Telugu govt jobs   »   Current Affairs   »   ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వారాంతపు కరెంట్ అఫైర్స్‌

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వారాంతపు కరెంట్ అఫైర్స్ అక్టోబర్ 2023 – 4వ వారం | డౌన్‌లోడ్ PDF

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వారాంతపు కరెంట్ అఫైర్స్ అక్టోబర్ 2023 – 4వ వారం | డౌన్‌లోడ్ PDF

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వారాంతపు కరెంట్ అఫైర్స్: APPSC గ్రూప్స్ , SI మరియు కానిస్టేబుల్ పరీక్షలలో కరెంట్ అఫైర్స్ చాలా ముఖ్యమైన విభాగాలలో ఒకటి మరియు మీరు మీ సమయాన్ని హృదయపూర్వకంగా కేటాయించినట్లయితే ఈ అంశం నుండి చాలా మంచి మార్కులు సాధించగలరు. పరీక్షల  ముందు అప్పటికప్పుడు  ఈ అంశాన్ని చదువుకొని వెళ్ళడం ద్వారా ఎక్కువ మార్కులు సాధించడం అసాధ్యం.  కరెంట్ అఫైర్స్ మీరు 10-15 రోజుల్లో పూర్తి  చేయగల విభాగం కాదు. మీరు కరెంట్ అఫైర్స్ పై పట్టు సాధించడానికి  ఉత్తమ మార్గం రోజూ వార్తాపత్రికలను చదవడం లేదా వారపు వార్తల ద్వారా వెళ్ళడం.

దీని ద్వారా  నెలవారీ లేదా 6 నెలల వార్తల ద్వారా తెలుసుకొనే సమాచారం కంటే ఎక్కువ సమాచారం తెలుసుకోవచ్చు. ఇక్కడ మేము మీకు అన్ని వార్తాపత్రికల నుండి సమకాలీన అంశాల సారాంశాన్ని మరియు ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కరెంట్ అఫైర్స్ ను ఇక్కడ అందిస్తున్నాము, ఇది మీ సమయాన్ని ఆదా చేస్తుంది మరియు మీరు ఆ సమయాన్ని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వారాంతపు సమకాలీన అంశాలు 2023 అధ్యయనం కోసం కేటాయించవచ్చు.

Adda247 Telugu

APPSC/TSPSC Sure shot Selection Group

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వారాంతపు కరెంట్ అఫైర్స్

1. ప్రతిష్టాత్మకమైన నీతి ఆయోగ్ ప్రాజెక్టుకు ఏయూ వైస్ ఛాన్సలర్ ఎంపికయ్యారు

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వారాంతపు కరెంట్ అఫైర్స్ అక్టోబర్ 2023 – 4వ వారం | డౌన్‌లోడ్ PDF_4.1

ఆంధ్రా యూనివర్శిటీ బయోకెమిస్ట్రీ డిపార్ట్‌మెంట్ రీసెర్చ్ స్కాలర్ బాతా హెప్సిబా వినీలా నీతి ఆయోగ్ ఆకాంక్షాత్మక బ్లాక్ ఫెలోషిప్‌కు ఎంపికయ్యారు. ఆమె అల్లూరి సీతారామరాజు జిల్లా వై రామవరం మండలానికి ఆస్పిరేషనల్ బ్లాక్ ఫెలోగా పని చేస్తారు. ఆస్పిరేషనల్ బ్లాక్ ఫెలోగా (ABF) ఎంపికైన వారికి నెలకు 55,000 స్టైఫండ్ ఇవ్వబడుతుంది. తి ఆయోగ్ దేశవ్యాప్తంగా మొత్తం 500 ఆస్పిరేషనల్ బ్లాక్‌లను ఎంపిక చేసింది. ఇందులో 15 బ్లాక్‌లు ఆంధ్రప్రదేశ్‌ నుంచి ఎంపికయ్యాయి. ABFలు తమకు కేటాయించిన ప్రాంతంలోని స్థానిక ప్రజలకు అవగాహన కల్పించేందుకు వర్క్‌షాప్‌లు, అవగాహన సదస్సులు మరియు నైపుణ్య శిక్షణ కార్యక్రమాలను నిర్వహిస్తారు.

2. విశాఖ కు చెందిన అన్మిష్, మార్షల్ ఆర్ట్స్ లో రికార్డు సృష్టించారు 

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వారాంతపు కరెంట్ అఫైర్స్ అక్టోబర్ 2023 – 4వ వారం | డౌన్‌లోడ్ PDF_5.1

అంతర్జాతీయ వేదికపై , విశాఖకు చెందిన భూపతిరాజు అన్మిష్‌ వర్మ మరోసారి సత్తాచాటారు. ఈ మార్షల్‌ ఆర్ట్స్‌ పోటీల్లో అన్మిష్‌కు ఇది వరుసగా మూడో బంగారు పతకం కావడం విశేషం.  దీంతో ఓ అరుదైన ఘనతను అన్మిష్‌ సొంతం చేసుకున్నారు. ఈ చాంపియన్ వరుసగా మూడుసార్లు స్వర్ణ పతకాన్ని గెలిచిన క్రీడాకారుడిగా ప్రపంచ రికార్డు సృష్టించారు. కెనడా వేదికగా జరిగిన ఓల్డ్‌ మార్షల్‌ ఆర్ట్స్‌ ఛాంపియన్‌ షిప్‌లో అన్మిష్‌ వర్మ గోల్డ్‌మెడల్‌ను సాధించారు.

భారత్ తరఫున 75 కిలోల విభాగంలో అన్మిష్ బంగారు పతకం కైవసం చేసుకున్నారు. ఈ మార్షల్‌ ఆర్ట్స్‌ పోటీల్లో అన్మిష్‌కు ఇది వరుసగా మూడో బంగారు పతకం సాధించడం. దీంతో మార్షల్ ఆర్ట్స్ ఛాంపియన్ షిప్‌లో హ్యాట్రిక్ గోల్డ్ మెడల్ సాధించిన తొలి భారత అథ్లెట్‌గా అన్మిష్ రికార్డులకెక్కారు. అంతకుముందు 2018లో గ్రీస్‌ వేదికగా జరిగిన మార్షల్ ఆర్ట్స్‌లో పసిడి పతకం సొంతం చేసుకున్న అన్మిష్, 2019లో ఆస్ట్రియా లో జరిగిన ఈవెంట్‌లోనూ బంగారు పతకం సాధించారు.

AP State Weekly CA October 2023 1 and 2 Week PDF

3. APCICT డిజిటల్ లీడర్స్ కార్యక్రమంలో పాల్గొననున్న SPMVV అధ్యాపకులు

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వారాంతపు కరెంట్ అఫైర్స్ అక్టోబర్ 2023 – 4వ వారం | డౌన్‌లోడ్ PDF_6.1

అక్టోబర్ 24 నుంచి 26 వరకు కొరియాలో జరిగే వార్షిక APCICT డిజిటల్ లీడర్స్ కార్యక్రమంలో SPMVV రిజిస్ట్రార్ ప్రొఫెసర్ N రజని, ఇంటర్నేషనల్ రిలేషన్స్ డీన్ ప్రొఫెసర్ పి.విజయలక్ష్మి, SPMVV అధ్యాపకులు మరియు AP స్టేట్ కౌన్సిల్ ఆఫ్ హయ్యర్ ఎడ్యుకేషన్ (APSCHE) వైస్ చైర్పర్సన్ ప్రొఫెసర్ పి.ఉమామహేశ్వరీదేవి పాల్గొంటున్నారు.

కొరియాలో డిజిటల్ పరివర్తన ద్వారా మహిళా పారిశ్రామికవేత్తలకు సాధికారత కల్పించేందుకు ఉద్దేశించిన కార్యక్రమానికి హాజరు కావాలని వారిని ఆహ్వానించారు. ఇంచియాన్ మెట్రోపాలిటన్ సిటీ, APCICT (ఆసియా, పసిఫిక్ ట్రైనింగ్ సెంటర్ ఫర్ కమ్యూనికేషన్ టెక్నాలజీ ఫర్ ఇన్ఫర్మేషన్ అండ్ కమ్యూనికేషన్ టెక్నాలజీ) సంయుక్తంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాయి.

లక్ష్యం : డిజిటల్ లీడర్స్ ప్రోగ్రామ్ యొక్క ప్రధాన లక్ష్యం డిజిటల్ లీడర్స్ మరియు ఛాంపియన్‌ల నెట్‌వర్క్‌ను బలోపేతం చేయడం, డిజిటల్ ట్రాన్స్‌ఫర్మేషన్ మరియు ఇన్నోవేషన్ ద్వారా మహిళా పారిశ్రామికవేత్తలకు సాధికారత కల్పించే పనికి మద్దతు ఇవ్వడం.

4. ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం రెండు కొత్త లెదర్ పార్క్ లను ఆమోదించింది

ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం రెండు కొత్త లెదర్ పార్క్ లను ఆమోదించింది

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్రం లో కొత్తగా రెండు లెదర్ పార్కులను ఏర్పాటు చేసేందుకు LIDCAP కసరత్తు చేస్తోంది. కృష్ణ జిల్లా మరియు ప్రకాశం జిల్లాలలో ఈ లెదర్ పార్కు లను ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వం తరపునుంచి రూ.12 కోట్లు కూడా మంజూరు అయ్యాయి. ఇప్పటికె కృష్ణ, గుంటూరు, తిరుపతి కర్నూల్, అనంతపురం, పార్వతీపురం మన్యం, శ్రీకాకుళంలో ఉన్న లెదర్ పార్కులకు ఈ రెండు లెదర్ పార్కు కలిపి మొత్తం 9 లెదర్ పార్కులు  రాష్ట్రంలో పనిచేయనున్నాయి. లెదర్ పార్కులను అభివృద్ది చేయడమే కాకుండా తగిన శిక్షణ కోసం శిక్షణా కేంద్రాలు కూడా ప్రారంభించనున్నారు. ప్రకాశం జిల్లా లోని యడవల్లి గ్రామం, కృష్ణ జిల్లా లోని జి. కోడూరు గ్రామాలలో ఈ లెదర్ పార్కులు ఏర్పాటు చేయనున్నారు.

AP State Weekly CA 3rd week October 2023-Telugu

5. విశాఖపట్నంలో ‘ఇంటర్నేషనల్ పీఆర్ ఫెస్టివల్ 2023’ పోస్టర్‌ను మిజోరం గవర్నర్ కే హరిబాబు విడుదల చేశారు

Mizoram Governor K Haribabu released the ‘International PR Festival 2023’ poster in Visakhapatnam-01

పబ్లిక్ రిలేషన్స్ సొసైటీ ఆఫ్ ఇండియా (PRSI) జాతీయ ప్రధాన కార్యదర్శి పీఎల్కే మూర్తి, మరియు ఇతర సభ్యుల సమక్షంలో ‘ఇంటర్నేషనల్ నేషనల్ పీఆర్ ఫెస్టివల్ 2023’ పోస్టర్ ఆవిష్కరణ జరిగింది. విశాఖపట్నం లోని మిజోరం గవర్నర్ కే హరిబాబుగారి నివాసంలో ఇంటర్నేషనల్ నేషనల్ పీఆర్ ఫెస్టివల్ 2023 పోస్టర్ ను ఆయన ఆవిష్కరించారు. ఆయన మాట్లాడుతూ ఈ సంవత్సరం థీమ్ ‘జి 20: భారతీయ విలువలు మరియు ప్రజా సంబంధాల కోసం ప్రపంచ అవకాశాలకు అభివృద్ధి చెందుతున్న భారతదేశాన్ని ప్రదర్శించడం’ ఎంతో ముఖ్యమైనది మరియు భారతదేశం యొక్క విలువలను మరియు ముఖచిత్రాన్ని ప్రపంచానికి చాటి చెబుతుంది అని, ఆ థీమ్ ఎంచుకున్నందుకు కృతజ్ఞతలు తెలియజేశారు.

6. రామాయపట్నం పోర్ట్ వద్ద పారిశ్రామిక అభివృద్ధి

రామాయపట్నం పోర్ట్ వద్ద పారిశ్రామిక అభివృద్ధి

రామాయపట్నం పోర్ట్ ని డిసెంబర్ నాటికి పూర్తి చేయనున్నారు. AP మారిటైమ్ బోర్డ్  పోర్ట్ సమీపంలో సుమారు 8000 ఎకరాల విస్తీర్ణంలో అభివృద్ది పనులు చేపట్టనుంది. పారిశ్రామిక పార్కు ఏర్పాటు కోసం భూ సమీకరణ జరుగుతోంది అని ఎండీ, సిఈఓ ప్రవీణ్ కుమార్ తెలిపారు. మొదటి దశ కింద 4,850 ఎకరాలలో పారిశ్రామిక పార్కు నెల్లూరు జిల్లాలో చేవూరులో 1312.58 ఎకరాలు మరియు రావూరు లో 951.77 ఎకరాలు సేకరించనున్నారు. ఇప్పటికే రామాయపట్నం తొలిదశ పనులు 2,634.65 కోట్లతో నవయుగ-అరబిందో భాగస్వామ్య కంపెనీ జూన్ 2022లో చేపట్టింది. ఈ పనుల వలన సంవత్సరానికి దాదాపుగా 34 మిలియన్ టన్నుల సామర్ధ్యం ఉంటుంది. ఈ పనులలో బల్క్ కార్గో బర్త్ను AP మారిటైమ్ బోర్డ్ కు అందించనుంది. రామాయపట్నం పోర్టు పక్కన కార్గో ఆధారిత ఎయిర్ పోర్ట్ నిర్మాణం పై దృష్టి పెట్టింది.

7. ఆసియా షూటింగ్ ఛాంపియన్‌షిప్‌లో మద్దినేని ఉమ మహేష్ జట్టు రజతం సాధించింది

Maddineni Uma Mahesh Team Clinched Silver Asian Shooting Championship
సౌత్ కొరియా లో చాంగ్‌వాన్ నగరం లో జరుగుతున్న 15వ ఆసియా షూటింగ్ చాంపియన్షిప్ పోటీలలో 10 మీటర్ల ఎయిర్ రైఫెల్ జూనియర్ మిక్స్డ్ విభాగంలో భారతదేశం తరపున పాల్గొన్న క్రీడా కారులు రజతం సాధించారు. ఆంధ్రప్రదేశ్ కు చెందిన ఉమామహేష్ మద్దినేని మరియు మధ్యప్రదేశ్ కి చెందిన భావనా తో కలిసి రజత పతాకం సాధించారు. జూనియర్ పురుషుల విభాగం లో ముగ్గురిలో ఒకరైన ధనుష్ శ్రీకాంత్‌ను పోటీకి అనర్హులుగా ప్రకటించడం తో ఆ విభాగం లో బంగారు పతకం సాధించే అవకాశం కోల్పోయింది. పతకం సాధించడం భారతదేశానికి ఎంతో గర్వకారణమని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రైఫెల్ అధ్యక్షులు షా.లలిత్ తెలిపారు.

Kautilya Current Affairs Special Live Batch by Ramesh Sir | Online Live Classes by Adda 247

 మరింత చదవండి
తాజా ఉద్యోగ ప్రకటనలు ఇక్కడ క్లిక్ చేయండి
ఉచిత స్టడీ మెటీరియల్ (APPSC, TSPSC) ఇక్కడ క్లిక్ చేయండి
ఉచిత మాక్ టెస్టులు ఇక్కడ క్లిక్ చేయండి
Adda247 తెలుగు APP ఇక్కడ క్లిక్ చేయండి

Sharing is caring!