Telugu govt jobs   »   Current Affairs   »   ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వారాంతపు కరెంట్ అఫైర్స్‌

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వారాంతపు కరెంట్ అఫైర్స్ నవంబర్ 2023 – 4వ వారం | డౌన్‌లోడ్ PDF

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వారాంతపు కరెంట్ అఫైర్స్ నవంబర్ 2023 – 4వ వారం | డౌన్‌లోడ్ PDF

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వారాంతపు కరెంట్ అఫైర్స్: APPSC గ్రూప్స్ , SI మరియు కానిస్టేబుల్ పరీక్షలలో కరెంట్ అఫైర్స్ చాలా ముఖ్యమైన విభాగాలలో ఒకటి మరియు మీరు మీ సమయాన్ని హృదయపూర్వకంగా కేటాయించినట్లయితే ఈ అంశం నుండి చాలా మంచి మార్కులు సాధించగలరు. పరీక్షల  ముందు అప్పటికప్పుడు  ఈ అంశాన్ని చదువుకొని వెళ్ళడం ద్వారా ఎక్కువ మార్కులు సాధించడం అసాధ్యం.  కరెంట్ అఫైర్స్ మీరు 10-15 రోజుల్లో పూర్తి  చేయగల విభాగం కాదు. మీరు కరెంట్ అఫైర్స్ పై పట్టు సాధించడానికి  ఉత్తమ మార్గం రోజూ వార్తాపత్రికలను చదవడం లేదా వారపు వార్తల ద్వారా వెళ్ళడం.

దీని ద్వారా  నెలవారీ లేదా 6 నెలల వార్తల ద్వారా తెలుసుకొనే సమాచారం కంటే ఎక్కువ సమాచారం తెలుసుకోవచ్చు. ఇక్కడ మేము మీకు అన్ని వార్తాపత్రికల నుండి సమకాలీన అంశాల సారాంశాన్ని మరియు ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కరెంట్ అఫైర్స్ ను ఇక్కడ అందిస్తున్నాము, ఇది మీ సమయాన్ని ఆదా చేస్తుంది మరియు మీరు ఆ సమయాన్ని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వారాంతపు సమకాలీన అంశాలు 2023 అధ్యయనం కోసం కేటాయించవచ్చు.

Adda247 Telugu

APPSC/TSPSC Sure shot Selection Group

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వారాంతపు కరెంట్ అఫైర్స్

1. హెల్త్ అండ్ వెల్‌నెస్ సెంటర్లలో ఏపీ రెండో స్థానంలో నిలిచింది

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వారాంతపు కరెంట్ అఫైర్స్ నవంబర్ 2023 – 4వ వారం | డౌన్‌లోడ్ PDF_4.1

గ్రామీణ, పట్టణ ప్రాంతాలలో వైద్యసేవలను మరింత చేరువ చేయడం కోసం ప్రభుత్వం చేస్తున్న కృషికి  జాతీయ స్థాయిలో రాష్ట్రా నికి ప్రత్యేక గుర్తింపు తీసుకువస్తోంది. హెల్త్ అండ్ వెల్నెస్ సెంటర్లలోనూ దేశంలో ఆంధ్ర ప్రదేశ్ రెండోస్థానంలో నిలిచింది. రాష్ట్రంలోని అన్ని కేంద్రాల్లోనూ ప్రజలకు వైద్యసేవలు అందిస్తున్నారు. దేశంలోని అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాం తాల్లోమొత్తంగా 1,60,480 హెల్త్ అండ్ వెల్‌నెస్ సెంటర్లు పని చేస్తున్నట్టు ఆరోగ్య, కుటుంబ మంత్రిత్వ శాఖ తెలిపింది. ఉత్తరప్రదేశ్లో 21,891 ఆరోగ్య కేంద్రాలు, ఆంధ్రప్రదేశ్ లో 11,855 కేంద్రాలు పని చేస్తున్నాయి. ఏపీ తర్వాత వరుసగా మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, పశ్చిమ బెంగాల్, బిహార్ రాష్ట్రాలలో ఎక్కువ హెల్త్ అండ్ వెల్‌నెస్ సెంటర్లు ఉన్నట్లు తెలిపారు.

Andhra Pradesh State Weekly CA November 2023 1st Week

2. డైకిన్ 3వ ఏసీ తయారీ యూనిట్ ఆంధ్రప్రదేశ్ శ్రీసిటీలో  ప్రారంభించబడింది

Daikin's 3rd AC Manufacturing unit is setup in Sricity, Andhra Pradesh

జపాన్ కు చెందిన డైకిన్ సంస్థ ఆంధ్రప్రదేశ్ లో ఏసి లు తయారుచేసే కర్మాగారం శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా, శ్రీ సిటీ లో ఈ నెల 23న అధికారికంగా ప్రారంభించనున్నారు. కేయవలం 18 నెలల్లో తయారీ యూనిట్ను ఏర్పాటు చేశారు దీని ద్వారా సుమారు 3000 మందికి ఉపాధి లభిస్తుంది. సుమారు రూ.1000 కోట్లతో 75.5 ఎకరాలలో ఈ పరిశ్రమ యూనిట్ ను స్థాపించారు. APSSDCL తో ఒప్పందం కుదుర్చుకుని 2020-21లో డిప్లొమా పూర్తిచేసిన విధ్యార్ధులకు శిక్షణ ఇచ్చి ఉపాధి కల్పించారు వారికి సుమారు రూ.2లక్షల వరకు వార్షిక వేతనం అందించనున్నారు. శ్రీసిటీ లో ఏర్పాటు చేసిన ఈ యూనిట్ భారతదేశంలోనే 3 యూనిట్ మొదటి రెండు జైపూర్, నీమ్రాణా రాజస్థాన్ లో ఏర్పాటు చేశారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే రూ. 3755 కోట్లు ఏసిల తయారీ రంగంలో బ్లూస్టార్, లాయిడ్, పానాసోనిక్ వంటి ప్రముఖ కంపెనీలు పెట్టుబడులు పెట్టాయి వీటిద్వారా ఏసి తయారీ హబ్ గా ఆంధ్రరాష్ట్రం నిలవనుంది.

3. ఓపెన్ హౌస్ ప్రాజెక్టు కోసం శ్రీసిటీ లో 400 కోట్లు పెట్టుబడి పెట్టిన THK ఇండియా

THK India Invested Rs.400 Cr in Sri City for Open House Project

జపాన్ కు చెందిన THK సంస్థ ఆంధ్రప్రదేశ్ శ్రీసిటీ లో ఏర్పాటైన THK ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ లో నవంబర్ 20వ తేదీన ఓపెన్ హౌస్ కార్యక్రమాన్ని నిర్వహించింది. రూ.600 కోట్ల పెట్టుబడితో ఈ పరిశ్రమ యూనిట్ స్థాపించారు తద్వారా 400 మందికి ఉపాధి లభించనుంది అని పేర్కొన్నారు. ఈ ఉత్పత్తి యూనిట్ దేశంలోనే ప్రధమంగా శ్రీసిటీ లో ప్రారంభించారు. ప్రెసిషన్ ఇంజనీరింగ్ లో ఈ పరిశ్రమ ఆంధ్రప్రదేశ్ లో నెలకొల్పారు. ఈ కార్యక్రమానికి THK కంపెనీ CEO అకిహిరో తెరామాచి, కాన్సుల్ జనరల్ మసయుకి టాగా, మరియు ఇతర పరిశ్రమ ప్రముఖులు హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ పరిశ్రమల శాఖా కమిషనర్ రాజేశ్వర్ రెడ్డి, శ్రీసిటీ MD రవీంద్ర కూడా పాల్గొన్నారు.

AP State Weekly CA November 2023 2nd Week PDF

4. ఆడుదాం ఆంధ్రా రాష్ట్ర స్థాయి క్రీడా పోటీలు జనవరిలో జరగనున్నాయి

Aadudam Andhra State Sports Fest will be held in January 

రాష్ట్ర ప్రభుత్వం “ఆడుదాం ఆంధ్ర” పేరుతో రాష్ట్రంలో విధ్యార్ధులలో క్రీడలపై మక్కువ పెంచడానికి సరికొత్తగా రాష్ట్ర స్థాయి పోటీలు నిర్వహించనుంది. దానికోసం ఈ నెల 27 నుంచి రాష్ట్రం లో ఉన్న గ్రామ/వార్డు సచివాలయాలలో రిజిస్ట్రేషన్ ప్రక్రియ ప్రారంభించనున్నారు. క్రీడలపై ఆసక్తి ఉన్న విద్యార్ధుల వివరాలను తీసుకొనున్నారు, వీటి కోసం ప్రత్యేక యాప్ ను రూపొందించారు. డిసెంబర్ 15 నుంచి జనవరి 26 వరకు ఐదు క్రీడా విభాగాలలో 2.99 లక్షల మ్యాచ్ లను నిర్వహించనున్నారు. క్రికెట్, కబడ్డీ, వాలీబాల్, ఖోఖో, యోగా వంటి వివిధ పోటీలు పెట్టనున్నారు. 15 సంవత్సరాలు పైబడిన బాల బాలికలను యాప్ లేదా వెబ్సైట్ లో రిజిస్టర్  చేయనున్నారు దీనికోసం 1.50 లక్షల వాలంటీర్లకు శిక్షణ కూడా ఇవ్వనున్నారు. దాదాపు 35 లక్షల మంది క్రీడాకారులు ఈ పోటీలలో పాల్గొంటారు అని అంచనా. పిల్లల్లో, క్రీడాకారులలో క్రీడలవైపు ప్రోత్సహించడానికి ఈ పోటీలు ఎంతో ఉపయోగపడతాయి.

5. 39వ ఆల్ ఇండియా పోస్టల్ టేబుల్ టెన్నిస్ టోర్నమెంట్ విజయవాడలో జరగనుంది

The 39th All India Postal Table Tennis tournament will be held in Vijayawada

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సర్కిల్ తపాలా శాఖ ఆధ్వర్యంలో ఈ నెల 23- 26 వరకు విజయవాడ లో ఉన్న చెన్నుపాటి రామకోటయ్య ఇండోర్ స్టేడియంలో 39వ ఆలిండియా పోస్టల్ టేబుల్ టెన్నిస్ టోర్నమెంట్ పోటీలు జరగనున్నాయి. AP పోస్టల్ సర్కిల్ చీఫ్ పోస్ట్ మాస్టర్ జనరల్ కల్నల్ ఈ పోటీల వివరాలు వి.రాములు తెలిపారు. ఈ పోటీలలో క్రికెట్, కేరమ్స్, కబడ్డీ, చెస్, బ్యాడ్మింటన్,మొదలైన ఆటలు 15 విభాగాల్లో జాతీయ స్థాయిలో క్రీడలు/ సాంస్కృతిక కార్యక్రమాలను తపాలా శాఖ నిర్వహిస్తోంది. గతంలో టేబుల్ టెన్నిస్ (2017), బ్యాడ్మింటన్ ((2019) విభాగాల్లో ఆలిండియా స్పోర్ట్స్ ఈవెంట్లను నిర్వహించిన ఏపీ సర్కిల్ ప్రస్తుతం టేబుల్ టెన్నిస్ టోర్నమెంట్ ను నిర్వహిస్తోంది. ఈ పోటీలకు దేశవ్యాప్తంగా 15 రాష్ట్రాల నుంచి దాదాపు 150 మంది క్రీడాకారులు పాల్గొనున్నారు, నవంబర్ 26న ఫైనల్స్ నిర్వహిస్తారు.

6. SWC5వ ఎడిషన్ లో భారతదేశపు అత్యంత వినూత్నమైన సస్టైనబిలిటీ ప్రాజెక్ట్ ఆఫ్ ది ఇయర్‌ అవార్డుని  శ్రీ సిటీ పొందింది

SWC5th Edition awarded India's Most Innovative Sustainability Project of the Year to Sri City

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం లో తిరుపతి జిల్లా లో ఉన్న శ్రీసిటీ కి అరుదైన గుర్తింపు దక్కింది. దేశంలోనే ప్రముఖ సంస్థ బిజినెస్ వరల్డ్ ముంబై వేదికగా జరిగిన 5వ సస్టైనబూల్ వరల్డ్ కాన్క్లేవ్ (SWC)ఎడిషన్ లో శ్రీసిటీ కి సస్టైనబిలిటీ ప్రాజెక్ట్ ఆఫ్ ది ఇయర్‌ అవార్డు లభించింది. దేశం మొత్తం మీద ఉన్న అన్నీ నగరాలలోకి శ్రీసిటీ కి ఈ అవార్డు దక్కడం ఎంతో గర్వకారణం. బిజినెస్ వరల్డ్ ఛైర్మన్ అండ్ ఎడిటర్ ఇన్ చీఫ్ డా.అనురాగ్ ఈ అవార్డుని ప్రధానం చేశారు. ఈ సందర్భంగా శ్రీసిటీ లో ఉన్న సుస్థిరమైన పట్టణీకరణ అభివృద్ధి చర్యలను తెలిపారు. ఈ అవార్డు అందుకున్న శ్రీసిటీ ఎండి డా.రవీంద్ర హర్షం వ్యక్తం చేశారు. పర్యావరణ అనుకూలమైన చర్యలు చేపట్టడంలో శ్రీసిటీ కి ఈ అవార్డు నిదర్శనం అని తెలిపారు.

AP State Weekly CA November 2023 3rd Week Telugu PDF

7. YSR కళ్యాణమస్తు మరియు YSR షాదీ తోఫా కింద 80 కోట్లకు పైగా పంపిణీ చేశారు

Over 80 Crore Distributed Under YSR Kalyanamasthu and YSR Shaadi Tohfa

2023 జులై-సెప్టెంబర్ త్రైమాసికంలో పెళ్లయిన 10,511 జంటలకు వారి బ్యాంకు ఖాతాల్లో ‘వైఎస్‌ఆర్‌ కళ్యాణమస్తు’, ‘వైఎస్‌ఆర్‌ షాదీ తోఫా’ పధకాల కింద రూ.81.64 కోట్లను ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి తన క్యాంప్ కార్యాలయం లో లబ్దిదారులకి విడుదల చేశారు.

వైఎస్‌ఆర్‌ కళ్యాణమస్తు, వైఎస్‌ఆర్‌ షాదీ తోఫా ఈ రెండు పధకాల ద్వారా ఎస్సీ, ఎస్టీ, బీసీ, వికలాంగులు, భవన నిర్మాణ కార్మికుల కుటుంబాలకు చెందిన పదవ తరగతి పూర్తయిన బాలికలకు వారి వివాహం నిమిత్తం రాష్ట్ర ప్రభుత్వం ఆర్ధిక సహాయం అందిస్తోంది.  మైనారిటీ వర్గాల బాలికలు. బాల్య వివాహాలను నిరోధించేందుకు వధూవరులు పదో తరగతి ఉత్తీర్ణులై 18 ఏళ్లు, 21 ఏళ్లు పూర్తి అవ్వాలి అని కఠిన నిర్ణయం చేసింది.

ఈ పధకం ద్వారా మైనారిటీలకు లక్ష రూపాయలు, దివ్యాంగులకు 1.50 లక్ష రూపాయలు, SC మరియు STలకు లక్ష రూపాయలు, BCలకు 50వేలు, SC/ST కులాంతర వివాహాలకు 1.20 లక్షలు అందజేస్తున్నారు. 2022 నుంచి ఇప్పటివరకు నాలుగు విడతలలో 46,062 మందికి 349 కోట్లు అందించారు.

AP State Weekly CA November 2023 4th Week Telugu PDF

AP Grama Sachivalayam Chapter Wise & Subject Wise Practice Tests | Online Test Series (Telugu & English) By Adda247

 మరింత చదవండి
తాజా ఉద్యోగ ప్రకటనలు ఇక్కడ క్లిక్ చేయండి
ఉచిత స్టడీ మెటీరియల్ (APPSC, TSPSC) ఇక్కడ క్లిక్ చేయండి
ఉచిత మాక్ టెస్టులు ఇక్కడ క్లిక్ చేయండి
Adda247 తెలుగు APP ఇక్కడ క్లిక్ చేయండి

 

Sharing is caring!