Telugu govt jobs   »   Weekly Current Affairs   »   AP and Telangana States January Weekly...

AP and Telangana States January Weekly Current Affairs | ఏపీ, తెలంగాణ రాష్ట్రాల జనవరి వారాంతపు కరెంట్ అఫైర్స్

AP and Telangana State Weekly Current Affairs, ఏపీ, తెలంగాణ రాష్ట్రాల వారాంతపు కరెంట్ అఫైర్స్

Current affairs play a very important role in the competitive examinations and hence, aspirants have to give undivided attention to it while doing preparation for the government examinations. The banking or state govt examinations comprise a section of “General Awareness” to evaluate how much the aspirant is aware of the daily happenings taking place around the world. To complement your preparation, we are providing you with a compilation of the Current affairs of January 1st and 2nd Week.

AP and Telangana State Weekly Current Affairs, ఏపీ, తెలంగాణ రాష్ట్రాల వారాంతపు కరెంట్ అఫైర్స్

Weekly current Affairs PDF in Telugu : APPSC, TSPSC గ్రూప్స్ , SI మరియు కానిస్టేబుల్ పరీక్షలలో  జనరల్ అవేర్‌నెస్ చాలా ముఖ్యమైన విభాగాలలో ఒకటి మరియు మీరు మీ సమయాన్ని హృదయపూర్వకంగా కేటాయించినట్లయితే ఈ అంశం నుండి చాలా మంచి మార్కులు సాధించగలరు. పరీక్షల  ముందు అప్పటికప్పుడు  ఈ అంశాన్ని చదువుకొని వెళ్ళడం ద్వారా ఎక్కువ మార్కులు సాధించడం అసాధ్యం.  GA మీరు 10-15 రోజుల్లో పూర్తి  చేయగల విభాగం కాదు. మీరు జనరల్ అవేర్నెస్ పై పట్టు సాధించడానికి  ఉత్తమ మార్గం రోజూ వార్తాపత్రికలను చదవడం లేదా వారపు వార్తల ద్వారా వెళ్ళడం.

దీని ద్వారా   నెలవారీ లేదా 6 నెలల వార్తల ద్వారా తెలుసుకొనే సమాచారం కంటే ఎక్కువ సమాచారం తెలుసుకోవచ్చు. ఇక్కడ మేము మీకు అన్ని వార్తాపత్రికల నుండి సమకాలీన అంశాల సారాంశాన్ని అందిస్తున్నాము, ఇది మీ సమయాన్ని ఆదా చేస్తుంది మరియు మీరు ఆ సమయాన్ని వారాంతపు సమకాలీన అంశాలు 2022 అధ్యయనం కోసం కేటాయించవచ్చు.

AP and Telangana State November Weekly Current Affairs |_70.1APPSC/TSPSC Sure shot Selection Group

Andhra Pradesh State Weekly Current Affairs

1. సంక్రాంతి కానుకగా దిల్లీ నుంచి వర్చువల్‌గా ‘వందేభారత్‌ ఎక్స్‌ప్రెస్‌’ను ప్రధాని మోదీ ప్రారంభించారు. 

Vnade Bharth
Vanade Bharth

ఎనిమిది సంవత్సరాలుగా తెలంగాణలో రైల్వేల పురోగతి అద్భుతంగా సాగుతోందని ప్రధాని నరేంద్ర మోదీ స్పష్టం చేశారు. వందేభారత్‌ రైళ్లలో ఇది ఎనిమిదవది. ఆంధ్రప్రదేశ్‌లోనూ రైల్వే నెట్‌వర్క్‌ అభివృద్ధికి తమ సర్కారు కృషి చేస్తోందని చెప్పారు. సికింద్రాబాద్‌ – విశాఖపట్నం వందేభారత్‌ ఎక్స్‌ప్రెస్‌ను ఆయన దిల్లీ నుంచి వర్చువల్‌గా జెండా ఊపి ప్రారంభించారు.  మరోవైపు సికింద్రాబాద్‌ స్టేషన్‌లో జరిగిన కార్యక్రమంలో గవర్నర్‌ తమిళిసై, కేంద్ర మంత్రులు అశ్వినీవైష్ణవ్, కిషన్‌రెడ్డి, రాష్ట్ర మంత్రి మహమూద్‌ అలీ, తదితరులు పాల్గొని కొత్త రైలుకు జెండా ఊపారు.

2. RRR లో నాటు నాటు పాటకు గోల్డెన్‌ గ్లోబ్‌ పురస్కారం లభించింది 

Golden Globe Awards 2023
Golden Globe Awards 2023

ప్రపంచ సినిమా వేదికపై తెలుగు చిత్రాలు అంతర్జాతీయ ఖ్యాతిని సంపాదించాయి. ప్రముఖ దర్శకుడు ఎస్‌.ఎస్‌.రాజమౌళి నుంచి వచ్చిన మరో చిత్రం ‘ఆర్‌ఆర్‌ఆర్‌’లోని ‘నాటు నాటు’ పాట ప్రతిష్ఠాత్మక గోల్డెన్‌ గ్లోబ్‌ పురస్కారం గెలుచుకుంది. ఇప్పుడు ఆ పాటే ‘ఉత్తమ ఒరిజినల్‌ సాంగ్‌ (మోషన్‌ పిక్చర్‌)’ విభాగంలో అవార్డు అందుకుంది. కాలిఫోర్నియాలోని బెవర్లీ హిల్టన్‌ హాల్‌లో జరిగిన కార్యక్రమంలో ‘నాటు నాటు’ పాటను స్వరపరిచిన సంగీత దర్శకుడు ఎమ్‌.ఎమ్‌ కీరవాణి పురస్కారాన్ని అందుకున్నారు. చంద్రబోస్‌ సాహిత్యం అందించారు. ఆసియా ఖండంలో ఈ పురస్కారాన్ని దక్కించుకున్న తొలి పాట ఇదే.

3. బాపట్ల లో అరుదైన వీరగల్లు శాసనాన్ని గుర్తించారు 

veeragallu shashanam
veeragallu shashanam

బాపట్ల జిల్లా అద్దంకి మండలం ధర్మవరంలో పదో శతాబ్దం నాటి అరుదైన వీరగల్లు (యుద్ధంలో మరణించిన వారి స్మారకార్థం వేసే శిల) శాసనం వెలుగు చూసింది. గ్రామంలోని మల్లికార్జున స్వామి ఆలయం లో  పనులు చేపడుతుండుగా అద్దంకి ప్రాంతానికి చెందిన చరిత్ర పరిశోధకులు విద్వాన్‌ జ్యోతి చంద్రమౌళి గుడి గోడపై దీన్ని గుర్తించారు. మట్టితో నిండిన శాసనాన్ని శుభ్రం చేసి పరిశీలించారు. చాళుక్యుల లిపిగా తెలుస్తోందని తెలిపారు. మాడయ్య అనే అతను మాధవస్వామి సన్నిధిలో తన తమ్ముడి పేరిట వేయించిన వీరగల్లుగా తెలిపారు.

4. ప్రముఖ దర్శకుడు రాజమౌళికి న్యూయార్క్‌ ఫిల్మ్‌ క్రిటిక్స్‌ సర్కిల్‌ పురస్కారాన్ని అందుకున్నారు 

Rajmouli
Rajamouli

ప్రపంచ చలన చిత్ర రంగంలో ప్రతిష్ఠాత్మకంగా భావించే న్యూయార్క్‌ ఫిల్మ్‌ క్రిటిక్స్‌ సర్కిల్‌ పురస్కారాన్ని దర్శకుడు రాజమౌళి అందుకున్నారు. న్యూయార్క్‌ వేదికగా నిర్వహించిన ఈ వేడుకలో కుటుంబ సమేతంగా పాల్గొన్న రాజమౌళి ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ చిత్రానికిగానూ ఉత్తమ దర్శకుడిగా ఈ అవార్డు అందుకున్నారు.

TSPSC General Studies and General Ability Test Series in Telugu and English For TSPSC GROUP-2, GROUP-3, AMVI, AEE, FSO, Extension Officer, Women and Child Development Officer(CDPO) By Adda247

Telangana State Weekly Current Affairs

1. తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా శాంతికుమారి నియమితులయ్యారు 

Shanthi Kumari
Shanthi Kumari

తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా సీనియర్‌ ఐఏఎస్‌ అధికారిణి ఎ.శాంతికుమారి నియమితులయ్యారు.  1989 బ్యాచ్‌కు చెందిన ఆమె ప్రస్తుతం అటవీ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా ఉన్నారు. ఆమె పేరును ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఖరారు చేసిన వెంటనే ఉత్తర్వులు వెలువడ్డాయి. రాష్ట్రానికి ఆమె తొలి మహిళా ప్రధాన కార్యదర్శి కావడం విశేషం.  శాంతికుమారి పదవీకాలం 2025 ఏప్రిల్‌ వరకు ఉంది.

2. తెలంగాణకు పర్యాటక మిత్ర పురస్కారం లభించింది 

paryataka mitra award
paryataka mitra puraskar

కోల్‌కతాలో జరిగిన బుద్ధిస్ట్‌ టూర్‌ ఆపరేటర్ల సంఘం అంతర్జాతీయ సదస్సులో తెలంగాణకు పర్యాటక మిత్ర పురస్కారం లభించింది. బుద్ధవనం ప్రత్యేకాధికారి మల్లేపల్లి లక్ష్మయ్య దీనిని స్వీకరించారు.

3. దేశంలో అత్యుత్తమ ఇంక్యుబేటరుగా టీహబ్‌ ఎంపికయ్యింది 

T HUB
T HUB

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వరంగ సంస్థ టీహబ్‌ కేంద్ర పరిశ్రమలు, వాణిజ్య ప్రోత్సాహక శాఖ అందజేసే ‘జాతీయ అంకుర సంస్థల పురస్కారం – 2022’ పొందింది. దేశంలోనే అత్యుత్తమ ఇంక్యుబేటరుగా ఎంపికైంది. కేంద్ర పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్‌ గోయల్, సహాయ మంత్రి సోం ప్రకాశ్‌ దీన్ని ఆన్‌లైన్‌లో అందజేశారు. ఆవిష్కరణలు, పారిశ్రామిక ప్రోత్సాహం, అభివృద్ధికి గాను ఈ పురస్కారం లభించింది. ఈ విభాగంలో 55 ఇంక్యుబేటర్లు పోటీ పడినప్పటికి తెలంగాణ విజేతగా నిలిచింది.

4. ఏన్కూరు ‘ఆగ్రోస్‌’కు జాతీయ పురస్కారం లభించింది 

awards
National award

ఏన్కూరు, ఖమ్మం జిల్లాలో ఆగ్రోస్‌ రైతు సేవా కేంద్రం నిర్వహిస్తున్న ఎ.సాయిరాం జాతీయ స్థాయిలో ద్వితీయ ఉత్తమ పురస్కారాన్ని అందుకున్నారు. దిల్లీలో జాతీయ వ్యవసాయ విస్తరణ, నిర్వహణ సంస్థ (మేనేజ్‌) ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో కేంద్ర వ్యవసాయ శాఖ సంయుక్త కార్యదర్శి శోభాఠాకూర్‌ ఈ పురస్కారం ప్రదానం చేసినట్లు రాజేంద్రనగర్‌లోని మేనేజ్‌ డైరెక్టర్‌ జనరల్‌ చంద్రశేఖర తెలిపారు. రైతులకు  అందిస్తున్న నాణ్యమైన సేవలకు ఈ పురస్కారం లభించిందని ఆగ్రోస్‌ ఎండీ రాములు తెలిపారు.

5. కేసీఆర్‌కు సర్‌ చోటూ రామ్‌ పురస్కారం లభించింది 

SIR chotu ram puraskar
SIR chotu ram puraskar

పంజాబ్‌కు చెందిన ప్రముఖ రైతు నాయకుడు సర్‌ చోటూ రామ్‌ జాతీయ పురస్కారానికి తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ను ఎంపిక చేసినట్లు అఖిల భారత రైతు సంఘం వెల్లడించింది. హైదరాబాద్‌లోని మంత్రుల నివాస ప్రాంగణంలో రైతు సంఘం ప్రతినిధుల చేతుల మీదుగా సీఎం తరఫున వ్యవసాయ మంత్రి నిరంజన్‌ రెడ్డి పురస్కారాన్ని స్వీకరించారు. తెలంగాణ రైతుల శ్రేయస్సుకు సీఎం చేస్తున్న అవిరళ కృషికి గాను దీన్ని ప్రకటిస్తున్నట్లు తెలిపింది.

6. టై హైదరాబాద్‌ అధ్యక్షురాలిగా రషీదా అడెన్వాలా నియమితులయ్యారు 

rasheeda
rasheeda

అంతర్జాతీయ ఔత్సాహిక పారిశ్రామికవేత్తల నెట్‌వర్క్‌లో భాగం అయిన టై హైదరాబాద్‌కు కొత్త అధ్యక్షురాలిగా రషీదా అడెన్వాలాను నియమించారు. ఈ పదవికి తొలి మహిళ ఈమే కావడం విశేషం. 2023 సంవత్సరానికి ప్రెసిడెంట్‌గా రషీదా వ్యవహరిస్తారు. ద ఇండస్‌ ఎంటర్‌ప్రెన్యూర్స్‌ (టై)ను 1992లో సిలికాన్‌ వ్యాలీలో స్థాపించారు. వివిధ రంగాల్లోని ఔత్సాహిక పారిశ్రామికవేత్తలకు, అన్ని దశల్లోనూ ప్రోత్సాహమిచ్చే లాభాపేక్ష లేని సంస్థ ఇది.

7. అమరుల త్యాగాలతోనే తెలంగాణకు విముక్తి

Drupadi Murmu
Drupadi Murmu

హైదరాబాద్‌లోని కేశవ్‌ మెమోరియల్‌ ఎడ్యుకేషన్‌ సొసైటీ ఆజాదీ కా అమృత్‌ మహోత్సవ్‌లో భాగంగా నిర్వహించిన ‘లిబరేషన్‌ ఆఫ్‌ నిజాం ప్రావిన్స్‌’ సదస్సులో ఆమె ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. నిజాం నవాబు పాలనలో అణచివేతకు గురైన ప్రజల కోసం అమరులు చేసిన త్యాగాల వల్లే తెలంగాణ ప్రాంతంతో కూడిన హైదరాబాద్‌ సంస్థానానికి విముక్తి లభించిందని రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము అన్నారు.  ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ..హైదరాబాద్‌ నగరం భిన్నత్వంలో ఏకత్వానికి చిరునామాగా మారిందని తెలిపారు.

adda247

మరింత చదవండి: 

తాజా ఉద్యోగ ప్రకటనలు క్కడ క్లిక్ చేయండి
ఉచిత స్టడీ మెటీరియల్ (APPSC, TSPSC) ఇక్కడ క్లిక్ చేయండి
ఉచిత మాక్ టెస్టులు ఇక్కడ క్లిక్ చేయండి

Sharing is caring!

FAQs

where can I found weekly current affairs?

you can found weekly current affairs at adda 247 telugu website