Telugu govt jobs   »   Current Affairs   »   ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వారాంతపు కరెంట్ అఫైర్స్‌

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వారాంతపు కరెంట్ అఫైర్స్ ఆగస్టు 2023 – 4వ వారం | డౌన్‌లోడ్ PDF

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వారాంతపు కరెంట్ అఫైర్స్ ఆగస్టు 2023 – 4వ వారం | డౌన్‌లోడ్ PDF

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వారాంతపు కరెంట్ అఫైర్స్: APPSC గ్రూప్స్ , SI మరియు కానిస్టేబుల్ పరీక్షలలో కరెంట్ అఫైర్స్ చాలా ముఖ్యమైన విభాగాలలో ఒకటి మరియు మీరు మీ సమయాన్ని హృదయపూర్వకంగా కేటాయించినట్లయితే ఈ అంశం నుండి చాలా మంచి మార్కులు సాధించగలరు. పరీక్షల  ముందు అప్పటికప్పుడు  ఈ అంశాన్ని చదువుకొని వెళ్ళడం ద్వారా ఎక్కువ మార్కులు సాధించడం అసాధ్యం.  కరెంట్ అఫైర్స్ మీరు 10-15 రోజుల్లో పూర్తి  చేయగల విభాగం కాదు. మీరు కరెంట్ అఫైర్స్ పై పట్టు సాధించడానికి  ఉత్తమ మార్గం రోజూ వార్తాపత్రికలను చదవడం లేదా వారపు వార్తల ద్వారా వెళ్ళడం.

దీని ద్వారా  నెలవారీ లేదా 6 నెలల వార్తల ద్వారా తెలుసుకొనే సమాచారం కంటే ఎక్కువ సమాచారం తెలుసుకోవచ్చు. ఇక్కడ మేము మీకు అన్ని వార్తాపత్రికల నుండి సమకాలీన అంశాల సారాంశాన్ని మరియు ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కరెంట్ అఫైర్స్ ను ఇక్కడ అందిస్తున్నాము, ఇది మీ సమయాన్ని ఆదా చేస్తుంది మరియు మీరు ఆ సమయాన్ని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వారాంతపు సమకాలీన అంశాలు 2023 అధ్యయనం కోసం కేటాయించవచ్చు.

Adda247 Telugu

APPSC/TSPSC Sure shot Selection Group

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వారాంతపు కరెంట్ అఫైర్స్

1. చిరు ధాన్యాల ఎగుమతుల్లో ఆంధ్రప్రదేశ్ ఏడో స్థానంలో ఉంది

చిరుధాన్యాల ఎగుమతుల్లో ఆంధ్రప్రదేశ్ ఏడో స్థానంలో ఉంది

దేశంలోని చిరుధాన్యాల ఎగుమతుల్లో ఆంధ్రప్రదేశ్ 7వ స్థానంలో ఉంది. గుజరాత్‌, మహారాష్ట్ర, బీహార్‌, పశ్చిమ బెంగాల్‌, తెలంగాణ, తమిళనాడు రాష్ట్రాలు ప్రధాన ఆరు స్థానాల్లో ఉన్నాయని కేంద్ర వాణిజ్య, పరిశ్రమల మంత్రిత్వ శాఖ వెల్లడించింది. అదనంగా, చిరుధాన్యాలను ఎగుమతి చేసే మొదటి ఐదు దేశాల్లో భారత్ ఉందని కూడా పేర్కొం ది. 2022-23 ఆర్థిక సంవత్సరంలో, మొత్తం 169,049.22 మెట్రిక్ టన్నుల చిరుధాన్యాలను భారతదేశం నుండి ఐదు దేశాలకు ఎగుమతి చేయబడ్డాయి. వీటిలో, పంపిణీ ఈ క్రింది విధంగా ఉంది: యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్‌కు 17.8 శాతం, సౌదీ అరేబియాకు 13.7 శాతం, నేపాల్‌కు 7.4 శాతం, బంగ్లాదేశ్‌కు 4.9 శాతం మరియు జపాన్‌కు 4.4 శాతం ఎగుమతి చేసినట్లు కేంద్రం పేర్కొంది.

2. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఐటీ చెల్లింపుదారులు భారీగా పెరిగారు

dszxc

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో దిగువ మధ్యతరగతి మరియు మధ్యతరగతి ప్రజల ఆదాయంలో గణనీయమైన పెరుగుదల కనిపించింది. ఫలితంగా ఆదాయాన్ని వెల్లడించి ప్రభుత్వానికి పన్ను చెల్లించే ట్యాక్స్ పేయర్ల సంఖ్య కూడా గణనీయంగా పెరుగుతోంది. గత మూడు సంవత్సరాలలో, రాష్ట్రంలో పన్ను చెల్లించే వ్యక్తుల సంఖ్య 1.8 మిలియన్లు (18 లక్షలు) పెరిగింది, దేశవ్యాప్తంగా ఏ ఇతర రాష్ట్రంలోనూ ఇంతటి పెరుగుదల లేదని ఎస్బీఐ రీసెర్చ్ సంస్థ తెలియజేసింది.

దేశవ్యాప్తంగా, 2015-2020 మధ్య పన్ను చెల్లింపుదారుల మొత్తం పెరుగుదల 3.81 కోట్లు, అయితే ఈ సంఖ్య 2020-2023 మధ్య కేవలం 1 కోటికి  పడిపోయింది. ఇతర రాష్ట్రాల్లోనూ పరిస్థితి ఇలానే ఉన్నా ఆంధ్రప్రదేశ్ లో మాత్రం ఆ ఐదేళ్లలో కేవలం 5 లక్షల మందే ట్యాక్స్ పేయర్లు పెరిగినట్లు ఎస్బీఐ తెలియజేసింది. మొత్తంగా చూస్తే 2015– 2023 మధ్య రాష్ట్రంలో 23 లక్షల మంది ట్యాక్స్ పేయర్లు పెరిగారు.

ఎస్బీఐ రీసెర్చ్ రిపోర్ట్ ప్రకారం దేశంలో మధ్యతరగతి వ్యక్తుల సగటు ఆదాయం 2014లో రూ.4.4 లక్షల నుంచి 2023 నాటికి రూ.13 లక్షలకు పెరిగింది. 2047 నాటికి ఈ సంఖ్య రూ.49.7 లక్షలకు పెరుగుతుందని అంచనా. గత దశాబ్దకాలంలో రూ.5 లక్షల నుంచి రూ.10 లక్షల మధ్య ఆదాయం ఉన్న పన్ను చెల్లింపుదారుల విభాగం 8.1 శాతం పెరిగింది. అలాగే రూ.10 లక్షల ఆదాయ కేటగిరీ నుంచి రూ.20 లక్షల ఆదాయ కేటగిరీకి వెళ్లిన వారు 3.8 శాతం మంది. రూ.20 లక్షల ఆదాయం ఉన్న కేటగిరీ నుంచి రూ.50 లక్షల కేటగిరీకి 1.5 శాతం వృద్ధి చెందిందని, రూ.50 లక్షల నుంచి రూ.కోటి మధ్య ఆదాయ శ్రేణిలో 0.2 శాతం వృద్ధి, రూ.కోటి దాటిన ఆదాయ వర్గంలో 0.02 శాతం మంది పెరిగారని నివేదిక విశ్లేషించింది

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వారాంతపు కరెంట్ అఫైర్స్ ఆగస్టు 2023 – 1వ వారం

3. సింగపూర్ మ్యాథ్స్ ఒలింపియాడ్ లో రజతం సాధించిన తిరుపతి బాలుడు

సింగపూర్ మ్యాథ్స్ ఒలింపియాడ్ లో రజతం సాధించిన తిరుపతి బాలుడు

ప్రతిష్టాత్మక సింగపూర్ ఇంటర్నేషనల్ మ్యాథ్స్ ఒలింపియాడ్ ఛాలెంజ్ (SIMOC)లో తిరుపతికి చెందిన నాలుగో తరగతి విద్యార్థి రాజా అనిరుధ్ శ్రీరామ్ రజత పతకం సాధించాడు. ఈ అద్భుత విజయం అతని కుటుంబానికి, పాఠశాలకు గౌరవాన్ని తీసుకురావడమే కాకుండా యావత్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి గర్వకారణంగా నిలిచాడు.

SIMOC లో దేశానికి ప్రాతినిధ్యం వహించిన 23 మంది భారతీయులలో ఆంధ్రప్రదేశ్ కు చెందిన రాజా అనిరుధ్ ఒక్కరే పాల్గొన్నారు. 32 దేశాలకు చెందిన 2000 మందికి పైగా విద్యార్థులు పాల్గొన్న ఈ కార్యక్రమంలో యువ గణిత మేధావులు తమ నైపుణ్యాలను, పరిజ్ఞానాన్ని ప్రదర్శించడానికి ఒక వేదికగా నిలిచింది.

4. ఏపీలో సోలార్ డీహైడ్రేషన్ యూనిట్లు ఏర్పాటు చేయనున్నారు

4yrtfhg

రాష్ట్రవ్యాప్తంగా సోలార్ డీహైడ్రేషన్ యూనిట్ల ఏర్పాటుకు సంబంధించిన ప్రణాళికలను ఏపీ ఫుడ్ ప్రాసెసింగ్ సొసైటీ (APSFPS) CEO ఎల్.శ్రీధర్ రెడ్డి వెల్లడించారు. పొదుపు సంఘాలతో సంబంధం ఉన్న మహిళలకు స్వయం ఉపాధి అవకాశాలను సృష్టించడంతోపాటు ఉల్లి, టమోటా రైతులకు ఏడాది పొడవునా సరసమైన ధరలను అందించడం దిని  ప్రాథమిక లక్ష్యం. కర్నూలు జిల్లాలో 100 యూనిట్లతో ప్రారంభమైన పైలెట్ ప్రాజెక్ట్ విజయవంతం కావడాన్ని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆమోదించారు మరియు రాష్ట్రవ్యాప్తంగా వాటి విస్తరణను ప్రతిపాదించారు. ఫలితంగా, రూ.84 కోట్ల పెట్టుబడితో మొత్తం 5,000 యూనిట్లు ఏర్పాటు చేస్తున్నామన్నారు. ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్టు కోసం ఆగష్టు 21 న విజయవాడలో ఏపీ ఫుడ్ ప్రాసెసింగ్ సొసైటీ, బ్యాంక్ ఆఫ్ బరోడా (BOB) మధ్య అవగాహన ఒప్పందం జరిగింది. సొసైటీ సీఈవో శ్రీధర్రెడ్డి, BOB డీజీఎం చందన్ సాహూ ఎంవోయూపై సంతకాలు చేశారు.

ఈ సందర్భంగా శ్రీధర్రెడ్డి మాట్లాడుతూ ఒక్కో యూనిట్ అంచనా వ్యయం రూ.1.68 లక్షలని చెప్పారు. ప్రభుత్వం ప్రాజెక్టు వ్యయంలో 35 శాతం (రూ. 29.40 కోట్లు) సబ్సిడీని అందిస్తుంది, అయితే లబ్ధిదారులు 10 శాతం (రూ. 8.40 కోట్లు) మిగిలిన 55 శాతం (రూ. 46.20 కోట్లు) బ్యాంక్ ఆఫ్ బరోడా ఆర్థిక సహాయాన్ని అందిస్తుందన్నారు.

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వారాంతపు కరెంట్ అఫైర్స్ ఆగస్టు 2023 – 2వ వారం

5. టమోటా ఉత్పత్తిలో ఆంధ్రప్రదేశ్ మూడో స్థానంలో ఉంది

45yetdhgc

దేశవ్యాప్తంగా టమోటా ఉత్పత్తిలో ఆంధ్రప్రదేశ్ మూడో స్థానంలో ఉంది. 2022-23 ఆర్థిక సంవత్సరంలో, రాష్ట్రం గణనీయమైన 23.37 లక్షల మెట్రిక్ టన్నుల టమోటా దిగుబడిని అందించింది, ఇది దేశం యొక్క మొత్తం టొమాటో ఉత్పత్తిలో 11.30 శాతానికి దోహదపడింది. దీనిని ప్రస్తావిస్తూ, ఇటీవల టమాటా ధరలు పెరగడానికి గల కారణాలు మరియు సవాళ్లను హైలైట్ చేస్తూ NABARD ఒక నివేదికను విడుదల చేసింది. ప్రధానంగా దేశంలో టమాటాలు ఎక్కువగా పండించే రాష్ట్రాల్లో 2022-23లో ఉత్పత్తి భారీగా తగ్గిందని నివేదిక తెలిపింది. అయితే ఇందుకు భిన్నంగా ఆంధ్రప్రదేశ్ మాత్రం అంతకు ముందు ఆర్థిక ఏడాదితో పోల్చితే 2022 – 23లో 1.50 శాతం వృద్ధి నమోదైందని వెల్లడించింది. ప్రధానంగా టమాల ధరల పెరుగుదలకు గుజరాత్, తమిళనాడు, ఛత్తీస్గఢ్, మహారాష్ట్రల్లో ఉత్ప త్తి గణనీయంగా తగ్గడమేనని NABARD తెలిపింది.

6. ఏపీ సీఎం జగన్ 3 పునరుత్పాదక ఇంధన ప్రాజెక్టులకు శంకుస్థాపన చేశారు

ఏపీ సీఎం జగన్ 3 పునరుత్పాదక ఇంధన ప్రాజెక్టులకు శంకుస్థాపన చేశారు

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఆగష్టు 23 న నంద్యాల జిల్లాలో 5,314 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తికి మూడు పునరుత్పాదక ఇంధన ప్రాజెక్టులకు శంకుస్థాపన చేసినట్లు ప్రెస్ నోట్ తెలిపింది.

ఆంధ్రప్రదేశ్ పవర్ జనరేషన్ కార్పొరేషన్ (APGENCO) ముఖ్యమంత్రి సమక్షంలో నేషనల్ హైడ్రో-ఎలక్ట్రిక్ పవర్ కార్పొరేషన్ (NHPC) తో అవగాహన ఒప్పందం (MOU) కుదుర్చుకుంది. ఈ అవగాహనా ఒప్పందము పంప్ స్టోరేజీ పవర్ ప్రాజెక్టులను ప్రోత్సహించడం లక్ష్యంగా పెట్టుకుంది.

ఓక్ మండలం జునుతల గ్రామంలో గ్రీన్కో ఏర్పాటు చేయనున్న 2300 మెగావాట్ల సౌర విద్యుత్ ప్రాజెక్టుకు, పాణ్యం మండలం కందికాయపల్లె గ్రామంలో ఏఎం గ్రీన్ ఎనర్జీ ఏర్పాటు చేయనున్న 700 మెగావాట్ల సోలార్, 314 మెగావాట్ల పవన విద్యుత్ ప్లాంట్లకు, బేతంచెర్ల మండలం ముద్దవరం గ్రామంలో ఎకోరెన్ ఎనర్జీ ఏర్పాటు చేయనున్న 1000 మెగావాట్ల సౌర, పవన విద్యుత్ ప్రాజెక్టులకు శంకుస్థాపన చేశారు. ఈ ప్రాజెక్టులలో మొత్తం పెట్టుబడి రూ.25,850 కోట్లు, దీనితో వేల మందికి ఉపాధి దొరుకుతుంది.

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వారాంతపు కరెంట్ అఫైర్స్ ఆగస్టు 2023 – 3వ వారం

7. డిజిటల్ చెల్లింపుల్లో ఆంధ్రప్రదేశ్ మొదటి స్థానంలో ఉంది

ETFV

స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) పరిశోధన నివేదిక ప్రకారం భారతదేశంలోని టాప్ 15 రాష్ట్రాలు డిజిటల్ చెల్లింపుల విలువ మరియు పరిమాణంలో 90% వాటాను కలిగి ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్ మొదటి స్థానంలో ఉండగా, మహారాష్ట్ర, తెలంగాణ, కర్ణాటక తర్వాతి స్థానాల్లో ఉన్నాయి. ఈ రాష్ట్రాల్లో సగటు డిజిటల్ చెల్లింపు మొత్తం ₹2,000 మరియు ₹2,200 మధ్య ఉంది.

ఏపీ, మహారాష్ట్ర, తెలంగాణ, కర్ణాటక తర్వాత ఉత్తరప్రదేశ్‌, రాజస్థాన్‌, తమిళనాడు, బీహార్‌, పశ్చిమ బెంగాల్‌లలో డిజిటల్‌ చెల్లింపులు ఎక్కువగా జరుగుతున్నాయి. ఈ రాష్ట్రాల్లో సగటు డిజిటల్ చెల్లింపులు ₹1,800 నుండి ₹2,000 వరకు ఉన్నాయి. వీటి తర్వాత ఒడిశా, కేరళ, మధ్యప్రదేశ్, గుజరాత్, అస్సాం మరియు హరియాణాల్లో డిజిటల్ చెల్లింపుల మొత్తం ₹1,600 మరియు ₹1,800 మధ్య ఉన్నట్లు నివేదిక వెల్లడించింది.

డిజిటల్ చెల్లింపుల్లో అగ్రగామిగా ఉన్న ఆంధ్రప్రదేశ్ మొత్తం 8-12% వాటాను కలిగి ఉందని నివేదిక పేర్కొంది. భారతదేశంలోని మొదటి 100 జిల్లాలు జిల్లాలవారీగా UPI డిజిటల్ చెల్లింపుల పరిమాణం మరియు విలువలో 45% వాటాను కలిగి ఉన్నట్లు తేలింది.

Download AP State Weekly CA week-04-August 2023-Telugu PDF

APPSC GROUP-2 2023 Prelims and Mains Chapter wise and Subject Wise Practice Tests Online Test Series in Telugu and English By Adda247

మరింత చదవండి: 
తాజా ఉద్యోగ ప్రకటనలు  క్కడ క్లిక్ చేయండి
ఉచిత స్టడీ మెటీరియల్ (APPSC, TSPSC) ఇక్కడ క్లిక్ చేయండి
ఉచిత మాక్ టెస్టులు  ఇక్కడ క్లిక్ చేయండి

Sharing is caring!