Telugu govt jobs   »   ఆంధ్రప్రదేశ్ పోస్టల్ GDS నోటిఫికేషన్ 2022

ఆంధ్రప్రదేశ్  పోస్టల్ GDS నోటిఫికేషన్ 2022 | Andhra Pradesh  postal GDS Notification 2022

ఆంధ్రప్రదేశ్  పోస్టల్ GDS నోటిఫికేషన్ 2022 | Andhra Pradesh  postal GDS Notification 2022

ఇండియా పోస్ట్ భారీగా ఉద్యోగాల భర్తీకి జాబ్ నోటిఫికేషన్  విడుదల చేసింది. దేశవ్యాప్తంగా ఉన్న పోస్ట్ ఆఫీసుల్లో  గ్రామీణ డాక్ సేవక్ పోస్టుల్ని భర్తీ చేస్తోంది. ఈ నోటిఫికేషన్‌ ద్వారా మొత్తం 38,926 పోస్టులను భర్తీ చేయనుంది. వీటిలో గ్రామీణ డాక్ సేవక్ పోస్టులతో పాటు బ్రాంచ్ పోస్ట్ మాస్టర్ , అసిస్టెంట్ బ్రాంచ్ పోస్ట్ మాస్టర్ పోస్టులున్నాయి.

ఆంధ్రప్రదేశ్  పోస్టల్ సర్కిల్ (ఆంధ్రప్రదేశ్ పోస్ట్ ఆఫీస్) రిక్రూటింగ్ డిపార్ట్‌మెంట్) అధికారిక రిక్రూట్‌మెంట్ బ్రాంచ్ పోస్ట్ మాస్టర్, అసిస్టెంట్ బ్రాంచ్ పోస్ట్ మాస్టర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. ఆంధ్రప్రదేశ్ తపాలా శాఖ జీడీఎస్ పోస్టుల భర్తీకి 1716 ఖాళీల కోసం నోటిఫికేషన్ విడుదల చేసింది. తెలంగాణ పోస్టల్ సర్కిల్ లో ఉద్యోగం కావాలనుకునే అర్హత గల అభ్యర్థులు ఆన్లైన్ ద్వారా అప్లై చేసుకోగలరు, దరఖాస్తు ప్రారంభ తేదీ 2 మే 2022, మరియు దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీ 5 జూన్ 2022. అదేవిధంగా దరఖాస్తు రుసుము ఎంపిక విధానం మొదలగు సమాచారం కోసం ఈ కథనాన్ని పూర్తిగా చదవండి .

ఆంధ్రప్రదేశ్ పోస్టల్ GDS నోటిఫికేషన్ 2022 | Andhra Pradesh postal GDS Notification 2022_40.1APPSC/TSPSC Sure shot Selection Group

 

ఆంధ్రప్రదేశ్  పోస్టల్ GDS నోటిఫికేషన్ 2022 అవలోకనం

ఆంధ్రప్రదేశ్  పోస్టల్ GDS నోటిఫికేషన్ 2022
పోస్ట్ పేరు బ్రాంచ్ పోస్ట్ మాస్టర్, అసిస్టెంట్ బ్రాంచ్ పోస్ట్ మాస్టర్
సంస్థ ఆంధ్రప్రదేశ్  పోస్టల్ సర్కిల్ (ఆంధ్రప్రదేశ్ పోస్ట్ ఆఫీస్) రిక్రూటింగ్ డిపార్ట్‌మెంట్)
ఖాళీల సంఖ్య 1716
స్థానం ఆంధ్రప్రదేశ్
ఆన్‌లైన్ అప్లికేషన్ ప్రారంభ తేదీ  2 మే 2022
ఆన్‌లైన్ దరఖాస్తు ముగింపు తేదీ 6 జూన్ 2022
ఎంపిక విధానం మెరిట్ ఆధారంగా ఎంపిక చేస్తారు.
అధికారిక వెబ్‌సైట్ https://indiapostgdsonline.gov.in/

Download Andhra Pradesh GDS Official Notification 2022 pdf

ఆంధ్రప్రదేశ్ GDS అర్హత ప్రమాణాలు

ఆంధ్రప్రదేశ్ GDS గ్రామీణ డాక్ సేవక్ యొక్క విద్య, వయోపరిమితి,  అర్హత ప్రమాణాలను ఇక్కడ  తనిఖీ చేయండి .

విద్యార్హత

ఆంధ్రప్రదేశ్ GDS గ్రామీణ డాక్ సేవక్  రిక్రూట్‌మెంట్ 2022 కోసం కనీస విద్యార్హత క్రింద పేర్కొన్న విధంగా ఉంది, అయితే, ఉన్నత విద్య ఉన్న అభ్యర్థులు కూడా GDS గ్రామీణ డాక్ సేవక్ ఖాళీకి దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు, అయితే వయోపరిమితి తప్పనిసరి.

పోస్ట్ విద్యార్హత
ఆంధ్రప్రదేశ్ GDS గ్రామీణ డాక్ సేవక్ 10వ తరగతి పాస్ కావాలి. మ్యాథమెటిక్స్, ఇంగ్లీష్ సబ్జెక్ట్స్ తప్పనిసరి.

ఇతర అర్హతలు: స్థానిక భాషలో 10వ తరగతి వరకు చదివి ఉండాలి.

వయోపరిమితి: 

కనిష్ట వయస్సు : 18 సంవత్సరాలు ఉండాలి

గరిష్ట వయస్సు : 40 సంవత్సరాలు ఉండాలి

వయోసడలింపు:

ఎస్‌సీ, ఎస్‌టీ అభ్యర్థులకు 5 సంవత్సరాలు
ఓబీసీ అభ్యర్థులకు 3 సంవత్సరాలు
దివ్యాంగులకు 10 సంవత్సరాలు
ఓబీసీ అయిన దివ్యాంగులకు 13 సంవత్సరాలు
ఎస్‌సీ, ఎస్‌టీ అయిన దివ్యాంగులకు 15 సంవత్సరాలు

 

ఆంధ్రప్రదేశ్ పోస్టల్ GDS నోటిఫికేషన్ 2022 | Andhra Pradesh postal GDS Notification 2022_50.1

 

ఆంధ్రప్రదేశ్ GDS దరఖాస్తు రుసుము

ఆంధ్రప్రదేశ్ GDS దరఖాస్తు రుసుము కింది విధంగా ఉంది

  • జనరల్ అభ్యర్థులకు : రూ.100.
  • ఎస్‌సీ, ఎస్‌టీ, దివ్యాంగులు, మహిళలు, ట్రాన్స్‌వుమెన్‌కు : ఫీజు లేదు

Also check: తెలంగాణ ట్రాన్స్‌పోర్ట్ కానిస్టేబుల్ నోటిఫికేషన్ 2022

 

ఆంధ్రప్రదేశ్ GDS నోటిఫికేషన్ 2022 ఆన్లైన్ దరఖాస్తు విధానం

కింద పేర్కొన్న దశలు అనుసరించడం ద్వారా ఆన్లైన్ లో దరఖాస్తు చేసుకోవచ్చు అవి:

దశ 1- అభ్యర్థులు ముందుగా https://indiapostgdsonline.gov.in/ వెబ్‌సైట్ ఓపెన్ చేయాలి.

దశ 2- హోమ్ పేజీలో వేర్వేరు రాష్ట్రాలకు వేర్వేరు లింక్స్ ఉంటాయి.

దశ  3- ఖాళీల వివరాలు తెలుసుకోవడానికి ఆ లింక్స్ క్లిక్ చేయొచ్చు.

దశ 4- రిజిస్ట్రేషన్ చేయడానికి Registration పైన క్లిక్ చేయాలి.

దశ 5- మొబైల్ నెంబర్, ఇమెయిల్ ఐడీతో రిజిస్ట్రేషన్ చేయాలి.

దశ 6- పేరు, తండ్రి పేరు, పుట్టిన తేదీ, 10వ తరగతి పాసైన వివరాలు, ఆధార్ నెంబర్‌తో రిజిస్ట్రేషన్ పూర్తి చేయాలి.

దశ 7- ఫోటో, సంతకం, టెన్త్ మెమో అప్‌లోడ్ చేయాలి.

దశ 8- రిజిస్ట్రేషన్ నెంబర్ జనరేట్ అయిన తర్వాత Apply పైన క్లిక్ చేయాలి.

దశ 9- రిజిస్ట్రేషన్ నెంబర్, సర్కిల్ వివరాలు ఎంటర్ చేయాలి.

దశ 10- ఆ తర్వాత అడ్రస్, పదవ తరగతిలో వచ్చిన మార్క్స్, ఇతర వివరాలతో అప్లికేషన్ ప్రాసెస్ పూర్తి చేయాలి.

దశ 11- ఫీజు చెల్లించి దరఖాస్తు ప్రక్రియ పూర్తి చేయాలి.

Andhra Pradesh GDS Online Application link

 

ఆంధ్రప్రదేశ్ GDS వేతనం

ఆంధ్రప్రదేశ్ GDS  గ్రామీణ డాక్ సేవక్ లో పని చేసే  బ్రాంచ్ పోస్ట్ మాస్టర్‌కు రూ.12,000, మరియు  అసిస్టెంట్ బ్రాంచ్ పోస్ట్ మాస్టర్, కు రూ.10,000 వేతనం అందిస్తారు.

SI CATEGORY Minimum TRCA for 4 Hours/Level 1 in TRCA Slab
1 BPM Rs.12,000/-
2 ABPM/DakSevak Rs.10,000/-

 

ఆంధ్రప్రదేశ్ GDS నోటిఫికేషన్ 2022-తరచుగా అడిగే ప్రశ్నలు

ప్ర. ఆంధ్రప్రదేశ్  GDS నోటిఫికేషన్‌లో ఎన్ని ఖాళీలు ఉన్నాయి?
జ : 1716 పోస్టులు ఉన్నాయి
ప్ర. ఆంధ్రప్రదేశ్  GDS నోటిఫికేషన్ 2022 కోసం ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేయడానికి ప్రారంభ తేదీ ఎప్పుడు?
జ: 2 మే 2022
ప్ర. ఆంధ్రప్రదేశ్ GDS నోటిఫికేషన్ 2022 కోసం ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీ ఎప్పుడు?
జ: 5 జూన్ 2022
ప్ర. ఆంధ్రప్రదేశ్ GDS నోటిఫికేషన్ 2022 కోసం ఎంపిక ప్రక్రియ ఏమిటి?
జ: 10వ తరగతి మార్కుల మెరిట్ ఆధారంగా.

Also check:TS Police Prohibition and Excise Constable Notification 2022 

 

***************************************************************************************

ఆంధ్రప్రదేశ్ పోస్టల్ GDS నోటిఫికేషన్ 2022 | Andhra Pradesh postal GDS Notification 2022_60.1

మరింత చదవండి: 

తాజా ఉద్యోగ ప్రకటనలు  ఇక్కడ క్లిక్ చేయండి
ఉచిత స్టడీ మెటీరియల్ (APPSC, TSPSC) ఇక్కడ క్లిక్ చేయండి
ఉచిత మాక్ టెస్టులు  ఇక్కడ క్లిక్ చేయండి

********************************************************************************************

ఆంధ్రప్రదేశ్ పోస్టల్ GDS నోటిఫికేషన్ 2022 | Andhra Pradesh postal GDS Notification 2022_70.1

Download Adda247 App

Sharing is caring!

Download your free content now!

Congratulations!

ఆంధ్రప్రదేశ్ పోస్టల్ GDS నోటిఫికేషన్ 2022 | Andhra Pradesh postal GDS Notification 2022_90.1

కరెంట్ అఫైర్స్ -ఏప్రిల్ 2022 మాస పత్రిక

Download your free content now!

We have already received your details!

ఆంధ్రప్రదేశ్ పోస్టల్ GDS నోటిఫికేషన్ 2022 | Andhra Pradesh postal GDS Notification 2022_100.1

Please click download to receive Adda247's premium content on your email ID

Incorrect details? Fill the form again here

కరెంట్ అఫైర్స్ -ఏప్రిల్ 2022 మాస పత్రిక

Thank You, Your details have been submitted we will get back to you.