Telugu govt jobs   »   Social Reformers

Andhra Pradesh History – Social Reformers, Download PDF | ఆంధ్ర ప్రదేశ్ చరిత్ర – సంఘ సంస్కర్తలు

సంఘ సంస్కర్తలు : ఆంధ్ర ప్రదేశ్ రాజకీయ, చారిత్రక, సామాజిక చరిత్రలో సంఘ సంస్కర్తలు చాలా ముఖ్యమైన పాత్ర పోశించారు. కందుకూరి  వీరేశ లింగం పంతులు, రఘుపతి వెంకట రత్నం నాయుడు వంటి కొందరు వ్యక్తులు ఉన్నారు. ఈ ఆర్టికల్‌లో మేము సంఘ సంస్కర్తలు  రూపొందించిన ఆంధ్రప్రదేశ్ సంఘ సంస్కరణల వివరాలను అందిస్తున్నాము. ఆంధ్ర ప్రదేశ్ సంఘ సంస్కర్తలు గురించి మరిన్ని వివరాలు తెలుసుకోవడానికి, వ్యాసాన్ని పూర్తిగా చదవండి.

TSPSC గ్రూప్ 1 కోసం చదవాల్సిన పుస్తకాలు, సబ్జెక్ట్ వైజ్ బుక్‌లిస్ట్_30.1

Adda247 APP

Andhra Pradesh History- Social Reformers |ఆంధ్రప్రదేశ్‌ చరిత్ర – సంఘ సంస్కర్తలు

  • భారతదేశ చరిత్రలో 19వ శతాబ్దాన్ని ముఖ్య యుగంగా పేర్కొనవచ్చు. ఈ కాలంనాటికి భారత సమాజం మూఢ నమ్మకాలతో, సాంఘిక దురాచారాలతో ఉండేది. 9వ శతాబ్దంలోనే ఎంతో మంది ముఖ్య సంఘ సంస్కర్తలు జన్మించారు. మూఢాచారాలతో ఉన్న సమాజాన్ని సంస్కరించి ప్రజల్లో ఆధునికతను, జాతీయ భావాలను కలిగించారు. అలాంటివారిలో పేర్కొనదగిన వారు రాజారామ్మోహన్‌రాయ్‌, దయానంద సరస్వతి.
  • రాజారామ్మోహన్‌రాయ్‌ 1828లో బ్రహ్మ సమాజాన్ని స్థాపించి సంఘ సంస్కరణకు శ్రీకారం చుట్టాడు.
  • దయానంద సరస్వతి 1875లో ఆర్య సమాజాన్ని స్థాపించాడు.
  • ఈ రెండు సంస్థల ప్రభావం ఆంధ్రదేశంపై తీవ్రంగా ఉండేది. మూఢ విశ్వాసాలతో నిద్రాణమైన ఆంధ్రజాతిని సంస్కరించిన వారిలో కందుకూరి వీరేశలింగం, రఘుపతి వెంకటరత్నంనాయుడు ముఖ్యులు.

First Social Reformers (తొలి సంఘ సంస్కర్తలు)

  • తొలి ఆంధ్ర సంఘసంస్కర్త ఏనుగుల వీరాస్వామి. ఆయన 19వ శతాబ్దం ప్రారంభంలో మద్రాస్‌ సుప్రీం కోర్టులో దుబాసీగా పనిచేశాడు. అస్పృశ్యతా నిర్మూలనకు పాటుపడ్డాడు. అస్పృశ్యతకు స్మృతులలో ఎలాంటి ఆధారాలు లేవన్నారు
  • నెల్లూరుకు చెందిన అనంత రామశాస్త్రి హరిజనోద్దరణకు పాటుపడ్డాడు. హరిజనులకు దేవాలయ ప్రవేశం కల్పించాలని ప్రచారం చేశారు
  • గాజుల లక్ష్మీనరసింహచెట్టి ‘కీసెంట్‌‘ అనే పత్రికను స్టాపించి దాని ద్వారా సాంఘిక సంస్కరణలను ప్రచారం చేశాడు. వెట్టిచాకిరీని రద్దు చేయాలని కోరారు
  • విశాఖపట్నంలో పరావస్తు వెంకటరంగాచార్యులు స్తీ పునర్వివాహం శాస్తసమ్మతమేనని ఆధారాలతో నిరూపించారు
  • సామినేని ముద్దు నరసింహ 1862లో రాసిన ‘హితసూచని‘ అనేగ్రంథంలో సాంఘిక సంస్కరణల ఆవశ్యకతను తెలియజేశారు, స్త్రీ విద్యకు కృషి చేశారు. బాల్యవివాహాలు, కన్యాశుల్కం, వ్యభిచారం లాంటి దురాచారాలను ఖండించారు. క్షుద్రశక్తులఆరాధన, మాంత్రికుల, తాంత్రికుల చర్యలను ఖండించారు.
  • కొమిలేశ్వర శ్రీనివాస పిళ్లె స్త్రీ విద్యకోసం కృషిచేశాడు. బాలికల పాఠశాలల స్థాపనకు రూ.70 వేలు ఇచ్చారు.
  • ఆత్మూరి లక్ష్మీనరసింహం బ్రహ్మసమాజ ప్రభావానికి లోనై, స్త్రీ పునర్వివాహ సమాజంలో సభ్యుడై ప్రచారంచేశారు. ఆయన వీరేశలింగం పంతులుకు గురువు.

Kandukuri Veereshalingam (కందుకూరి వీరేశలింగం)

Veeresha lingam panthulu
Veeresha lingam panthulu
  • వీరేశలింగం ఆంధ్రదేశంలో సంస్కరణల యుగానికి యుగ పురుషుడయ్యారు. ఆయన 1848 ఏప్రిల్‌ 16న రాజమండ్రిలో జన్మించారు.
  • 1869లో మెట్రిక్యులేషన్‌ అనంతరం కొరంగిలో ఉపాధ్యాయుడిగా, రాజమండ్రిలో సీనియర్‌ తెలుగు పండితుడిగా పనిచేశారు. విద్యార్ది దశ నుంచే హేతువాదాన్ని అలవరుచుకున్నారు. విగ్రహారాధన, మూఢవిశ్వాసాలు, శకునాలు, మంత్రతంత్రాలను ఖండించాడు. బ్రహ్మ సమాజ సిద్ధాంతాలతో ప్రభావితుడయ్యారు.

స్త్రీ విద్య

ఆంధ్రదేశంలో వీరేశలింగం స్త్రీ విద్య కోసం పాటుపడ్డారు. 1870 దశకంలో ఆంధ్రదేశంలో వెలువడుతున్న పురుషార్థప్రదాయని, ఆంధ్రభాషా సంజీవని అనే పత్రికల్లో స్త్రీ విద్య గురించి వివాదం చెలరేగింది. ఈ సందర్భంలో వీరేశలింగం స్త్రీ విద్యను సమర్దించారు. తన సిద్దాంత ప్రచారం కోసం వివేకవర్ధిని అనే పత్రికను 1874లో రాజమండ్రిలో ప్రారంభించారు. తన ఆశయాలను ఆచరణలో పెట్టేందుకు 1874 సెప్టెంబరులో ధవళేశ్వరం వద్ద ఒక బాలికల పాఠశాలను స్థాపించాడు. ఇది ఆంధ్రదేశంలోనే తొలి బాలికల పాఠశాల. ఆయన రాజమండ్రి లోని ఇన్నీస్‌పేటలో 1881లో మరో బాలికల పాఠశాలను స్థాపించారు. హరిజనులకోసం పాఠశాలలు, శ్రామికుల కోసం రాత్రి పాఠశాలలు స్థాపించారు.

Widow Remarriages (వితంతు పునర్వివాహాలు)

  • విరేశలింగానికి స్త్రీ జనోద్ద్ధారకుడిగా విశేషఖ్యాతి లభించింది. ఆయన 1874లో మద్రాసులోవితంతు పునర్వివాహ సంఘాన్ని స్థాపించారు.
  • 1875లో వితంతు పునర్వివాహాలను సమర్ధిస్తూ విశాఖపట్టణవాసి అయిన పరావస్తు వెంకటరంగాచార్యులు ‘పునర్వివాహ సంగ్రహం’ అనేగ్రంథాన్ని రాశాడు.
  • రాజమండ్రి ప్రభుత్వ కళాశాల ప్రధానాధికారి ఇ.పి.మెట్‌కాఫ్‌ వీరేశలింగానికి మద్దతు తెలిపాడు. ఆయన రాజమండ్రిలో 1878లో సంఘసంస్కరణ సమాజాన్ని స్థాపించాడు. 1879 ఆగస్టు 3న వీరేశలింగం వితంతు పునర్వివాహాలను సమర్ధిస్తూ ఉపన్యసించాడు.
  • 1880లో చల్లపల్లి బాపయ్య, బసవరాజు, గవర్రాజుల సహకారంతో వితంతు పునర్వివాహ సంఘాన్ని స్థాపించాడు. వితంతువులను వివాహం చేసుకునే వ్యక్తుల కోసం అన్వేషణ ప్రారంభించాడు. ఒక వితంతువు దొరికింది. ఆమె పేరు సీతమ్మ.
  • 1881 డిసెంబరు 11నరాజమండ్రిలో గోగులపాటి శ్రీరాములుతో సీతమ్మ వివాహం జరిగింది. ఇది వీరేశలింగం జరిపించిన తొలి వితంతు వివాహం. డిసెంబరు 15న రత్నమ్మ అనే వితంతువును రాచర్ల రామచంద్రయ్య పెళ్లి చేసుకున్నాడు. ఇది ద్వితీయ వితంతు వివాహం.
  • 1892 నాటికి వీరేశలింగం ఇరవై వితంతువివాహాలను జరిపించాడు. పైడా రామకృష్ణయ్య అనే కాకినాడ వ్యాపారి వీరేశలింగానికి ఆర్థికసహాయం చేశాడు. వీరేశలింగం 1897లో మద్రాసులో, 1905లో రాజమండ్రిలో వితంతు శరణాలయాలను స్థాపించాడు.
  • 1883లో స్త్రీల కోసం ప్రత్యేకంగా ‘సతీహితబోధిని’ అనే మాస పత్రికను ప్రారంభించాడు. ఆయన కార్యకలాపాలు, వార్తలు దేశంలోని వివిధ ప్రాంతాలకు వ్యాపించాయి.
  • మహాదేవ గోవిందరనడే, ఈశ్వరచంద్ర విద్యాసాగర్‌, చంద్రార్కర్‌, మహర్షి డి.కె. కార్వే లాంటి సంఘసంస్కర్తలు వీరేశలింగం సేవలను కొనియాడారు. ఆయన పేరు విదేశాల్లో కూడా వ్యాపించింది. బ్రిటన్‌ దేశస్తురాలైన మానింగ్‌ అనే యువతి వీరేశలింగం స్థాపించిన వితంతు శరణాలయానికి 50 పౌండ్లు చెందేలా వీలునామాలో రాసిపెట్టింది.
  • వీరేశలింగం సేవలకు మెచ్చి ప్రభుత్వం 1893లో రావు బహదూర్‌ బిరుదు ప్రదానం చేసింది.
  • మద్రాసులో 1898లో భారత సంఘ సంస్కరణ సభకు అధ్యక్షత వహించి అత్యున్నతమైన గౌరవాన్ని పొందాడు.
  • ఈ సభలో మహాదేవ గోవింద రనడే, వీరేశలింగాన్ని దక్షిణ భారత ఈశ్వరచంద్ర విద్యాసాగరుడిగా అభివర్ణించాడు.
  • 1905 డిసెంబరు 15న వీరేశలింగం తాను స్థాపించిన వివిధ సంస్థల నిర్వహణ కోసం ‘హితకారిణి సమాజం’ అనే కేంద్ర సంస్థను స్టాపించి తన యావదాస్తిని ఆ సంస్థ పేరున రాశాడు.
  • రచయితగా వీరేశలింగం వీరేశలింగం రాసిన ‘రాజశేఖరచరిత్ర’ తెలుగులో మొదటి నవలగా ప్రశంస పొందింది. చిన్నపిల్లల కోసం ‘సత్యరాజా పూర్వదేశ యాత్రలు’,’ఈసఫ్‌ కథలు’ రాశాడు. కవుల చరిత్ర, శాకుంతల నాటకానువాదం రచించాడు. గద్యతిక్కన, గద్యవాజ్ఞయ బ్రహ్మ, యుగకర్త అనే బిరుదులున్నాయి.

Raghupathi Venkataratnam Naidu (రఘుపతి వెంకటరత్నం నాయుడు)

R V R Naidu
R V R Naidu
  • రఘుపతి వెంకటరత్నం నాయుడు విద్యార్థిగా ఉన్నప్పుడే బ్రహ్మ సమాజ ప్రభావానికి లోనయ్యాడు.
  • 1885లో బ్రహ్మ సమాజంలో చేరి మద్రాసులో మన్నవ బుచ్చయ్య పంతులు
    కార్యక్రమాల్లో పాల్గొన్నాడు. 1894లో మచిలిపట్నం నోబుల్‌ కళాశాలలో ప్రొఫెసర్‌గా చేరిన తర్వాతే ఆయన సంఘసంస్కరణ ప్రారంభమైంది.
  • 1894,1895 సంవత్సరాల్లో విజయవాడ, రాజమండ్రి, గుంటూరు, ఏలూరు పట్టణాల్లో బ్రహ్మ సమాజ ఉద్యమం, సిద్ధాంతాలపై పలుమార్లు ప్రసంగించాడు. ఆ ప్రసంగాల్లో సంఘుశుద్ది, అనాథ ఉద్దరణ ముఖ్య ఆశయాలుగా ఆయన వివరించాడు.
  • అస్పృశ్యతా నిర్మూలన, మద్యపాన నిషేధం, దేవదాసీ పద్ధతి నివారణకు పాటుపడ్డాడు.
  • 1878లో వీరేశలింగం స్థాపించిన ‘ప్రార్ధా సమాజం” పేరుతోనే నాయుడు సంస్కరణోద్యమం నడిచింది. వెంకటరత్నం 1891లో సాంఘిక శుద్ది సంఘాన్ని స్థాపించాడు.
  • దేవదాసీ పద్దతి నిర్మూలనకు వెంకటరత్నం పాటు పడ్డాడు. దేవదాసీల పేరుతో వారిని వేశ్యలుగా మార్చిన హిందూ సంప్రదాయాన్ని అసహ్యించుకున్నాడు.
  • అనాథ బాలబాలికలకు రక్షణ కల్పించడం కోసం కాకినాడలో ఆయన అనాథ బాలబాలికల శరణాలయాన్ని  స్థాపించాడు. హరిజన బాలబాలికల వసతి గృహాన్ని కూడా నిర్మించాడు.
  • మహాత్మాగాంధీ కంటే ముందే వెంకటరత్నం నాయుడు అస్పృశ్యతా నివారణకు కృషి చేశాడు. హరిజన బాలికలను పెంచి విద్యాబుద్ధులు నేర్పించి, పెళ్లిళ్లు కూడా జరిపించాడు. ఈశ్వరుడికి, మానవుడికి ఏ అంతరం లేని విధంగా ఆధ్యాత్మిక, సాంఘిక ఉపాసనలు జరిపి, ఈశ్వర భక్తిభావం పెంపొందించాడు. పిఠాపురం రాజా ఆర్థిక సహాయంతో కాకినాడలో ఆంధ్ర బ్రహ్మోపాసనామందిరాన్ని, బ్రహ్మధర్మ ప్రచారానికి నిధిని నెలకొల్పాడు.
  • ఆయన నోబుల్‌ కళాశాలను వదిలి, సికింద్రాబాద్‌లోని మహబూబ్‌ కళాశాలలో, ఆ తరువాత కాకినాడలోని పిఠాపురం రాజా కళాశాలలో ప్రిన్సిపాల్‌గా పనిచేసి ఉద్యోగ విరమణ పొందాడు.

Gurjada Apparao (గురజాడ అప్పారావు)

gurajada apparao
gurajada apparao
  • గురజాడ అప్పారావు భాషవేత్త, భావకవి. వ్యావహారిక భాషలో, ప్రజలకు అర్థమయ్యే రీతిలో తన రచనలు చేశాడు.
  • ఆయనకు దేవుడి కంటే మనిషి ముఖ్యం. మతం కంటే సమాజం ప్రధానం.
  • ముత్యాలసరాలు, కన్యాశుల్కం, పూర్ణమ్మ మొదలైన రచనలు చేశాడు. కన్యాశుల్కం అనే సాంఘిక దురాచారానికి అద్దం పట్టడానికి సునిశితమైన హాస్యంతో ‘కన్యాశుల్కం’ నాటకం రాశాడు.
  • బాల్య వివాహాలు అనే దురాచారం ఎలాంటి ఫలితాలనిస్తుందో తెలిపేందుకు ‘పుత్తడిబొమ్మ పూర్ణమ్మ” రచించాడు.
  • ఆనాటి అస్పృశ్యతను రూపుమాపడానికి ఆయన తన ముత్యాలసరాలులో సర్వమానవ సౌభ్రాత్రాన్ని తెలియ జేశాడు.
  • మతం పేరుతో మానవుడిని నిర్లక్ష్యం చేసే సాంఘిక వ్యవస్థను దుయ్యబట్టాడు. విగ్రహారాధన, మూఢాచారాలు, గుడ్డి నమ్మకాలను విమర్శించాడు.

Komarraju Venkata Lakshmana Rao (కొమర్రాజు వెంకట లక్ష్మణరావు)

K L RAo
K L Rao
  • కొమర్రాజు వెంకట లక్ష్మణరావు తెలుగు వారికి చరిత్ర, పరిశోధనలు పరిచయం చేశాడు.
  • తెలుగులో చరిత్ర, వైజ్ఞానిక గ్రంథాలు లేని కొరతను తీర్చడానికి మహోద్యమాన్ని ప్రారంభించాడు.
  • ఆంధ్రచరిత్ర పరిశోధక పితామహుడిగా ప్రసిద్ధిపొందాడు. క్రీ.శ.1900లో మునగాల ఎస్టేట్‌లో దివాన్‌గా చేరాడు.
  • 1901లో హైదరాబాద్‌లో ‘శ్రీకృష్ణదేవరాయాంధ్ర భాషానిలయం’ గ్రంథాలయాన్ని నెలకొల్పాడు. తెలుగు భాష స్థెతిని మెరుగు పరచడమే దీని లక్ష్యం.
  • ఆధునిక విజ్ఞానశాస్త్ర రచనలను ప్రోత్సహించడానికి ఆయన 1906లో ‘విజ్ఞాన చంద్రికా గ్రంథ మండలి’ స్థాపనకు కారకుడయ్యాడు. ఈ మండలి ఎన్నో గ్రంథాలను ప్రచురించింది. బ్రిటిష్‌  ఎన్‌సైక్లోపీడియా పద్ధతిలో ‘ఆంధ్ర విజ్ఞానసర్వస్వం’ అనే గ్రంథ రచనకు లక్ష్మణరావు కారకుడయ్యాడు. ఇది మూడు భాగాలుగా, రెండు వేల పేజీలతో వెలువడింది. భారతీయ భాషల్లో ఇదే మొదటి విజ్ఞాన సర్వస్వం.

Gidugu Venkata Ramamurthy (గిడుగు వెంకట రామమూర్తి)

Rama Murthy
Rama Murthy
  • చిన్నయసూరి తరువాత అడుగున పడిపోయిన వ్యావహారిక భాషకు సాహిత్యంలో పట్టంకట్టే ‘వచనం’ విస్తరించేందుకు కృషి చేసిన వాడు గిడుగు వెంకటరామమూర్తి.
  • తెలుగు భాషావ్యాప్తికి గ్రాంథిక భాష ఆటంకం అని వ్యావహారిక భాషోద్యమం చేపట్టాడు.
  • ‘తెలుగు’ అనే పత్రికను స్థాపించి గ్రాంధిక భాషా వాదుల వాదాన్ని, పద్ధతులను ఖండించాడు.
  • పర్లాకిమిడి ప్రాంతంలో జీవించేసవరుల భాషకు లిపిలేదు. రామమూర్తి వారి సంప్రదాయాలు, వ్యవహారాలను పరిశీలించి, వాటిని తెలుగు లిపిలో ప్రచురించాడు. సవరుల పిల్లలకు విద్యాబుద్దులు నేర్పించి అంటరానితనం నిర్మూలనకు కృషిచేశాడు.

Andhra Pradesh History – Social Reformers, Download PDF

 

మరింత చదవండి: 
తాజా ఉద్యోగ ప్రకటనలు  ఇక్కడ క్లిక్ చేయండి
ఉచిత స్టడీ మెటీరియల్ (APPSC, TSPSC) ఇక్కడ క్లిక్ చేయండి
ఉచిత మాక్ టెస్టులు  ఇక్కడ క్లిక్ చేయండి

 

Sharing is caring!

FAQs

where can i found Andhra Pradesh History Sanga Samskarthalu pdf?

you can get Andhra Pradesh History Sanga Samskarthalu pdf in this article

who wrote kanyashulkam?

Gurajada apparao wrote kanyashulakm

how i get ap study material?

You can get ap study material in adda 247 telugu website