోనే తొలి ఇండస్ట్రీ 4.0 సెంటర్ ఆఫ్ ఎక్సలెన్సీ సిద్ధం
పారిశ్రామికరంగంలో నాలుగో తరం టెక్నాలజీ ఆవిష్కరణలకు విశాఖ వేదిక అవుతోంది. విశాఖ ఉక్కు (ఆర్‌ఐఎన్‌ఎల్)తో కలిసి సాఫ్ట్‌వేర్ టెక్నాలజీ పార్క్స్ ఆఫ్ ఇండియా (ఎస్‌టీపీఐ) సంయుక్తంగా ‘కల్పతరువు’ పేరుతో ఏర్పాటుచేసిన ఇండస్ట్రీ–4.0 సీవోఈ (సెంటర్ ఆఫ్ ఎక్సలెన్సీ) కార్యకలాపాలు సెప్టెంబర్ 20 నుంచి లాంఛనంగా ప్రారంభం కానున్నాయి. దేశంలోని స్టార్టప్‌లను ఆకర్షించేలా ఓపెన్ చాలెంజ్ ప్రోగ్రాం–1 (ఓసీపీ–1)ను కల్పతరువు సీఓఈ ప్రకటించింది.
విశాఖపట్నంలో ఉన్న ప్రభుత్వరంగ సంస్థలు ఆర్‌ఐఎన్‌ఎల్, ఎన్‌టీపీసీ, వైజాగ్ పోర్టు, హెచ్‌పీసీఎల్ వంటి పరిశ్రమల్లో మానవ వనరుల వినియోగం తగ్గించి ఖర్చులను నియంత్రించే నూతన టెక్నాలజీ ఆవిష్కరణలను పెంచి తద్వారా స్టార్టప్‌లను ప్రోత్సహించేందుకు కల్పతరువు సీవోఈని ఏర్పాటుచేసినట్లు ఎస్‌టీపీఐ విశాఖ అడిషనల్ డైరెక్టర్ సురేష్ తెలిపారు. ఇందులో భాగంగా ముందుగా విశాఖ ఉక్కు పరిశ్రమకు సంబంధించిన ఆరు సమస్యల పరిష్కారాన్ని కోరుతూ ఓసీపీ–1 పేరుతో స్టార్టప్‌లను ఆహ్వానిస్తున్నట్లు తెలిపారు. ఒక్కో సమస్యకు ఇండస్ట్రీ–4 టెక్నాలజీతో చక్కటి పరిష్కరం చూపిన ప్రోటోటైప్ స్టార్టప్‌ను ఎంపికచేసి రూ.4 లక్షలు బహుమతిగా ఇవ్వడమే కాక, కల్పతరువు సీవోఈ ద్వారా ప్రాజెక్టు ఫండింగ్ సౌకర్యం కలి్పస్తారు. పరిశ్రమల్లో ఆటోమేషన్ పెంచేందుకు బిలియన్ డాలర్లు వ్యయం చేస్తున్నారని, ఇందులో నూతన ఆవిష్కరణలకు విశాఖ వేదిక కానుందని కల్పతరువు ప్రాజెక్టు మేనేజ్‌మెంట్ గ్రూపు సభ్యుడు, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అసోసియేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ (ఐటాప్) ప్రెసిడెంట్ శ్రీధర్ కోసరాజు తెలిపారు.
5. AP State Economy: ‘నికరం’గా ఆర్థికవృద్ధి
రాష్ట్ర ఆర్ధిక వ్యవస్థ మూ డేళ్లుగా వృద్ధి పథంలో దూసుకుపోతోంది. ఆర్థిక వృద్ధికి ప్రధానంగా వ్యవసాయం, తయారీ, రియల్ ఎస్టేట్ రంగాలు వెన్నుదన్నుగా నిలుస్తున్నాయి. ప్రస్తుత ధరలతో పోల్చి చూస్తే 2021–22 ఆర్థిక ఏడాది నాటికి రాష్ట్ర ఆర్థిక నికర విలువ (నెట్ స్టేట్ వ్యాల్యూ యాడెడ్) రికార్డు స్థాయిలో రూ.10.85 లక్షల కోట్లకు చేరుకోవడం గమనార్హం. ఆర్థిక మందగమనం, వరుసగా రెండేళ్ల పాటు కరోనా సంక్షోభ పరిస్థితులను అధిగమించి గత మూడేళ్లలో రాష్ట్ర ఆర్థిక నికర విలువ 37.28 శాతం మేర పెరిగింది.
6. తొలిసారిగా రూ.2 లక్షలు దాటిన ఏపీ తలసరి ఆదాయం
తొలిసారిగా ఏపీ తలసరి ఆదాయం రెండు లక్షల రూపాయలు దాటింది. 2021 – 22కి సంబంధించి రిజర్వ్ బ్యాంక్ ఇండియా విడుదల చేసిన ఆర్థిక వ్యవస్థ గణాంకాల నివేదికలో వివిధ రాష్ట్రాల తలసరి ఆదాయ వివరాలను వెల్లడించింది. ఆర్బీఐ విడుదల చేసిన ప్రొవిజనల్ గణాంకాల మేరకు రాష్ట్ర తలసరి ఆదాయం 2021–22 ఆర్థిక సంవత్సరంలో రూ. 2,07,771కి పెరిగింది. ఇదే సమయంలో జాతీయ తలసరి ఆదాయం రూ.1,50,007 మాత్రమే నమోదు కావడం గమనార్హం.
ఆర్థిక సంవత్సరం (2021–22)లో రాష్ట్ర తలసరి ఆదాయం ఏకంగా 17.57 శాతం పెరిగింది. అంతకుముందు ఆర్థిక సంవత్సరంతో పోల్చితే రాష్ట్ర తలసరి ఆదాయం రూ. 31,064 పెరిగింది.
మూడేళ్లలో 34.88 శాతం పెరుగుదల
గత సర్కారు దిగిపోయే నాటికి 2018 – 19లో రాష్ట్ర తలసరి ఆదాయం రూ.1,54,031 మాత్ర మే ఉండగా 2021–22లో ఏకంగా రూ.2,07,771కి పెరిగింది. వైఎస్సార్‌సీపీ పాలనలో మూడేళ్లలో రాష్ట్ర తలసరి ఆదాయం 34.88 శాతం మేర పెరిగినట్లు స్పష్టమవుతోంది.
మరింత చదవండి:
తాజా ఉద్యోగ ప్రకటనలు | ఇక్కడ క్లిక్ చేయండి |
ఉచిత స్టడీ మెటీరియల్ (APPSC, TSPSC) | ఇక్కడ క్లిక్ చేయండి |
ఉచిత మాక్ టెస్టులు | ఇక్కడ క్లిక్ చేయండి |