పశుసంవర్ధక శాఖ అసిస్టెంట్ స్టడీ మెటీరియల్: పౌల్ట్రీ ఫీడింగ్
పౌల్ట్రీ లో జంతువు ఎదుగుదలకు ఆహారం ఎంతో ముఖ్యం ఇది దాని శరీర నిర్మాణంలో ప్రాధమిక భాగం. ఆహారం కోసం దాదాపుగా 60-70 % పెట్టుబడి అవుతుంది, దీంతో పెట్టుబడి నిర్వహణ అతి పెద్ద సమస్య. పెట్టుబడిని ఎంత సామర్ధవంతంగా నిర్వహిస్తే లాభాలు కలుగుతాయి. పౌల్ట్రీ ఉత్పత్తి విజయవంతం చేసే చర్యలలో పౌల్ట్రీ ఫీడింగ్ నిర్వహణ ప్రధాన కారణం. పౌల్ట్రీ లో 40 కంటే ఎక్కువ పోషకాలు దాణాలో అందించాలి, వాటి వలన శరీర అవయవాలు బాగా అభివృద్ధి చెందుతాయి. ఈ పోషకాలలో ప్రోటీన్లు, ఖనిజ పోషకాలు, కార్బోహైడ్రేట్లు, కొవ్వు, విటమిన్లు మొదలైనవి ఎన్నో ఉన్నాయి వాటిని సమపాళ్లలో అందిస్తే లాభాలు పొందటం సులువు.
కోళ్ళ పెంపకంలో ఎదురయ్యే ఇబ్బందులు:
- ఖరీదైన మెతను కొనుగోలు చేయడం
- కోళ్ళ దాణాలో కృత్రిమ ఆహారాన్ని ఉపయోగించడం
- కోళ్లను బంధించి పెంచడం
APPSC/TSPSC Sure shot Selection Group
పౌల్ట్రీ ఫీడింగ్ లో ఉపయోగించే ఆహార పదార్ధాలు
పౌల్ట్రీలో ఆహారానికి కార్బోహైడ్రేట్లు మరియు కొవ్వులు శక్తి యొక్క ప్రధాన వనరులు. అవసరమైన అమైనో ఆమ్లాలు: అర్జినిన్, గ్లైసిన్, హిస్టిడిన్, లూసిన్, ఐసోలూసిన్, లైసిన్, మెథియోనిన్, సిస్టీన్, ఫెనిలాలనైన్, థ్రెయోనిన్, ట్రిప్టోఫాన్ మరియు వాలైన్ వీటిని తప్పనిసరిగా సమపాళ్ళల్లో అందించాలి. ఖనిజాలు, విటమిన్లు జీవ క్రియ లో ఉపయోగపడతాయి. ఈ దిగువన పట్టికలో దాణాలో ఉపయోగించే పదార్ధం మరియు వాటి శాతంని తెలుసుకోండి.
పౌల్ట్రీ ఫీడింగ్ లో ఉపయోగించే ఆహార పదార్ధాలు వాటి శాతం |
|
పదార్ధం | % (శాతం) |
Bajra | 10-20 |
Blood meal | 3 |
CSC (decorticated) | 0-10 |
Coconut cake | 5-10 |
Cotton Meal | |
Deoiled rice bran | 10-20 |
Fish meal | 5-10 |
GNC | 10-30 |
Maize | 60 |
Maize gluten | 0-10 |
Mustard cake | 0-5 |
Meat Meal | 5-10 |
Molasses | 0-5 |
Peanut meat | |
Rice | 40 |
Rice Bran | 10-20 |
Rice Polish | 10-30 |
Sunflower cake | 10-20 |
Sorghum | 30-40 |
Safflower cake | 5-15 |
Silkworm-pupae meal | 6 |
Soybean Meal | 40 |
Tapioca meal | 5-15 |
Wheat Bran | 10-15 |
Wheat | 50 |
పౌల్ట్రీ ఫీడింగ్ లో దాణా
ఫీడ్ పరిమాణం మరియు ఫీడ్ యొక్క పోషక అవసరాలు బరువు మరియు వయస్సుపై ఆధారపడి ఉంటాయి. పౌల్ట్రీ, వాటి పెరుగుదల రేటు, వాటి గుడ్డు ఉత్పత్తి రేటు, వాతావరణం మరియు పౌల్ట్రీ ఆహారం ద్వారా పొందే పోషకాహారం మొత్తం. పౌల్ట్రీ యొక్క పోషక అవసరాలు సంక్లిష్టంగా ఉంటాయి మరియు వాటికి తగిన ఆహారంలో కనీసం 38 పోషకాలు అవసరమవుతాయి. పౌల్ట్రీ ఫీడింగ్ లో దాణా కింద ఉపయోగించే వివిధ పదార్ధాలు వాటి వనరులు గురించి తెలుసుకోండి.
కార్బోహైడ్రేట్లు
- అటుకులు
- గోధుమ
- జొన్నలు
- బార్లీ
- మొక్కజొన్న
- ఇతర పప్పు దినుసులు
మాంసకృతులు
- చేప మాంసం
- ప్రొద్దుతిరుగుడు పువ్వు పిండి
- వేరుశనగ పిండి
- సొయా
- పత్తిగింజ పిండి
- ఇతర అపరాల గింజలు
విటమిన్లు
- ఈస్ట్
- డిస్టిలరీస్
- ఆల్ఫా
- పాల ఉత్పత్తులు
- ఇతర జంతువుల కాలేయం (కోడి, మేక)
ఖనిజ లవణాలు
- చేప మాంసం
- పాల ఉత్పత్తులు
- సున్నపు రాయి
- ఉప్పు
- జింక్ ఆక్సైడ్
- డై కాల్షియం ఫాస్ఫేట్
- ఆల్చిప్ప పెంకులు
కొవ్వు మరియు నూనె పదార్ధాలు
- జంతువుల కొవ్వు
- పంది కొవ్వు
- మొక్కజొన్న మరియు కూరగాయల నూనెలు
కోళ్ళ దాణా లో ముడి పదార్ధాలు
కోళ్ళ దాణా లో ముడి పదార్ధాలను రెండు విధాలు గా లభిస్తాయి అవి ఆర్గనిక్ మరియు ఇన్ ఆర్గానిక్. ఈ ఆర్గానిక్ మరియు ఇన్ఆర్గానిక్ పదార్ధాలు కోళ్ళు ఎదగడానికి మరియు అవి పెట్టే గుడ్లు పెంకు భాగం గట్టిగా ఉండటానికి కూడా ఉపయోగపడతాయి.
ఆర్గానిక్ కాంపౌండ్లు
ఈ ఆర్గానిక్ కాంపౌండ్ల లో ముఖ్యంగా కార్బోహైడ్రేట్లు, ప్రోటీన్లు, కొవ్వు పదార్ధాలు, విటమిన్లు ఉంటాయి
ఇన్ ఆర్గానిక్ కాంపౌండ్లు
ఇందులో నీరు మరియు మినరల్స ఉంటాయి
పౌల్ట్రీ ఫీడింగ్ నీటిలో కరిగే విటమిన్ లు
- థయామిన్ (B1)
- రైబోఫ్లావిన్ (B2)
- నికోటిన్ (B3)
- సైనోకోబాలమిన్ (B12)
- ఫోలిక్ యాసిడ్
- బయోటిన్
- ఫాంటోథేనిక్ యాసిడ్
- కొలిన్
ఈ నీటిలో కరిగే విటమిన్లు అందించక పోవడం వలన పౌల్ట్రీ లో కోళ్ళ ఎదుగుదలలో ఎన్నో ఇబ్బందులు ఎదురవుతాయి తద్వారా అది ఆదాయ ఆర్జన ని దెబ్బతీస్తుంది.
పౌల్ట్రీలో ఫీడ్ సప్లిమెంట్లు
సప్లిమెంట్స్ అనేవి దాణాలో లోపం ఉన్న పోషకాలను సరఫరా చేయడానికి దాణాలో జోడించబడే పోషక పదార్థాలు. శక్తి మరియు ప్రోటీన్ సరఫరా కోసం దాణాలో ఉపయోగించే వస్తువులను సాధారణంగా సప్లిమెంట్లు పదార్థాలు అంటారు. ఈ పదార్ధాలు కొన్ని ఖనిజాలు, విటమిన్లు మరియు అమైనో ఆమ్లాలలని కలిగి ఉంటాయి. మినరల్ సప్లిమెంట్స్ ఆర్గానిక్ కాంప్లెక్స్‌గా సింథటిక్ రూపాల్లో అందిస్తారు, ఉదాహరణకు చీలేటెడ్ మినరల్స్, విటమిన్ సప్లిమెంట్స్ సింథటిక్ రూపాల్లో అందిస్తారు మరియు కృత్రిమ రూపాల్లో అనుబంధంగా ఉంటాయి, ఉదా. DL-మెథియోనిన్, L-లైసిన్, మొదలైనవి ఉంటాయి.
సంకలనాలు దాణా తీసుకోవడం, జీర్ణక్రియ, శోషణ మరియు పక్షుల మెరుగైన పెరుగుదల మరియు ఉత్పత్తి పనితీరు కోసం పోషకాల వినియోగాన్ని మెరుగుపరచడానికి దాణాలో జోడించబడే పోషక రహిత పదార్థాలు. పౌల్ట్రీ కోసం ఉపయోగించే వివిధ రకాల ఫీడ్ సంకలితాలు ఉన్నాయి, ఇవి ముఖ్యమైన ఫీడ్ సంకలనాలు అవి: యాంటీబయాటిక్, ప్రోబయోటిక్, ప్రీబయోటిక్, యాసిడిఫైయర్, ఎంజైమ్, ఎమల్సిఫైయర్, టాక్సిన్ బైండర్, యాంటీ ఆక్సిడెంట్, గ్రోత్ ప్రమోటర్లు మొదలైనవి ఉన్నాయి
మరింత చదవండి: | |
తాజా ఉద్యోగ ప్రకటనలు | ఇక్కడ క్లిక్ చేయండి |
ఉచిత స్టడీ మెటీరియల్ (APPSC, TSPSC) | ఇక్కడ క్లిక్ చేయండి |
ఉచిత మాక్ టెస్టులు | ఇక్కడ క్లిక్ చేయండి |