Telugu govt jobs   »   Weekly Current Affairs in Telugu   »   ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వారాంతపు కరెంట్ అఫైర్స్

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వారాంతపు కరెంట్ అఫైర్స్ అక్టోబర్ 2023 – 1వ మరియు 2వ వారం | డౌన్‌లోడ్ PDF

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వారాంతపు కరెంట్ అఫైర్స్ అక్టోబర్ 2023 – 1వ మరియు 2వ వారం | డౌన్‌లోడ్ PDF

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వారాంతపు కరెంట్ అఫైర్స్: APPSC గ్రూప్స్ , SI మరియు కానిస్టేబుల్ పరీక్షలలో కరెంట్ అఫైర్స్ చాలా ముఖ్యమైన విభాగాలలో ఒకటి మరియు మీరు మీ సమయాన్ని హృదయపూర్వకంగా కేటాయించినట్లయితే ఈ అంశం నుండి చాలా మంచి మార్కులు సాధించగలరు. పరీక్షల  ముందు అప్పటికప్పుడు  ఈ అంశాన్ని చదువుకొని వెళ్ళడం ద్వారా ఎక్కువ మార్కులు సాధించడం అసాధ్యం.  కరెంట్ అఫైర్స్ మీరు 10-15 రోజుల్లో పూర్తి  చేయగల విభాగం కాదు. మీరు కరెంట్ అఫైర్స్ పై పట్టు సాధించడానికి  ఉత్తమ మార్గం రోజూ వార్తాపత్రికలను చదవడం లేదా వారపు వార్తల ద్వారా వెళ్ళడం.

దీని ద్వారా  నెలవారీ లేదా 6 నెలల వార్తల ద్వారా తెలుసుకొనే సమాచారం కంటే ఎక్కువ సమాచారం తెలుసుకోవచ్చు. ఇక్కడ మేము మీకు అన్ని వార్తాపత్రికల నుండి సమకాలీన అంశాల సారాంశాన్ని మరియు ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కరెంట్ అఫైర్స్ ను ఇక్కడ అందిస్తున్నాము, ఇది మీ సమయాన్ని ఆదా చేస్తుంది మరియు మీరు ఆ సమయాన్ని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వారాంతపు సమకాలీన అంశాలు 2023 అధ్యయనం కోసం కేటాయించవచ్చు.

Adda247 Telugu

APPSC/TSPSC Sure shot Selection Group

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వారాంతపు కరెంట్ అఫైర్స్

1. పీఏసీ చైర్మన్‌గా పయ్యావుల కేశవ్‌ నియమితులయ్యారు

Payyuvula Keshav has been Appointed as PAC Chairman

ఆంధ్రప్రదేశ్ ప్రజా పద్దుల కమిటీ చైర్మన్‌గా పయ్యావుల కేశవ్‌ మరోసారి నియమితులయ్యారని అసెంబ్లీ సెక్రటరీ జనరల్ పీపీకే రామాచార్యులు ప్రకటించారు. పయ్యావుల కేశవ్‌ గారు  పీఏసీ చైర్మన్ పదవితోపాటు 2023-24 ఆర్థిక సంవత్సరానికిగాను నియమించిన అసెంబ్లీలో ఆర్థిక కమిటీల వివరాలను వెల్లడించారు.అలాగే ప్రభుత్వ రంగ సంస్థల కమిటీ (పీయూసీ)చైర్మన్‌గా వైసీపీ ఎమ్మెల్యే గ్రంధి శ్రీనివాస్‌, ఎస్టిమేట్‌ (అంచనాల) కమిటీ చైర్మన్‌గా విశ్వాసరాయి కళావతిలను నియమించారు.

2. గుంటూరు జిల్లా నవులూరులోని అంతర్జాతీయ క్రికెట్ స్టేడియం మ్యాచ్‌లకు సిద్ధమైంది

గుంటూరు జిల్లా నవులూరులోని అంతర్జాతీయ క్రికెట్ స్టేడియం మ్యాచ్_లకు సిద్ధమైంది

గుంటూరు జిల్లా నవులూరు అమరావతి టౌన్‌షిప్‌లోని అంతర్జాతీయ క్రికెట్ స్టేడియం మ్యాచ్‌లకు సిద్ధమైంది. మూడేళ్ల కిందటే నిర్మాణం పూర్తయినా నిధుల కొరత కారణంగా చివరి దశ పనులు నిలిచిపోయాయి. ప్రస్తుతం బీసీసీఐ నుంచి నిధులు విడుదల అయ్యాయి. తొలి విడతగా రూ.15 కోట్లు విడుదల కావడంతో స్టేడియంలో ఫ్లడ్ లైట్లు ఏర్పాటు చేయనున్నారు. త్వరలో అంతర్జాతీయ క్రికెట్ మ్యాచ్ నిర్వహించేందుకు ఆంధ్రా క్రికెట్ అసోసియేషన్ చర్యలు తీసుకుంటోంది.

ఆంధ్రా క్రికెట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో మూడు ట్రోఫీలు నిర్వహించేందుకు బీసీసీఐ అనుమతి ఇవ్వడంతో పాటు మ్యాచ్‌ల నిర్వహణకు అన్ని రకాల సౌకర్యాలు కల్పించారు. పురుషుల అండర్-19 వినూ మన్కడ్ ట్రోఫీ అక్టోబర్ 12 నుంచి జరగనుంది. ఈ క్రికెట్ స్టేడియంలో 15 మ్యాచ్‌లు జరగనున్నాయి. హైదరాబాద్, ఢిల్లీ, మహారాష్ట్ర, బెంగాల్, ఉత్తరాఖండ్, మేఘాలయ జట్లు పోటీపడనున్నాయి. అలాగే డిసెంబర్‌లో విజయ్ మర్చంట్ ట్రోఫీని నిర్వహించనున్నారు.

3. రాజమహేంద్రవరంలో జనవరి 5 నుంచి 7 వరకు ప్రపంచ తెలుగు మహాసభలు జరగనున్నాయి

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వారాంతపు కరెంట్ అఫైర్స్ అక్టోబర్ 2023 – 1వ మరియు 2వ వారం | డౌన్‌లోడ్ PDF_6.1

ఆంధ్ర సారస్వత పరిషత్, చైతన్య విద్యా సంస్థల సంయుక్త ఆధ్వర్యంలో జనవరి 5, 6, 7 తేదీల్లో 2వ అంతర్జాతీయ తెలుగు మహా సభలు మూడు రోజుల పాటు జరగనున్నాయి. రాజమహేంద్రవరంలోని గోదావరి ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ (జీఐఈటీ) ప్రాంగణంలో భారీ ఎత్తున తెలుగుతల్లి పండుగలా నిర్వహించనున్న ఈ కార్యక్రమానికి 70 దేశాల నుంచి ప్రతినిధులు హాజరు కానున్నారు.

రాజరాజ నరేంద్రుడు అవతరించి, రాజమహేంద్రవరం నగరాన్ని స్థాపించి వెయ్యేళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా నగరంలో ప్రపంచ తెలుగు మహాసభలు నిర్వహిస్తున్నట్లు ఆంధ్ర సారస్వత పరిషత్ అధ్యక్షులు డాక్టర్ గజల్ శ్రీనివాస్, గౌరవాధ్యక్షులు కెవివి సత్యనారాయణ రాజు, కార్యదర్శి తెలిపారు.

4. ఆంధ్రప్రదేశ్ హైకోర్టుకు నలుగురు కొత్త న్యాయమూర్తులను సుప్రీంకోర్టు కొలీజియం నామినేట్ చేసింది

ap High court

ఆంధ్రప్రదేశ్ హైకోర్టుకు నలుగురు కొత్త న్యాయమూర్తులను సుప్రీంకోర్టు కొలీజియం నామినేట్ చేసింది. న్యాయవాదుల కోటాలో నలుగురు సీనియర్‌ న్యాయవాదులు హరినాథ్‌, కిరణ్‌మయి, సుమిత్‌, విజయ్‌లను కొత్త న్యాయమూర్తులుగా సిఫారసు చేసింది.  హరినాథ్ ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో డిప్యూటీ సొలిసిటర్ జనరల్ (DSG)గా పనిచేస్తున్నారు, కిరణ్మయి 2016 నుండి ఆదాయపు పన్ను (IT) విభాగానికి సీనియర్ స్టాండింగ్ కౌన్సెల్‌గా పని చేస్తున్నారు. సుమతి ప్రభుత్వ ప్లీడర్‌గా పని చేస్తున్నారు, విజయ్‌కి సుమారు 25 సంవత్సరాలు అనుభవం మరియు సివిల్, క్రిమినల్, రెవెన్యూ, సర్వీసెస్, టాక్స్ మరియు పర్యావరణ విషయాలతో సహా అన్ని రకాల కేసులను వాదించారు. నలుగురి నియామకం తర్వాత మంజూరైన 37 మంది న్యాయమూర్తుల సంఖ్యతో పోలిస్తే ఆంధ్రప్రదేశ్ హైకోర్టు సంఖ్య 31కి చేరుకుంది

5. ఆంధ్రప్రదేశ్ లో దేశంలోనే అతిపెద్ద ప్రైవేటు బంగారు గని పూర్తి స్థాయి ఉత్పత్తి ప్రారంభం కానుంది.

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వారాంతపు కరెంట్ అఫైర్స్ అక్టోబర్ 2023 – 1వ మరియు 2వ వారం | డౌన్‌లోడ్ PDF_8.1

ఆంధ్రప్రదేశ్‌లో దేశంలోనే మొట్టమొదటి అతిపెద్ద ప్రైవేట్ బంగారు గని పూర్తి స్థాయి ఉత్పత్తి వచ్చే ఏడాది అక్టోబరు-నవంబర్ నాటికి ప్రారంభమవుతుందని డెక్కన్ గోల్డ్ మైన్స్ లిమిటెడ్ మేనేజింగ్ డైరెక్టర్ హనుమ ప్రసాద్ తెలిపారు. ఇప్పటికే పైలట్ స్కేల్ ఆపరేషన్ ప్రారంభించిన జొన్నగిరి గోల్డ్ ప్రాజెక్ట్ పూర్తి స్థాయి ఉత్పత్తిని ప్రారంభించిన తర్వాత ఏడాదికి 750 కిలోల బంగారాన్ని ఉత్పత్తి చేస్తుందని తెలిపారు. ఆంధ్రప్రదేశ్‌లోని కర్నూలు జిల్లా తుగ్గలి మండలం జొన్నగిరి, ఎర్రగుడి, పగిడిరాయి గ్రామాల సమీపంలో బంగారు గని ఉంది.DGML అన్వేషణ మరియు మైనింగ్ రంగంలో లోతైన మూలాలు కలిగిన ప్రమోటర్లచే 2003లో స్థాపించబడింది. DGML చాలా కాలంగా భారతదేశం మరియు విదేశాలలో బంగారు అన్వేషణ కార్యకలాపాలలో పాల్గొంటోంది.

6. రైతుల అభివృద్ధి కోసం ఏపీ ఫుడ్ ప్రాసెసింగ్ సొసైటీ MoUలు కుదుర్చుకుంది

రైతుల అభివృద్ధి కోసం ఏపీ ఫుడ్ ప్రాసెసింగ్ సొసైటీ MoUలు కుదుర్చుకుంది

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఫుడ్ ప్రొసెసింగ్ సొసైటి రైతులకు లబ్ధి చేకూరచేలా మరియు వారి ఆదాయాన్ని పెంచి వారి అభివృద్ధి కోసం వివిధ సంస్థలతో మౌలిక అవగాహన ఒప్పందాలుMoU చేసుకుంది. ఈ ఒప్పందం ఆంధ్ర ప్రగతి గ్రామీణ బ్యాంక్ (APGB), రహేజా సోలార్ ఫుడ్ ప్రొసెసింగ్ ప్రైవేట్ లిమిటెడ్ (RSFPL) మరియు దామోదరం సంజీవయ్య జాతీయ న్యాయ విశ్వవిధ్యాలయం తో ఆంధ్రప్రదేశ్ ఫుడ్ ప్రొసెసింగ్ సొసైటి అవగాహన ఒప్పందం కుదుర్చుకుంది. కంపెనీ CEO శ్రీధర్ రెడ్డి గాఋ ఒప్పంద పాత్రల మీద సంతకాలు చేసి మార్చుకున్నారు.

7. ప్రకాశం బ్యారేజ్ కి అంతర్జాతీయ గుర్తింపు లభించింది

ప్రకాశం బ్యారేజ్ కి అంతర్జాతీయ గుర్తింపు లభించింది

నవంబర్ 2 నుండి 8 వరకు విశాఖపట్నంలో జరిగిన అంతర్జాతీయ ICID కాంగ్రెస్‌ 25వ సదస్సు లో ప్రకాశం బ్యారేజీ కి ప్రతిష్టాత్మక WHIS అవార్డు దక్కింది. ఈ అవార్డు విషయం ఇండియన్ నేషనల్ కమిటీ ఆన్ ఇరిగేషన్ అండ్ డ్రైనేజీ (IN CID) డైరెక్టర్ అవంతి వర్మ శుక్రవారం రాష్ట్ర జలవనరుల శాఖ ముఖ్య కార్యదర్శికి తెలిపారు. ప్రకాశం బ్యారేజి కి వందేళ్లకు పైగా చరిత్ర ఉంది, అంతటి ఈ చారిత్రక కట్టడానికి అంతర్జాతీయ నీటిపారుదల, డ్రైనేజీ కమిషన్ (ICID) వరల్డ్ హెరిటేజ్ ఇరిగేషన్ స్ట్రక్చర్ (WHIS)గా ప్రకటించడం ఎంతో గర్వకారణం. 2023 సంవత్సరానికి ICID గుర్తించిన ప్రపంచవ్యాప్తంగా 19 నిర్మాణాలకు ఈ అవార్డు అందించింది అందులో ప్రకాశం బ్యారేజీ దీనినే పాత కృష్ణా ఆనకట్ట అని కూడా అంటారు నిలిచింది.

8. పొట్టి శ్రీరాములు కళాశాలకు ఎడ్యు ఎక్సలెన్స్ అవార్డు

పొట్టి శ్రీరాములు కళాశాలకు ఎడ్యు ఎక్సలెన్స్ అవార్డు

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉన్నత విద్యామండలి మంగళవారం నాడు విజయవాడలో నిర్వహించిన రసస్వద-ది అప్రిసియేషన్ 2023 కార్యక్రమంలో పొట్టి శ్రీరాములు చలవాడి మల్లికార్జునరావు కాలేజ్ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ (అటానమస్) కళాశాల NAAC A++ సాధించినందుకు రసవాడలో ఎడ్యుకేషన్ ఎక్సలెన్స్-2023 అవార్డు అందించింది. ఈ అవార్డు కళాశాలలో ఉన్నత ప్రమాణాలను తెలియజేస్తుంది అలాగే కళాశాల న్యాక్ గణాంకాలలో అత్యున్నత గ్రేడ్ సాధించినందుకు ప్రొఫెసర్ జె.లక్ష్మీనారాయణ హర్షం వ్యక్తం చేశారు. విధ్యయశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ ప్రిన్సిపల్ ప్రొఫెసర్ జె.లక్ష్మీనారాయణకు, కళాశాల కార్యదర్శి పడుచూరి లక్ష్మణస్వామి కి అవార్డుని ప్రధానం చేశారు. ఈ కార్యక్రమానికి ఇతర ఉన్నతాధికారులు ప్రముఖులు హాజరయ్యారు.

9. ఏపీలో తొలి ఎలక్ట్రిక్ డబుల్ డెక్కర్ బస్సు తిరుపతిలో ప్రారంభించారు

ఏపీలో తొలి ఎలక్ట్రిక్ డబుల్ డెక్కర్ బస్సు తిరుపతిలో ప్రారంభించారు

ఆంధ్రప్రదేశ్, తిరుపతిలో ప్రత్యేకంగా రూ.2 కోట్ల విలువైన ఈవీ డబుల్ డెక్కర్ బస్సులను ప్రారంభించారు. గత నెలలో ప్రారంభించిన ట్రయల్ రన్ విజయవంతమైంది అందులో భాగంగా టెంపుల్ సిటీ అయిన తిరుపతిలో తొలిసారిగా ఎయిర్ కండిషన్డ్ ఎలక్ట్రిక్ డబుల్ డెక్కర్ బస్సులను నడపనున్నారు.  హైదరాబాద్ తర్వాత దక్షిణ భారతదేశంలో తిరుపతి లోనే ఈ విద్యుత్ తో నడిచే డబల్ డెక్కర్ బస్లను వినియోగంలోకి తీసుకుని వచ్చారు. ఈ పర్యావరణ అనుకూల ప్రయాణ సౌకర్యాన్ని ప్రజలకోసం ప్రారంభించారు. అశోక్ లేలాండ్ కు చెందిన ఎలక్ట్రిక్ బస్ ను కేంద్ర ప్రభుత్వ స్మార్ట్ సిటీ ప్రాజెక్టులో భాగంగా ఈ బస్ లను ప్రారంభించారు. వీటిని తిరుపతి స్మార్ట్ సిటీ కార్పొరేషన్ లిమిటెడ్ ఆధ్వర్యంలో EV బస్సులను నగరపాలక సంస్థ కొనుగోలు చేసింది.

10. ఏపీ జస్టిస్ లక్ష్మారెడ్డి 9141 కేసులను డీల్ చేసి గొప్ప రికార్డు సృష్టించారు

ఏపీ జస్టిస్ లక్ష్మారెడ్డి 9141 కేసులు విచారించి గొప్ప రికార్డు సృష్టించారు

ఆంధ్రప్రదేశ్ కుర్నూల్ లోకాయుక్త న్యాయమూర్తిగా 2019 లో బాధ్యతలు చేపట్టిన జస్టిస్ లక్ష్మారెడ్డి కేవలం నాలుగేళ్లలో లోకాయుక్తకు అందిన 9,141 ఫిర్యాదులపై విచారణ జరిపి తీర్పులు వెలువరించి రికార్డు సృష్టించారు. మరియు ఆయన నియామకం తో పాటు ప్రభుత్వం జాప్యం కారణంగా డిప్యూటీ లోకాయుక్త బాధ్యతలను కూడా తానే స్వయంగా చేపట్టారు. దేశం లోని ఏ లోకాయుక్త కూడా ఇన్ని తీర్పులు వెలువరించలేదు కావున ఆ ఘనత జస్టిస్ లక్ష్మారెడ్డి గారికే చెందుతుంది.

11. విశాఖపట్నంలో కాశ్మీరీ యూత్ ఫెస్టివల్

విశాఖపట్నంలో కాశ్మీరీ యూత్ ఫెస్టివల్

విశాఖపట్నం లోనే మొట్టమొదటి సారిగా నిర్వహించబడుతున్న కాశ్మీరీ యూత్ ఫెస్టివల్ కి సంభందించిన ఏర్పాట్ల గురించి నెహ్రూ యువకేంద్రం అధికారులు జి. మహేశ్వర మరియు అల్లం రాంప్రసాద్, తెలిపారు. ఈ ఉత్సవానికి విచ్చేసే 120 సందర్శకులకు మన సంప్రదాయం, ఆహారపు అలవాట్లు, పద్దతులు మరియు సంస్కృతి తో పాటు కేంద్ర పథకాల గురించి  పూర్తిగా తెలియజేస్తారు. ఐదు రోజుల పాటు జరిగే ఈ కాశ్మీరీ యూత్ ఫెస్టివల్ అక్టోబర్ 2 నుంచి 7 వరకూ నిర్వహిస్తారు. దీనికి శ్రీనగర్ కి చెందిన 6 జిల్లాల నుంచి మొత్తం 120 మంది విశాఖపట్నం జిల్లా మరియు పరిసర ప్రముఖ ప్రాంతాలు సందర్శించి, నైపుణ్యం గురించి శిక్షణా తరగతులకు హాజరవుతారు.

AP State Weekly CA October 2023 1 and 2 Week PDF

APCOB Staff Assistant 2023 Telugu Batch | Online Live Classes by Adda 247

 మరింత చదవండి
తాజా ఉద్యోగ ప్రకటనలు ఇక్కడ క్లిక్ చేయండి
ఉచిత స్టడీ మెటీరియల్ (APPSC, TSPSC) ఇక్కడ క్లిక్ చేయండి
ఉచిత మాక్ టెస్టులు ఇక్కడ క్లిక్ చేయండి
Adda247 తెలుగు APP ఇక్కడ క్లిక్ చేయండి

Sharing is caring!