Telugu govt jobs   »   Current Affairs   »   Andhra Pradesh State Current affairs In...

Andhra Pradesh State Current affairs In Telugu November 2022 | ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కరెంట్ అఫైర్స్ నవంబర్ 2022 తెలుగులో

Andhra Pradesh State Current affairs In Telugu November 2022: Andhra Pradesh state current affairs plays crucial role in GROUP-1, GROUP-2, Panchayat Secretary, GROUP-4 , Assistant Engineer(AE), Sub-Inspector and Constable, Junior Lecturers etc., exams.. Andhra Pradesh Government releases notification for Various posts through Andhra Pradesh like GROUP-1, GROUP-2, Panchayat Secretary, GROUP-4 , Assistant Engineer(AE), Sub-Inspector and Constable, Junior Lecturers, Degree Lecturers and various executive and non-executive posts under various departments of Telangana. Current affairs play a very important role in the competitive examinations and hence, aspirants have to give undivided attention to it while doing preparation for the government examinations. To complement your preparation, we are providing you the Andhra Pradesh State Current affairs In Telugu Novemeber2022.

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కరెంట్ అఫైర్స్ నవంబర్ 2022 తెలుగులో: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కరెంట్ అఫైర్స్ GROUP-1, GROUP-2, పంచాయితీ సెక్రటరీ, GROUP-4, అసిస్టెంట్ ఇంజనీర్(AE), సబ్-ఇన్‌స్పెక్టర్ మరియు కానిస్టేబుల్, జూనియర్ లెక్చరర్స్ మొదలైన పరీక్షలలో కీలక పాత్ర పోషిస్తుంది.. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వివిధ పోస్టుల కోసం నోటిఫికేషన్ విడుదల చేసింది. APPSC  ద్వారా GROUP-1, GROUP-2, పంచాయితీ సెక్రటరీ, GROUP-4, అసిస్టెంట్ ఇంజనీర్ (AE), సబ్-ఇన్‌స్పెక్టర్ మరియు కానిస్టేబుల్, జూనియర్ లెక్చరర్లు, డిగ్రీ లెక్చరర్లు మరియు వివిధ ఎగ్జిక్యూటివ్ మరియు నాన్ ఎగ్జిక్యూటివ్ పోస్టులు తెలంగాణలోని వివిధ విభాగాల క్రింద. కరెంట్ అఫైర్స్ పోటీ పరీక్షల్లో చాలా ముఖ్యమైన పాత్రను పోషిస్తాయి. కాబట్టి, ప్రభుత్వ పరీక్షలకు ప్రిపరేషన్ చేస్తున్నప్పుడు అభ్యర్థులు దానిపై ప్రత్యేక శ్రద్ధ వహించాలి. మీ ప్రిపరేషన్‌ను పూర్తి చేయడానికి, మేము మీకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కరెంట్ అఫైర్స్‌ను నవంబర్ 2022 తెలుగులో అందిస్తున్నాము.

Andhra Pradesh State Current affairs In Telugu November 2022_40.1

APPSC/TSPSC Sure shot Selection Group

Andhra Pradesh State Current affairs In Telugu | ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కరెంట్ అఫైర్స్ తెలుగులో

1. విశాఖలో గ్లోబల్‌ ఇన్వెస్టర్‌ సమ్మిట్‌–2023

Andhra Pradesh State Current affairs In Telugu November 2022_50.1
Global Investor Summit 2023
వాస్తవ పెట్టుబడులను ఆకర్షించడమే లక్ష్యంగా మార్చి 3, 4 తేదీల్లో అంతర్జాతీయ పెట్టుబడుల సదస్సు– 2023ను నిర్వహించనున్నట్లు  ఏపీ ప్రభుత్వం ప్రకటించింది. కోవిడ్‌ సంక్షోభం కారణంగా రెండేళ్ల నుంచి ఎటువంటి పెట్టుబడుల సమావేశాలు నిర్వహించలేకపోయామని, వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ముఖ్యమంత్రి అయ్యాక నిర్వహిస్తున్న తొలి సదస్సు విజయవంతం అయ్యేలా చర్యలు తీసుకుంటున్నామని రాష్ట్ర పరిశ్రమలు, ఐటీ శాఖ మంత్రి గుడివాడ అమరనాథ్‌ పేర్కొన్నారు. గ్లోబల్‌ ఇన్వెస్టర్‌ సమ్మిట్‌–2023 వివరాలను తెలియజేయడానికి నవంబర్ 8న ఆయన సచివాలయంలో  సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ గత ప్రభుత్వంలో జరిగిన పెట్టుబడుల సదస్సుకు భిన్నంగా ఈ సమావేశాలు నిర్వహిస్తామని చెప్పారు.

2. Arogyasri 2.0 : రెట్టింపు భరోసా – ఇక 3,255 చికిత్సలకు వర్తింపు

Andhra Pradesh State Current affairs In Telugu November 2022_60.1
Arogyasri 2.0
రాష్ట్రంలోని పేద, మధ్య తరగతి కుటుంబాల్లోని ప్రజల ఆరోగ్యానికి ఏపీ సీఎం వైఎస్‌ జగన్‌ రెట్టింపు భరోసా కల్పించారు. ఆయా వర్గాల ప్రజలు దురదృష్టవశాత్తు ఏదైన జబ్బు బారిన పడిన సందర్భాల్లో ఉచితంగా కార్పొరేట్‌ వైద్యాన్ని అందిస్తున్న ‘డాక్టర్‌ వైఎస్సార్‌ ఆరోగ్యశ్రీ’ పథకాన్ని మరింత బలోపేతం చేశారు.

ఈ పథకం పరిధిలోకి మరో 809 చికిత్సలను కొత్తగా చేర్చి, మొత్తం 3,255 వైద్య చికిత్సల(ప్రక్రియలు)తో ‘డాక్టర్‌ వైఎస్సార్‌ ఆరోగ్యశ్రీ 2.0’ను అక్టోబర్ 28న తన క్యాంపు కార్యాలయం నుంచి ప్రారంభించారు. దీంతో ఇప్పటి వరకు ఉన్న 2,446 చికిత్స ప్రక్రియల సంఖ్య 3,255కు చేరింది. ఇవన్నీవెంటనే అందుబాటులోకి వచ్చాయి.

3. రాజమహేంద్రవరానికి సమీపంలో రూ.270 కోట్లతో అస్సాగో బయో ఇథనాల్‌ ప్లాంట్‌ ఏర్పాటు

Andhra Pradesh State Current affairs In Telugu November 2022_70.1
Assago Bio Ethanol Plant
రాజమహేంద్రవరానికి సమీపంలోని APIIC ఇండ్రస్టియల్‌ పార్క్‌లో 20 ఎకరాల్లో ఏర్పాటు చేస్తున్న ఈ గ్రీన్‌ఫీల్డ్‌ యూనిట్‌ ద్వారా రోజుకు 200 కిలోలీటర్ల బయో ఇథనాల్‌ ఉత్పత్తి అవుతుంది.

ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలతో రాష్ట్రంలో బయో ఇథనాల్‌ యూనిట్లు ఏర్పాటు చేయడానికి అనేక సంస్థలు ముందుకొస్తున్నాయి. ఇందులో భాగంగా తూర్పుగోదావరి జిల్లా గోకవరం మండలం గుమ్మళ్ళదొడ్డి వద్ద సుమారు రూ.270 కోట్లతో అస్సాగో ఇండస్ట్రీస్‌ ఏర్పాటుచేస్తున్న బయో ఇథనాల్‌ యూనిట్‌ నిర్మాణ పనులకు ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి నవంబర్ 4న శంకుస్థాపన చేసారు.

రాజమహేంద్రవరానికి సమీపంలోని ఏపీఐఐసీ ఇండ్రస్టియల్‌ పార్క్‌లో 20 ఎకరాల్లో ఏర్పాటు చేస్తున్న ఈ గ్రీన్‌ఫీల్డ్‌ యూనిట్‌ ద్వారా రోజుకు 200 కిలోలీటర్ల బయో ఇథనాల్‌ ఉత్పత్తి అవుతుంది. ఈ యూనిట్‌ ద్వారా ప్రత్యక్షంగా 100 మందికి, పరోక్షంగా 400 మందికి ఉపాధి లభించనుంది. ముడిచమురు దిగుమతుల బిల్లును తగ్గించుకోవడంతోపాటు హరిత ఇంధన వినియోగం పెంచడం ద్వారా కర్బన ఉద్గారాలను తగ్గించాలన్న లక్ష్యంగా 2025–26 నాటికి ప్రతి లీటరు పెట్రోల్‌లో 20 శాతం బయో ఇథనాల్‌ మిశ్రమం కలపడాన్ని తప్పనిసరి చేస్తూ కేంద్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది.

5. 5th India Agri Business Summit – 2022: దేశవ్యాప్తంగా ఆర్బీకేలు(వైఎస్సార్‌ రైతు భరోసా కేంద్రాలు)

Andhra Pradesh State Current affairs In Telugu November 2022_80.1
5th India Agri Business Summit – 2022

వ్యవసాయంలో రైతన్నలకు అన్ని విధాలుగా సహాయ సహకారాలందించేందు కు, నాణ్యమైన ఇన్‌పుట్స్, సాగుకు సంబంధించి అన్ని రకాల ఇతర సేవలు అందించేందుకు ఏపీ సీఎం వైఎస్‌ జగన్‌ ప్రవేశ పెట్టిన అద్భుత వ్యవస్థ వైఎస్సార్‌ రైతు భరోసా కేంద్రాలు (ఆర్బీకేలు).

రాష్ట్ర వ్యవసాయ రంగంలో అత్యున్నత ఫలితాలు ఇస్తున్న ఈ వ్యవస్థ ప్రపంచవ్యాప్తంగా ప్రశంసలందుకుంటోంది. ఈ వ్యవస్థ ఏర్పాటుకు ఇప్పటికే ఇథియోపియా దేశం రాష్ట్ర అధికారుల సహకారం తీసుకుంటోంది. దేశంలోని పలు రాష్ట్రాలు కూడా ఈ వ్యవస్థ ఏర్పాటుకు ఆసక్తి చూపిస్తున్నాయి. ఆ రాష్ట్రాల అధికార బృందాలు రాష్ట్రానికి వచ్చి ఆర్బీకేలు, డిజిటల్‌ కియోస్క్‌లపై అధ్యయనం చేశా యి. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం కూడా ఈ తరహా వ్యవస్థను దేశవ్యాప్తంగా నెలకొల్పడానికి చర్యలు చేపట్టింది.

6. AP Infra Projects: 9 ప్రాజెక్టులు(రూ.15,233 కోట్లు)లకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేయనున్న ప్రధాని మోదీ

Andhra Pradesh State Current affairs In Telugu November 2022_90.1
AP Infra Projects
దొండపర్తి (విశాఖ దక్షిణ): ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పర్యటనకు రాష్ట్ర ప్రభుత్వం పకడ్బందీ ఏర్పాట్లు చేస్తోంది. నవంబర్ 12న ఉదయం ఏయూ ఇంజనీరింగ్‌ కాలేజీ మైదానంలో భారీ బహిరంగ సభలో పాల్గొననున్నారు.

ఇదే వేదికపై నుంచి రూ.15,233 కోట్లు విలువైన 9 ప్రాజెక్టులకు వర్చువల్‌గా శంకుస్థాపనలుప్రారంభోత్సవాలు చేయనున్నారు.

శంకుస్థాపనల ప్రాజెక్టులు

  • రూ.7,614 కోట్లు విలువైన 5 ప్రాజెక్టులకు ప్రధాని శంకుస్థాపన చేయనున్నారు. వాటిలో..
  •  రూ.152 కోట్లతో విశాఖపట్నం  ఫిషింగ్‌ హార్బర్‌ ఆధునీకరణ.
  • రూ.3,778 కోట్లతో రాయ్‌పూర్‌– విశాఖపట్నం 6 లేన్ల గ్రీన్‌ఫీల్డ్‌ హైవే, ఎకనామిక్‌ కారిడార్‌.
  • రూ.460 కోట్లతో విశాఖపట్నం  రైల్వేస్టేషన్‌ అభివృద్ధి.
  • రూ.2,658 కోట్లతో 321 కిలో మీటర్ల శ్రీకాకుళం–అంగుల్‌కు గెయిల్‌ పైప్‌లైన్‌ ప్రాజెక్టులు ఉన్నాయి.

7. AP Global Agri Award రైతు ముంగిటకే విత్తన సరఫరా భేష్‌

Andhra Pradesh State Current affairs In Telugu November 2022_100.1
Global Agri Award

నాణ్యమైన ధ్రువీకరించిన విత్తనాలను గ్రామ స్థాయిలో రైతుల ముంగిటకే అందించడం వినూత్న ఆలోచన అని కేంద్ర మత్స్య, పశు సంవర్ధక శాఖల సహాయ మంత్రి సంజీవ్‌ కుమార్‌ బల్యాన్, నీతి ఆయోగ్‌ సభ్యుడు (వ్యవసాయం) రమేష్ చంద్‌ ప్రశంసించారు.

విత్తన పంపిణీలో ఏపీ ప్రభుత్వం తీసుకొచ్చిన సంస్కరణలు దేశానికే ఆదర్శమని చెప్పారు. మూడేళ్లలో 50.95 లక్షల మందికి 34.97 లక్షల క్వింటాళ్ల విత్తనాలను అత్యంత పారదర్శకంగా పంపిణీ చేయడం నిజంగా గొప్ప విషయమన్నారు. వ్యవసాయ రంగంలో విశేష ప్రతిభ కనబర్చిన సంస్థలకు ఇండియన్‌ చాంబర్‌ ఆఫ్‌ ఫుడ్‌ అండ్‌ అగ్రికల్చర్‌ (ఐసీఎఫ్‌ఏ) ఏటా అందించే ఇండియా అగ్రి బిజినెస్‌ అవార్డుల్లో విత్తన పంపిణీ కేటగిరీలో ఏపీ సీడ్స్‌కు గ్లోబల్‌ అగ్రి అవార్డును అందించింది.

నవంబర్ 9న జరిగిన ఇండియా అగ్రి బిజినెస్‌ సమ్మిట్‌లో ఈ అవార్డును సంజీవ్‌కుమార్‌ బల్యాన్, రమేష్ చంద్‌ చేతుల మీదుగా రాష్ట్ర వ్యవసాయ శాఖ స్పెషల్‌ సీఎస్‌ పూనం మాలకొండయ్య, ఏపీ విత్తనాభివృద్ధి సంస్థ ఎండీ డాక్టర్‌ గెడ్డం శేఖర్‌బాబు అందుకున్నారు.

Andhra Pradesh State Current affairs In Telugu November 2022_110.1

8. 26న పీఎస్‌ఎల్‌వీ సీ54 ప్రయోగం

Andhra Pradesh State Current affairs In Telugu November 2022_120.1
PSLV C54 launch on 26
భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) ఈ నెల 26న ఉదయం 11.56 గంటలకు తిరుపతి జిల్లా సతీష్‌ ధవన్‌ స్పేస్‌ సెంటర్‌ షార్‌ లో పోలార్‌ శాటిలైట్‌ లాంచింగ్‌ వెహికల్‌ (పీఎస్‌ఎల్‌వీ సీ54) ఉపగ్రహ వాహకనౌకను ప్రయోగించేందుకు సన్నాహాలు చేస్తోంది.

ప్రయోగం ద్వారా భారత్‌కు చెందిన 960 కేజీల బరువు కలిగిన ఓషన్‌శాట్‌–3 (ఈవోఎస్‌–06) ఉపగ్రహంతో పాటు మరో 8 ఉపగ్రహాలను అంతరిక్ష కక్ష్యలోకి పంపనున్నారు. భారత్‌కే చెందిన తైబోల్ట్‌–1, తైబోల్ట్‌–2, ఆనంద్, ఇండియా–భూటాన్‌ దేశాలు సంయుక్తంగా తయారు చేసిన అకా ఐఎన్‌ఎస్‌–2బీ, స్విట్జర్లాండ్‌కు చెందిన ఆస్ట్రోకాస్ట్‌ –2 పేరుతో 4 ఉపగ్రహాలను కక్ష్యలోకి పంపనున్నారు.

9. ఆయిల్‌పామ్‌ సాగులో ఏపీ నంబర్‌–1 

Andhra Pradesh State Current affairs In Telugu November 2022_130.1
AP is number 1 in oil palm cultivation
ఆయిల్‌పామ్‌ రంగంలో ఆంధ్రప్రదేశ్‌ దేశంలోనే లీడర్‌ ఆఫ్‌ ది స్టేట్‌గా నిలిచిందని భారతీయ వ్యవసాయ పరిశోధనా మండలి మాజీ డిప్యూటీ డైరెక్టర్‌ జనరల్‌ హెచ్‌పీ సింగ్‌ పేర్కొన్నారు. విజయవాడ సమీపంలోని పోరంకిలో మూడు రోజులపాటు జరగనున్న 3వ జాతీయ ఆయిల్‌పామ్‌ సదస్సు  ప్రారంభమైంది.

ఆయిల్‌పామ్‌ రంగంలో అత్యుత్తమ పురోగతి సాధిస్తున్న రాష్ట్రంగా ఎంపికైన ఆంధ్రప్రదేశ్‌ తరఫున రాష్ట్ర ఉద్యాన కమిషనర్‌ ఎస్‌ఎస్‌ శ్రీధర్‌ ‘బెస్ట్‌ పెర్ఫార్మెన్స్‌ స్టేట్‌ ఇన్‌ ఇండియా’ అవార్డును అందుకున్నారు. సదస్సులో హెచ్‌పీ సింగ్‌ మాట్లాడుతూ.. జాతీయస్థాయిలో 4 లక్షల హెక్టార్లలో ఆయిల్‌పామ్‌ సాగవుతుంటే.. 1.90 లక్షల హెక్టార్లు ఏపీలోనే ఉందన్నారు.

ఏపీని స్ఫూర్తిగా తీసుకుని ఇతర రాష్ట్రాలు ఆయిల్‌పామ్‌ తోటల విస్తరణకు ముందుకెళ్లాల్సిన అవసరం ఉందన్నారు. దేశంలో 29 లక్షల హెక్టార్లకు పైగా విస్తీర్ణంలో ఆయిల్‌పామ్‌ను విస్తరించేందుకు అనువైన ప్రాంతం ఉందన్నారు. విస్తరణ కోసం పరిశోధనా సంస్థలు, యూనివర్సిటీలు, ప్రభుత్వ విభాగాలు సంఘటితంగా పనిచేయాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు.

10. ఏపీకి రెండు ‘స్కోచ్‌ గోల్డ్‌’ అవార్డులు

Andhra Pradesh State Current affairs In Telugu November 2022_140.1
‘Scotch Gold’ Awards
పొదుపు సంఘాల మహిళలకు బ్యాంకుల నుంచి పెద్ద మొత్తంలో రుణాలు ఇప్పించడమే కాకుండా ఆయా కుటుంబాలు ఆర్థిక స్వావలంబన సాధించే దిశగా అలుపెరగని కృషి చేస్తున్న రాష్ట్ర ప్రభుత్వం వివిధ విభాగాల్లో రెండు స్కోచ్‌ గోల్డ్, మరో నాలుగు స్కోచ్‌ సిల్వర్‌ అవార్డులను గెలుచుకుంది. దేశవ్యాప్తంగా గ్రామీణాభివృద్ధి కార్యక్రమాలకు సంబంధించి దాదాపు వంద ప్రాజెక్టులు ఈ ఏడాది స్కోచ్‌ అవార్డుల కోసం పోటీ పడ్డాయి. ఆయా రాష్ట్రాలు దరఖాస్తు చేసుకున్న అన్ని ప్రాజెక్టులపై ఇప్పటికే రెండు విడతల స్కూృటినీ నిర్వహించగా.. చివరగా  ఢిల్లీ నుంచి వర్చువల్‌ విధానంలో పలు ప్రాజెక్టులను మరో విడత సమీక్షించి.. స్కోచ్‌ సంస్థ అవార్డులను ప్రకటించింది.

మహిళా స్వయం సహాయక సంఘాలు బ్యాంకుల ద్వారా రుణాలు పొందటమే కాకుండా వాటిని సద్వినియోగం చేసుకుని కుటుంబ ఆదాయాలను పెంచుకునేలా రాష్ట్ర ప్రభుత్వం వివిధ రూపాల్లో అందజేస్తున్న సహాయ సహకారాలకు గాను ప్రతిష్టాత్మక స్కోచ్‌ సంస్థ గోల్డ్‌ అవార్డును ప్రకటించింది. 2019 నుంచి 2022 మార్చి వరకు మూడేళ్ల కాలంలో రాష్ట్రంలోని పొదుపు సంఘాల మహిళలు రూ.77,106.74 కోట్లను రుణాలుగా పొందారు.

11. ఏపీసీసీ అధ్యక్షుడిగా గిడుగు రుద్రరాజు

Andhra Pradesh State Current affairs In Telugu November 2022_150.1
AP Congress Chief
ఆంధ్రప్రదేశ్‌ కాంగ్రెస్‌ కమిటీ అధ్యక్షుడిగా పార్టీ సీనియర్‌ నేత గిడుగు రుద్రరాజును కాంగ్రెస్‌ పార్టీ అధిష్టానం నియమించింది. వర్కింగ్‌ ప్రెసిడెంట్లుగా మస్తాన్‌ వలీ, జంగా గౌతమ్, పద్మశ్రీ సుంకర, పి.రాకేశ్‌రెడ్డి నియామకాల ప్రతిపాదనను పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ఆమోదించారు.

ఈ మేరకు ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్‌ నవంబర్‌ 23న ఉత్తర్వులు జారీ చేశారు. వీరితో పాటు ఏఐసీసీ కార్యక్రమాల అమలు కమిటీ చైర్మన్‌గా కేంద్ర మాజీ మంత్రి ఎంఎం పల్లంరాజు, ప్రచార కమిటీ చైర్మన్‌గా జీవీ హర్షకుమార్, మీడియా–సోషల్‌ మీడి యా కమిటీ చైర్మన్‌గా ఎన్‌.తులసిరెడ్డిలకు అవకాశం కల్పించారు. రాజకీయ వ్యవహారాల కమిటీలో పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జ్‌ ఊమెన్‌ చాందీతో పాటు 18 మంది, కోఆర్డినేషన్‌ కమిటీలో 33 మంది నేతలతో పాటు పీసీసీ విభాగాల అధ్యక్షులు ఉంటారని ఏఐసీసీ వెల్లడించింది. పీసీసీ తాజా మాజీ అధ్యక్షుడు శైలజానాథ్‌కు రాజకీయ వ్యవహారాలు, కో–ఆర్డినేషన్‌ కమిటీల్లో చోటు కల్పించారు.

12. ఏపీతో ’ఈఈఎస్‌ఎల్‌’ ఒప్పందం

Andhra Pradesh State Current affairs In Telugu November 2022_160.1
‘EESL’ agreement with AP
గృహ నిర్మాణ పథకం లబ్ధిదారులకు విద్యుత్‌ ఆదా చేయగల గృహోపకరణాలను తక్కువ ధరకు పంపిణీ చేయాలనీ రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ చేసిన ప్రతిపాదనకు కేంద్ర ప్రభుత్వ సంస్థ ఎనర్జీ ఎఫీషియెన్సీ సర్వీసెస్‌ లిమిటెడ్‌ (ఈఈఎస్‌ఎల్‌) సూత్రప్రాయంగా అంగీకరించింది. రాష్ట్రంలో మొదటి దశలో నిర్మిస్తున్న 15.6 లక్షల ఇళ్లకు సంబంధించి ఒక్కో లబ్ధిదారునికి నాలుగు ఎల్‌ఈడీ బల్బులు, రెండు ఎల్‌ఈడీ ట్యూబ్‌లైట్లు, రెండు ఫ్యాన్లను మార్కెట్‌ ధర కన్నా తక్కుకే అందచేయాలన్న రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యానికి అనుగుణంగా గృహ నిర్మాణ శాఖ, ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర ఇంధన సామర్థ్య అభివృద్ధి సంస్థ (ఏపీ సీడ్కో)తో త్రైపాక్షిక ఒప్పందం కుదుర్చుకోవడానికి ఈఈఎస్‌ఎల్‌ సంసిద్ధత వ్యక్తంచేసింది.

గృహ నిర్మాణ శాఖ, ఏపీఎస్‌ఈసీఎం అధికారులతో ఆదివారం జరిగిన టెలీకాన్ఫెరెన్స్‌లో ఈఈఎస్‌ఎల్‌ సీఈఓ విశాల్‌ కపూర్‌ ఈ విషయాన్ని వెల్లడించారు. ఇంధన సామర్థ్య రంగ అభివృద్ధికి చిత్తశుద్ధితో కృషిచేస్తున్న అతికొద్ది రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్‌ ఒకటని ఆయన కొనియాడారు. రాష్ట్రంలో అమలుచేస్తున్న ఇంధన సామర్థ్య ప్రాజెక్టులకు సహకరించేందుకు ఈఈఎస్‌ఎల్‌ ఎప్పుడూ సిద్ధంగా ఉంటుందన్నారు.

13. పండ్ల ఉత్పత్తిలో  దేశంలోనే ఏపీ అగ్రగామి

Andhra Pradesh State Current affairs In Telugu November 2022_170.1
AP is the leader in fruit production in the country
పండ్ల ఉత్పత్తిలో రాష్ట్రం అగ్రగామిగా నిలిచింది. 2021–22 ఆర్థిక సంవత్సరంలో మొత్తం పండ్ల ఉత్పత్తిలో దేశంలోనే అగ్రస్థానంలో నిలిచింది.  ఆ సంవత్సరంలో అన్ని రాష్ట్రాల్లో కలిపి 10,72,41,510 టన్నుల పండ్లు ఉత్పత్తి అవగా అందులో ఆంధ్రప్రదేశ్‌ వాటా అత్యధికంగా 17.72 శాతమని కేంద్ర వ్యవసాయ, రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ వెల్లడించింది. ఈ శాఖ 2021–22లో రాష్ట్రాలవారీగా పండ్ల ఉత్పత్తి, సాగు విస్తీర్ణంపై మూడో ముందస్తు అంచనాలను వెల్లడించింది.

ఆ నివేదిక ప్రకారం.. బత్తాయి, అరటి, బొప్పాయి, మామిడి పండ్ల ఉత్పత్తిలో దేశంలోనే మొదటి స్థానంలో ఆంధ్రప్రదేశ్‌ ఉంది. ఏపీలో మొత్తం పండ్ల ఉత్పత్తి 1,89,99,020 టన్నులు. ఆ తరువాత  1,24,66,980 టన్నులతో మహారాష్ట్ర, 1,11,13,860 టన్నుల పండ్ల ఉత్పత్తితో ఉత్తరప్రదేశ్‌ రెండు, మూడు స్థానాల్లో ఉన్నాయి.

మొత్తం పండ్లు సాగు విస్తీర్ణం ఆంధ్రప్రదేశ్‌కన్నా మహారాష్ట్రలో ఎక్కువగా ఉన్నప్పటికీ,  ఉత్పత్తిలో మాత్రం ఆంధ్రప్రదేశ్‌ అగ్రభాగాన ఉండటం విశేషం. ఆంధ్రప్రదేశ్‌లో పండ్ల సాగు విస్తీర్ణం 7,88,220 హెక్టార్లుండగా మహారాష్ట్రలో 8,31,180 హెక్టార్లలో సాగు చేసినట్లు ఆ నివేదిక తెలిపింది.

14. పాతపట్నం జాతీయ రహదారి, ఓఎన్‌జీసీ ‘యు’ఫీల్డ్‌ అభివృద్ధి ప్రాజెక్టులు జాతికి అంకితం

ఆంధ్రప్రదేశ్‌ ప్రజలు ప్రపంచం నలుమూలలా వివిధ రంగాల్లో తమదైన ప్రత్యేకతను, నైపుణ్యాన్ని ప్రదర్శిస్తూ, విశేషమైన గుర్తింపు తెచ్చుకున్నారని ప్రధాని నరేంద్ర మోదీ కొనియాడారు. విశాఖలో రూ.10,500 కోట్ల ప్రాజెక్టులకు ప్రధాని రిమోట్‌ ద్వారా శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు. విశాఖ రైల్వేస్టేషన్‌ ఆధునికీకరణ, చేపల రేవు నిర్మాణం, రాయపూర్‌ – విశాఖపట్నం మధ్య 6 వరుసల ఆర్థిక కారిడార్, విశాఖలోని కాన్వెంట్‌ జంక్షన్‌ నుంచి షీలానగర్‌ వరకు రహదారి విస్తరణ, శ్రీకాకుళం నుంచి అంగుల్‌ వరకు పైపులైను ప్రాజెక్టులకు శంకుస్థాపన చేశారు. పాతపట్నం నుంచి నర్సన్నపేట వరకు నిర్మించిన జాతీయ రహదారి, తూర్పు తీరంలో ఓఎన్‌జీసీ ‘యు’ఫీల్డ్‌ అభివృద్ధి ప్రాజెక్టులను జాతికి అంకితం చేశారు.

Andhra Pradesh State Current affairs In Telugu November 2022_180.1

మరింత చదవండి: 

తాజా ఉద్యోగ ప్రకటనలు  ఇక్కడ క్లిక్ చేయండి
ఉచిత స్టడీ మెటీరియల్ (APPSC, TSPSC) ఇక్కడ క్లిక్ చేయండి
ఉచిత మాక్ టెస్టులు  ఇక్కడ క్లిక్ చేయండి

Sharing is caring!

Download your free content now!

Congratulations!

Andhra Pradesh State Current affairs In Telugu November 2022_200.1

కరెంట్ అఫైర్స్ -ఏప్రిల్ 2022 మాస పత్రిక

Download your free content now!

We have already received your details!

Andhra Pradesh State Current affairs In Telugu November 2022_210.1

Please click download to receive Adda247's premium content on your email ID

Incorrect details? Fill the form again here

కరెంట్ అఫైర్స్ -ఏప్రిల్ 2022 మాస పత్రిక

Thank You, Your details have been submitted we will get back to you.