Telugu govt jobs   »   Monthly & Weekly Current Affairs   »   AP and Telangana states July Weekly...

AP and Telangana states July Weekly Current affairs , ఏపీ, తెలంగాణ రాష్ట్రాల జూలై వారాంతపు కరెంట్ అఫైర్స్ పార్ట్ 3

AP and Telangana state Weekly Current affairs, ఏపీ, తెలంగాణ రాష్ట్రాల వారాంతపు కరెంట్ అఫైర్స్

Current affairs play a very important role in the competitive examinations and hence, aspirants have to give undivided attention to it while doing preparation for the government examinations. The banking or state govt examinations comprise a section of “General Awareness” to evaluate how much the aspirant is aware of the daily happenings taking place around the world. To complement your preparation, we are providing you with a compilation of the  Current affairs of July 3rd week.

AP and Telangana state Weekly Current affairs, ఏపీ, తెలంగాణ రాష్ట్రాల వారాంతపు కరెంట్ అఫైర్స్

Weekly current Affairs PDF in Telugu : APPSC, TSPSC గ్రూప్స్ , SI మరియు కానిస్టేబుల్ పరీక్షలలో  జనరల్ అవేర్‌నెస్ చాలా ముఖ్యమైన విభాగాలలో ఒకటి మరియు మీరు మీ సమయాన్ని హృదయపూర్వకంగా కేటాయించినట్లయితే ఈ అంశం నుండి చాలా మంచి మార్కులు సాధించగలరు. పరీక్షల  ముందు అప్పటికప్పుడు  ఈ అంశాన్ని చదువుకొని వెళ్ళడం ద్వారా ఎక్కువ మార్కులు సాధించడం అసాధ్యం.  GA మీరు 10-15 రోజుల్లో పూర్తి  చేయగల విభాగం కాదు. మీరు జనరల్ అవేర్నెస్ పై పట్టు సాధించడానికి  ఉత్తమ మార్గం రోజూ వార్తాపత్రికలను చదవడం లేదా వారపు వార్తల ద్వారా వెళ్ళడం.

దీని ద్వారా   నెలవారీ లేదా 6 నెలల వార్తల ద్వారా తెలుసుకొనే సమాచారం కంటే ఎక్కువ సమాచారం తెలుసుకోవచ్చు. ఇక్కడ మేము మీకు అన్ని వార్తాపత్రికల నుండి సమకాలీన అంశాల సారాంశాన్ని అందిస్తున్నాము, ఇది మీ సమయాన్ని ఆదా చేస్తుంది మరియు మీరు ఆ సమయాన్ని వారాంతపు సమకాలీన అంశాలు 2022 అధ్యయనం కోసం కేటాయించవచ్చు.

AP and Telangana states July Weekly Current affairs_40.1APPSC/TSPSC Sure shot Selection Group

 

Telangana state Weekly Current affairs

1. తెలంగాణలో ఒకే రోజు 53 సంస్థలతో ఒప్పందాలు

AP and Telangana states July Weekly Current affairs_50.1

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఒక్క రోజే 53 కార్పొరేటు సంస్థలతో అవగాహన ఒప్పందాలు కుదుర్చుకొంది. రాష్ట్ర ప్రభుత్వ నైపుణ్య, విజ్ఞాన సంస్థ (తెలంగాణ అకాడమీ ఫర్‌ స్కిల్స్‌ నాలెడ్జ్‌ – టాస్క్‌) పరిశ్రమలు, ఐటీ శాఖల మంత్రి కేటీఆర్‌ సమక్షంలో టీహబ్‌ 2.0లో ఈ ఒప్పందాలు జరిగాయి. టాస్క్‌ చరిత్రలో ఇది మైలు రాయి అని, యువతకు ఉపాధే లక్ష్యంగా తెలంగాణ ప్రభుత్వం పురోగమిస్తోందని ఈ సందర్భంగా కేటీఆర్‌ చెప్పారు. 26 కొత్త సంస్థలతో ఒప్పందాలు, 27 పాత సంస్థలతో పునరుద్ధరణపై టాస్క్‌ సీఈవో శ్రీకాంత్‌ సిన్హా, ఆయా సంస్థల ప్రతినిధులు సంతకాలు చేశారు. ప్రభుత్వంతో ఒప్పందాలు చేసుకున్న సంస్థల్లో ఎల్‌అండ్‌టీ మెట్రోరైలు, భారత్‌ ఫోర్జ్, కల్యాణి రాఫెల్‌ 24/7, హెటిరో, హైసియా, ఇన్ఫోసిస్‌ స్ప్రింగ్‌బోర్డ్, వాహన్, విడాల్, రుబికాన్, హెడ్‌ హెల్డ్‌ హైలు ఉన్నాయి.

2. ఆవిష్కరణల్లో తెలంగాణ అ‘ద్వితీయం’!

AP and Telangana states July Weekly Current affairs_60.1

నీతి ఆయోగ్‌ ప్రకటించిన ‘ఇండియా ఇన్నోవేషన్‌ ఇండెక్స్‌–2021 (భారత ఆవిష్కరణల సూచీ– 2021)’ మూడో ఎడిషన్‌ ర్యాంకుల్లో తెలంగాణ దేశంలోనే రెండో స్థానంలో నిలిచింది. ఏడు అంశాల్లో 66 సూచి­కల ఆధారంగా రాష్ట్రాల పనితీరును ఇన్‌స్టిట్యూట్‌ ఫర్‌ కాంపిటీ టివ్‌నెస్‌ (ఐఎఫ్‌సీ) సహకారంతో నీతి ఆయోగ్‌ అధ్యయ­నం చేసి  ‘గ్లోబల్‌ ఇండియన్‌ ఇండెక్స్‌ (జీఐఐ)’ స్కోర్‌ను కేటాయించింది.  నివేదికను నీతి ఆయోగ్‌ వైస్‌ చైర్మన్‌ సుమన్‌ బెరీ ఆవిష్కరించారు.

పెర్ఫార్మర్స్‌లో టాప్‌

ఏడు అంశాల ఆధారంగా మొత్తం స్కోర్‌ కేటాయించగా  ఇందులో ఐదింటి ఆధారంగా పెర్ఫార్మర్స్‌ (అద్భుత పనితీరు చూపినవారు)గా, మరో రెండింటి ఆధారంగా ఎనేబులర్స్‌ (సాధించినవారు)గా గుర్తించారు. పెద్ద రాష్ట్రాలు, ఈశాన్య–పర్వత ప్రాంత రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతా లకు వేర్వేరుగా స్కోర్‌ను కేటాయించారు. పెద్ద రాష్ట్రాల జాబితాలో 17.66 సగటు స్కోర్‌తో తెలంగాణ దేశంలో రెండో స్థానంలో నిలిచింది. తొలిస్థానంలో కర్ణాటక (18.01), మూడోస్థానంలో హరియాణా ఉన్నాయి. ఇక కేటగిరీల వారీగా చూస్తే పెర్ఫార్మర్స్‌ కేటగిరీలో 15.24 స్కోర్‌తో తెలంగాణ దేశంలోనే అగ్రస్థానంలో నిలవగా  ఎనేబులర్స్‌ కేటగిరీలో 20.08 స్కోర్‌తో నాలుగో స్థానంలో నిలిచింది.

AP and Telangana states July Weekly Current affairs_70.1

 3. మహిళల కోసం ప్రత్యేక ‘లీగల్‌ సెల్‌’ 

AP and Telangana states July Weekly Current affairs_80.1

మహిళల భద్రత, హక్కుల పరిరక్షణ కోసం తెలంగాణ రాష్ట్ర మహిళా కమిషన్‌ ప్రత్యేకంగా లీగల్‌ సెల్‌ను ఏర్పాటు చేసింది. రాష్ట్ర మహిళా కమిషన్‌ కార్యాలయంలో ఏర్పాటు చేసిన లీగల్‌ సెల్‌ను  జాతీయ మహిళా కమిషన్‌ చైర్‌పర్సన్‌ రేఖా శర్మ, రాష్ట్ర మహిళా కమిషన్‌ చైర్‌ పర్సన్‌ సునీతాలక్ష్మారెడ్డి ప్రారంభించారు.

మహిళలకు చట్టబద్ధమైన సహాయాన్ని మరింత అందుబాటులోకి తీసుకురావాలనే లక్ష్యంతో ఈ లీగల్‌ సెల్‌ను ఏర్పాటు చేయడం శుభపరిణామమని రేఖా శర్మ అన్నారు. రాష్ట్రంలో మహిళలకు ఉచిత న్యాయ సలహాలు, సేవలు అందించడమే లక్ష్యంగా ఈ కేంద్రం పనిచేస్తుందన్నారు. మహిళలకు చట్టపరమైన సహాయం కోసం ఈ సెల్‌ వన్‌–స్టాప్‌ సెంటర్‌గా పనిచేస్తుందని సునీతాలక్ష్మారెడ్డి వివరించారు. అలాగే మహిళలకు సహాయంగా ఉండేందుకు ప్రారంభించిన వాట్సాప్‌ హెల్ప్‌ లైన్‌ 9490555533, ఫేస్‌ బుక్, ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్‌ ద్వారా మహిళా కమిషన్‌కు వస్తున్న ఫిర్యాదులు గురించి తెలియజేశారు.

4. సులభతర వాణిజ్యంలో తెలంగాణకు అగ్రస్థానం

AP and Telangana states July Weekly Current affairs_90.1

సులభతర వాణిజ్య విధానం(ఈవోడీబీ) ర్యాంకుల్లో 2020కి సంబంధించి తెలంగాణ అగ్రస్థానంలో నిలిచింది. కేంద్ర పరిశ్రమల శాఖకు అనుబంధంగా ఉండే పరిశ్రమల ప్రోత్సాహక, అంతర్గత వాణిజ్య విభాగం ఏటా ప్రకటించే సులభతర వాణిజ్యం ర్యాంకులను వెల్లడించింది. గతంలో ఉన్న ర్యాంకుల విధానానికి స్వస్తి పలుకుతూ ఈ ఏడాది రాష్ట్రాలను టాప్‌ అచీవర్స్, అచీవర్స్, అస్పైరర్స్, ఎమర్జింగ్‌ ఇకో సిస్టమ్స్‌ అనే 4 కేటగిరీలుగా విభజించింది. టాప్‌ అచీవర్స్‌ జాబితాలో తెలంగాణతోపాటు ఆంధ్రప్రదేశ్, గుజరాత్, హరియాణా, కర్ణాటక, తమిళనాడు, పంజాబ్‌ రాష్ట్రాలు ఉన్నాయి.

5. హైదరాబాద్‌ ఐఐటీ కి జాతీయ ర్యాంకు

AP and Telangana states July Weekly Current affairs_100.1

దేశంలోని ఉత్తమ విద్యాసంస్థల జాబితాలో నిలిచి హైదరాబాద్‌ ఐఐటీ మరోసారి సత్తా చాటింది. కేంద్ర విద్యా శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌  ఢిల్లీలో విడుదల చేసిన నేషనల్‌ ఇన్‌స్టిట్యూషనల్‌ ర్యాంకింగ్‌ ఫ్రేమ్‌వర్క్‌ ర్యాంకుల్లో హైదరాబాద్‌ ఐఐటీ సహా రాష్ట్రంలోని పలు విశ్వవిద్యాలయాలు జాతీయ ర్యాంకులు సాధించాయి.

అన్ని విభాగాలకు కలిపి (ఓవరాల్‌) ఇచ్చిన ర్యాంకుల్లో ఐఐటీ(హెచ్‌) 14వ ర్యాంకును (గతేడాది 16వ ర్యాంకు) సొంతం చేసుకుంది. ఈ సంస్థకు 62.86 జాతీయ స్కోర్‌ లభించింది. ఇంజనీరింగ్‌ కాలేజీల విభాగంలో ఐఐటీ(హెచ్‌) టాప్‌–10లో నిలిచి 9వ ర్యాంకు పొందింది. పరిశోధన విభాగంలో 12వ ర్యాంకు సాధించింది. దేశంలోకెల్లా ఉత్తమ విద్యాసంస్థగా ఐఐటీ మద్రాస్‌ తొలిస్థానంలో నిలిచి వరుసగా నాలుగోసారి ఈ ఘనత సాధించగా ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ సైన్స్‌ (బెంగళూరు) దేశంలోనే ఉత్తమ యూనివర్సిటీగా నిలిచింది.

జాతీయ స్థాయిలో 10వ ర్యాంకు సాధించిన యూనివర్సిటీ ఆఫ్‌ హైదరాబాద్‌ ఓవరాల్‌ విభాగంలో 20వ ర్యాంకు, రీసెర్చ్‌లో 27వ ర్యాంకు సాధించింది.  వర్సిటీల ర్యాంకుల్లో ఉస్మానియా  వర్సిటీ 22వ ర్యాంకు పొందింది. ఓవరాల్‌ ర్యాంకుల విభాగంలో 46వ స్థానంలో నిలిచింది. ఇంజనీరింగ్‌ కాలేజీల విభాగంలోవరంగల్‌ ఎన్‌ఐటీ 21 ర్యాంకు ఓవరాల్‌ విభాగంలో 45వ ర్యాంకు పొందింది.

ఇంజనీరింగ్‌ విద్యలో జేఎన్‌టీయూ (హైదరాబాద్‌)కు జాతీయస్థాయిలో 76వ ర్యాంకు దక్కింది. కాగా, ప్రతిభగల విద్యా ర్థులు, సమర్థులైన అధ్యాపకుల కృషివల్లే ఐఐటీ (హెచ్‌) దినదినాభివృద్ధి చెందుతోందని సంస్థ డైరెక్టర్‌ ప్రొ.బీఎస్‌ మూర్తి తెలిపారు. వివిధ విభాగాల్లో ఓయూ ర్యాంకులు సాధించడంపై వర్సిటీ వీసీ రవీందర్‌ హర్షం వ్యక్తం చేశారు.

 

AP and Telangana states July Weekly Current affairs_110.1

 

 

Andhra Pradesh state Weekly Current affairs

1. ఆంధ్ర రాష్ట్ర హైకోర్టుకు ఏడుగురు కొత్త న్యాయమూర్తులు

AP and Telangana states July Weekly Current affairs_120.1

AP and Telangana states July Weekly Current affairs_130.1

సుప్రీంకోర్టు కొలీజియం ఆంధ్రప్రదేశ్‌ హైకోర్టుకు ఏడుగురు కొత్త న్యాయమూర్తుల పేర్లను ప్రతిపాదించింది. ప్రస్తుతం వివిధ కోర్టుల్లో న్యాయాధికారులుగా పని చేస్తున్న వీరికి హైకోర్టు న్యాయమూర్తులుగా పదోన్నతి కల్పించాలని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఎన్‌.వి.రమణ నేతృత్వంలో సమావేశమైన కొలీజియం నిర్ణయించి కేంద్రానికి సిఫార్సు చేసింది. వీరిలో అడుసుమల్లి వెంకట రవీంద్రబాబు, వక్కలగడ్డ రాధాకృష్ణ కృపాసాగర్, బండారు శ్యాంసుందర్, ఊటుకూరు శ్రీనివాస్, బొప్పన వరాహ లక్ష్మీనరసింహ చక్రవర్తి, తల్లాప్రగడ మల్లికార్జునరావు, దుప్పల వెంకటరమణ ఉన్నారు. 37 మంది న్యాయమూర్తులు ఉండాల్సిన ఏపీ హైకోర్టులో ప్రస్తుతం 24 మంది పని చేస్తున్నారు. ఇప్పటికే మహబూబ్‌ సుబానీ షేక్‌ పేరును కొలీజియం కేంద్రానికి సిఫార్సు చేసింది. ఆయనతో పాటు, ఈ ఏడుగురి పేర్లకూ కేంద్రం ఆమోదముద్ర వేస్తే మొత్తం న్యాయమూర్తుల సంఖ్య 32కు చేరుతుంది. గత రెండు రోజుల్లో సీజేఐ జస్టిస్‌ ఎన్‌.వి.రమణ నేతృత్వంలోని కొలీజియం అలహాబాద్‌ హైకోర్టుకు 9 మంది, కర్ణాటక హైకోర్టుకు అయిదుగురు న్యాయాధికారుల పేర్లను సిఫార్సు చేసింది.

2. ఎంఎస్‌ఎంఈలకు యూనియన్‌ బ్యాంకుతో ఏపీఐఐసీ ఒప్పందం 

AP and Telangana states July Weekly Current affairs_140.1

సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమ (ఎంఎస్‌ఎంఈ)లు రుణం కోసం దరఖాస్తు చేసుకున్న 10 రోజుల్లో యూనియన్‌ బ్యాంకు ద్వారా మంజూరు చేసేలా ఆ బ్యాంకుతో ఒప్పందం కుదుర్చుకున్నట్లు ఆంధ్ర రాష్ట్ర పారిశ్రామిక మౌలిక సదుపాయాల కల్పనా సంస్థ (ఏపీఐఐసీ) వైస్‌ ఛైర్మన్, ఎండీ సుబ్రమణ్యం తెలిపారు. ఏపీఐఐసీ గుర్తించిన 39 పారిశ్రామిక పార్కుల్లోని ఎంఎస్‌ఎంఈలకు రుణాలు అందించడంలో బ్యాంకు భాగస్వామ్యం కానుందన్నారు. మంగళగిరిలోని ఏపీఐఐసీ కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో ఏపీఐఐసీ ఎండీ సుబ్రమణ్యం, యూనియన్‌ బ్యాంకు చీఫ్‌ జనరల్‌ మేనేజర్‌ బ్రహ్మానందరెడ్డి అవగాహన ఒప్పందంపై సంతకాలు చేశారు.

3. ‘అమృత్‌ సరోవర్‌’లో ఏపీకి మూడో స్థానం

AP and Telangana states July Weekly Current affairs_150.1

దేశవ్యాప్తంగా కేంద్ర ప్రభుత్వం చేపట్టిన ‘అమృత్‌ సరోవర్‌’ కార్యక్రమం అమలులో ఆంధ్రప్రదేశ్‌  మూడో స్థానానికి ఎగబాకింది. దేశానికి స్వాతంత్య్రం వచ్చి 75 ఏళ్లు పూర్తవుతున్న సందర్భంగా దేశంలోని ప్రతి జిల్లాలో కనీసం 75 చెరువులను అభివృద్ధి చేయాలన్న లక్ష్యంగా ప్రధాని నరేంద్ర మోదీ ఈ ఏడాది ఏప్రిల్‌ 24న ఈ కార్యక్రమాన్ని లాంఛనంగా ప్రారంభించిన విషయం తెలిసిందే. కనీసం ఒక ఎకరం విస్తీర్ణంలో పది వేల క్యూబిక్‌ మీటర్ల మేర నీరు నిల్వ చేసేలా ఈ చెరువులు నిర్మించాలని నిర్ణయించింది.

నిర్దేశిత లక్ష్యం కన్నా ఎక్కువగా ఈ కార్యక్రమం ద్వారా రాష్ట్రంలో అన్ని శాఖల ఆధ్వర్యంలో 2,890 చెరువుల నిర్మాణం, అభివృద్ధి చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. ఇప్పటికే 1,809 చెరువుల పనులు కూడా మొదలయ్యాయి. వచ్చే ఏడాది ఆగస్టుకు చెరువుల నిర్మాణం పూర్తిచేయాల్సి ఉంది.

4. నెలాఖరులో నింగిలోకి ఎస్‌ఎస్‌ఎల్‌వీ

AP and Telangana states July Weekly Current affairs_160.1

భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ(ఇస్రో) చిన్న తరహా ఉపగ్రహాలను రోదసిలోకి పంపేందుకు రూపొందించిన స్మాల్‌ శాటిలైట్‌ లాంచింగ్‌ వెహికల్‌(ఎస్‌ఎస్‌ఎల్‌వీ)ను ఈ నెలాఖరులో ప్రయోగించేందుకు ఏర్పాట్లు చేస్తోంది. ఎస్‌ఎస్‌ఎల్‌వీ డీ1 రాకెట్‌ ద్వారా 142 కేజీల బరువు కలిగిన మైక్రోశాట్‌–2ఏ అనే ఉపగ్రహాన్ని రోదసి లోకి పంపేందుకు చర్యలు చేపట్టింది. తిరుపతి జిల్లా సతీష్‌ ధవన్‌ స్పేస్‌ సెంటర్‌(షార్‌)లోని మొదటి ప్రయోగ వేదికపై రాకెట్‌ అనుసంధానం చేసే పనులు ఇప్పటికే ప్రారంభమయ్యాయి.

ప్రస్తుతం అంతరిక్ష ప్రయోగాలు వాణిజ్యపరంగా మారిపోవడంతో పలు దేశాలు చిన్న తరహా ఉపగ్రహాలను తక్కువ ఖర్చుతో ఇస్రో ద్వారా ప్రయోగించేందుకు ఆసక్తి చూపిస్తున్నాయి. బుల్లి ఉపగ్రహాలను తక్కువ వ్యయంతో ప్రయోగించే విషయంలో భారత్‌ ప్రపంచంలోనే నంబర్‌వన్‌ స్థానంలో ఉంది. ఇప్పటికే పీఎస్‌ఎల్‌వీ రాకెట్ల ద్వారా 34 దేశాలకు చెందిన 342 ఉపగ్రహాలను ప్రయోగించి ప్రపంచంలోనే ప్రత్యేక స్థానాన్ని సంపాదించింది. ఆ స్థానాన్ని నిలుపుకునేందుకు ఎస్‌ఎస్‌ఎల్‌వీ రాకెట్‌ను రూపొందించింది.

ఇప్పటివరకు ఇస్రో ఎస్‌ఎల్‌వీ, ఏఎస్‌ఎల్‌వీ, పీఎస్‌ఎల్‌వీ, జీఎస్‌ఎల్‌వీ, జీఎస్‌ఎల్‌వీ మార్క్‌3 అనే ఐదు రకాల రాకెట్లతో ఉపగ్రహాలను రోదసి లోకి పంపించింది. ప్రస్తుతం ఆరో రకం రాకెట్‌గా ఎస్‌ఎస్‌ఎల్‌వీని తయారు చేసింది. ఇప్పటి వరకు పీఎస్‌ఎల్‌వీని మాత్రమే వాణిజ్యపరమైన ప్రయోగాలకు ఉపయోగించారు. ఇప్పుడు ఎస్‌ఎస్‌ఎల్‌వీని కూడా అందుబాటులోకి తెస్తున్నారు.

5. సూక్ష్మ సేద్యంలో ఏపీ అగ్రగామి 

AP and Telangana states July Weekly Current affairs_170.1

సూక్ష్మ సేద్యంలో ఆంధ్రప్రదేశ్‌ ఇతర రాష్ట్రాల కంటే ముందంజలో ఉంది. ఆ తర్వాత స్థానంలో కర్ణాటక నిలిచింది. దేశంలో వ్యవసాయ సాంకేతికతపై నాబార్డు పరిశోధన నివేదిక ఈ విషయాన్ని వెల్లడించింది. సూక్ష్మ సేద్యంలో తొలి ఐదు రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, మహారాష్ట్ర, తమిళనాడు, గుజరాత్‌ రాష్ట్రాలున్నట్లు ఆ నివేదిక పేర్కొంది. అలాగే, ఏపీలోని మొత్తం సాగు విస్తీర్ణంలో 51 శాతం ఈ తరహా సేద్యమే చేస్తున్నట్లు ఆ నివేదిక తెలిపింది.

అదే కర్ణాటకలో 49 శాతం, మహారాష్ట్ర 34 శాతం, తమిళనాడులో 29 శాతం, గుజరాత్‌లో 22 శాతం సూక్ష్మ సేద్యం చేస్తున్నట్లు వెల్లడించింది. ఇక భూగర్భ జలాలు బాగా అడుగంటిన పంజాబ్, హరియాణా రాష్ట్రాల్లో సూక్ష్మ సేద్యం సాగు విస్తీర్ణం బాగా తక్కువగా ఉండటంపట్ల నివేదిక ఆశ్చర్యాన్ని వ్యక్తంచేసింది. పంజాబ్‌లో మొత్తం సాగు విస్తీర్ణంలో సూక్ష్మ సేద్యం కేవలం ఒక శాతమే ఉండగా.. దాని పొరుగు రాష్ట్రం హర్యానాలో పది శాతమే ఉంది.

6. పెట్టుబడుల వాస్తవరూపంలో ఏపీ నంబర్‌ 1

AP and Telangana states July Weekly Current affairs_180.1

రాష్ట్రంలో  పెద్ద ఎత్తున పరిశ్రమల స్థాపనను ప్రోత్సహిస్తున్నారు, కొత్త పెట్టుబడులను ఆకర్షించడమే కాకుండా పరిశ్రమలు త్వరితగతిన ఉత్పత్తి ప్రారంభించే విధంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రణాళికాబద్ధంగా తీసుకుంటున్న చర్యలు సత్ఫలితాలనిస్తున్నాయి. ఉత్పత్తి ప్రారంభించడం ద్వారా పెట్టుబడులను వాస్తవరూపంలోకి తేవడంలో ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రం దేశంలో మొదటి స్థానంలో ఉంది.

కేంద్ర ప్రభుత్వరంగ సంస్థ డిపార్టమెంట్‌ ఫర్‌ ప్రమోషన్‌ ఆఫ్‌ ఇండస్ట్రీస్‌ అండ్‌ ఇంటర్నల్‌ ట్రేడ్‌ (డీపీఐఐటీ) తాజా గణాంకాలు ఈ విషయాన్ని వెల్లడించాయి. ఈ ఏడాది జనవరి నుంచి మార్చి వరకు మూడు నెలల కాలంలో రాష్ట్రంలో రూ.19,409 కోట్ల పెట్టుబడులు వాస్తవ రూపంలోకి వచ్చాయి. ఈ పెట్టుబడులు పెట్టిన 15 పరిశ్రమలు ఉత్పత్తి ప్రారంభించాయి. వీటిలో నోవా ఎయిర్, తారక్‌ టెక్స్‌టైల్స్, టీహెచ్‌కే ఇండియా, కిసాన్‌ క్రాఫ్ట్, తారకేశ్వర స్పిన్నింగ్‌ మిల్‌ వంటివి ఉన్నాయి.

Also check : AP and Telangana state July Weekly Current affairs part 2

*************************************************************************

 

AP and Telangana states July Weekly Current affairs_190.1

మరింత చదవండి: 

తాజా ఉద్యోగ ప్రకటనలు  ఇక్కడ క్లిక్ చేయండి
ఉచిత స్టడీ మెటీరియల్ (APPSC, TSPSC) ఇక్కడ క్లిక్ చేయండి
ఉచిత మాక్ టెస్టులు  ఇక్కడ క్లిక్ చేయండి

 

Sharing is caring!

Download your free content now!

Congratulations!

AP and Telangana states July Weekly Current affairs_210.1

కరెంట్ అఫైర్స్ -ఏప్రిల్ 2022 మాస పత్రిక

Download your free content now!

We have already received your details!

AP and Telangana states July Weekly Current affairs_220.1

Please click download to receive Adda247's premium content on your email ID

Incorrect details? Fill the form again here

కరెంట్ అఫైర్స్ -ఏప్రిల్ 2022 మాస పత్రిక

Thank You, Your details have been submitted we will get back to you.