Telugu govt jobs   »   Current Affairs   »   Andhra Pradesh State Current affairs In...

Andhra Pradesh State Current affairs In Telugu September 2022 | ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కరెంట్ అఫైర్స్ సెప్టెంబర్ 2022 తెలుగులో 

Andhra Pradesh State Current affairs In Telugu September 2022: Andhra Pradesh state current affairs plays crucial role in GROUP-1, GROUP-2, Panchayat Secretary, GROUP-4 , Assistant Engineer(AE), Sub-Inspector and Constable, Junior Lecturers etc., exams.. Andhra Pradesh Government releases notification for Various posts through Andhra Pradesh like GROUP-1, GROUP-2, Panchayat Secretary, GROUP-4 , Assistant Engineer(AE), Sub-Inspector and Constable, Junior Lecturers, Degree Lecturers and various executive and non-executive posts under various departments of Telangana. Current affairs play a very important role in the competitive examinations and hence, aspirants have to give undivided attention to it while doing preparation for the government examinations. To complement your preparation, we are providing you the Andhra Pradesh State Current affairs In Telugu September 2022.

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కరెంట్ అఫైర్స్ సెప్టెంబర్ 2022 తెలుగులో: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కరెంట్ అఫైర్స్ GROUP-1, GROUP-2, పంచాయితీ సెక్రటరీ, GROUP-4, అసిస్టెంట్ ఇంజనీర్(AE), సబ్-ఇన్‌స్పెక్టర్ మరియు కానిస్టేబుల్, జూనియర్ లెక్చరర్స్ మొదలైన పరీక్షలలో కీలక పాత్ర పోషిస్తుంది.. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వివిధ పోస్టుల కోసం నోటిఫికేషన్ విడుదల చేసింది. APPSC  ద్వారా GROUP-1, GROUP-2, పంచాయితీ సెక్రటరీ, GROUP-4, అసిస్టెంట్ ఇంజనీర్ (AE), సబ్-ఇన్‌స్పెక్టర్ మరియు కానిస్టేబుల్, జూనియర్ లెక్చరర్లు, డిగ్రీ లెక్చరర్లు మరియు వివిధ ఎగ్జిక్యూటివ్ మరియు నాన్ ఎగ్జిక్యూటివ్ పోస్టులు తెలంగాణలోని వివిధ విభాగాల క్రింద. కరెంట్ అఫైర్స్ పోటీ పరీక్షల్లో చాలా ముఖ్యమైన పాత్రను పోషిస్తాయి. కాబట్టి, ప్రభుత్వ పరీక్షలకు ప్రిపరేషన్ చేస్తున్నప్పుడు అభ్యర్థులు దానిపై ప్రత్యేక శ్రద్ధ వహించాలి. మీ ప్రిపరేషన్‌ను పూర్తి చేయడానికి, మేము మీకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కరెంట్ అఫైర్స్‌ను సెప్టెంబర్ 2022 తెలుగులో అందిస్తున్నాము.

Andhra Pradesh State Current affairs In Telugu September 2022_3.1

APPSC/TSPSC Sure shot Selection Group

Andhra Pradesh State Current affairs In Telugu | ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కరెంట్ అఫైర్స్ తెలుగులో

 

1. ఆంధ్రప్రదేశ్‌కు ‘ఇన్‌ఫ్రా ఫోకస్‌’ అవార్డు

Infra focus
Infra focus

తీరప్రాంత అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న కృషికి జాతీయ స్థాయిలో గుర్తింపు లభించింది. దేశీయ ఇన్‌ఫ్రా రంగంపై ప్రముఖ వాణిజ్య దినపత్రిక ఎకనామిక్‌ టైమ్స్‌ ఏటా ప్రకటించే అవార్డు ఏపీ పోర్టులకు దక్కింది. పోర్టు ఆధారిత మౌలిక వసతుల కల్పనలో రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న కృషి, అత్యుత్తమ ప్రగతికి గుర్తింపుగా ఇన్‌ఫ్రా ఫోకస్‌ అవార్డుకు ఎంపిక చేసినట్లు పరిశ్రమల శాఖ మంత్రి గుడివాడ అమర్‌నాథ్‌కు రాసిన లేఖలో ఎకనామిక్‌ టైమ్స్‌ పేర్కొంది.

సెప్టెంబర్‌ 27న ఢిల్లీలోని హయత్‌ రెసిడెన్సీలో జరిగే 7వ ఇన్‌ఫ్రా ఫోకస్‌ అవార్డుల కార్యక్రమంలో ఈ అవార్డును ప్రధానం చేయనున్నారు. ఈ కార్యక్రమానికి హాజరు కావాలని మంత్రి అమర్‌నాథ్‌ను టైమ్స్‌ గ్రూప్‌ ఆహ్వానించింది. నీతి ఆయోగ్‌ సలహాదారుడు సుధేందు జే సిన్హా అధ్యక్షతన ఏర్పాటైన జ్యూరీ అన్ని రాష్ట్రాలు అమలు చేస్తున్న వివిధ ఇన్‌ఫ్రా ప్రాజెక్టులను పరిశీలించి అవార్డుకు ఎంపిక చేసింది.

2. APలోని నాడు – నేడు స్ఫూర్తితో ‘పీఎం శ్రీ’ స్కూళ్లు

PM shree school
PM shree school

విద్యారంగ సంస్కరణల్లో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ప్రతిష్టాత్మక ‘మనబడి నాడు – నేడు’ కార్యక్రమం పలు రాష్ట్రాలకు ఆదర్శంగా నిలవగా తాజాగా కేంద్ర ప్రభుత్వానికీ స్ఫూర్తిదాయకమైంది.

నాడు – నేడు తరహాలో అన్ని సదుపాయాలతో ‘పీఎం శ్రీ’ పేరిట కొత్తగా స్కూళ్లను ప్రారంభించాలని తాజాగా కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. సెప్టెంబర్ 6 న జరిగిన కేంద్ర కేబినెట్‌ సమావేశంలో ఆమోదం తెలిపింది. దేశవ్యాప్తంగా 14,500 స్కూళ్లను ప్రారంభించనున్నారు. ప్రాజెక్టు ప్రాతిపదికన ఐదేళ్లపాటు కొనసాగనున్నాయి.

3. ఏపీ రాష్ట్రంలో రూ.1,26,622.23 కోట్లు పెట్టుబడులు

 investments in AP state
investments in AP state

రాష్ట్ర పారిశ్రామిక రంగంలో నూతన శకాన్ని లిఖిస్తూ రూ.1,26,622.23 కోట్ల విలువైన పెట్టుబడులకు రాష్ట్ర పెట్టుబడుల ప్రోత్సాహక మండలి (ఎస్‌ఐపీబీ) ఆమోదం తెలిపింది. గ్రీన్‌ ఎనర్జీ, ఫార్మా, ఎలక్ట్రిక్‌ వాహనాలు, ఫుడ్‌ ప్రోసెసింగ్‌ రంగాలకు చెందిన వివిధ పెట్టుబడుల ప్రతిపాదనలకు ఏపీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అధ్యక్షతన జరిగిన సెప్టెంబర్ 5 న తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో జరిగిన సమావేశంలో ఎస్‌ఐపీబీ ఆమోదం తెలిపింది. ఆయా కంపెనీల ఏర్పాటు ద్వారా 36,380 మందికి ఉపాధి లభించనుంది.

ఇందులో ఒక్క గ్రీన్‌ ఎనర్జీ రంగంలోనే రూ.81,043 కోట్ల పెట్టుబడులు ఉన్నాయి. ఇండోసోల్‌ సోలార్, ఆస్త్రా గ్రీన్, షిర్డీ సాయి ఎలక్ట్రికల్స్, అరబిందో రియాల్టీ అండ్‌ ఇన్‌ఫ్రా, ఏఎం గ్రీన్‌ ఎనర్జీ, గ్రీన్‌కో వంటి సంస్థలు పర్యావరణ ఉపయుక్తమైన ఆరు పంప్డ్‌ స్టోరేజ్‌ విద్యుత్‌ యూనిట్లను ఏర్పాటు చేస్తున్నాయి. ఈ ఆరు గ్రీన్‌ ఎనర్జీ పాంట్ల ద్వారా 17,930 మెగావాట్ల విద్యుత్‌ ఉత్పత్తి కానుంది. ఈ యూనిట్ల ద్వారా 20,130 మందికి ఉపాధి లభిస్తుందని అంచనా. వీటితో పాటు నెల్లూరు జిల్లా రామాయపట్నం వద్ద ఇండోసోల్‌ సోలార్‌ కంపెనీ మరో రూ.43,143 కోట్లతో మెటలార్జికల్‌ గ్రేడ్‌ సిలికాన్, పాలీ సిలికాన్, ఫ్లోట్‌.. రోల్డ్‌ గ్లాసెస్‌ తయారీ యూనిట్‌తో పాటు సోలార్‌ విద్యుత్‌ ప్లాంట్‌ను ఏర్పాటు చేయనుంది. కాకినాడ సెజ్‌ వద్ద రూ.1,900 కోట్ల పెట్టుబడితో లైఫిజ్‌ ఫార్మా, వైఎస్సార్‌ జిల్లా కొప్పర్తి వద్ద కాసిస్‌ రూ.386.23 కోట్లతో ఎలక్ట్రిక్‌ బస్సుల తయారీ కేంద్రం, కృష్ణా జిల్లా మల్లవల్లి వద్ద రూ.150 కోట్లతో అవిశాఫుడ్స్‌ ఫుడ్‌ ప్రాసెసింగ్‌ యూనిట్‌ ప్రతిపాదనలకు ఎస్‌ఐపీబీ ఆమోదం తెలిపింది.

4. మానవ అక్రమ రవాణా తగ్గడం శుభపరిణామం

Human trafficking
Human trafficking

ఆంధ్రప్రదేశ్‌లో మానవ అక్రమ రవాణా తగ్గుముఖం పట్టడం శుభపరిణామం అని, గతేడాది కాలంగా రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్న కట్టుదిట్టమైన చర్యలు మంచి ఫలితాలు ఇస్తున్నాయని అనేందుకు ఇదే సంకేతమని హెల్ప్‌ స్వచ్ఛంద సంస్థ రాష్ట్ర కార్యదర్శి రామమోహన్‌ నిమ్మరాజు స్పష్టం చేశారు. మానవ అక్రమ రవాణాకు వ్యతిరేకంగా స్వచ్ఛంద సంస్థ ద్వారా కొన్నేళ్లుగా కృషి చేస్తున్న రామమోహన్‌ జాతీయ నేర గణాంక సంస్థ (ఎన్‌సీఆర్‌బీ)–2021 నివేదికపై సెప్టెంబర్ 4 న స్పందించారు. గతేడాది ప్రతి జిల్లాకు ఒక మానవ అక్రమ రవాణా నిరోధక యూనిట్‌ (ఏహెచ్‌టీయూ) ఏర్పాటు చేసి అక్రమ రవాణా నిరోధానికి కఠిన చర్యలు తీసుకోవడం మంచి ఫలితాలు ఇచ్చిందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న చర్యల ఫలితంగా మానవ అక్రమ రవాణా కేసుల్లో 2020లో మూడో స్థానంలో ఉన్న ఆంధ్రప్రదేశ్‌ 2021లో ఐదో స్థానానికి తగ్గిందన్నారు. ఎన్‌సీఆర్‌బీ రిపోర్టు ప్రకారం మానవ అక్రమ రవాణాలో మొదటి స్థానంలో తెలంగాణ, రెండు, మూడు, నాలుగు స్థానాల్లో వరుసగా మహారాష్ట్ర, అస్సాం, కేరళ ఉన్నాయన్నారు. గతేడాది ఆంధ్రప్రదేశ్‌లో 99.3 శాతం కేసుల్లో పోలీసులు చార్జిషీట్‌ వేయడం, 757 మందిని అరెస్టు చేయడం ఒక రికార్డు అని రామమోహన్‌ వివరించారు.

5. NITI Aayog వర్కింగ్‌ గ్రూప్‌లో ఏపీకి చోటు

niti-aayog
niti-aayog

రానున్న ముప్పై ఏళ్లలో వ్యవసాయ విధానాల రూపకల్పన కోసం నీతి ఆయోగ్‌ పర్యవేక్షణలో ఏర్పాటు చేసిన జాతీయ­స్థాయి వర్కింగ్‌ గ్రూప్‌లో ఆంధ్రప్రదేశ్‌కు ప్రాతినిధ్యం కల్పిస్తూ కేంద్రం ఆదేశాలు జారీచేసింది.

విదేశాల నుంచి దిగుమతులపై ఆధారపడకుండా దేశీయంగా పెరుగుతున్న జనాభా అవసరాలకు తగినట్లుగా నాణ్యమైన ఆహార ఉత్పత్తుల దిగుబడులను పెంచుకునేందుకు అనుసరించాల్సిన కార్యాచరణపై పాలసీల రూపకల్పనలో ఈ కమిటీ క్రియాశీలకంగా వ్యవహరిస్తుంది. వ్యవసాయం, ఉద్యానం, పట్టు, పశుసంవర్థక, మత్స్య తదితర వ్యవసాయ అనుబంధ రంగాలను బలోపేతం చేసేందుకు ఈ కమిటీ రూపొందించే విధానాలను కేంద్రం అమలుచేస్తుంది.

6. E- Crop Registration : ఏపీ మోడల్‌గా,  జాతీయ స్థాయిలో అమలుకు శ్రీకారం

E-crop registration
E-crop registration

ఆంధ్రప్రదేశ్‌లో ఈ–క్రాప్‌ నమోదు వల్ల రైతాంగానికి ఒనగూరుతున్న ప్రయోజనాలను ప్రత్యక్షంగా పరిశీలించిన కేంద్రం, ఈ విధానాన్ని దేశ వ్యాప్తంగా అమలు చేసేందుకు శ్రీకారం చుట్టింది.

ఏపీని మోడల్‌గా తీసుకొని, అగ్రిస్టాక్‌ డిజిటల్‌ అగ్రికల్చర్‌ (ఏడీఎ) పేరిట అన్ని రాష్ట్రాల్లో ఈ–క్రాప్‌ నమోదు చేయాలని కేంద్ర వ్యవసాయ, కుటుంబ సంక్షేమ శాఖ ఆదేశాలు జారీ చేసింది. సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఆలోచనల నుంచి పుట్టిన ఈ కార్యక్రమం మూడేళ్లుగా విజయవంతంగా అమలవుతోంది. జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో ప్రశంసలందుకుంటోంది. ఈ–క్రాప్‌ నమోదు ప్రామాణికంగా సబ్సిడీపై విత్తనాలు, ఎరువులు, పురుగుల మందులతో పాటు వైఎస్సార్‌ రైతు భరోసా కింద ఏటా రూ.13,500 చొప్పున పెట్టుబడి సాయం, స్కేల్‌ ఆఫ్‌ ఫైనాన్స్‌ ప్రకారం పంట రుణాలు, రూ.లక్ష లోపు పంట రుణాలు ఏడాది లోపు చెల్లించిన వారికి వైఎస్సార్‌ సున్నా వడ్డీ రాయితీ, ప్రకృతి వైపరీత్యాల వల్ల పంటలు నష్టపోయిన రైతులను ఆదుకునేందుకు సీజన్‌ ముగియకుండానే పంట నష్ట పరిహారం (ఇన్‌పుట్‌ సబ్సిడీ), వైఎస్సార్‌ ఉచిత పంటల బీమా పథకాలనందిస్తున్నారు.

భూ యజమానులకే కాకుండా, సెంటు భూమి లేని ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ కౌలుదారులకు కూడా ఈ క్రాప్‌ నమోదే అర్హతగా వైఎస్సార్‌ రైతు భరోసాతో సహా అన్ని రకాల పథకాలు అందిస్తున్నారు. ఈ క్రాప్‌ అమలులోకి వచ్చాక వ్యవసాయ, ఉద్యాన, పట్టు, పశుగ్రాసం, ఆక్వా పంటలన్నీ కలిపి ఖరీఫ్‌ 2020లో 124.92 లక్షల ఎకరాలు, రబీ 2020–21లో 83.77 లక్షల ఎకరాలు, ఖరీఫ్‌ 2021లో 112.26 లక్షల ఎకరాలు, రబీ 2021–22లో 82.59 లక్షల ఎకరాల్లో ఈ–క్రాప్‌ బుకింగ్‌ జరిగింది.

Lakshya APPSC Group-1
Lakshya APPSC Group-1

7. మోసకారి లోన్‌ యాప్‌లపై ఫిర్యాదులకు ప్రత్యేక కాల్‌ సెంటర్‌: సీఏం జగన్‌

Fraudulent Loan Apps
Fraudulent Loan Apps

సామాన్యులను లక్ష్యంగా చేసుకొని మోసాలు, వేధింపులకు పాల్పడుతున్న లోన్‌యాప్‌లపై కఠిన చర్యలకు పోలీసు శాఖ కార్యాచరణను వేగవంతం చేసింది. లోన్‌యాప్‌ల ఆగడాలపై ఉక్కుపాదం మోపాలన్న ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి తాజా ఆదేశాలతో బహుముఖ వ్యూహంతో ముందుకెళ్తోంది.  జాతీయ నోడల్‌ ఏజెన్సీ ‘ఇండియన్‌ కంప్యూటర్‌ ఎమెర్జెన్సీ రెస్పాన్స్‌ టీమ్‌ (సీఈఆర్టీ)తో కలసి ఇటువంటి యాప్‌లపై నిషేధం విధించేందుకు సిద్ధమవుతోంది.

8. పెట్టుబడుల ఆకర్షణలో APనే అగ్రగామి

DPIIT's July report
DPIIT’s July report

పారిశ్రామిక పెట్టుబడులను అకర్షించడంలో వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వం అతి పెద్ద ఘనత సాధించింది. 2022 సంవత్సరంలో పెట్టుబడుల ఆకర్షణలో దేశంలోనే అగ్రగామి రాష్ట్రంగా నిలిచింది. కేంద్ర ప్రభుత్వ  డిపార్ట్‌మెంట్‌ ఫర్‌ ప్రమోషన్‌ ఆఫ్‌ ఇండస్ట్రీ అండ్‌ ఇంటర్నల్‌ ట్రేడ్‌ (డీపీఐఐటీ)జూలై నెల నివేదికలో ఆంధ్రప్రదేశ్‌ ప్రగతి విషయం వెల్లడైంది. ఈ ఏడాది తొలి ఏడు నెలల్లో  దేశం మొత్తం మీద 1.71 లక్షల కోట్ల పెట్టుబడులు రాగా అందులో ఆంధ్రప్రదేశ్‌లోనే అత్యధికంగా రూ.40,361 కోట్ల పెట్టుబడులు వచ్చినట్టు ఆ నివేదిక పేర్కొంది. రూ.36,828 కోట్ల పెట్టుబడులతో ఒడిశా రెండో స్థానంలో నిలిచింది. దేశంలో పెట్టుబడుల్లో ఈ రెండు రాష్ట్రాలది 45 శాతం అని డీపీఐఐటీ తెలిపింది.

9. అక్టోబర్‌ 1 నుంచి వైఎస్‌ఆర్‌ కల్యాణమస్తు, షాదీ తోఫా

YSR Kalyanamastu
YSR Kalyanamastu

ఇచ్చిన హామీల్లో ఇప్పటికే 98.44 శాతం అమలు చేసి సంక్షేమ అమలులో తన చిత్తశుద్ధి చూపించుకుంది వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి నేతృత్వంలోని వైఎస్సార్‌ సీపీ ప్రభుత్వం. తాజాగా ఏపీలో మరో భారీ సంక్షేమ పథకానికి కసరత్తులు పూర్తి చేసింది. మరో కీలక హామీని నెరవేరుస్తూ నిర్ణయం తీసుకుంది. అక్టోబర్‌ 1వ తేదీ నుంచి వైఎస్‌ఆర్‌ కల్యాణమస్తు, షాదీ తోఫా పథకాలు  అమలు చేయనుంది.

బీసీ, ఎస్పీ, ఎస్టీ, మైనార్టీ వర్గాలకు, భవన కార్మిక కుటుంబాలకు ఈ పథకం వర్తించనున్నాయి. పేద ఆడపిల్ల కుటుంబాలకు బాసటగా ఉండేందుకు, గౌరవప్రదంగా వివాహం జరిపించేందుకు తోడ్పాటుగా ఈ పథకాన్ని జగన్‌ సర్కార్‌ అమలు చేయనుంది. అంతేకాదు ఈ పథకం కింద గత ప్రభుత్వం ప్రకటించిన దానికంటే అధికంగా నగదు సాయం అందించనుంది.

  • ఎస్సీలకు వైఎస్సార్‌ కల్యాణమస్తు కింద లక్ష రూపాయలు
  • ఎస్సీల కులాంతర వివాహాలకు రూ.1.2 లక్షలు
  • ఎస్టీలకు వైఎస్సార్‌ కల్యాణమస్తు కింద లక్ష రూపాయలు
  • ఎస్టీల కులాంతర వివాహాలకు రూ.1.2 లక్షలు
  • బీసీలకు వైఎస్సార్‌ కల్యాణమస్తు కింద రూ.50వేలు
  • బీసీల కులాంతర వివాహాలకు రూ.75వేలు
  • మైనారిటీలకు షాదీ తోఫా కింద లక్ష రూపాయలు.
  • దివ్యాంగులు వివాహాలకు రూ. 1.5 లక్షలు
  • భవన నిర్మాణ కార్మికుల వివాహాలకు రూ.40వేలు ఆర్థిక సాయం అందించనుంది వైఎస్‌ జగన్‌ ప్రభుత్వం.

 

English Quiz MCQS Questions And Answers 15 September 2022, For All Competitive Exams |_80.1

10. ఏపీ శాసనసభలో స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖ చట్ట సవరణ బిల్లు 

AP Legislature
AP Legislature

స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖ మరో కొత్త వసూలు విధానానికి ఉపక్రమించింది. జాతీయ, అంతర్జాతీయ సంస్థల మధ్య జరిగే లీజు ఒప్పందాలకు సంబంధించి స్టాంపు డ్యూటీని విధించింది. ఈ సంస్థలు తమ ఉత్పత్తులు, యంత్రాలు, పరికరాలు, ఆహార పదార్థాలు విక్రయించుకోడానికి అనుమతించే ఒప్పందాలకు స్టాంపు డ్యూటీ నిర్ణయించింది. తాజాగా రాష్ట్ర ప్రభుత్వం భారత స్టాంపు చట్టం – 1899ని సవరిస్తూ బిల్లును శాసనసభలో ప్రవేశపెట్టింది. ఇలాంటి లీజులపై ఏడాదికి రూ.1,000, ఏడాదికి మించి పదేళ్లలోపు ప్రతి ఏడాదికి రూ.1,000, పదేళ్ల కాలానికి మించితే రూ.25,000 స్టాంపు డ్యూటీ చెల్లించాల్సి ఉంటుంది. ట్రేడింగ్‌ కేటగిరిలోనూ, మేధో సంపత్తి బదలాయింపులోనూ ఇదే విధానంలో స్టాంపు డ్యూటీ చెల్లించాలి.

11. ‘రీ-సర్వే’పై నల్సార్‌తో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఒప్పందం 

'Re-survey'
‘Re-survey’

భూముల రీ-సర్వేపై రైతుల్లో అవగాహన కల్పించేందుకు, పరిశోధనల నిర్వహణకు హైదరాబాద్‌లోని నల్సార్‌ న్యాయ విశ్వవిద్యాలయం, ఆంధ్ర రాష్ట్ర సర్వే శాఖల మధ్య ఒప్పందం జరిగింది. హైదరాబాదులో జరిగిన ఒప్పంద కార్యక్రమంలో విశ్వవిద్యాలయం ఉపకులపతి ఆచార్య బాలకిష్టారెడ్డి, సర్వే శాఖ శిక్షణ సంస్థ వైస్‌ ప్రిన్సిపల్‌ కుమార్‌ అవగాహన పత్రాలను మార్చుకున్నారు. ఈ సందర్భంగా సర్వే శాఖ కమిషనర్‌ సిద్దార్థజైన్‌ ఓ ప్రకటన విడుదల చేశారు. సీఎం జగన్‌ రీ-సర్వే నిర్వహణలో నల్సార్‌ న్యాయ విశ్వవిద్యాలయాన్ని భాగస్వామ్యం చేయాలని ఆదేశించిన మేరకు చర్యలు తీసుకున్నాం. రైతులకు రీ-సర్వేపై అవగాహన, చట్టపర హక్కులపై స్పష్టత కల్పించడం వంటి అంశాలు ఈ ఒప్పందంలో క్రియాశీలకంగా ఉంటాయి. ఈ ఒప్పందం ద్వారా రీ-సర్వేలో పాల్గొనే భాగస్వాములకు విశ్వవిద్యాలయం ద్వారా శిక్షణ అందుతుంది. రీ-సర్వే నిర్వహణలో పార్టీలు పరస్పర అంగీకారం, ఇతర అంశాలపైనా విశ్వవిద్యాలయం తనవంతు సహకారాన్ని అందిస్తుంది. రాష్ట్రంలో రూ.వెయ్యి కోట్లతో చేపట్టిన రీ-సర్వే 2023 సెప్టెంబరు నాటికి పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు వివరించారు.

12. YSR ఆరోగ్య విశ్వ విద్యాలయంగా మార్చేందుకు రాష్ట్ర ఉభయ సభలు ఆమోదం

YSR Health University
YSR Health University

డాక్టర్‌ ఎన్టీఆర్‌ ఆరోగ్య విశ్వ విద్యాలయం పేరును డాక్టర్‌ వైఎస్సార్‌ ఆరోగ్య విశ్వ విద్యాలయంగా మార్చేందుకు రాష్ట్ర ఉభయ సభలు ఆమోదం తెలిపాయి. డాక్టర్‌ ఎన్టీఆర్‌ ఆరోగ్య విజ్ఞాన శాస్త్రాల విశ్వవిద్యాలయం సవరణ బిల్లు–2022ను ఉభయ సభల్లో వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి విడదల రజిని ప్రవేశపెట్టారు.

1986 నవంబర్‌ 1వ తేదీన ఏపీ యూనివర్సిటీ ఆఫ్‌ హెల్త్‌ సైన్సెస్‌ పేరిట ఆరోగ్య విశ్వవిద్యాలయం ఏర్పాటు చేశారు. 1998 జనవరి 8వ తేదీన ఎన్టీఆర్‌ ఆరోగ్య విశ్వ విద్యాలయంగా పేరు మార్చారు. ప్రస్తుతం దానిని డాక్టర్‌ వైఎస్సార్‌ ఆరోగ్య విశ్వ విద్యాలయంగా మార్చేందుకు ప్రవేశ పెట్టిన బిల్లుకు ఏకగ్రీవంగా ఆమోదం లభించింది.

13. విశాఖలో దేశంలోనే తొలి ఇండస్ట్రీ 4.0 సెంటర్‌ ఆఫ్‌ ఎక్సలెన్సీ సిద్ధం

The first Industry 4.0 Center of Excellence
The first Industry 4.0 Center of Excellence

పారిశ్రామికరంగంలో నాలుగో తరం టెక్నాలజీ ఆవిష్కరణలకు విశాఖ వేదిక అవుతోంది. విశాఖ ఉక్కు (ఆర్‌ఐఎన్‌ఎల్‌)తో కలిసి సాఫ్ట్‌వేర్‌ టెక్నాలజీ పార్క్స్‌ ఆఫ్‌ ఇండియా (ఎస్‌టీపీఐ) సంయుక్తంగా ‘కల్పతరువు’ పేరుతో ఏర్పాటుచేసిన ఇండస్ట్రీ–4.0 సీవోఈ (సెంటర్‌ ఆఫ్‌ ఎక్సలెన్సీ) కార్యకలాపాలు సెప్టెంబర్‌ 20 నుంచి లాంఛనంగా ప్రారంభం కానున్నాయి. దేశంలోని స్టార్టప్‌లను ఆకర్షించేలా ఓపెన్‌ చాలెంజ్‌ ప్రోగ్రాం–1 (ఓసీపీ–1)ను కల్పతరువు సీఓఈ ప్రకటించింది.

విశాఖపట్నంలో ఉన్న ప్రభుత్వరంగ సంస్థలు ఆర్‌ఐఎన్‌ఎల్, ఎన్‌టీపీసీ, వైజాగ్‌ పోర్టు, హెచ్‌పీసీఎల్‌ వంటి పరిశ్రమల్లో మానవ వనరుల వినియోగం తగ్గించి ఖర్చులను నియంత్రించే నూతన టెక్నాలజీ ఆవిష్కరణలను పెంచి తద్వారా స్టార్టప్‌లను ప్రోత్సహించేందుకు కల్పతరువు సీవోఈని ఏర్పాటుచేసినట్లు ఎస్‌టీపీఐ విశాఖ అడిషనల్‌ డైరెక్టర్‌ సురేష్‌  తెలిపారు. ఇందులో భాగంగా ముందుగా విశాఖ ఉక్కు పరిశ్రమకు సంబంధించిన ఆరు సమస్యల పరిష్కారాన్ని కోరుతూ ఓసీపీ–1 పేరుతో స్టార్టప్‌లను ఆహ్వానిస్తున్నట్లు తెలిపారు. ఒక్కో సమస్యకు ఇండస్ట్రీ–4 టెక్నాలజీతో చక్కటి పరిష్కరం చూపిన ప్రోటోటైప్‌ స్టార్టప్‌ను ఎంపికచేసి రూ.4 లక్షలు బహుమతిగా ఇవ్వడమే కాక, కల్పతరువు సీవోఈ ద్వారా ప్రాజెక్టు ఫండింగ్‌ సౌకర్యం కలి్పస్తారు. పరిశ్రమల్లో ఆటోమేషన్‌ పెంచేందుకు బిలియన్‌ డాలర్లు వ్యయం చేస్తున్నారని, ఇందులో నూతన ఆవిష్కరణలకు విశాఖ వేదిక కానుందని కల్పతరువు ప్రాజెక్టు మేనేజ్‌మెంట్‌ గ్రూపు సభ్యుడు, ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ అసోసియేషన్‌ ఆఫ్‌ ఆంధ్రప్రదేశ్‌ (ఐటాప్‌) ప్రెసిడెంట్‌ శ్రీధర్‌ కోసరాజు తెలిపారు.

14. AP State Economy: ‘నికరం’గా ఆర్థికవృద్ధి

AP State Economy
AP State Economy

రాష్ట్ర ఆర్ధిక వ్యవస్థ మూ డేళ్లుగా వృద్ధి పథంలో దూసుకుపోతోంది. ఆర్థిక వృద్ధికి ప్రధానంగా వ్యవసాయం, తయా­రీ, రియల్‌ ఎస్టేట్‌ రంగాలు వెన్నుద­న్నుగా నిలుస్తున్నాయి. ప్రస్తుత ధరలతో పోల్చి చూస్తే 2021–22 ఆర్థిక ఏడాది నాటికి రాష్ట్ర ఆర్థిక నికర విలువ (నెట్‌ స్టేట్‌ వ్యాల్యూ యాడెడ్‌) రికార్డు స్థాయిలో రూ.10.85 లక్షల కోట్లకు చేరుకోవడం గమనార్హం. ఆర్థిక మందగమనం, వరుసగా రెండేళ్ల పాటు కరోనా సంక్షోభ పరిస్థితులను అధిగమించి గత మూడేళ్లలో రాష్ట్ర ఆర్థిక నికర విలువ 37.28 శాతం మేర పెరిగింది.

15. తొలిసారిగా రూ.2 లక్షలు దాటిన ఏపీ తలసరి ఆదాయం

AP Per Capita Income
AP Per Capita Income

తొలిసారిగా ఏపీ తలసరి ఆదాయం రెండు లక్షల రూపాయలు దాటింది. 2021 – 22కి సంబంధించి రిజర్వ్‌ బ్యాంక్‌ ఇండియా విడుదల చేసిన ఆర్థిక వ్యవస్థ గణాంకాల నివేదికలో వివిధ రాష్ట్రాల తలసరి ఆదాయ వివరాలను వెల్లడించింది. ఆర్బీఐ విడుదల చేసిన ప్రొవిజనల్‌ గణాంకాల మేరకు రాష్ట్ర తలసరి ఆదాయం 2021–22 ఆర్థిక సంవత్సరంలో రూ. 2,07,771కి పెరిగింది. ఇదే సమయంలో జాతీయ తలసరి ఆదాయం రూ.1,50,007 మాత్రమే నమోదు కావడం గమనార్హం.

ఆర్థిక సంవత్సరం (2021–22)లో రాష్ట్ర తలసరి ఆదాయం ఏకంగా 17.57 శాతం  పెరిగింది. అంతకుముందు ఆర్థిక సంవత్సరంతో పోల్చితే రాష్ట్ర తలసరి ఆదాయం రూ. 31,064 పెరిగింది.

మూడేళ్లలో 34.88 శాతం పెరుగుదల

గత సర్కారు దిగిపోయే నాటికి 2018 – 19లో రాష్ట్ర తలసరి ఆదాయం రూ.1,54,031 మాత్ర మే ఉండగా 2021–22లో ఏకంగా రూ.2,07,771కి పెరిగింది. వైఎస్సార్‌సీపీ పాలనలో మూడేళ్లలో రాష్ట్ర తలసరి ఆదాయం 34.88 శాతం మేర పెరిగినట్లు స్పష్టమవుతోంది.

adda247

 

16. ఆకట్టుకుంటున్న RBK చానల్‌

RBK Channel
RBK Channel

వైఎస్సార్‌ రైతు భరోసా కేంద్రాలను నాలెడ్జ్‌ హబ్‌లుగా తీర్చిదిద్దే లక్ష్యంతో అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో అన్నదాతల కోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన ఆర్బీకే చానల్‌ విశేష ఆదరణతో దూసుకుపోతోంది.

రెండేళ్లలోనే 1.95 లక్షల సబ్‌స్క్రైబర్లను, 21.50 లక్షల వ్యూయర్‌షిప్‌ను సాధించింది. రైతులతో పాటు జాతీయ, అంతర్జాతీయ ప్రముఖుల ప్రశంసలందుకుంటోంది. వివిధ రాష్ట్ర ప్రభుత్వాల అభినందనలూ చూరగొంటోంది.

ఆర్బీకేల ద్వారా ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలతో పాటు నూతన సాగు విధానాలను రైతులకు చేరువ చేసే లక్ష్యంతో యూట్యూబ్‌లో ఈ చానల్‌ను ఏర్పాటు చేశారు. ప్రసారాల వివరాలను ఎప్పటికప్పుడు ఆర్బీకేల పరిధిలోని వాట్సాప్‌ గ్రూపుల ద్వారా రైతులకు, ఎస్‌ఎంఎస్‌ల ద్వారా సబ్‌స్క్రైబర్లకు తెలియజేస్తున్నారు. ఈ చానల్‌ కోసం గన్నవరంలోని సమీకృత రైతు సమాచార కేంద్రం(ఐసీసీ కాల్‌ సెంటర్‌)లో ప్రత్యేకంగా స్టూడియో ఏర్పాటు చేశారు. ఈ చానల్‌ ద్వారా వ్యవసాయ అనుబంధ రంగాల కార్యక్రమాలను ప్రసారం చేస్తున్నారు. శాస్త్రవేత్తల ద్వారా రైతుల సందేహాలను నివృత్తి చేస్తున్నారు. ఆదర్శ రైతుల అనుభవాలను తెలియజేస్తున్నారు. వైఎస్సార్‌ యంత్రసేవా కేంద్రాల్లో ఉండే పరికరాలు, ఉపయోగాలు వివరించేందుకు రైతు గ్రూపులతో సమావేశాలు నిర్వహిస్తున్నారు. ఈ చానల్‌ ద్వారా 371 ప్రత్యక్ష ప్రసారాలతో పాటు వివిధ శాఖలకు సంబంధించిన 895 రైతు ప్రాయోజిత వీడియోలను అప్‌లోడ్‌ చేశారు. ఆర్బీకే 2.0 వెర్షన్, ఆర్బీకేల ద్వారా అందిస్తున్న సేవలపై ప్రసారం చేసిన కార్యక్రమానికి అత్యధికంగా 87,233 వ్యూయర్‌షిప్‌ లభించింది. రైతులు ఈ చానల్‌ కార్యక్రమాలను వీక్షించేందుకు అమితాసక్తిని ప్రదర్శిస్తున్నారు. ఇటీవలే యూట్యూబ్‌ నుంచి సిల్వర్‌ బటన్‌ను కూడా సాధించింది.

17. ఎన్‌ఎస్‌ఐసీ – ఏపీమెడ్‌టెక్‌ మధ్య ఒప్పందం 

Agreement between NSIC and APMedTech
Agreement between NSIC and APMedTech

వైద్య పరికరాల ఉత్పత్తిలో పరస్పరం సహకరించుకోవాలని కేంద్ర ప్రభుత్వరంగ సంస్థ నేషనల్‌ స్మాల్‌ ఇండస్ట్రీస్‌ కార్పొరేషన్‌ లిమిటెడ్‌ (ఎన్‌ఎస్‌ఐసీ), ఏపీ మెడ్‌టెక్‌ జోన్లు నిర్ణయించాయి. ఈ మేరకు కేంద్ర సూక్ష్మ, చిన్నతరహా పరిశ్రమల శాఖ మంత్రి నారాయణ్‌ రాణే సమక్షంలో అవగాహన ఒప్పందం కుదుర్చుకున్నాయి. ఎంఓయూపై ఎన్‌ఎస్‌ఐసీ సీఎండీ గౌరంగ్‌ దీక్షిత్, ఏపీమెడ్‌టెక్‌ జోన్‌ ఎండీ, సీఈఓ జితేంద్రశర్మలు సంతకాలు చేశారు.

18. Ramco Cements కర్మాగారాన్ని ప్రారంభించిన సీఎం జగన్

Ramco Cements factory
Ramco Cements factory

నంద్యాల జిల్లా కొలిమిగుండ్ల మండలం కల్వటాలలో ఏర్పాటైన ‘రామ్‌కో సిమెంట్స్‌’ కర్మాగారాన్ని సెప్టెంబర్ 28న సీఎం జగన్ మోహన్ రెడ్డి బజర్ నొక్కి ప్రారంభించారు.

అంతకు ముందు ఫ్యాక్టరీలోని పరికరాలు, టెక్నాలజీ, ఉత్పత్తి తదితర అంశాలను పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ రామ్‌కో ఇండస్ట్రీ వల్ల మన ప్రాంతానికి, మనకు మంచి జరుగుతుందన్నారు. మన పిల్లలు ఎక్కడికో వెళ్లాల్సిన పరిస్థితి లేకుండా ఇక్కడే ఉద్యోగ అవకాశాలు లభిస్తాయని చెప్పారు. ఈ ప్రాంతంలో లైమ్‌ స్టోన్‌ మైన్స్‌ ఉన్నప్పటికీ గతంలో ఎలాంటి పరిశ్రమలు లేవని ప్రస్తుతం ఇక్కడ 2 మిలియన్‌ టన్నుల క్లింకర్, 1.5 మిలియన్‌ టన్నుల గ్రైండింగ్‌ సామర్థ్యంతో ప్లాంట్‌ ఏర్పాటైందన్నారు. తద్వారా 3 మిలియన్‌ టన్నుల సిమెంట్‌ ఉత్పత్తి అవుతుందని, ఇది తొలి దశ మాత్రమేనని రాబోయే రోజుల్లో యాజమాన్యం దీన్ని విస్తరిస్తుందని అన్నారు. తద్వారా ఈ ప్రాంతంలో మెరుగైన వసతులు వస్తాయని, సీఎస్‌ఆర్‌ (కార్పొరేట్‌ సోషల్‌ రెస్పాన్స్‌బులిటీ – సామాజిక బాధ్యత) వల్ల చుట్టుపక్కల గ్రామాలకు మంచి జరుగుతుందని తెలిపారు. 75 శాతం స్థానికులకే ఉద్యోగ అవకాశాలు ఉండాలని చట్టం చేయడం వల్ల మన పిల్లలకు మంచే జరుగుతుందని వివరించారు.

19. శిక్షణ కార్యక్రమాలపై ఏపీ శాక్స్, ఎకో ఇండియా ఒప్పందం

శిక్షణ కార్యక్రమాల నిర్వహణకు సంబంధించి దిల్లీకి చెందిన ఎకో ఇండియా సంస్థతో ఆంధ్రప్రదేశ్‌ ఎయిడ్స్‌ నియంత్రణ సంస్థ (ఏపీ శాక్స్‌) ఒప్పందం కుదుర్చుకుంది. తాడేపల్లిలోని ఏపీ శాక్స్‌ కార్యాలయంలో నిర్వహించిన కార్యక్రమంలో వైద్య ఆరోగ్య శాఖ ప్రత్యేక కార్యదర్శి, ఏపీ శాక్స్‌ ప్రాజెక్టు డైరెక్టర్‌ జీఎస్‌ నవీన్‌కుమార్‌ సమక్షంలో ఏపీడీ డాక్టర్‌ కామేశ్వర్‌ప్రసాద్, ఎకో ఇండియా ఉపాధ్యక్షుడు డాక్టర్‌ సందీప్‌ భల్లాలు ఇందుకు సంబంధించిన పత్రాలపై సంతకాలు చేశారు.

APPSC Group-1
APPSC Group-1

 

 

మరింత చదవండి:

తాజా ఉద్యోగ ప్రకటనలు ఇక్కడ క్లిక్ చేయండి
ఉచిత స్టడీ మెటీరియల్ (APPSC, TSPSC) ఇక్కడ క్లిక్ చేయండి
ఉచిత మాక్ టెస్టులు ఇక్కడ క్లిక్ చేయండి

Sharing is caring!