జాతీయ విద్యా విధానం (ఎన్ఈపీ) అమలులో ఆంధ్రప్రదేశ్ దేశంలోనే అగ్రస్థానంలో ఉంది
జాతీయ విద్యా విధానం (ఎన్ఈపీ) అమలులో దేశంలోనే ఆంధ్రప్రదేశ్ అగ్రగామిగా ఉందని కేంద్రీయ గిరిజన విశ్వ విద్యాలయం వైస్ చాన్సలర్ టీవీ కట్టిమని అన్నారు. జూలై 26న విశాఖపట్నంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ యూనివర్సిటీ(శ్రీకాకుళం) వీసీ నిమ్మ వెంక టరావు, జేఎన్టీయూ(విజయనగరం) వీసీ బి.వెంకట సుబ్బయ్య, ఆంధ్ర యూనివర్సిటీ రిజిస్ట్రార్ వి.కృష్ణమోహన్, ఇండియన్ ఇన్స్టి ట్యూట్ ఆఫ్ పెట్రోలియం ఎనర్జీ డైరెక్టర్ శాలివాహన్, ఐఐఎం ప్రతినిధి ఆచార్య షమీమ్ తో కలిసి ఆయన మీడియాతో మాట్లాడారు.
జాతీయ స్థాయి విధానాలను కేంద్ర ప్రభుత్వం రూపొందించినప్పటికీ, భావి తరాలకు ఉపయోగపడేలా వాటిని విజయవంతంగా అమలు చేసేది రాష్ట్ర ప్రభుత్వాలే అని చెప్పారు. జాతీయ విద్యా విధానం విద్యార్థులకు వారి అభిరుచులకు అనుగుణంగా కోర్సులను ఎంచుకునే స్వేచ్ఛను కల్పించింది మరియు యువతలో దాగి ఉన్న ప్రతిభను వెలికితీయడం దీని లక్ష్యం. పరిశ్రమల్లో 75 శాతం ఉద్యోగాలు స్థానిక యువతకు కేటాయించడం, విద్యాలయాలను పరిశ్రమలకు అనుసంధానం చేయడం వంటి చర్యలు విద్యార్ధులకు భరోసాగా నిలుస్తున్నాయని చెప్పారు. ఉన్నత విద్యకు పాఠశాల స్థాయిలోనే పటిష్ట పునాది వేసేలా రాష్ట్ర ప్రభుత్వం ఎన్నో సంస్కరణలు తీసుకువచ్చిందన్నారు. ఉద్యోగ అవకాశాలు లక్ష్యంగా బోధన సాగుతోందన్నారు. గిరిజన యూనివర్శిటీకి 561 ఎకరాల భూమిని కేటాయించామని, మాస్టర్‌ప్లాన్ ప్రకారం నిర్మాణం పూర్తయిన తర్వాత యూనివర్సిటీని కొత్త క్యాంపస్‌కు తరలిస్తామని వీసీ కట్టిమని తెలిపారు.
ఈ సందర్భంగా గిరిజన వర్సిటీ రూపొందించిన జాతీయ విద్యావ్యవస్థ ప్రయోజనాలను తెలియజేస్తూ రూపొందించిన పుస్తకాన్ని ఆవిష్కరించారు.
మరింత చదవండి: | |
తాజా ఉద్యోగ ప్రకటనలు | ఇక్కడ క్లిక్ చేయండి |
ఉచిత స్టడీ మెటీరియల్ (APPSC, TSPSC) | ఇక్కడ క్లిక్ చేయండి |
ఉచిత మాక్ టెస్టులు | ఇక్కడ క్లిక్ చేయండి |
***************************************************************************