Telugu govt jobs   »   Telugu Current Affairs   »   AP and Telangana state Weekly Current...

AP and Telangana state Weekly Current affairs, ఏపీ, తెలంగాణ రాష్ట్రాల వారాంతపు కరెంట్ అఫైర్స్

AP and Telangana state Weekly Current affairs, ఏపీ, తెలంగాణ రాష్ట్రాల వారాంతపు కరెంట్ అఫైర్స్

Current affairs play a very important role in the competitive examinations and hence, aspirants have to give undivided attention to it while doing preparation for the government examinations. The banking or state govt examinations comprise a section of “General Awareness” to evaluate how much the aspirant is aware of the daily happenings taking place around the world. To complement your preparation, we are providing you with a compilation of the  Current affairs of MAY 3rd week.

AP and Telangana state Weekly Current affairs, ఏపీ, తెలంగాణ రాష్ట్రాల వారాంతపు కరెంట్ అఫైర్స్

Weekly current Affairs PDF in Telugu : APPSC, TSPSC గ్రూప్స్ , SI మరియు కానిస్టేబుల్ పరీక్షలలో  జనరల్ అవేర్‌నెస్ చాలా ముఖ్యమైన విభాగాలలో ఒకటి మరియు మీరు మీ సమయాన్ని హృదయపూర్వకంగా కేటాయించినట్లయితే ఈ అంశం నుండి చాలా మంచి మార్కులు సాధించగలరు. పరీక్షల  ముందు అప్పటికప్పుడు  ఈ అంశాన్ని చదువుకొని వెళ్ళడం ద్వారా ఎక్కువ మార్కులు సాధించడం అసాధ్యం.  GA మీరు 10-15 రోజుల్లో పూర్తి  చేయగల విభాగం కాదు. మీరు జనరల్ అవేర్నెస్ పై పట్టు సాధించడానికి  ఉత్తమ మార్గం రోజూ వార్తాపత్రికలను చదవడం లేదా వారపు వార్తల ద్వారా వెళ్ళడం.

దీని ద్వారా   నెలవారీ లేదా 6 నెలల వార్తల ద్వారా తెలుసుకొనే సమాచారం కంటే ఎక్కువ సమాచారం తెలుసుకోవచ్చు. ఇక్కడ మేము మీకు అన్ని వార్తాపత్రికల నుండి సమకాలీన అంశాల సారాంశాన్ని అందిస్తున్నాము, ఇది మీ సమయాన్ని ఆదా చేస్తుంది మరియు మీరు ఆ సమయాన్ని వారాంతపు సమకాలీన అంశాలు 2022 అధ్యయనం కోసం కేటాయించవచ్చు.

AP and Telangana state Weekly Current affairs, ఏపీ, తెలంగాణ రాష్ట్రాల వారాంతపు కరెంట్ అఫైర్స్_40.1APPSC/TSPSC Sure shot Selection Group

Telangana state Weekly Current affairs

1. ప్రపంచ బాక్సింగ్‌ ఛాంపియన్‌షిప్‌లో తెలంగాణకు చెందిన నిఖత్‌ జరీన్‌ స్వర్ణం సాధించింది.

AP and Telangana state Weekly Current affairs, ఏపీ, తెలంగాణ రాష్ట్రాల వారాంతపు కరెంట్ అఫైర్స్_50.1
World Boxing Championship 2022: Telangana Girl Wins Gold in Boxing

టర్కీలోని ఇస్తాంబుల్‌ వేదికగా జరుగుతోన్న 12వ మహిళల ప్రపంచ బాక్సింగ్‌ చాంపియన్‌షిప్‌–2022లో భారత మహిళా బాక్సర్‌ నిఖత్‌ జరీన్‌ స్వర్ణ పతకం గెలిచింది. మే 19న జరిగిన 52 కేజీల ఫ్లయ్‌ వెయిట్‌ కేటగిరీ ఫైనల్లో తెలంగాణకి చెందిన నిఖత్‌ 5–0తో థాయ్‌లాండ్‌ బాక్సర్‌ జిత్‌పాంగ్‌ జుతమాస్‌పై విజయం సాధించింది. దీంతో భారత్‌ తరఫున ప్రపంచ చాంపియన్‌గా నిలిచిన ఐదో మహిళా బాక్సర్‌గా నిఖత్‌ జరీన్‌ రికార్డులకెక్కింది. మేరీకోమ్‌ చివరి సారిగా 2018లో గెలిచాకా మళ్లీ నాలుగేళ్ల తర్వాత ప్రపంచ బాక్సింగ్‌ వేదికపై తెలుగుతేజం భారత మువ్వన్నెలను సగర్వంగా రెపరెప లాడించింది.

2. తెలంగాణ రాష్ట్ర హైకోర్టు నూతన సీజేగా జస్టిస్‌ ఉజ్జల్‌ భూయాన్‌  నియమితులయ్యారు

AP and Telangana state Weekly Current affairs, ఏపీ, తెలంగాణ రాష్ట్రాల వారాంతపు కరెంట్ అఫైర్స్_60.1
Telangana Highcourt

తెలంగాణ రాష్ట్ర హైకోర్టు సీజేగా జస్టిస్‌ ఉజ్జల్‌ భూయాన్‌ను నియమించాలని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఎన్‌వీ రమణ నేతృత్వంలోని కొలీజియం మే 17న సిఫార్సు చేసింది. తెలంగాణ సహా ఐదు హైకోర్టులకు చెందిన న్యాయమూర్తులకు ప్రధాన న్యాయమూర్తులుగా పదోన్నతులు కల్పించాలని పేర్కొంది. ప్రస్తుతం తెలంగాణ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ సతీష్‌చంద్ర శర్మను ఢిల్లీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా బదిలీ చేయాలని తెలిపింది.  2021, అక్టోబర్‌ 11న తెలంగాణ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్‌ సతీశ్‌చంద్ర శర్మ బాధ్యతలు చేపట్టిన విషయం తెలిసిందే. కొలీజియం సిఫార్సులపై రాష్ట్రపతి ఆమోదముద్ర వేయాల్సి ఉంది.

 

 3. కాకతీయుల కాలం నాటి శివాలయాన్ని ఖమ్మం జిల్లాలో గుర్తించారు.

AP and Telangana state Weekly Current affairs, ఏపీ, తెలంగాణ రాష్ట్రాల వారాంతపు కరెంట్ అఫైర్స్_70.1
shiva-temple-kusumanchi

కాకతీయుల కాలం నాటి శివాలయం ఒకటి ఇటీవల వెలుగు చూసింది. ఖమ్మం జిల్లా కూసుమంచి పంచాయితీ కార్యాలయం వెనకవైపు ఉన్న ఈ ఆలయాన్ని ప్లీచ్‌ ఇండియా ఫౌండేషన్‌ గుర్తించింది. క్రీ.శ.13వ శతాబ్దంలో నిర్మించిన ఈ శివాలయ నిర్మాణ శైలిలో కొన్ని ప్రత్యేకతలు ఉన్నాయని.. గణపేశ్వరాలయ వాస్తు శిల్పాన్ని పోలి ఉందని పురాతత్వ శాస్త్రవేత్తలు తెలిపారు. ద్వారాల ముందు రాతి కిటికీలతోపాటు గోడపైభాగంలో ఆలయం చుట్టూ రాతి వెంటిలేటర్‌ ఉండటం విశేషమన్నారు.

4. టీహబ్‌తో ఫాల్కన్‌ ఎక్స్‌ ఒప్పందం కుదుర్చుకుంది.

AP and Telangana state Weekly Current affairs, ఏపీ, తెలంగాణ రాష్ట్రాల వారాంతపు కరెంట్ అఫైర్స్_80.1
Falcon X has entered into an agreement with T-Hub

సిలికాన్‌ వ్యాలీలో జరిగే ‘గ్లోబల్‌ స్టార్టప్‌ ఎమర్షన్‌ ప్రోగ్రాం’ కోసం అమెరికాకు చెందిన ఫాల్కన్‌ ఎక్స్‌ సంస్థతో టీహబ్‌ ఒప్పందం చేసుకుంది. ఈ కార్యక్రమంలో భాగంగా భారత్‌లోని స్టార్టప్‌ వ్యవస్థాపకులు అమెరికా మార్కెట్లోకి ప్రవేశించేందుకు, తమ ఉత్పత్తులను ప్రదర్శించేందుకు వీలు కలగనుంది. ఐదు వారాల ప్రాజెక్టులో భాగంగా కొత్త మార్కెట్‌లోకి ప్రవేశించేందుకు అవకాశాలు ఉంటాయని టీహబ్‌ సీఈవో ఎం.ఎస్‌.ఆర్‌. తెలిపారు.తొలి మూడు స్థానాల్లో నిలిచిన స్టార్టప్‌లకు ఫాల్కన్‌ ఎక్స్‌ సంస్థ నుంచి లక్ష అమెరికా డాలర్ల వ్యూహాత్మక నిధులు అందుతాయన్నారు.

AP and Telangana state Weekly Current affairs, ఏపీ, తెలంగాణ రాష్ట్రాల వారాంతపు కరెంట్ అఫైర్స్_90.1

Andhra Pradesh state Weekly Current affairs

1. సంచార పశు ఆరోగ్య సేవలను ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర ప్రభుత్వం అందుబాటులోకి తెచ్చింది.

AP and Telangana state Weekly Current affairs, ఏపీ, తెలంగాణ రాష్ట్రాల వారాంతపు కరెంట్ అఫైర్స్_100.1
YSR Mobile Veterinary Ambulances

మూగ జీవాల కోసం ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర ప్రభుత్వం డాక్టర్‌ వైఎస్సార్‌ సంచార పశు ఆరోగ్య సేవలను అందుబాటులోకి తెచ్చింది. నియోజకవర్గానికి రెండు చొప్పున రాష్ట్ర వ్యాప్తంగా రూ.278 కోట్లతో 340 పశువుల అంబులెన్స్‌లను అందుబాటులోకి తీసుకొస్తున్నారు. తొలి విడతగా రూ.143 కోట్ల అంచనా వ్యయంతో ఏర్పాటు చేసిన 175 అంబులెన్స్‌లను తాడేపల్లి క్యాంప్‌ కార్యాలయం వద్ద రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి మే 19న జెండా ఊపి ప్రారంభించారు. 108, 104 అంబులెన్స్‌ల తరహాలోనే అత్యాధునిక సౌకర్యాలతో ఈ మొబైల్‌ అంబులేటరీ క్లినిక్స్‌ను తీర్చిదిద్దారు. రెండో విడతలో రూ.135 కోట్లతో 165 అంబులెన్స్‌లను అందుబాటులోకి తీసుకొస్తున్నట్లు అధికారులు తెలిపారు.

ప్రాధాన అంశాలు:

  • ప్రతి అంబులెన్స్‌లో ట్రావిస్‌తో పాటు వెయ్యి కిలోల బరువున్న మూగ జీవాన్ని తరలించేందుకు వీలుగా హైడ్రాలిక్‌ లిఫ్ట్‌ సౌకర్యం.
  • 20 రకాల పేడ సంబంధిత పరీక్షలు, 15 రకాల రక్త పరీక్షలు చేసేందుకు వీలుగా మైక్రో స్కోప్‌తో కూడిన లేబరేటరీ.
  • ప్రాథమిక వైద్య సేవలతో పాటు సన్న జీవాలు, పెంపుడు జంతువులు, పక్షులకు సర్జరీలు చేసేందుకు వీలుగా సౌకర్యాలు. అందుబాటులో సీజన్‌ వారీగా అవసరమైన వ్యాక్సిన్లు, అన్ని రకాల మందులు.
  • ప్రతి వాహనంలో పశు వైద్యుడు, వెటర్నరీ డిప్లమో చేసిన సహాయకుడు, డ్రైవర్‌ కమ్‌ అటెండర్‌.
  • టోల్‌ ఫ్రీ నంబర్‌ 1962కు ఫోన్‌ చేసి పశువు అనారోగ్య సమాచారం తెలియజేస్తే చాలు రైతు ముంగిటకు వెళ్లి వైద్య సేవలు అందిస్తారు. అవసరమైతే సమీప పశు వైద్యశాలకు తరలించి మెరుగైన వైద్యం చేయిస్తారు. పూర్తిగా కోలుకున్న తర్వాత తిరిగి ఉచితంగా అదే అంబులెన్స్‌లో రైతు ఇంటికి భద్రంగా చేరుస్తారు.

2. ప్రపచంలో తొలి సోలార్, విండ్, హైడల్‌ పవర్‌ ప్రాజెక్టును ఆంధ్రప్రదేశ్ లో ప్రారంభించారు.

AP and Telangana state Weekly Current affairs, ఏపీ, తెలంగాణ రాష్ట్రాల వారాంతపు కరెంట్ అఫైర్స్_110.1
Integrated Renewable Energy Project

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో మరో భారీ పవర్‌ ప్రాజెక్టు ఏర్పాటవుతోంది. ఒకే యూనిట్‌ నుంచి సోలార్, విండ్, హైడల్‌ పవర్‌ (పంప్డ్‌ స్టోరేజీ) విద్యుత్‌ ఉత్పాదనకు సంబంధించిన ఇంటిగ్రేటెడ్‌ పునరుత్పాదక ఇంధన ప్రాజెక్టు (ఇంటిగ్రేటెడ్‌ రెన్యూవబుల్‌ ఎనర్జీ ప్రాజెక్టు–ఐఆర్‌ఈపీ) ఉమ్మడి కర్నూలు జిల్లాలో ఏర్పాటవుతోంది. గ్రీన్‌కో ఎనర్జీస్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ నిర్మించే ఈ ప్రాజెక్టు ద్వారా 5,230 మెగావాట్ల విద్యుత్‌ ఉత్పత్తి కానుంది. ప్రపంచంలో మూడు విభాగాల ద్వారా ఒకే యూనిట్‌ నుంచి ఇన్ని మెగావాట్ల విద్యుత్‌ ఉత్పత్తిచేసే తొలి ప్రాజెక్టు ఇదే. ఈ ప్రాజెక్టు నిర్మాణానికి రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి మే 17న శంకుస్థాపన చేశారు.

ప్రాధాన అంశాలు:

  • ఓర్వకల్లు మండలం గుమ్మితం తండా(కర్నూలు జిల్లా), పాణ్యం మండలం పిన్నాపురం(నంధ్యాల జిల్లా)లలో గ్రీన్‌కో ఎనర్జీస్‌ లిమిటెడ్‌ ఏర్పాటుచేస్తున్న.. ఈ ప్రాజెక్టు ప్రపంచంలోనే అత్యధికంగా విద్యుత్‌ను ఉత్పత్తిచేసే పునరుత్పాదక ఇంధన ప్రాజెక్టుగా అవతరిస్తోంది.
  • ఒకే యూనిట్‌ నుంచి సోలార్, పవన, హైడల్‌ పవర్‌ను ఉత్పత్తిచేసే ప్రాజెక్టు కూడా ఇదే కాబోతోంది.
  • ఈ ప్రాజెక్టులో సోలార్‌ విద్యుత్‌ ఉత్పత్తి 3,000 మెగావాట్లు, విండ్‌ 550 మెగావాట్లు, హైడల్‌ పవర్‌ 1,680 మెగావాట్ల విద్యుత్‌ను ఉత్పత్తిచేసి నేషనల్‌ గ్రిడ్‌కు అనుసంధానించి ఓర్వకల్‌ పీజీసీఐఎల్‌/సీటీయూ విద్యుత్‌ సబ్‌స్టేషన్‌ ద్వారా దేశంలోని డిస్కమ్‌లు, పరిశ్రమలకు సరఫరా చేసేలా చర్యలు తీసుకుంటున్నారు.
  • ఈ ప్రాజెక్టు నిర్మాణాన్ని రాబోయే ఐదేళ్లలో పూర్తిచేసి విద్యుత్‌ ఉత్పత్తిని ప్రారంభిస్తారు. దీనికోసం రాష్ట్ర ప్రభుత్వం 4,766.28 ఎకరాల భూమిని కేటాయించింది. ఇందులో ఇప్పటికే 2,800 ఎకరాలను కంపెనీకి అప్పగించారు.
  • ఇంటిగ్రేటెడ్‌ రెన్యూవబుల్‌ ఎనర్జీ ప్రాజెక్టు కోసం గ్రీన్‌కో ఎనర్జీస్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ రూ.15 వేల కోట్ల పెట్టుబడి పెట్టబోతోంది. ఈ ప్రాజెక్టు కారణంగా, వాతావరణంలో ఏటా కార్బన్‌ డయాక్సైడ్‌ 15 మిలియన్‌ టన్నులు తగ్గుతుందని కంపెనీ అంచనా.

3. ఏపీ ప్రధాన ఎన్నికల అధికారిగా మీనా బాధ్యతలు స్వీకరించారు

AP and Telangana state Weekly Current affairs, ఏపీ, తెలంగాణ రాష్ట్రాల వారాంతపు కరెంట్ అఫైర్స్_120.1
MK Meena takes charge as new Chief Electoral Officer of Andhra Pradesh

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి (చీఫ్‌ ఎలక్టోరల్‌ ఆఫీసర్‌ – సీఈవో)గా సీనియర్‌ ఐఏఎస్‌ అధికారి ముఖేష్‌ కుమార్‌ మీనా బాధ్యతలు స్వీకరించారు. ఇప్పటివరకూ సీఈవోగా కొనసాగిన కె.విజయానంద్‌ నుంచి ఆయన బాధ్యతలు తీసుకున్నారు. 2024లో సాధారణ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో మీనా ప్రధాన ఎన్నికల అధికారిగా నియమితులవటం విశేషం.

 

AP and Telangana state Weekly Current affairs, ఏపీ, తెలంగాణ రాష్ట్రాల వారాంతపు కరెంట్ అఫైర్స్_130.1

మరింత చదవండి: 

తాజా ఉద్యోగ ప్రకటనలు  ఇక్కడ క్లిక్ చేయండి
ఉచిత స్టడీ మెటీరియల్ (APPSC, TSPSC) ఇక్కడ క్లిక్ చేయండి
ఉచిత మాక్ టెస్టులు  ఇక్కడ క్లిక్ చేయండి

AP and Telangana state Weekly Current affairs, ఏపీ, తెలంగాణ రాష్ట్రాల వారాంతపు కరెంట్ అఫైర్స్_140.1

Sharing is caring!

Download your free content now!

Congratulations!

AP and Telangana state Weekly Current affairs, ఏపీ, తెలంగాణ రాష్ట్రాల వారాంతపు కరెంట్ అఫైర్స్_160.1

కరెంట్ అఫైర్స్ -ఏప్రిల్ 2022 మాస పత్రిక

Download your free content now!

We have already received your details!

AP and Telangana state Weekly Current affairs, ఏపీ, తెలంగాణ రాష్ట్రాల వారాంతపు కరెంట్ అఫైర్స్_170.1

Please click download to receive Adda247's premium content on your email ID

Incorrect details? Fill the form again here

కరెంట్ అఫైర్స్ -ఏప్రిల్ 2022 మాస పత్రిక

Thank You, Your details have been submitted we will get back to you.