Telugu govt jobs   »   Weekly Current Affairs   »   AP and Telangana States September Weekly...

AP and Telangana States September Weekly Current Affairs , ఏపీ, తెలంగాణ రాష్ట్రాల సెప్టెంబర్ వారాంతపు కరెంట్ అఫైర్స్

AP and Telangana State Weekly Current Affairs, ఏపీ, తెలంగాణ రాష్ట్రాల వారాంతపు కరెంట్ అఫైర్స్

Current affairs play a very important role in the competitive examinations and hence, aspirants have to give undivided attention to it while doing preparation for the government examinations. The banking or state govt examinations comprise a section of “General Awareness” to evaluate how much the aspirant is aware of the daily happenings taking place around the world. To complement your preparation, we are providing you with a compilation of the  Current affairs of September 2nd week.

 

AP and Telangana State Weekly Current Affairs, ఏపీ, తెలంగాణ రాష్ట్రాల వారాంతపు కరెంట్ అఫైర్స్

Weekly current Affairs PDF in Telugu : APPSC, TSPSC గ్రూప్స్ , SI మరియు కానిస్టేబుల్ పరీక్షలలో  జనరల్ అవేర్‌నెస్ చాలా ముఖ్యమైన విభాగాలలో ఒకటి మరియు మీరు మీ సమయాన్ని హృదయపూర్వకంగా కేటాయించినట్లయితే ఈ అంశం నుండి చాలా మంచి మార్కులు సాధించగలరు. పరీక్షల  ముందు అప్పటికప్పుడు  ఈ అంశాన్ని చదువుకొని వెళ్ళడం ద్వారా ఎక్కువ మార్కులు సాధించడం అసాధ్యం.  GA మీరు 10-15 రోజుల్లో పూర్తి  చేయగల విభాగం కాదు. మీరు జనరల్ అవేర్నెస్ పై పట్టు సాధించడానికి  ఉత్తమ మార్గం రోజూ వార్తాపత్రికలను చదవడం లేదా వారపు వార్తల ద్వారా వెళ్ళడం.

దీని ద్వారా   నెలవారీ లేదా 6 నెలల వార్తల ద్వారా తెలుసుకొనే సమాచారం కంటే ఎక్కువ సమాచారం తెలుసుకోవచ్చు. ఇక్కడ మేము మీకు అన్ని వార్తాపత్రికల నుండి సమకాలీన అంశాల సారాంశాన్ని అందిస్తున్నాము, ఇది మీ సమయాన్ని ఆదా చేస్తుంది మరియు మీరు ఆ సమయాన్ని వారాంతపు సమకాలీన అంశాలు 2022 అధ్యయనం కోసం కేటాయించవచ్చు.

AP and Telangana State September Weekly Current Affairs |_70.1APPSC/TSPSC Sure shot Selection Group

 

Telangana State Weekly Current affairs

1. తెలంగాణ కొత్త సచివాలయానికి అంబేద్కర్‌ పేరు

Telangana Secretariat
Telangana Secretariat

కొత్తగా నిర్మిస్తున్న సచివాలయానికి భారత రాజ్యాంగ నిర్మాత బీఆర్‌ అంబేద్కర్‌ పేరు పెట్టేందుకు తెలంగాణ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు సీఎస్‌ సోమేశ్‌ కుమార్‌కు సీఎం కేసీఆర్‌ ఆదేశాలు జారీ చేశారు. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్‌ మాట్లాడుతూ అంబేద్కర్ దార్శనికతతో రాజ్యాంగంలో ఆర్టికల్-3 పొందుపరచడం ద్వారా మాత్రమే తెలంగాణ నేడు ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పాటైందన్నారు.సచివాలయానికి అంబేద్కర్‌ నామకరణం తెలంగాణ ప్రజలకు గర్వకారణమన్నారు.
అంబేద్కర్‌ పేరు సచివాలయానికి పెట్టడం దేశానికి ఆదర్శమని కొనియాడారు. భారత ప్రజలందరికీ అన్ని రంగాల్లో సమాన గౌరవం దక్కాలనే అంబేద్కర్ మహాశయుని తాత్వికతను తెలంగాణ ప్రభుత్వం అందిపుచ్చుకుని ముందుకు సాగుతున్నదన్నారు. అలాగే పార్లమెంట్‌ కొత్త భవనానికి అంబేద్కర్‌ పేరు పెట్టాలని డిమాండ్‌ చేశారు. దీనిపై తెలంగాణ అసెంబ్లీ ఏకగ్రీవ తీర్మానం చేసిందన్నారు.

2. మెడికల్‌ కాలేజీల ప్రిన్సిపాళ్లు, డీఎంఈల వయోపరిమితి 65 ఏళ్లకు పెంపు

Age limit of principals of medical colleges and DMEs
Age limit of principals of medical colleges and DMEs

మెడికల్‌ కాలేజీల్లో అధ్యాపకుల మాదిరిగానే ప్రిన్సిపాళ్లు, వైద్యవిద్యా సంచాలకులు, అదనపు సంచాలకుల వయోపరిమితిని 65 ఏళ్లకు పెంచుతూ చేసిన సవరణ బిల్లును అసెంబ్లీ ఏకగ్రీవంగా ఆమోదించింది.

సెప్టెంబర్ 13న మంత్రి హరీశ్‌ తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగ(పదవీ విరమణ వయసు క్రమబద్దీకరణ) సవరణ బిల్లును ప్రవేశపెట్టారు. హరీశ్‌ మాట్లాడుతూ గతంలో వైద్య విద్య లో పనిచేసే అధ్యాపకుల వయోపరిమితిని 65 ఏళ్లకు పెంచామన్నారు. ప్రొఫెసర్ల నుంచే మెడికల్‌ కాలేజీలకు ప్రిన్సిపాళ్లుగా, వైద్య విద్య డైరెక్టర్, అడిషనల్‌ డైరెక్టర్లుగా నియమిస్తున్నా, వారి వయో పరిమితిని పెంచలేదన్నారు. ఇప్పుడు సవరణ ప్రతిపాదించామని చెప్పారు. నేషనల్‌ మెడికల్‌ కమిషన్‌(ఎన్‌ఎంసీ) కూడా 70 ఏళ్ల వరకు పెంచుకోవచ్చని చెప్పిందన్నారు.

3. సెప్టెంబర్ 17న తెలంగాణ జాతీయ సమైక్యత దినోత్సవం

Telangana National Integration Day
Telangana National Integration Day

తెలంగాణ ప్రాంతం 1948 సెప్టెంబర్ 17న ప్రజాస్వామ్య పాలనలోకి అడుగుపెట్టిన నేపథ్యంలో ఏటా సెప్టెంబర్  17న తెలంగాణ జాతీయ సమైక్యత దినోత్సవం నిర్వహించాలని నిర్ణయించినట్టు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్‌ ప్రకటించారు.

ఈ మేరకు సెప్టెంబర్ 13న ఉత్తర్వులు జారీ చేశారు. 2022 సెప్టెంబర్  17 నాటికి 75 ఏళ్లు పూర్తి అవుతున్న శుభసందర్భంగా సెప్టెంబర్ 16 నుంచి 18వరకు తెలంగాణ జాతీయ సమైక్యత వజ్రోత్సవాలను నిర్వహించనున్నట్టు తెలిపారు.

4. ఎనిమిది బిల్లులకు తెలంగాణ శాసనసభ, మండలి ఆమోదం

Telangana Legislature
Telangana Legislature

తెలంగాణ రాష్ట్ర శాసనసభ, మండలి 8 బిల్లులకు ఆమోదం తెలిపాయి. అందులో ఆరు ప్రైవేట్‌ విశ్వవిద్యాలయాల ఏర్పాటుకు గత ఏప్రిల్‌ 12న రాష్ట్ర మంత్రి మండలి అంగీకారం తెలపగా, తాజాగా అసెంబ్లీలో మాత్రం ప్రభుత్వం 5 విశ్వవిద్యాలయాలకే బిల్లులు ప్రవేశపెట్టి ఆమోదించింది. భారతీయ పరిశ్రమల సమాఖ్య (సీఐఐ), కావేరి వ్యవసాయ విశ్వవిద్యాలయం, గురునానక్, ఎంఎన్‌ఆర్, అమిటీ, నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ కన్‌స్ట్రక్షన్‌ మేనేజ్‌మెంట్‌ అండ్‌ రీసెర్చ్‌(ఇక్మార్‌) విశ్వవిద్యాలయాల ఏర్పాటుకు మంత్రి మండలి ఆమోదం తెలిపింది. అలాగే కేంద్ర ప్రభుత్వాన్ని ఉద్దేశించి రెండు ప్రధాన అంశాలపై రూపొందించిన తీర్మానాలను రాష్ట్ర శాసనసభ, శాసనమండలి ఏకగ్రీవంగా ఆమోదించాయి. కేంద్రం ప్రతిపాదించిన విద్యుత్‌ సవరణ బిల్లు-2022ను వ్యతిరేకిస్తూ ప్రతిపాదించిన ఒక తీర్మానాన్ని, నూతనంగా నిర్మిస్తున్న పార్లమెంటు భవనానికి అంబేడ్కర్‌ పేరు పెట్టాలనే మరో తీర్మానాన్ని ప్రవేశపెట్టగా రెండింటికీ ఆమోదం లభించింది. విద్యుత్‌ సవరణ బిల్లును వ్యతిరేకిస్తూ శాసనసభలో, మండలిలో మంత్రి జగదీశ్‌రెడ్డి తీర్మానాన్ని ప్రతిపాదించారు. పార్లమెంట్‌ నూతన భవనానికి అంబేడ్కర్‌ పేరు పెట్టాలన్న ప్రతిపాదనకు శాసనసభ, శాసనమండలిలో ఏకగ్రీవంగా ఆమోదం లభించింది. అసెంబ్లీలో ఈ తీర్మానాన్ని పురపాలక మంత్రి కేటీఆర్‌ ప్రవేశపెట్టారు. సుప్రీంకోర్టు ఆదేశాలు, నిబంధనల ప్రకారమే పంజాగుట్టలో విగ్రహాన్ని తొలగించాల్సి వచ్చింది. 125 అడుగుల విగ్రహాన్ని ఐమాక్స్‌ పక్కనే కడుతున్నాం. జనవరిలోగా దాన్ని ఆవిష్కరిస్తామని మంత్రి కేటీఆర్‌ తెలిపారు. అనంతరం తీర్మానాన్ని శాసనసభ ఆమోదించింది. మండలిలో మంత్రి సత్యవతి రాథోడ్, పార్లమెంట్‌ నూతన భవనానికి అంబేడ్కర్‌ పేరు పెట్టాలన్న తీర్మానాన్ని ప్రతిపాదించారు.

5. అసెంబ్లీలో ఏడు బిల్లులు ప్రవేశపెట్టిన ప్రభుత్వం

Telangana Legislature
Telangana Legislature

తెలంగాణ అటవీశాస్త్ర విశ్వవిద్యాలయానికి రాష్ట్ర ముఖ్యమంత్రే కులపతి (ఛాన్స్‌లర్‌)గా వ్యవహరించనున్నారు. సిద్దిపేట జిల్లా ములుగు వద్ద ఉన్న ఫారెస్ట్‌ కళాశాలను వర్సిటీగా మారుస్తామని గత మార్చిలో బడ్జెట్‌ ప్రవేశపెట్టిన సందర్భంగా ప్రభుత్వం ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో వర్సిటీకి ప్రత్యేక చట్టం చేసేందుకు ప్రభుత్వం అసెంబ్లీలో బిల్లు ప్రవేశపెట్టింది. ప్రస్తుతం బాసరలోని ఆర్‌జీయూకేటీకి మాత్రమే విద్యారంగ నిపుణుడు కులపతిగా ఉన్నారు. మిగిలిన అన్ని వర్సిటీలకు గవర్నర్‌ కులపతిగా వ్యవహరిస్తున్నారు. తొలిసారిగా అటవీ వర్సిటీకి సీఎం ఛాన్స్‌లర్‌ కాబోతున్నారు. ఈ మేరకు బిల్లులో ప్రతిపాదించారు. రాష్ట్రంలోని 15 వర్సిటీల్లో బోధన, బోధనేతర నియామకాలను చేపట్టేందుకు తెలంగాణ విశ్వవిద్యాలయాల ఉమ్మడి నియామక బోర్డు (టీయూసీఆర్‌బీ) – 2022 బిల్లు సహా మొత్తం ఏడు బిల్లులను అసెంబ్లీలో ప్రవేశపెట్టారు. తెలంగాణ వస్తు సేవల పన్ను (సవరణ) బిల్లు – 2022, ఆజామాబాద్‌ పారిశ్రామిక ప్రాంతం రద్దు, మున్సిపల్‌ చట్టాల సవరణ, బోధనాసుపత్రుల వైద్య నిపుణుల వయో పరిమితి పెంపు, తెలంగాణ మోటారు వాహనాల పన్నుల సవరణ బిల్లులను ఆయా మంత్రులు ప్రవేశపెట్టారు.

6. వైద్య సలహామండలిలో తెలంగాణకు స్థానం

జాతీయ వైద్య కమిషన్‌లోని సెక్షన్‌ 11(2)(సీ) ప్రకారం కేంద్ర వైద్య, ఆరోగ్య శాఖ ఏర్పాటు చేసిన వైద్య సలహామండలి (మెడికల్‌ అడ్వయిజరీ కౌన్సిల్‌)లో తెలంగాణకు స్థానం లభించింది. ఇందులో కాళోజీ నారాయణరావు వైద్య విశ్వవిద్యాలయం ఉప కులపతి డాక్టర్‌ కరుణాకర్‌రెడ్డి, తెలంగాణ స్టేట్‌ మెడికల్‌ కౌన్సిల్‌ ప్రతినిధి డాక్టర్‌ వి.రాజలింగ్‌లను కేంద్ర వైద్య, ఆరోగ్య శాఖ సభ్యులుగా నియమించింది.

Andhra Pradesh State Weekly Current Affairs

1. మోసకారి లోన్‌ యాప్‌లపై ఫిర్యాదులకు ప్రత్యేక కాల్‌ సెంటర్‌: సీఏం జగన్‌

Fraudulent Loan Apps
Fraudulent Loan Apps

సామాన్యులను లక్ష్యంగా చేసుకొని మోసాలు, వేధింపులకు పాల్పడుతున్న లోన్‌యాప్‌లపై కఠిన చర్యలకు పోలీసు శాఖ కార్యాచరణను వేగవంతం చేసింది. లోన్‌యాప్‌ల ఆగడాలపై ఉక్కుపాదం మోపాలన్న ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి తాజా ఆదేశాలతో బహుముఖ వ్యూహంతో ముందుకెళ్తోంది.  జాతీయ నోడల్‌ ఏజెన్సీ ‘ఇండియన్‌ కంప్యూటర్‌ ఎమెర్జెన్సీ రెస్పాన్స్‌ టీమ్‌ (సీఈఆర్టీ)తో కలసి ఇటువంటి యాప్‌లపై నిషేధం విధించేందుకు సిద్ధమవుతోంది.

2. పెట్టుబడుల ఆకర్షణలో APనే అగ్రగామి

DPIIT's July report
DPIIT’s July report

పారిశ్రామిక పెట్టుబడులను అకర్షించడంలో వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వం అతి పెద్ద ఘనత సాధించింది. 2022 సంవత్సరంలో పెట్టుబడుల ఆకర్షణలో దేశంలోనే అగ్రగామి రాష్ట్రంగా నిలిచింది. కేంద్ర ప్రభుత్వ  డిపార్ట్‌మెంట్‌ ఫర్‌ ప్రమోషన్‌ ఆఫ్‌ ఇండస్ట్రీ అండ్‌ ఇంటర్నల్‌ ట్రేడ్‌ (డీపీఐఐటీ)జూలై నెల నివేదికలో ఆంధ్రప్రదేశ్‌ ప్రగతి విషయం వెల్లడైంది. ఈ ఏడాది తొలి ఏడు నెలల్లో  దేశం మొత్తం మీద 1.71 లక్షల కోట్ల పెట్టుబడులు రాగా అందులో ఆంధ్రప్రదేశ్‌లోనే అత్యధికంగా రూ.40,361 కోట్ల పెట్టుబడులు వచ్చినట్టు ఆ నివేదిక పేర్కొంది. రూ.36,828 కోట్ల పెట్టుబడులతో ఒడిశా రెండో స్థానంలో నిలిచింది. దేశంలో పెట్టుబడుల్లో ఈ రెండు రాష్ట్రాలది 45 శాతం అని డీపీఐఐటీ తెలిపింది.

3. అక్టోబర్‌ 1 నుంచి వైఎస్‌ఆర్‌ కల్యాణమస్తు, షాదీ తోఫా

YSR Kalyanamastu
YSR Kalyanamastu

ఇచ్చిన హామీల్లో ఇప్పటికే 98.44 శాతం అమలు చేసి సంక్షేమ అమలులో తన చిత్తశుద్ధి చూపించుకుంది వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి నేతృత్వంలోని వైఎస్సార్‌ సీపీ ప్రభుత్వం. తాజాగా ఏపీలో మరో భారీ సంక్షేమ పథకానికి కసరత్తులు పూర్తి చేసింది. మరో కీలక హామీని నెరవేరుస్తూ నిర్ణయం తీసుకుంది. అక్టోబర్‌ 1వ తేదీ నుంచి వైఎస్‌ఆర్‌ కల్యాణమస్తు, షాదీ తోఫా పథకాలు  అమలు చేయనుంది.

బీసీ, ఎస్పీ, ఎస్టీ, మైనార్టీ వర్గాలకు, భవన కార్మిక కుటుంబాలకు ఈ పథకం వర్తించనున్నాయి. పేద ఆడపిల్ల కుటుంబాలకు బాసటగా ఉండేందుకు, గౌరవప్రదంగా వివాహం జరిపించేందుకు తోడ్పాటుగా ఈ పథకాన్ని జగన్‌ సర్కార్‌ అమలు చేయనుంది. అంతేకాదు ఈ పథకం కింద గత ప్రభుత్వం ప్రకటించిన దానికంటే అధికంగా నగదు సాయం అందించనుంది.

  • ఎస్సీలకు వైఎస్సార్‌ కల్యాణమస్తు కింద లక్ష రూపాయలు
  • ఎస్సీల కులాంతర వివాహాలకు రూ.1.2 లక్షలు
  • ఎస్టీలకు వైఎస్సార్‌ కల్యాణమస్తు కింద లక్ష రూపాయలు
  • ఎస్టీల కులాంతర వివాహాలకు రూ.1.2 లక్షలు
  • బీసీలకు వైఎస్సార్‌ కల్యాణమస్తు కింద రూ.50వేలు
  • బీసీల కులాంతర వివాహాలకు రూ.75వేలు
  • మైనారిటీలకు షాదీ తోఫా కింద లక్ష రూపాయలు.
  • దివ్యాంగులు వివాహాలకు రూ. 1.5 లక్షలు
  • భవన నిర్మాణ కార్మికుల వివాహాలకు రూ.40వేలు ఆర్థిక సాయం అందించనుంది వైఎస్‌ జగన్‌ ప్రభుత్వం.

 

English Quiz MCQS Questions And Answers 15 September 2022, For All Competitive Exams |_80.1


మరింత చదవండి:

తాజా ఉద్యోగ ప్రకటనలు ఇక్కడ క్లిక్ చేయండి
ఉచిత స్టడీ మెటీరియల్ (APPSC, TSPSC) ఇక్కడ క్లిక్ చేయండి
ఉచిత మాక్ టెస్టులు ఇక్కడ క్లిక్ చేయండి

 

Sharing is caring!