Telugu govt jobs   »   Weekly Current Affairs   »   AP and Telangana States February Weekly...

AP and Telangana States March Weekly Current Affairs | ఏపీ, తెలంగాణ రాష్ట్రాల మార్చి వారాంతపు కరెంట్ అఫైర్స్

AP and Telangana State Weekly Current Affairs, ఏపీ, తెలంగాణ రాష్ట్రాల వారాంతపు కరెంట్ అఫైర్స్

Current affairs play a very important role in the competitive examinations and hence, aspirants have to give undivided attention to it while doing preparation for the government examinations. The banking or state govt examinations comprise a section of “General Awareness” to evaluate how much the aspirant is aware of the daily happenings taking place around the world. To complement your preparation, we are providing you with a compilation of the February Current affairs of AP and Telangana State Weekly Current Affairs, ఏపీ, తెలంగాణ రాష్ట్రాల వారాంతపు కరెంట్ అఫైర్స్

Weekly current Affairs PDF in Telugu : APPSC, TSPSC గ్రూప్స్ , SI మరియు కానిస్టేబుల్ పరీక్షలలో  జనరల్ అవేర్‌నెస్ చాలా ముఖ్యమైన విభాగాలలో ఒకటి మరియు మీరు మీ సమయాన్ని హృదయపూర్వకంగా కేటాయించినట్లయితే ఈ అంశం నుండి చాలా మంచి మార్కులు సాధించగలరు. పరీక్షల  ముందు అప్పటికప్పుడు  ఈ అంశాన్ని చదువుకొని వెళ్ళడం ద్వారా ఎక్కువ మార్కులు సాధించడం అసాధ్యం.  GA మీరు 10-15 రోజుల్లో పూర్తి  చేయగల విభాగం కాదు. మీరు జనరల్ అవేర్నెస్ పై పట్టు సాధించడానికి  ఉత్తమ మార్గం రోజూ వార్తాపత్రికలను చదవడం లేదా వారపు వార్తల ద్వారా వెళ్ళడం.

దీని ద్వారా   నెలవారీ లేదా 6 నెలల వార్తల ద్వారా తెలుసుకొనే సమాచారం కంటే ఎక్కువ సమాచారం తెలుసుకోవచ్చు. ఇక్కడ మేము మీకు అన్ని వార్తాపత్రికల నుండి సమకాలీన అంశాల సారాంశాన్ని అందిస్తున్నాము, ఇది మీ సమయాన్ని ఆదా చేస్తుంది మరియు మీరు ఆ సమయాన్ని వారాంతపు సమకాలీన అంశాలు 2022 అధ్యయనం కోసం కేటాయించవచ్చు.

AP and Telangana States March Weekly Current Affairs |_40.1APPSC/TSPSC Sure shot Selection Group

Andhra Pradesh State Weekly Current Affairs

1. అత్యద్భుతమైన 6 భవిష్య నగరాల జాబితాలో ఆంధ్రప్రదేశ్‌ రాజధాని అమరావతికి చోటు దక్కింది.

AP and Telangana States March Weekly Current Affairs |_50.1
Amaravathi

ప్రపంచంలోనే అత్యద్భుతమైన 6 భవిష్య నగరాల జాబితాలో ఆంధ్రప్రదేశ్‌ రాజధాని అమరావతికి చోటు దక్కింది. రాబోయే 50 ఏళ్లలో ప్రపంచం ఎలా ఉండబోతోందనే దానికి అమరావతి, వివిధ దేశాల్లోని మరో 5 నగరాలు అద్దం పట్టనున్నాయని ప్రపంచ ప్రతిష్ఠాత్మక మ్యాగజైన్‌ ‘ఆర్కిటెక్చరల్‌ డైజెస్ట్‌’ పేర్కొంది. ‘6 మోస్ట్‌ ఫ్యూచరిస్టిక్‌ సిటీస్‌ బీయింగ్‌ బిల్ట్‌ అరౌండ్‌ ది వరల్డ్‌’ శీర్షికతో ఆ మ్యాగజైన్‌ నగరాల నమూనాలతో సహా తాజాగా ఓ కథనాన్ని ప్రచురించింది. ఆ జాబితాలో అమరావతిని చేర్చింది. ప్రపంచంలోని భవిష్య నగరాలు ఎలా ఉంటాయో చూపేందుకు ఒక మచ్చుతునకగా అమరావతిని నిర్మించేలా ఫోస్టర్‌ అండ్‌ పార్టనర్స్‌ బృహత్‌ ప్రణాళికను సిద్ధం చేశారు. ప్రపంచంలోనే సుస్థిర నగరంగా సరికొత్త, వర్ధమాన సాంకేతికతలతో కూడిన నగరంగా దీన్ని అభివృద్ధి చేయతలపెట్టారు. విద్యుత్‌ వాహనాలు, నీటి ట్యాక్సీలు, ప్రత్యేకమైన సైకిల్‌ మార్గాలతో అత్యద్భుతంగా ఈ నగరాన్ని నిర్మించాలనుకున్నారు.

2. ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వంతో పేటీఎం మాతృసంస్థ ఒప్పందం కుదుర్చుకుంది 

AP and Telangana States March Weekly Current Affairs |_60.1
paytm

ఆర్థిక, ప్రజారోగ్య, పారిశ్రామిక, సైబర్‌ సెక్యూరిటీ రంగాల్లో పరస్పర సహకారానికి ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వంతో ఒప్పందం కుదుర్చుకున్నట్లు పేటీఎం మాతృసంస్థ ‘వన్‌97 కమ్యునికేషన్స్‌’ వెల్లడించింది. ఇటీవల రాష్ట్రంలో జరిగిన గ్లోబల్‌ ఇన్వెస్టర్స్‌ సమిట్‌లో ఈ మేరకు ఎంవోయూ కుదుర్చుకున్నట్లు తెలిపింది. ఈ ఒప్పందం ప్రకారం చిన్న వ్యాపారులకు, ప్రభుత్వ శాఖల చెల్లింపులకు పేటీఎం తోడ్పాటు అందిస్తుందని పేర్కొంది.

3. జాతీయ మైనారిటీ కమిషన్‌ AP సలహాదారుగా అర్షద్‌ అయూబ్‌ఖాన్‌ ఎంపికయ్యారు 

AP and Telangana States March Weekly Current Affairs |_70.1
Minority commission

జాతీయ మైనారిటీ కమిషన్‌ ఏపీ సలహాదారుగా చిత్తూరు జిల్లాకు చెందిన అర్షద్‌ అయూబ్‌ఖాన్‌ను కేంద్రం నియమించింది. ఈ మేరకు కేంద్ర మైనారిటీ సంక్షేమ శాఖ కార్యదర్శి షరిక్‌ సయీద్‌ ఆదేశాలు జారీ చేశారు.

4. విశాఖ ఉక్కు ఉత్పత్తిలో రికార్డు స్థాయిని నెలకొల్పింది 

AP and Telangana States March Weekly Current Affairs |_80.1
Vizag

విశాఖ ఉక్కు కర్మాగారం ఫిబ్రవరి నెలలో అత్యుత్తమ పనితీరుతో నూతన రికార్డులు నమోదు చేసిందని ఉక్కు వర్గాలు తెలిపాయి. ఫిబ్రవరిలో బ్లాస్ట్‌ఫర్నెస్‌ (బీఎఫ్‌)-1, -2ల్లో కలిపి రోజుకు సరాసరి 15,004 టన్నుల చొప్పున మొత్తం 4,20,100 టన్నుల హాట్‌మెటల్‌ ఉత్పత్తి జరిగింది. వైర్‌ రాడ్‌ మిల్‌ (డబ్ల్యూఆర్‌ఎం)-1 నుంచి 91,356 టన్నులు, ఎస్‌బీఎం (స్పెషల్‌ బార్‌ మిల్‌) నుంచి 53,453 టన్నులు, డబ్ల్యూఆర్‌ఎం-2 నుంచి 56,722 టన్నులు, స్ట్రక్చరల్‌ మిల్‌ నుంచి 48,853 టన్నుల ఉత్పత్తి సాధించి రికార్డు నమోదు చేసింది.

5. విశాఖలో ప్రపంచ పెట్టుబడిదారుల సదస్సు జరిగింది 

AP and Telangana States March Weekly Current Affairs |_90.1
AP GIS

పెట్టుబడిదారుల సదస్సులో రూ.13 లక్షల కోట్ల పెట్టుబడులకు సంబంధించి 340 ఒప్పందాలు చేసుకున్నట్లు ఏపీ ముఖ్యమంత్రి జగన్‌ మోహన్‌రెడ్డి ప్రకటించారు. 20 రంగాల్లో పెట్టుబడులతో 6 లక్షల మందికి ఉపాధి లభిస్తుందని ఆయన తెలిపారు. ఏపీ ప్రభుత్వం విశాఖలోని ఆంధ్రా యూనివర్సిటీ ఇంజినీరింగ్‌ కళాశాల మైదానంలో రెండు రోజుల పాటు నిర్వహించిన ప్రపంచ పెట్టుబడిదారుల సదస్సు ముగిసింది. ఈ సదస్సులో మొత్తం రూ.13,41,734 కోట్ల పెట్టుబడులకు సంబంధించిన 378 ఒప్పందాలు చేసుకున్నట్టు ఏపీ ప్రభుత్వం ప్రకటించింది.

  •  తొలిరోజు రూ.11.85 లక్షల కోట్ల పెట్టుబడులకు 92 ఎంఓయూలు, రెండో రోజు రూ.1.56 లక్షల కోట్ల పెట్టుబడులకు 286 ఎంఓయూలు చేసుకున్నట్టు వెల్లడించింది. అత్యధికంగా పర్యాటక రంగంలో 117 ఒప్పందాలు చేసుకున్నట్టు తెలిపింది. రెండు రోజుల సదస్సులో ముకేశ్‌ అంబానీ, కరణ్‌ అదానీ, నవీన్‌ జిందాల్, అర్జున్‌ ఒబెరాయ్, కృష్ణ ఎల్ల, సుచిత్ర ఎల్ల, గ్రంధి మల్లికార్జునరావు, ప్రీతారెడ్డి, హరిమోహన్‌ బంగూర్, సతీష్‌రెడ్డి తదితర పారిశ్రామిక ప్రముఖులు పాల్గొన్నారు.
  •  రెండో రోజు పెట్టుబడుల సదస్సులో రిలయన్స్‌ సంస్థ రూ.50 వేల కోట్ల పెట్టుబడులకు ఒప్పందం చేసుకున్నట్టు రాష్ట్ర ప్రభుత్వం తెలిపింది. హెచ్‌పీసీఎల్‌ ఎనర్జీ రూ.14.3 కోట్లతో ఒక ఒప్పందం, హెచ్‌సీఎల్‌ టెక్నాలజీస్‌ రూ.22 కోట్లతో 2 ఒప్పందాలు, ఫ్లిప్‌కార్ట్‌ సంస్థ రూ.20 కోట్లతో 2 ఒప్పందాలు చేసుకున్నట్టు వెల్లడించింది.
  •  సదస్సు వేదికగా రూ.3,841 కోట్ల విలువైన 14 పారిశ్రామిక యూనిట్లను ముఖ్యమంత్రి జగన్‌ వర్చువల్‌గా ప్రారంభించారు. కింబర్లే క్లార్క్, బ్లూస్టార్, క్లైమాటిక్, లారస్‌ ల్యాబ్స్, హేవెల్స్‌ ఇండియా, శారదా మెటల్స్, అల్లాయిస్‌ కంపెనీలు ప్రారంభించిన వాటిలో ఉన్నాయి.

6. ప్రముఖ సాహితీవేత్త డాక్టర్‌ కె.రామలక్ష్మీ ఆరుద్ర కన్ను మూశారు 

AP and Telangana States March Weekly Current Affairs |_100.1
Rama lakshmi

ప్రముఖ రచయిత్రి డాక్టర్‌ కె. రామలక్ష్మీ (92) మలక్‌పేట ఆస్మాన్‌గఢ్‌ శ్రీ సాయి అపార్ట్‌మెంట్‌లోని తమ నివాసంలో మరణించారు. రామలక్ష్మీ కాకినాడ జిల్లా కోటనందూరులో 1930 డిసెంబరు 31న జన్మించారు. మద్రాసు విశ్వవిద్యాలయం పరిధిలోని స్టెల్లా మారిస్‌ కళాశాల నుంచి పట్టభద్రులయ్యారు. తెలుగు, తమిళం, ఆంగ్లం, హిందీ భాషలపై పట్టున్న రామలక్ష్మీ 1951 నుంచి రచనా వ్యాసంగం ప్రారంభించారు. 1954లో ఆరుద్రతో వివాహం జరిగింది. మానవశాస్త్రం, మానవ సంబంధాలపై ప్రొఫెసర్‌ యు.ఆర్‌. ఎబ్రెన్‌ఫెల్స్‌ ఆధ్వర్యంలో అధ్యయనం చేశారు. ప్రముఖ పాత్రికేయుడు, స్వాతంత్య్ర సమరయోధుడు ఖాసా సుబ్బారావు ఆధ్వర్యంలోని ‘స్వతంత్ర’ పత్రికలో ఆంగ్ల విభాగానికి ఉప సంపాదకురాలిగా చేశారు. వివాహమైన తరువాత ‘రామలక్ష్మీ ఆరుద్ర’ అనే కలం పేరుతోనూ రచనలు చేశారు. పరిశోధన, వ్యాసం, చిన్న కథలు, నవలలు, బాల సాహిత్య రచనల్లో ఆమె నిష్ణాతులు. జీవనజ్యోతి చిత్ర కథారచనకు నంది అవార్డు అందుకున్నారు. ఆమెకు 1957లో గృహలక్ష్మి స్వర్ణ కంకణ పురస్కారం లభించింది. 1978లో ఉత్తమ జర్నలిస్టుగా రామానాయుడు అవార్డును జమీన్‌రైతు వారపత్రిక అందజేసింది. 1998లో రాజాలక్ష్మీ ఫౌండేషన్‌ అవార్డు అందుకున్నారు.

Telangana State Weekly Current Affairs

1. మహిళలకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ అవార్డులు లభించాయి 

AP and Telangana States March Weekly Current Affairs |_110.1
Awards

వివిధ రంగాల్లో ప్రతిభ కనపరిచిన మహిళలను రాష్ట్రస్థాయి ఉత్తమ అవార్డులకు రాష్ట్ర ప్రభుత్వం ఎంపిక చేసింది. ఈ మేరకు రాష్ట్ర మహిళా సంక్షేమ శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. వీరికి రూ.లక్ష చొప్పున నగదు పురస్కారాన్ని అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా అందజేయాలని ఆదేశించింది.

2. కొంగర కలాన్‌లో ఫాక్స్‌కాన్‌ సంస్థ ఉత్పత్తి ప్లాంట్‌ను నెలకొల్పనుంది

AP and Telangana States March Weekly Current Affairs |_120.1
Agreement

ఎలక్ట్రానిక్స్‌ ఉత్పత్తి రంగంలో ప్రపంచ ప్రసిద్ధిగాంచిన ‘హోన్‌ హాయ్‌ టెక్నాలజీ’ గ్రూప్‌నకు చెందిన ‘ఫాక్స్‌కాన్‌’ సంస్థ తెలంగాణలో రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం నియోజకవర్గం కొంగర కలాన్‌లో భారీ పెట్టుబడులతో తమ ఉత్పత్తి ప్లాంట్‌ను నెలకొల్పనుంది. ఈ అంశాన్ని ధ్రువీకరిస్తూ సంస్థ ఛైర్మన్‌ యంగ్‌ లియూ తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌కు ప్రత్యేకంగా లేఖ రాశారు. ఇటీవల రాష్ట్రంలో టీ-వర్క్స్‌ ప్రారంభానికి విచ్చేసిన ‘ఫాక్స్‌కాన్‌’ ఛైర్మన్‌ యంగ్‌ లియూ, సీఎం కేసీఆర్‌తో ప్రత్యేకంగా భేటీ అయ్యారు. ఆ సందర్భంగా తెలంగాణలో పెట్టుబడులు పెట్టేందుకు ఫాక్స్‌కాన్‌ కంపెనీకి, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి మధ్య ఒప్పందం కుదిరింది.

3. టీసీఎస్‌కు తెలంగాణ ఇండస్ట్రీస్‌ పురస్కారం లభించింది 

AP and Telangana States March Weekly Current Affairs |_130.1
AWARDS

తెలంగాణ రాష్ట్రంలో ఐటీ సేవల రంగానికి అందిస్తున్న సేవలకు గాను ‘తెలంగాణ రాష్ట్ర ఇండస్ట్రీ అవార్డ్‌ ఫర్‌ ఎక్స్‌లెన్సీ ఇన్‌ ఐటీ’ పురస్కారానికి టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్‌ (టీసీఎస్‌) ఎంపికయ్యింది. సీఐఐ తెలంగాణ విభాగం వార్షిక సమావేశంలో ఈ పురస్కారాన్ని తెలంగాణ ఐటీ మంత్రి కేటీఆర్‌ చేతుల మీదుగా టీసీఎస్‌ సీనియర్‌ వైస్‌ ప్రెసిడెంట్‌ వి.రాజన్న అందుకున్నారు. హైదరాబాద్‌ టీసీఎస్‌లో దాదాపు 90,000 మంది ఉద్యోగులున్నారని, వీరి సంఖ్య పెరుగుతూనే ఉందని రాజన్న తెలిపారు.

4. సీఐఐ ఐడబ్ల్యూఎన్‌ తెలంగాణ విభాగం ఛైర్‌ ఉమెన్‌గా శ్రీవిద్య రెడ్డి నియమితులయ్యారు 

AP and Telangana States March Weekly Current Affairs |_140.1
Sri Vidya

సీఐఐ ఇండియన్‌ ఉమెన్‌ నెట్‌వర్క్‌ (సీఐఐ ఐడబ్ల్యూఎన్‌) తెలంగాణ విభాగానికి ఛైర్‌ ఉమెన్‌గా శ్రీవిద్య రెడ్డి బాధ్యతలు చేపట్టారు. అదే విధంగా వైస్‌ ఛైర్‌ ఉమెన్‌గా తనూజ అబ్బూరి ఎంపికయ్యారు. వీరిద్దరూ 2023 – 24 సంవత్సరానికి ఈ హోదాల్లో పనిచేస్తారు. జి.పుల్లారెడ్డి గ్రూప్‌ ఆఫ్‌ ఎడ్యుకేషన్‌ సొసైటీకి వైస్‌ ఛైర్‌పర్సన్‌గా శ్రీవిద్య రెడ్డి ఉన్నారు. అమెజాన్‌లో ఆసియా పసిఫిక్‌ ప్రాంతానికి డీఈఐ లీడ్‌గా తనూజ అబ్బూరి కొనసాగుతున్నారు.

5. శంషాబాద్‌ ఎయిర్‌పోర్టుకు ‘ఉత్తమ విమానాశ్రయ’ పురస్కారం అందుకుంది 

AP and Telangana States March Weekly Current Affairs |_150.1
Shamshabad Airport

హైదరాబాద్‌ అంతర్జాతీయ విమానాశ్రయం మరోసారి ఎయిర్‌పోర్ట్‌ కౌన్సిల్‌ ఇంటర్నేషనల్‌ – ఎయిర్‌పోర్ట్‌ సర్వీస్‌ క్వాలిటీ సర్వే ద్వారా ‘ఉత్తమ విమానాశ్రయం’ అవార్డుకు ఎంపికైంది. 2022కి ఆసియా పసిఫిక్‌ ప్రాంతంలో 15-25 మిలియన్ల వార్షిక ప్రయాణీకుల విభాగంలో ఈ అవార్డు లభించింది. వరుసగా 9 సంవత్సరాలు హైదరాబాద్‌ విమానాశ్రయం గ్లోబల్‌ టాప్‌-3 విమానాశ్రయాల్లో ఒకటిగా నిలుస్తూవస్తోంది.

6. ఇండియా ఓపెన్‌ అథ్లెటిక్స్‌ ఛాంపియన్‌షిప్‌లో జ్యోతికకు స్వర్ణం లభించింది 

AP and Telangana States March Weekly Current Affairs |_160.1
Jyotika

ఇండియా ఓపెన్‌ అథ్లెటిక్స్‌ ఛాంపియన్‌షిప్‌లో తెలుగమ్మాయి దండి జ్యోతిక శ్రీ (గోపీచంద్‌ మైత్రా) స్వర్ణ పతకంతో సత్తాచాటింది. మహిళల 400 మీటర్ల పరుగును జ్యోతిక 53.26 సెకన్లలో ముగించి అగ్రస్థానం కైవసం చేసుకుంది. సీనియర్‌ విభాగంలో జ్యోతికకు ఇదే మొదటి టైటిల్‌.

7. సీఆర్పీఎఫ్‌ గ్రూప్‌ సెంటర్‌ DIGగా ఉదయ్‌భాస్కర్‌ నియమితులయ్యారు 

AP and Telangana States March Weekly Current Affairs |_170.1
Uday Bhaskar

సీఆర్పీఎఫ్‌ సదరన్‌ సెక్టార్‌ డీఐజీగా బిళ్ల ఉదయ్‌భాస్కర్‌ బాధ్యతలు స్వీకరించారు. ఉత్తర కశ్మీర్‌ రేంజ్‌ బారాముల్లా డీఐజీగా పనిచేసిన ఆయన ఇటీవలే డిప్యుటేషన్‌పై సీఆర్పీఎఫ్‌కు బదిలీ అయ్యారు. అధికారులు ఆయనకు హైదరాబాద్‌ చాంద్రాయణగుట్టలోని గ్రూప్‌ సెంటర్‌ డీఐజీగా పోస్టింగ్‌ ఇచ్చారు. గుంటూరు జిల్లా కన్నవారితోటకు చెందిన ఉదయ్‌భాస్కర్‌ 2008లో జమ్మూకశ్మీర్‌ కేడర్‌ ఐపీఎస్‌గా ఎంపికయ్యారు. శిక్షణ అనంతరం అనంత్‌నాగ్‌ ఏఎస్పీగా పనిచేశారు. తర్వాత జమ్మూ, లేహ్‌ ఎస్పీగా, జమ్మూ ట్రాఫిక్‌ ఎస్పీగా విధులు నిర్వర్తించారు. డీఐజీగా పదోన్నతి పొందిన అనంతరం జమ్మూ పోలీస్‌ హెడ్‌క్వార్టర్స్‌ల, తర్వాత దోడా-కిష్ట్వార్‌-రంబన్‌ (డీకేఆర్‌) రేంజ్‌ డీఐజీగానూ పనిచేశారు.

AP and Telangana States March Weekly Current Affairs |_180.1

 

మరింత చదవండి: 

తాజా ఉద్యోగ ప్రకటనలు క్కడ క్లిక్ చేయండి
ఉచిత స్టడీ మెటీరియల్ (APPSC, TSPSC) ఇక్కడ క్లిక్ చేయండి
ఉచిత మాక్ టెస్టులు ఇక్కడ క్లిక్ చేయండి

Sharing is caring!

FAQs

where can I found weekly current affairs?

you can found weekly current affairs at adda 247 telugu website