Telugu govt jobs   »   Current Affairs   »   ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నెలవారీ కరెంట్ అఫైర్స్

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అక్టోబర్ 2023 నెల కరెంట్ అఫైర్స్ తెలుగులో, APPSC గ్రూప్స్ మరియు అన్ని పోటీ పరీక్షల ప్రత్యేకం

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కరెంట్ అఫైర్స్ అక్టోబర్ 2023 తెలుగులో: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కరెంట్ అఫైర్స్ APPSC గ్రూప్స్, పంచాయితీ సెక్రటరీ, సబ్-ఇన్‌స్పెక్టర్ మరియు కానిస్టేబుల్, జూనియర్ లెక్చరర్స్ మొదలైన పరీక్షలలో కీలక పాత్ర పోషిస్తుంది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వివిధ పోస్టుల కోసం నోటిఫికేషన్ విడుదల చేసింది. త్వరలోAPPSC గ్రూప్ 1 మరియు గ్రూప్ 2, గ్రామ సచివాలయం, ఉపాద్యాయులు మరియు ఇతర ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల చేయబడుతుంది. ప్రతి పోటి పరీక్షలలో కరెంట్ అఫైర్స్ అనేవి చాలా ముఖ్యమైన పాత్రను పోషిస్తాయి. రాష్ట్ర స్థాయి ప్రభుత్వ ఉద్యోగాలకు ఎక్కువగా ఆ రాష్ట్రము లో జరిగే అంశాలనుండి ప్రశ్నలు వస్తాయి. కాబట్టి, ప్రభుత్వ పరీక్షలకు ప్రిపరేషన్ చేస్తున్నప్పుడు అభ్యర్థులు దానిపై ప్రత్యేక శ్రద్ధ వహించాలి. మీ ప్రిపరేషన్‌ను పూర్తి చేయడానికి, మేము మీకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కరెంట్ అఫైర్స్‌ను అక్టోబర్ 2023 తెలుగులో అందిస్తున్నాము.

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అక్టోబర్ 2023 నెల కరెంట్ అఫైర్స్ తెలుగులో_3.1

APPSC/TSPSC Sure shot Selection Group

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కరెంట్ అఫైర్స్ తెలుగులో

1. పీఏసీ చైర్మన్‌గా పయ్యావుల కేశవ్‌ నియమితులయ్యారు

Payyuvula Keshav has been Appointed as PAC Chairman

ఆంధ్రప్రదేశ్ ప్రజా పద్దుల కమిటీ చైర్మన్‌గా పయ్యావుల కేశవ్‌ మరోసారి నియమితులయ్యారని అసెంబ్లీ సెక్రటరీ జనరల్ పీపీకే రామాచార్యులు ప్రకటించారు. పయ్యావుల కేశవ్‌ గారు  పీఏసీ చైర్మన్ పదవితోపాటు 2023-24 ఆర్థిక సంవత్సరానికిగాను నియమించిన అసెంబ్లీలో ఆర్థిక కమిటీల వివరాలను వెల్లడించారు.అలాగే ప్రభుత్వ రంగ సంస్థల కమిటీ (పీయూసీ)చైర్మన్‌గా వైసీపీ ఎమ్మెల్యే గ్రంధి శ్రీనివాస్‌, ఎస్టిమేట్‌ (అంచనాల) కమిటీ చైర్మన్‌గా విశ్వాసరాయి కళావతిలను నియమించారు.

2. గుంటూరు జిల్లా నవులూరులోని అంతర్జాతీయ క్రికెట్ స్టేడియం మ్యాచ్‌లకు సిద్ధమైంది

గుంటూరు జిల్లా నవులూరులోని అంతర్జాతీయ క్రికెట్ స్టేడియం మ్యాచ్_లకు సిద్ధమైంది

గుంటూరు జిల్లా నవులూరు అమరావతి టౌన్‌షిప్‌లోని అంతర్జాతీయ క్రికెట్ స్టేడియం మ్యాచ్‌లకు సిద్ధమైంది. మూడేళ్ల కిందటే నిర్మాణం పూర్తయినా నిధుల కొరత కారణంగా చివరి దశ పనులు నిలిచిపోయాయి. ప్రస్తుతం బీసీసీఐ నుంచి నిధులు విడుదల అయ్యాయి. తొలి విడతగా రూ.15 కోట్లు విడుదల కావడంతో స్టేడియంలో ఫ్లడ్ లైట్లు ఏర్పాటు చేయనున్నారు. త్వరలో అంతర్జాతీయ క్రికెట్ మ్యాచ్ నిర్వహించేందుకు ఆంధ్రా క్రికెట్ అసోసియేషన్ చర్యలు తీసుకుంటోంది.

ఆంధ్రా క్రికెట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో మూడు ట్రోఫీలు నిర్వహించేందుకు బీసీసీఐ అనుమతి ఇవ్వడంతో పాటు మ్యాచ్‌ల నిర్వహణకు అన్ని రకాల సౌకర్యాలు కల్పించారు. పురుషుల అండర్-19 వినూ మన్కడ్ ట్రోఫీ అక్టోబర్ 12 నుంచి జరగనుంది. ఈ క్రికెట్ స్టేడియంలో 15 మ్యాచ్‌లు జరగనున్నాయి. హైదరాబాద్, ఢిల్లీ, మహారాష్ట్ర, బెంగాల్, ఉత్తరాఖండ్, మేఘాలయ జట్లు పోటీపడనున్నాయి. అలాగే డిసెంబర్‌లో విజయ్ మర్చంట్ ట్రోఫీని నిర్వహించనున్నారు.

3. రాజమహేంద్రవరంలో జనవరి 5 నుంచి 7 వరకు ప్రపంచ తెలుగు మహాసభలు జరగనున్నాయి

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అక్టోబర్ 2023 నెల కరెంట్ అఫైర్స్ తెలుగులో_6.1

ఆంధ్ర సారస్వత పరిషత్, చైతన్య విద్యా సంస్థల సంయుక్త ఆధ్వర్యంలో జనవరి 5, 6, 7 తేదీల్లో 2వ అంతర్జాతీయ తెలుగు మహా సభలు మూడు రోజుల పాటు జరగనున్నాయి. రాజమహేంద్రవరంలోని గోదావరి ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ (జీఐఈటీ) ప్రాంగణంలో భారీ ఎత్తున తెలుగుతల్లి పండుగలా నిర్వహించనున్న ఈ కార్యక్రమానికి 70 దేశాల నుంచి ప్రతినిధులు హాజరు కానున్నారు.

రాజరాజ నరేంద్రుడు అవతరించి, రాజమహేంద్రవరం నగరాన్ని స్థాపించి వెయ్యేళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా నగరంలో ప్రపంచ తెలుగు మహాసభలు నిర్వహిస్తున్నట్లు ఆంధ్ర సారస్వత పరిషత్ అధ్యక్షులు డాక్టర్ గజల్ శ్రీనివాస్, గౌరవాధ్యక్షులు కెవివి సత్యనారాయణ రాజు, కార్యదర్శి తెలిపారు.

4. ఆంధ్రప్రదేశ్ హైకోర్టుకు నలుగురు కొత్త న్యాయమూర్తులను సుప్రీంకోర్టు కొలీజియం నామినేట్ చేసింది

ap High court

ఆంధ్రప్రదేశ్ హైకోర్టుకు నలుగురు కొత్త న్యాయమూర్తులను సుప్రీంకోర్టు కొలీజియం నామినేట్ చేసింది. న్యాయవాదుల కోటాలో నలుగురు సీనియర్‌ న్యాయవాదులు హరినాథ్‌, కిరణ్‌మయి, సుమిత్‌, విజయ్‌లను కొత్త న్యాయమూర్తులుగా సిఫారసు చేసింది.  హరినాథ్ ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో డిప్యూటీ సొలిసిటర్ జనరల్ (DSG)గా పనిచేస్తున్నారు, కిరణ్మయి 2016 నుండి ఆదాయపు పన్ను (IT) విభాగానికి సీనియర్ స్టాండింగ్ కౌన్సెల్‌గా పని చేస్తున్నారు. సుమతి ప్రభుత్వ ప్లీడర్‌గా పని చేస్తున్నారు, విజయ్‌కి సుమారు 25 సంవత్సరాలు అనుభవం మరియు సివిల్, క్రిమినల్, రెవెన్యూ, సర్వీసెస్, టాక్స్ మరియు పర్యావరణ విషయాలతో సహా అన్ని రకాల కేసులను వాదించారు. నలుగురి నియామకం తర్వాత మంజూరైన 37 మంది న్యాయమూర్తుల సంఖ్యతో పోలిస్తే ఆంధ్రప్రదేశ్ హైకోర్టు సంఖ్య 31కి చేరుకుంది

5. ఆంధ్రప్రదేశ్ లో దేశంలోనే అతిపెద్ద ప్రైవేటు బంగారు గని పూర్తి స్థాయి ఉత్పత్తి ప్రారంభం కానుంది.

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అక్టోబర్ 2023 నెల కరెంట్ అఫైర్స్ తెలుగులో_8.1

ఆంధ్రప్రదేశ్‌లో దేశంలోనే మొట్టమొదటి అతిపెద్ద ప్రైవేట్ బంగారు గని పూర్తి స్థాయి ఉత్పత్తి వచ్చే ఏడాది అక్టోబరు-నవంబర్ నాటికి ప్రారంభమవుతుందని డెక్కన్ గోల్డ్ మైన్స్ లిమిటెడ్ మేనేజింగ్ డైరెక్టర్ హనుమ ప్రసాద్ తెలిపారు. ఇప్పటికే పైలట్ స్కేల్ ఆపరేషన్ ప్రారంభించిన జొన్నగిరి గోల్డ్ ప్రాజెక్ట్ పూర్తి స్థాయి ఉత్పత్తిని ప్రారంభించిన తర్వాత ఏడాదికి 750 కిలోల బంగారాన్ని ఉత్పత్తి చేస్తుందని తెలిపారు. ఆంధ్రప్రదేశ్‌లోని కర్నూలు జిల్లా తుగ్గలి మండలం జొన్నగిరి, ఎర్రగుడి, పగిడిరాయి గ్రామాల సమీపంలో బంగారు గని ఉంది.DGML అన్వేషణ మరియు మైనింగ్ రంగంలో లోతైన మూలాలు కలిగిన ప్రమోటర్లచే 2003లో స్థాపించబడింది. DGML చాలా కాలంగా భారతదేశం మరియు విదేశాలలో బంగారు అన్వేషణ కార్యకలాపాలలో పాల్గొంటోంది.

6. రైతుల అభివృద్ధి కోసం ఏపీ ఫుడ్ ప్రాసెసింగ్ సొసైటీ MoUలు కుదుర్చుకుంది

రైతుల అభివృద్ధి కోసం ఏపీ ఫుడ్ ప్రాసెసింగ్ సొసైటీ MoUలు కుదుర్చుకుంది

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఫుడ్ ప్రొసెసింగ్ సొసైటి రైతులకు లబ్ధి చేకూరచేలా మరియు వారి ఆదాయాన్ని పెంచి వారి అభివృద్ధి కోసం వివిధ సంస్థలతో మౌలిక అవగాహన ఒప్పందాలుMoU చేసుకుంది. ఈ ఒప్పందం ఆంధ్ర ప్రగతి గ్రామీణ బ్యాంక్ (APGB), రహేజా సోలార్ ఫుడ్ ప్రొసెసింగ్ ప్రైవేట్ లిమిటెడ్ (RSFPL) మరియు దామోదరం సంజీవయ్య జాతీయ న్యాయ విశ్వవిధ్యాలయం తో ఆంధ్రప్రదేశ్ ఫుడ్ ప్రొసెసింగ్ సొసైటి అవగాహన ఒప్పందం కుదుర్చుకుంది. కంపెనీ CEO శ్రీధర్ రెడ్డి గాఋ ఒప్పంద పాత్రల మీద సంతకాలు చేసి మార్చుకున్నారు.

7. ప్రకాశం బ్యారేజ్ కి అంతర్జాతీయ గుర్తింపు లభించింది

ప్రకాశం బ్యారేజ్ కి అంతర్జాతీయ గుర్తింపు లభించింది

నవంబర్ 2 నుండి 8 వరకు విశాఖపట్నంలో జరిగిన అంతర్జాతీయ ICID కాంగ్రెస్‌ 25వ సదస్సు లో ప్రకాశం బ్యారేజీ కి ప్రతిష్టాత్మక WHIS అవార్డు దక్కింది. ఈ అవార్డు విషయం ఇండియన్ నేషనల్ కమిటీ ఆన్ ఇరిగేషన్ అండ్ డ్రైనేజీ (IN CID) డైరెక్టర్ అవంతి వర్మ శుక్రవారం రాష్ట్ర జలవనరుల శాఖ ముఖ్య కార్యదర్శికి తెలిపారు. ప్రకాశం బ్యారేజి కి వందేళ్లకు పైగా చరిత్ర ఉంది, అంతటి ఈ చారిత్రక కట్టడానికి అంతర్జాతీయ నీటిపారుదల, డ్రైనేజీ కమిషన్ (ICID) వరల్డ్ హెరిటేజ్ ఇరిగేషన్ స్ట్రక్చర్ (WHIS)గా ప్రకటించడం ఎంతో గర్వకారణం. 2023 సంవత్సరానికి ICID గుర్తించిన ప్రపంచవ్యాప్తంగా 19 నిర్మాణాలకు ఈ అవార్డు అందించింది అందులో ప్రకాశం బ్యారేజీ దీనినే పాత కృష్ణా ఆనకట్ట అని కూడా అంటారు నిలిచింది.

8. పొట్టి శ్రీరాములు కళాశాలకు ఎడ్యు ఎక్సలెన్స్ అవార్డు

పొట్టి శ్రీరాములు కళాశాలకు ఎడ్యు ఎక్సలెన్స్ అవార్డు

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉన్నత విద్యామండలి మంగళవారం నాడు విజయవాడలో నిర్వహించిన రసస్వద-ది అప్రిసియేషన్ 2023 కార్యక్రమంలో పొట్టి శ్రీరాములు చలవాడి మల్లికార్జునరావు కాలేజ్ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ (అటానమస్) కళాశాల NAAC A++ సాధించినందుకు రసవాడలో ఎడ్యుకేషన్ ఎక్సలెన్స్-2023 అవార్డు అందించింది. ఈ అవార్డు కళాశాలలో ఉన్నత ప్రమాణాలను తెలియజేస్తుంది అలాగే కళాశాల న్యాక్ గణాంకాలలో అత్యున్నత గ్రేడ్ సాధించినందుకు ప్రొఫెసర్ జె.లక్ష్మీనారాయణ హర్షం వ్యక్తం చేశారు. విధ్యయశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ ప్రిన్సిపల్ ప్రొఫెసర్ జె.లక్ష్మీనారాయణకు, కళాశాల కార్యదర్శి పడుచూరి లక్ష్మణస్వామి కి అవార్డుని ప్రధానం చేశారు. ఈ కార్యక్రమానికి ఇతర ఉన్నతాధికారులు ప్రముఖులు హాజరయ్యారు.

9. ఏపీలో తొలి ఎలక్ట్రిక్ డబుల్ డెక్కర్ బస్సు తిరుపతిలో ప్రారంభించారు

ఏపీలో తొలి ఎలక్ట్రిక్ డబుల్ డెక్కర్ బస్సు తిరుపతిలో ప్రారంభించారు

ఆంధ్రప్రదేశ్, తిరుపతిలో ప్రత్యేకంగా రూ.2 కోట్ల విలువైన ఈవీ డబుల్ డెక్కర్ బస్సులను ప్రారంభించారు. గత నెలలో ప్రారంభించిన ట్రయల్ రన్ విజయవంతమైంది అందులో భాగంగా టెంపుల్ సిటీ అయిన తిరుపతిలో తొలిసారిగా ఎయిర్ కండిషన్డ్ ఎలక్ట్రిక్ డబుల్ డెక్కర్ బస్సులను నడపనున్నారు.  హైదరాబాద్ తర్వాత దక్షిణ భారతదేశంలో తిరుపతి లోనే ఈ విద్యుత్ తో నడిచే డబల్ డెక్కర్ బస్లను వినియోగంలోకి తీసుకుని వచ్చారు. ఈ పర్యావరణ అనుకూల ప్రయాణ సౌకర్యాన్ని ప్రజలకోసం ప్రారంభించారు. అశోక్ లేలాండ్ కు చెందిన ఎలక్ట్రిక్ బస్ ను కేంద్ర ప్రభుత్వ స్మార్ట్ సిటీ ప్రాజెక్టులో భాగంగా ఈ బస్ లను ప్రారంభించారు. వీటిని తిరుపతి స్మార్ట్ సిటీ కార్పొరేషన్ లిమిటెడ్ ఆధ్వర్యంలో EV బస్సులను నగరపాలక సంస్థ కొనుగోలు చేసింది.

10. ఏపీ జస్టిస్ లక్ష్మారెడ్డి 9141 కేసులను డీల్ చేసి గొప్ప రికార్డు సృష్టించారు

ఏపీ జస్టిస్ లక్ష్మారెడ్డి 9141 కేసులు విచారించి గొప్ప రికార్డు సృష్టించారు

ఆంధ్రప్రదేశ్ కుర్నూల్ లోకాయుక్త న్యాయమూర్తిగా 2019 లో బాధ్యతలు చేపట్టిన జస్టిస్ లక్ష్మారెడ్డి కేవలం నాలుగేళ్లలో లోకాయుక్తకు అందిన 9,141 ఫిర్యాదులపై విచారణ జరిపి తీర్పులు వెలువరించి రికార్డు సృష్టించారు. మరియు ఆయన నియామకం తో పాటు ప్రభుత్వం జాప్యం కారణంగా డిప్యూటీ లోకాయుక్త బాధ్యతలను కూడా తానే స్వయంగా చేపట్టారు. దేశం లోని ఏ లోకాయుక్త కూడా ఇన్ని తీర్పులు వెలువరించలేదు కావున ఆ ఘనత జస్టిస్ లక్ష్మారెడ్డి గారికే చెందుతుంది.

11. విశాఖపట్నంలో కాశ్మీరీ యూత్ ఫెస్టివల్

విశాఖపట్నంలో కాశ్మీరీ యూత్ ఫెస్టివల్

విశాఖపట్నం లోనే మొట్టమొదటి సారిగా నిర్వహించబడుతున్న కాశ్మీరీ యూత్ ఫెస్టివల్ కి సంభందించిన ఏర్పాట్ల గురించి నెహ్రూ యువకేంద్రం అధికారులు జి. మహేశ్వర మరియు అల్లం రాంప్రసాద్, తెలిపారు. ఈ ఉత్సవానికి విచ్చేసే 120 సందర్శకులకు మన సంప్రదాయం, ఆహారపు అలవాట్లు, పద్దతులు మరియు సంస్కృతి తో పాటు కేంద్ర పథకాల గురించి  పూర్తిగా తెలియజేస్తారు. ఐదు రోజుల పాటు జరిగే ఈ కాశ్మీరీ యూత్ ఫెస్టివల్ అక్టోబర్ 2 నుంచి 7 వరకూ నిర్వహిస్తారు. దీనికి శ్రీనగర్ కి చెందిన 6 జిల్లాల నుంచి మొత్తం 120 మంది విశాఖపట్నం జిల్లా మరియు పరిసర ప్రముఖ ప్రాంతాలు సందర్శించి, నైపుణ్యం గురించి శిక్షణా తరగతులకు హాజరవుతారు.

12. “విజన్ విశాఖపట్నం 2030” కార్యక్రమం

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అక్టోబర్ 2023 నెల కరెంట్ అఫైర్స్ తెలుగులో_15.1

బిజెపి రాజ్యసభ సభ్యుడు GVL నరసింహారావు తన “విజన్ విశాఖపట్నం 2030” కార్యక్రమంలో భాగంగా ఆదివారం ట్రావెల్, టూరిజం మరియు హోటల్ రంగాల ప్రతినిధులతో సమావేశం నిర్వహించారు. “విజన్ విశాఖపట్నం 2030”లో భాగంగా, జీవీఎల్ ఇప్పటికే విశాఖపట్నం నుండి షిప్పింగ్, ఫార్మా, ఎరువులు, రసాయనాలు మరియు ఆక్వా రంగ పరిశ్రమల ప్రతినిధులతో సమావేశాలు నిర్వహించి, ఈ రంగాల అభివృద్ధికి రోడ్ మ్యాప్‌ను సిద్ధం చేయడానికి కేంద్ర మంత్రులతో పరిశ్రమల ప్రతినిధులతో పరస్పర చర్చలు ఏర్పాటు చేశారు.

13. వైజాగ్‌లో ఇన్ఫోసిస్ డెవలప్‌మెంట్ సెంటర్‌ను ఏపీ సీఎం వైఎస్ జగన్ ప్రారంభించారు

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అక్టోబర్ 2023 నెల కరెంట్ అఫైర్స్ తెలుగులో_16.1

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సోమవారం విశాఖపట్నంలో ఇన్ఫోసిస్ సాఫ్ట్‌వేర్ డెవలప్‌మెంట్ సెంటర్‌ను ప్రారంభించారు. 83,750 చదరపు అడుగుల విస్తీర్ణంలో విస్తరించి ఉన్న ఈ సదుపాయం ఉద్యోగులకు వారి ఇళ్లకు దగ్గరగా ఉంటూ హైబ్రిడ్ మోడ్‌లో పని చేయడానికి ఎక్కువ సౌలభ్యాన్ని అందిస్తుంది. కొత్త డేటా సెంటర్ క్లౌడ్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) మరియు డిజిటల్ వంటి తదుపరి తరం సాంకేతికతల ద్వారా ప్రపంచ అవకాశాలపై పని చేయడానికి స్థానిక ప్రతిభావంతులను ఆకర్షించడానికి, రీస్కిల్ చేయడానికి మరియు అప్‌స్కిల్ చేయడానికి ఇన్ఫోసిస్‌ని అనుమతిస్తుంది. ఇన్ఫోసిస్ డెవలప్‌మెంట్ సెంటర్ (IDC) సుమారు 1,000 మంది ఉద్యోగులకు వసతి కల్పిస్తుంది మరియు ఇన్ఫోసిస్ యొక్క భవిష్యత్తు-సిద్ధమైన హైబ్రిడ్ వర్క్‌ప్లేస్ స్ట్రాటజీతో సమలేఖనం చేయబడింది.

14. ఆయుర్ పర్వ 2023 జాతీయ సదస్సు తిరుపతిలో జరగనుంది

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అక్టోబర్ 2023 నెల కరెంట్ అఫైర్స్ తెలుగులో_17.1

TTD మందారిన్ల మద్దతుతో, దాని ఆయుర్వేద విభాగం ఇటీవలి కాలంలో అనేక విప్లవాత్మక సంస్కరణలను ప్రవేశపెట్టింది మరియు ఆయుష్ మంత్రిత్వ శాఖ మరియు అఖిల భారత ఆయుర్ సమ్మేళన్ అక్టోబర్ 27 నుండి 29 వరకు సంయుక్తంగా నిర్వహించే 3-రోజుల జాతీయ సదస్సు ఆయుర్ పర్వ 2023లో భాగంగా ఏర్పాటు చేసింది. తిరుపతిలోని కచపా ఆడిటోరియంలో, టిటిడిలోని SV ఆయుర్వేద ఆసుపత్రి ప్రిన్సిపల్ (ఎఫ్‌ఎసి) మరియు మెడికల్ సూపరింటెండెంట్ మరియు శ్రీ శ్రీనివాస ఆయుర్వేద ఫార్మసీ ఇన్‌ఛార్జ్ డాక్టర్ రేణు దీక్షిత్‌కు సమాచారం అందించారు.

ఆయుర్ పర్వ 2023 అనేది తిరుపతిలో అక్టోబర్ 27 నుండి 29 వరకు జరిగే జాతీయ సదస్సు. ఈ సదస్సుకు కచపా ఆడిటోరియంలోని ఎస్‌వీ ఆయుర్‌ ఆసుపత్రి వేదిక కానుంది. ఆయుష్ మంత్రిత్వ శాఖ మరియు అఖిల భారత ఆయుర్ సంయుక్తంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించాయి. ఆయుర్ పర్వంలో టీటీడీ ఆయుర్వేద విభాగం పాల్గొంటుంది.

15. APలో 3 పక్షుల సంరక్షణ కేంద్రాలను కమ్యూనిటి రిజర్వ్ ప్రాంతాలుగా మార్చనున్నారు

APలో 3 పక్షుల సంరక్షణ కేంద్రాలను కమ్యూనిటి రిజర్వ్ ప్రాంతాలుగా మార్చనున్నారు

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో, శ్రీకాకుళం జిల్లాలో ఉన్న తేలినీలాపురం పక్షుల కేంద్రం, గుంటూరు జిల్లాలో ఉన్న ఉప్పలపాడు పక్షుల కేంద్రం, అనకాపల్లి జిల్లాలో ఉన్న కాండకర్ల అవ సరస్సు లను కమ్యూనిటి రిజర్వ్ ప్రాంతాలుగా మార్చానున్నట్టు అటవీ అధికారులు తెలిపారు. ఈ మూడు పక్షుల కేంద్రాలను అభివృద్ధి చేయడం వలన వలస వచ్చే పక్షులకు ఎంతో ఉపయోగకరంతో పాటు పర్యాటకంగా కూడా అభివృద్ది అవుతుంది. స్థానికుల సహకారంతో ఈ మూడు జిల్లాలలో ఉన్న పక్షుల కేంద్రాలను కమ్యూనిటి రిజర్వ్ ప్రాంతాలుగా తీర్చి దిద్దేందుకు మార్గదర్శకాలను సిద్దం చేస్తున్నట్టు అధికారులు తెలిపారు. శ్రీకాకుళం జిల్లా తేలినీలాపురంలో 30 కిలోమీటర్లు విస్తీర్ణంలో ఉంది. ఇక్కడకి పక్షులు శీతాకాలంలో గూడు కట్టేందుకు దాదాపుగా 200 రకాలు పైగా పక్షి జాతులతో పాటు పెలికాన్, పేయింటెడ్ స్టార్క్ వంటివి సైబీరియా నుంచి వస్తాయి.

16. ప్రధాన మంత్రి గ్లోబల్ మారిటైమ్ ఇండియా సమ్మిట్ 2023 ను విశాఖపట్నంలో ప్రారంభించారు

ప్రధాన మంత్రి గ్లోబల్ మారిటైమ్ ఇండియా సమ్మిట్ 2023 ను విశాఖపట్నంలో ప్రారంభించారు

ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ వీడియో కాన్ఫరెన్సింగ్ ద్వారా గ్లోబల్ మారిటైమ్ ఇండియా సమ్మిట్ (GMIS) 2023 ను ప్రారంభించారు. ఈ సమ్మిట్ అక్టోబర్ 17 నుంచి 19 వరకు సమ్మిట్ ముంబైలోని ఎంఎంఆర్‌డీఏ గ్రౌండ్స్‌లో జరిగినది. మూడు రోజుల గ్లోబల్ మారిటైమ్ ఇండియా సమ్మిట్‌లో మొదటి రోజు రూ. 3.24 లక్షల కోట్ల విలువైన 34 ఒప్పందాలపై సంతకాలు జరిగాయి, ఇది భారతదేశాన్ని సముద్ర శక్తిగా మార్చడానికి వివిధ వాటాదారుల నిబద్ధతను ప్రతిబింబిస్తుంది. ఈ కార్య‌క్ర‌మంలో ప్ర‌ధాన మంత్రి భార‌త న‌గ‌ర నీలి ఆర్థిక వ్య‌వ‌స్థ‌కు సంబంధించిన దీర్ఘ‌కాల బ్లూప్రింట్ ‘అమృత్ కాల్ విజ‌న్ 2047’ని ఆవిష్క‌రించారు.  విశాఖ పోర్టు లో 655 కోట్లతో Q7, WQ 6,7,8, బెర్తు లను యాంత్రికరణ పనులను ప్రదాన మంత్రి శంకుస్థాపన చేశారు. ఇప్పటికే పూర్తయిన విశాఖపట్నం కంటైనర్ టెర్మినల్ పనుల రెండవ దశ పనులను జాతికి అంకితం చేశారు, ఈ పనులను 633కోట్లతో పూర్తిచేశారు. 

గ్లోబల్ మారిటైమ్ ఇండియా సమ్మిట్ (GMIS) 2023లో గుడివాడ అమరనాథ్ సమక్షంలో విశాఖపట్నం పోర్టు ట్రస్ట్, NHAI అధికారులు వివిధ ఒప్పందాలను కుదుర్చుకున్నారు.

17. విశాఖపట్నం పోర్ట్ అథారిటీ గ్లోబల్ మారిటైమ్ సమ్మిట్‌లో రూ.1,400 కోట్ల విలువైన ఒప్పందాలను కుదుర్చుకుంది

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అక్టోబర్ 2023 నెల కరెంట్ అఫైర్స్ తెలుగులో_20.1

విశాఖపట్నం పోర్ట్ అథారిటీ (VPA) నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా (NHAI) మరియు ట్రియాన్ ప్రాపర్టీస్‌తో రూ. 1,400 కోట్ల విలువైన ప్రాజెక్టులను అమలు చేయడానికి ఒప్పందాలు కుదుర్చుకుంది. ముంబైలో జరుగుతున్న గ్లోబల్ మారిటైమ్ ఇండియా సమ్మిట్, 2023లో పోర్ట్ అథారిటీ ఈ ఒప్పందాలను కుదుర్చుకుంది. విశాఖపట్నం పోర్ట్ అథారిటీ (VPA) NHAI తో అవగాహన ఒప్పందాన్ని (MOU) మార్చుకుంది. ఈ అవగాహన ఒప్పందంలో భాగంగా, NHAI కాన్వెంట్ జంక్షన్ నుండి షీలా నగర్ వరకు ప్రస్తుతం ఉన్న నాలుగు లేన్ల రహదారిని ఆరు లేన్లుగా అభివృద్ధి చేస్తుంది. ఇందుకోసం వీపీఏ దాదాపు రూ.500 కోట్లు వెచ్చిస్తున్నట్లు పోర్టు అథారిటీ ఓ పత్రికా ప్రకటనలో తెలిపింది.

18. వైజాగ్ SEZ ఎగుమతులు ఏప్రిల్-సెప్టెంబర్ 2023లో రూ.1 ట్రిలియన్‌ దాటాయి

VIZAG SEZ exports crossed 1 trillion in august- september

విశాఖపట్నం స్పెషల్ ఎకనామిక్ జోన్ (VSEZ) గత 32 ఏళ్లలో మొదటిసారిగా 2020-21లో రూ. 1 ట్రిలియన్ ఎగుమతులను సాధించి ఒక రికార్డు ను సృష్టించింది. తాజాగా ఈ ఏప్రిల్-సెప్టెంబర్ మధ్యన మరోసారి రూ.1ట్రిలియన్ మార్కును దాటాడమే కాకుండా గత ఏడాదితో పోలిస్తే 30శాతం వృద్ధి ని నమోదు చేసింది అని VSEZ అధికారి శ్రీనివాస్ ముప్పాల తెలిపారు. వృద్ధి పరంగా దేశంలోని అన్ని సెజ్‌లలో మొదటి స్థానంలో నిలిచింది.

2019-20లో రూ. 96,886 కోట్ల ఎగుమతులు ఈ ఏడాదిలో రూ. 1,03,513 కోట్లకు చేరుకున్నాయి. సేవల ఎగుమతులు రూ.76,413 కోట్లు, వాణిజ్య ఎగుమతులు రూ.28,315 కోట్లు గా నమోదయ్యాయి. అంతక్రితం ఏడాదితో పోలిస్తే సేవల ఎగుమతులు 34 శాతం, వాణిజ్య ఎగుమతులు 21 శాతం పెరుగుదల నమోదైంది.  VSEZ కు రూ.1.04 కోట్ల పెట్టుబడితో పాటు, 2023లో 6.61 లక్షల మందికి ఉద్యోగ అవకాశాలు లభించాయి.

19. శ్రేష్టతకు గుర్తింపు: ప్రముఖులకు 27 వైఎస్సార్ అవార్డులు ప్రదానం

శ్రేష్టతకు గుఖులకు 27 వైఎస్సార్ అవార్డులు ప్రదానం

రాష్ట్ర ప్రభుత్వం 2023 సంవత్సరానికి గాను YSR జీవితకాల సాఫల్య మరియు సాఫల్య పురస్కారాల గ్రహీతలను మూడవ సంవత్సరం కూడా ప్రకటించింది. GDV కృష్ణ మోహన్ రెండు విభాగాలలో కలిపి మొత్తం 27 మంది పేర్లను ప్రకటించారు. స్క్రీనింగ్ కమిటీ 23 మంది జీవితకాల సాఫల్య పురస్కారాలు మరియు 4 ని అచీవ్‌మెంట్ అవార్డులుకు ఎంపిక చేసింది. ఈ అవార్డులు వివిధ రంగాలకు చెందిన ప్రముఖులను వారు చేసిన సామాజిక  బాధ్యత ను గుర్తిస్తుంది. అవార్డు పొందిన వారికి బహుమానం కూడా అందిస్తారు. డా. YSR లైఫ్‌టైమ్ అచీవ్‌మెంట్ అవార్డు కింద రూ.10 లక్షల నగదు, డా. YSR కాంస్య బొమ్మ, స్మారక చిహ్నం, ప్రశంసా పత్రం అందిస్తారు. డా. YSR అచీవ్‌మెంట్ అవార్డు కింద రూ.5 లక్షల నగదు బహుమతి, ప్రతిమ, ప్రశంసా పత్రం అందజేస్తారు.

20. ప్రతిష్టాత్మకమైన నీతి ఆయోగ్ ప్రాజెక్టుకు ఏయూ వైస్ ఛాన్సలర్ ఎంపికయ్యారు

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అక్టోబర్ 2023 నెల కరెంట్ అఫైర్స్ తెలుగులో_23.1

ఆంధ్రా యూనివర్శిటీ బయోకెమిస్ట్రీ డిపార్ట్‌మెంట్ రీసెర్చ్ స్కాలర్ బాతా హెప్సిబా వినీలా నీతి ఆయోగ్ ఆకాంక్షాత్మక బ్లాక్ ఫెలోషిప్‌కు ఎంపికయ్యారు. ఆమె అల్లూరి సీతారామరాజు జిల్లా వై రామవరం మండలానికి ఆస్పిరేషనల్ బ్లాక్ ఫెలోగా పని చేస్తారు. ఆస్పిరేషనల్ బ్లాక్ ఫెలోగా (ABF) ఎంపికైన వారికి నెలకు 55,000 స్టైఫండ్ ఇవ్వబడుతుంది. తి ఆయోగ్ దేశవ్యాప్తంగా మొత్తం 500 ఆస్పిరేషనల్ బ్లాక్‌లను ఎంపిక చేసింది. ఇందులో 15 బ్లాక్‌లు ఆంధ్రప్రదేశ్‌ నుంచి ఎంపికయ్యాయి. ABFలు తమకు కేటాయించిన ప్రాంతంలోని స్థానిక ప్రజలకు అవగాహన కల్పించేందుకు వర్క్‌షాప్‌లు, అవగాహన సదస్సులు మరియు నైపుణ్య శిక్షణ కార్యక్రమాలను నిర్వహిస్తారు.

21. విశాఖ కు చెందిన అన్మిష్, మార్షల్ ఆర్ట్స్ లో రికార్డు సృష్టించారు

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అక్టోబర్ 2023 నెల కరెంట్ అఫైర్స్ తెలుగులో_24.1

అంతర్జాతీయ వేదికపై , విశాఖకు చెందిన భూపతిరాజు అన్మిష్‌ వర్మ మరోసారి సత్తాచాటారు. ఈ మార్షల్‌ ఆర్ట్స్‌ పోటీల్లో అన్మిష్‌కు ఇది వరుసగా మూడో బంగారు పతకం కావడం విశేషం.  దీంతో ఓ అరుదైన ఘనతను అన్మిష్‌ సొంతం చేసుకున్నారు. ఈ చాంపియన్ వరుసగా మూడుసార్లు స్వర్ణ పతకాన్ని గెలిచిన క్రీడాకారుడిగా ప్రపంచ రికార్డు సృష్టించారు. కెనడా వేదికగా జరిగిన ఓల్డ్‌ మార్షల్‌ ఆర్ట్స్‌ ఛాంపియన్‌ షిప్‌లో అన్మిష్‌ వర్మ గోల్డ్‌మెడల్‌ను సాధించారు.

భారత్ తరఫున 75 కిలోల విభాగంలో అన్మిష్ బంగారు పతకం కైవసం చేసుకున్నారు. ఈ మార్షల్‌ ఆర్ట్స్‌ పోటీల్లో అన్మిష్‌కు ఇది వరుసగా మూడో బంగారు పతకం సాధించడం. దీంతో మార్షల్ ఆర్ట్స్ ఛాంపియన్ షిప్‌లో హ్యాట్రిక్ గోల్డ్ మెడల్ సాధించిన తొలి భారత అథ్లెట్‌గా అన్మిష్ రికార్డులకెక్కారు. అంతకుముందు 2018లో గ్రీస్‌ వేదికగా జరిగిన మార్షల్ ఆర్ట్స్‌లో పసిడి పతకం సొంతం చేసుకున్న అన్మిష్, 2019లో ఆస్ట్రియా లో జరిగిన ఈవెంట్‌లోనూ బంగారు పతకం సాధించారు.

22. APCICT డిజిటల్ లీడర్స్ కార్యక్రమంలో పాల్గొననున్న SPMVV అధ్యాపకులు

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అక్టోబర్ 2023 నెల కరెంట్ అఫైర్స్ తెలుగులో_25.1

అక్టోబర్ 24 నుంచి 26 వరకు కొరియాలో జరిగే వార్షిక APCICT డిజిటల్ లీడర్స్ కార్యక్రమంలో SPMVV రిజిస్ట్రార్ ప్రొఫెసర్ N రజని, ఇంటర్నేషనల్ రిలేషన్స్ డీన్ ప్రొఫెసర్ పి.విజయలక్ష్మి, SPMVV అధ్యాపకులు మరియు AP స్టేట్ కౌన్సిల్ ఆఫ్ హయ్యర్ ఎడ్యుకేషన్ (APSCHE) వైస్ చైర్పర్సన్ ప్రొఫెసర్ పి.ఉమామహేశ్వరీదేవి పాల్గొంటున్నారు.

కొరియాలో డిజిటల్ పరివర్తన ద్వారా మహిళా పారిశ్రామికవేత్తలకు సాధికారత కల్పించేందుకు ఉద్దేశించిన కార్యక్రమానికి హాజరు కావాలని వారిని ఆహ్వానించారు. ఇంచియాన్ మెట్రోపాలిటన్ సిటీ, APCICT (ఆసియా, పసిఫిక్ ట్రైనింగ్ సెంటర్ ఫర్ కమ్యూనికేషన్ టెక్నాలజీ ఫర్ ఇన్ఫర్మేషన్ అండ్ కమ్యూనికేషన్ టెక్నాలజీ) సంయుక్తంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాయి.

లక్ష్యం : డిజిటల్ లీడర్స్ ప్రోగ్రామ్ యొక్క ప్రధాన లక్ష్యం డిజిటల్ లీడర్స్ మరియు ఛాంపియన్‌ల నెట్‌వర్క్‌ను బలోపేతం చేయడం, డిజిటల్ ట్రాన్స్‌ఫర్మేషన్ మరియు ఇన్నోవేషన్ ద్వారా మహిళా పారిశ్రామికవేత్తలకు సాధికారత కల్పించే పనికి మద్దతు ఇవ్వడం.

23. ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం రెండు కొత్త లెదర్ పార్క్ లను ఆమోదించింది

ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం రెండు కొత్త లెదర్ పార్క్ లను ఆమోదించింది

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్రం లో కొత్తగా రెండు లెదర్ పార్కులను ఏర్పాటు చేసేందుకు LIDCAP కసరత్తు చేస్తోంది. కృష్ణ జిల్లా మరియు ప్రకాశం జిల్లాలలో ఈ లెదర్ పార్కు లను ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వం తరపునుంచి రూ.12 కోట్లు కూడా మంజూరు అయ్యాయి. ఇప్పటికె కృష్ణ, గుంటూరు, తిరుపతి కర్నూల్, అనంతపురం, పార్వతీపురం మన్యం, శ్రీకాకుళంలో ఉన్న లెదర్ పార్కులకు ఈ రెండు లెదర్ పార్కు కలిపి మొత్తం 9 లెదర్ పార్కులు  రాష్ట్రంలో పనిచేయనున్నాయి. లెదర్ పార్కులను అభివృద్ది చేయడమే కాకుండా తగిన శిక్షణ కోసం శిక్షణా కేంద్రాలు కూడా ప్రారంభించనున్నారు. ప్రకాశం జిల్లా లోని యడవల్లి గ్రామం, కృష్ణ జిల్లా లోని జి. కోడూరు గ్రామాలలో ఈ లెదర్ పార్కులు ఏర్పాటు చేయనున్నారు.

24. విశాఖపట్నంలో ‘ఇంటర్నేషనల్ పీఆర్ ఫెస్టివల్ 2023’ పోస్టర్‌ను మిజోరం గవర్నర్ కే హరిబాబు విడుదల చేశారు

Mizoram Governor K Haribabu released the ‘International PR Festival 2023’ poster in Visakhapatnam-01

పబ్లిక్ రిలేషన్స్ సొసైటీ ఆఫ్ ఇండియా (PRSI) జాతీయ ప్రధాన కార్యదర్శి పీఎల్కే మూర్తి, మరియు ఇతర సభ్యుల సమక్షంలో ‘ఇంటర్నేషనల్ నేషనల్ పీఆర్ ఫెస్టివల్ 2023’ పోస్టర్ ఆవిష్కరణ జరిగింది. విశాఖపట్నం లోని మిజోరం గవర్నర్ కే హరిబాబుగారి నివాసంలో ఇంటర్నేషనల్ నేషనల్ పీఆర్ ఫెస్టివల్ 2023 పోస్టర్ ను ఆయన ఆవిష్కరించారు. ఆయన మాట్లాడుతూ ఈ సంవత్సరం థీమ్ ‘జి 20: భారతీయ విలువలు మరియు ప్రజా సంబంధాల కోసం ప్రపంచ అవకాశాలకు అభివృద్ధి చెందుతున్న భారతదేశాన్ని ప్రదర్శించడం’ ఎంతో ముఖ్యమైనది మరియు భారతదేశం యొక్క విలువలను మరియు ముఖచిత్రాన్ని ప్రపంచానికి చాటి చెబుతుంది అని, ఆ థీమ్ ఎంచుకున్నందుకు కృతజ్ఞతలు తెలియజేశారు.

25. రామాయపట్నం పోర్ట్ వద్ద పారిశ్రామిక అభివృద్ధి

రామాయపట్నం పోర్ట్ వద్ద పారిశ్రామిక అభివృద్ధి

రామాయపట్నం పోర్ట్ ని డిసెంబర్ నాటికి పూర్తి చేయనున్నారు. AP మారిటైమ్ బోర్డ్  పోర్ట్ సమీపంలో సుమారు 8000 ఎకరాల విస్తీర్ణంలో అభివృద్ది పనులు చేపట్టనుంది. పారిశ్రామిక పార్కు ఏర్పాటు కోసం భూ సమీకరణ జరుగుతోంది అని ఎండీ, సిఈఓ ప్రవీణ్ కుమార్ తెలిపారు. మొదటి దశ కింద 4,850 ఎకరాలలో పారిశ్రామిక పార్కు నెల్లూరు జిల్లాలో చేవూరులో 1312.58 ఎకరాలు మరియు రావూరు లో 951.77 ఎకరాలు సేకరించనున్నారు. ఇప్పటికే రామాయపట్నం తొలిదశ పనులు 2,634.65 కోట్లతో నవయుగ-అరబిందో భాగస్వామ్య కంపెనీ జూన్ 2022లో చేపట్టింది. ఈ పనుల వలన సంవత్సరానికి దాదాపుగా 34 మిలియన్ టన్నుల సామర్ధ్యం ఉంటుంది. ఈ పనులలో బల్క్ కార్గో బర్త్ను AP మారిటైమ్ బోర్డ్ కు అందించనుంది. రామాయపట్నం పోర్టు పక్కన కార్గో ఆధారిత ఎయిర్ పోర్ట్ నిర్మాణం పై దృష్టి పెట్టింది.

26. ఆసియా షూటింగ్ ఛాంపియన్‌షిప్‌లో మద్దినేని ఉమ మహేష్ జట్టు రజతం సాధించింది

Maddineni Uma Mahesh Team Clinched Silver Asian Shooting Championship

సౌత్ కొరియా లో చాంగ్‌వాన్ నగరం లో జరుగుతున్న 15వ ఆసియా షూటింగ్ చాంపియన్షిప్ పోటీలలో 10 మీటర్ల ఎయిర్ రైఫెల్ జూనియర్ మిక్స్డ్ విభాగంలో భారతదేశం తరపున పాల్గొన్న క్రీడా కారులు రజతం సాధించారు. ఆంధ్రప్రదేశ్ కు చెందిన ఉమామహేష్ మద్దినేని మరియు మధ్యప్రదేశ్ కి చెందిన భావనా తో కలిసి రజత పతాకం సాధించారు. జూనియర్ పురుషుల విభాగం లో ముగ్గురిలో ఒకరైన ధనుష్ శ్రీకాంత్‌ను పోటీకి అనర్హులుగా ప్రకటించడం తో ఆ విభాగం లో బంగారు పతకం సాధించే అవకాశం కోల్పోయింది. పతకం సాధించడం భారతదేశానికి ఎంతో గర్వకారణమని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రైఫెల్ అధ్యక్షులు లలిత్ తెలిపారు.

AP State Monthly Current Affairs October 2023 in English

Andhra Pradesh State October 2023 Current Affairs in Telugu

pdpCourseImg

 మరింత చదవండి
తాజా ఉద్యోగ ప్రకటనలు ఇక్కడ క్లిక్ చేయండి
ఉచిత స్టడీ మెటీరియల్ (APPSC, TSPSC) ఇక్కడ క్లిక్ చేయండి
ఉచిత మాక్ టెస్టులు ఇక్కడ క్లిక్ చేయండి
Adda247 తెలుగు APP ఇక్కడ క్లిక్ చేయండి

Sharing is caring!