Telugu govt jobs   »   State GK   »   Andhra Pradesh Cuisine

Andhra Cuisine, APPSC Groups, AP Police Study Material | ఆంధ్ర వంటకాలు, APPSC గ్రూప్స్, AP పోలీస్ స్టడీ మెటీరియల్

Andhra Cuisine | ఆంధ్ర వంటకాలు

Andhra Telugu cuisine is a cuisine of South India native to the Telugu people from the states of Andhra and Yanam. Generally known for its tangy, hot and spicy taste, the cooking is very diverse due to the vast spread of the people and varied topological regions. Coastal Andhra, Rayalaseema have distinctive cuisines. In the semi-arid Telangana state region millet-based bread (rotte) is the predominant staple food, whereas rice is predominant in irrigated Andhra and Rayalaseema regions. Ragi is also popular in Rayalaseema region. Many of the curries (known as koora), snacks and sweets vary in the method of preparation and differ in name, too.

అన్నం, పరబ్రహ్మ స్వరూపం అనే తెలుగు నానుడి, తెలుగింటి వంటలోని ప్రధాన ఆహార వస్తువు ఏమిటో చెప్పకనే చెబుతుంది! తెలుగు వంట తెలుగు వారి ఇంటి వంట.

Cooking methods in different areas | వివిధ ప్రాంతాల్లో వంట విధానాలు

Festival_special_South_Indian_dishes

పండుగ సందర్భాలలో చేసే ప్రత్యేకమైన తెలుగు వంటలు (గారెలు, పరవాన్నం, పులిహోర, కూర, వేపుడు, పులుసు, పప్పు, నూరుడుపచ్చడి)

ఆంధ్ర ప్రదేశ్, తెలంగాణలకే ప్రత్యేకం అని కాకుండా తెలుగు వారు నివసించే అన్ని ప్రాంతాల్లో తెలుగు వంటలు ఉంటాయి. కర్నాటక, తమిళనాడులలో ఉండే తెలుగు వారు కొద్దిపాటి ప్రాంతీయ ప్రభావాలతో కూడిన తెలుగు వంటలనే వండుకుని ఆస్వాదిస్తారు. ఈ వంటలు తెలుగు వారికి ఇష్టమయిన కారం, పులుపు రుచుల మేళవింపుతో ఉంటాయి. వంట వండే విధానంలో చాలా తేడా కనిపించినా అది కేవలం తెలుగు వారు విస్తృతంగా వ్యాప్తికి నిదర్శనం. ఆంధ్ర ప్రదేశ్ లో పండే ముఖ్యమయిన పంటలయిన వరి, మిరప పంటలు ప్రస్ఫుటంగా ఈ వంటల్లో కనిపిస్తాయి. చాలా వరకూ సాంప్రదాయక వంటలు బియ్యం ఇంకా మిరప వాడకంతోనే అధికంగా చేస్తారు. మసాలా దినుసులు కూడా అత్యధికంగా వాడబడతాయి. శాకాహారమయినా, మాంసాహారమయినా, లేక చేపలు (ఇతర సముద్ర జీవాలు) ఆధారిత ఆహారమయినా అన్నిట్లోనూ వంటలు భేషుగ్గా ఉంటాయి. పప్పు లేనిదే ఆంధ్ర ఆహారం ఉండదు. అలానే టొమాటోలు, చింతపండు వాడకమూ అధికమే! తెలుగు వంటకాలలో ప్రత్యేకతను సంతరించుకున్నవి ఊరగాయలు. ఆవకాయ మొదలుకొని అన్ని రకాల కూరగాయలతో ఊరగాయ చేసుకోవడం తెలుగు వారికే చెల్లయింది.

ఆంధ్రులకి అన్నమే ప్రధానమైన ఆహారం. బియ్యం ఉత్పత్తిలో భారత దేశంలో పశ్చిమ బెంగాల్ తర్వాత ఆంధ్ర ప్రదేశ్ ది రెండవ స్థానము. సహజంగానే అన్ని ఆంధ్ర వంటకాలు అన్నంతో కూడుకున్నవే.

కోస్తా, రాయలసీమ లలో అన్నం ప్రధానాహారం. అయితే రాయలసీమలో రాగులు, జొన్నల వినియోగం కూడా ఎక్కువే. వీటిలోకి వివిధ రకాలైన పప్పు, పులుసు, రసం (చారు), కూరల తయారీలో ప్రాంతాలని బట్టి మార్పులు చేర్పులు ఉంటాయి.

Regional differences | ప్రాంతీయ భేదాలు

వాతావరణ పరిస్థితులు, హైందవ రాజవంశీకుల, ముస్లిం నవాబుల ఆహారపుటలవాట్లు ప్రధానంగా తెలుగు వంటకాలపై ప్రభావం చూపాయి. ఇవే కాక తెలంగాణ, ఆంధ్ర ప్రదేశ్ ల చుట్టు ప్రక్కల ఇతర రాష్ట్రాల ప్రభావం సరిహద్దు ప్రాంతాలపై ప్రభావం చూపి తెలుగు వంటని మరింత వైవిధ్యభరితం చేశాయి. కొన్ని సామాజిక వర్గాలు, మారుమూల ప్రాంతాలు వారివారి వంటల్లో అనాదిగా వస్తున్న సంప్రదాయాలనే ఇంకనూ అనుసరిస్తున్నారు.

Uttarandhra | ఉత్తరాంధ్ర

ఉత్తరాంధ్ర ప్రజలు సాధారణ వంటలలో కూడా తీపిని ఇష్టపడతారు. రోజూ తినే పప్పులో బెల్లం వినియోగిస్తారు. దీనినే బెల్లం పప్పుగా వ్యవహరిస్తారు. ఈ పప్పుని, అన్నంలో వెన్నని కలుపుకు తింటారు.

మెంతులని ఉపయోగించి మెంతిపెట్టిన కూర, ఆవాలని ఉపయోగించి ఆవపెట్టిన కూర, నువ్వులని ఉపయోగించి నువ్వుగుండు కూర లని తయారు చేస్తారు. కూరగాయలు, మొక్కజొన్న గింజలని ఉల్లిపాయలతో కలిపి ఉల్లికారం చేస్తారు.

పూరి, పటోలిలు ఇక్కడి వారి అభిమాన అల్పాహారం. పండగలకి ఉదయం నుండి సాయంత్రం వరకూ ఉపవాసమున్న తర్వాత బియ్యపు పిండితో చేయబడే ఉప్పిండిని సేవిస్తారు. ఉప్పిండి లోనూ, అన్నం లోనూ ఇంగువ చారును తింటారు. బియ్యపు పిండి, బెల్లం, మొక్కజొన్న గింజలు ఉల్లిపాయలతో బెల్లం పులుసుని చేస్తారు.

ఇక్కడి ఊరగాయ తయారీలో స్వల్ప తేడాలు ఉన్నాయి. నువ్వుల నూనెలో ఉప్పు, ఆవపిండి, కారం కలిపిన మామిడి ముక్కలని నానబెట్టి, ఆ తర్వాత వాటిని ఎండబెట్టి ఆ పై ఊరబెడతారు. దీని వలన బంగాళాఖాతం నుండి వచ్చే తేమ వలన ఊరగాయ చెడిపోకుండా ఎక్కువ రోజులు మన్నుతుంది. ఈ ప్రక్రియ వలన ఊరగాయ మరింత ముదురు రంగులోకి మారటమే కాకుండా ఊరగాయ రుచిలో తీపి పెరుగుతుంది.

Coastal Andhra | కోస్తాంధ్ర

Vegetarian_Andhra_Meal

 

కృష్ణ, గోదావరి పరీవాహక ప్రాంతము,, బంగాళా ఖాతాన్ని ఆనుకొన్న ప్రదేశం అవ్వటం మూలాన ఈ ప్రదేశంలో వరి, ఎండుమిరపలు పండుతాయి. అందుకే అన్నం, పప్పు, సముద్రాహారాలు ఇక్కడి ప్రజల ప్రధానాహారం. ఇతర ప్రాంతీయ వంటకాలున్ననూ అన్నం మాత్రం ప్రధానాహారం. దక్షిణ కోస్తాకి చెందినప్రకాశం,నెల్లూరు వంటలకి, ఉత్తరాంధ్ర వంటలకి మధ్య తేడా ప్రస్ఫుటంగా కనబడుతుంది. ఇక్కడి వంటకాలు ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలోనే కాకుండా, తెలంగాణ, బెంగుళూరు, చెన్నై, న్యూ ఢిల్లీలలో కూడా ప్రశస్తి పొందాయి.

Godavari districts | గోదావరి జిల్లాలు

తూర్పు గోదావరి జిల్లా మండపేట మండలం తాపేశ్వరంలో తయారయ్యే తాపేశ్వరం కాజా చాలా ప్రసిద్ధి చెందినది. ఇదే జిల్లాకి చెందిన ఆత్రేయపురం పూతరేకులకు ఖ్యాతి.

ఒంగోలుకి చెందిన అల్లూరయ్య నేతి మిఠాయిలు ప్రశస్తి. ఇక్కడ అన్ని రకాల మిఠాయిలు చేయబడిననూ, సుతిమెత్తగా, నోట్లో వేసుకొనగనే కరిగిపోవు మైసూరుపాకాన్ని జనం బాగా ఇష్టపడతారు.

Nellore | నెల్లూరు

చేపల పులుసుకి నెల్లూరు చేపల పులుసు పెట్టింది పేరు. రాష్ట్రమంతటా నెల్లూరు వారి భోజనశాలలను విరివిగా చూడవచ్చును.

Rayalaseema | రాయలసీమ

సాధారణంగా రాయలసీమ వంటకాలు కూడా ఇతర తెలుగు వంటల వలె ఉన్ననూ వాటికి ప్రత్యేకమైన పేర్లు ఉండటమే కాక, ఇక్కడ కొన్ని ప్రత్యేక వంటలున్నవి.

ఉగ్గాని (మరమరాలతో చేసే అల్పాహారం) సీమ ప్రత్యేకత. బొరుగులు (మరమరాలు) వీటిని ఈ పేర్లతో పిలుస్తారు. ఇవి బియ్యం ద్వారా తయారయ్యే ఉప ఉత్పత్తి. ఉగ్గానిలోకి బజ్జీలు నంజుకొంటారు. ఒక్క చిత్తూరు జిల్లా మినహా, మిగతా మూడు జిల్లాల లోను దీనిని చేస్తారు. ఇది హోటళ్ళలో కూడా లభ్యం. అయితే ఒక్కో జిల్లాలో దీనికి ఒక్కో పేరు ఉంది. కర్నూలులో బొరుగుల తిరగవాతగా, అనంతపురంలో ఉగ్గాని గా, కడపలో బొరుగుల చిత్రాన్నంగా వ్యవహరిస్తారు.

Uggani_bajji

ఇదే విధంగా జొన్న రొట్టెలను కూడా చిత్తూరును మినహాయించి మూడు జిల్లాల్లోనూ తింటారు. కర్ణాటక, ఆంధ్ర రాష్ట్రాలలో ఈ మధ్య ఇది హోటళ్ళలో కూడా లభ్యమౌతుంది. మధుమేహానికి మంచి పత్యకారి.

Jonnarotte

రాగిసంగటి కడపలో బాగా తింటారు. వీటి కోసం ప్రత్యేకంగా హోటళ్ళను జిల్లాలో చాల విరివిగా చూడవచ్చు. మిగతా మూడు జిల్లాల్లో కంటే కడపలోనే ఎక్కువగా తింటారు. బెంగుళూరులోని పెద్ద పెద్ద రెస్టారెంటులలో కూడా ఈ మధ్య ఇది లభిస్తోంది.

Ragi_sangati

  • పొంగలి చిత్తూరులో బాగా ఎక్కువ. చాలా మంది తెలంగాణా వాసులకి పొంగలి తెలియదు. అయితే తమిళనాడు పొంగలి ఇక్కడి పొంగలి ఒకటే విధంగా ఉంటాయి. కర్ణాటకలో పొంగలిలో పాలని వినియోగిస్తారు.
  • ఇడ్లీల తయారీలో చిత్తూరు జిల్లా వారు ఇడ్లీ రవ్వకు బదులుగా ఉప్పుడు బియ్యాన్ని వినియోగిస్తారు. ఇడ్లీ, దోసె లలో చిత్తూరు జిల్లా వారు పచ్చడి, సాంబారు లే కాకుండా మాంసాహార పులుసు కూరలని తింటారు.
  • సాంబారులో ఇతర కూరగాయ ముక్కలతో బాటుగా చిత్తూరులో మామిడికాయని కూడా వేస్తారు. కొద్దిగా వగరు, పులుపులు కలవటంతో సాంబారు మరింత రుచికరం అవుతుంది.
  • ఇతర మామిడి కాయలు సాధారణంగా గుండ్రంగా ఉంటాయి. కానీ చిత్తూరు జిల్లాకి చెందిన ఒక రకం మామిడి పొడవుగా ఉంటాయి. ఇవి పులుపు తక్కువగా ఉండి పచ్చిగానే తినటానికి రుచికరంగా ఉంటాయి. ఇతర జిల్లాలలో వీటినే తోతాపురి అని అంటారు.
  • బనగానెపల్లె “బేనిషా” మామిడి పళ్ళు రాష్ట్రం మొత్తం పేరొందింది.[1] మామిడి పళ్ళను ఇష్టపడే నవాబు, ఒక్కొక్క రకం మామిడి చెట్టుకి ఒక్కొక్క రకం గుర్తు (నిషాన్) చెక్కించేవాడు. అయితే ఒక రకం మామిడి పండు ఎంతో తీయగా, మిగతా అన్ని రకాల కంటే రుచిగా ఉండటంతో, ఆ చెట్టుకి ఏ గుర్తు చెక్కించక, దానికి గుర్తు లేనిది (బే నిషాన్) అని నామకరణం చేయించాడు. అదే వాడుకలో బేనిషా అయ్యింది. ఒక NTR చిత్రంలో “బంగినపల్లి మామిడి పండు రంగుకొచ్చింది” అనే పాట కూడా ఉంది.
  • పులిహోరని కడప, కర్నూలు, అనంతపురం జిల్లాలలో చిత్రాన్నం అని అంటారు. చిత్తూరు జిల్లాలో పులుసన్నం అని అంటారు (నిమ్మకాయ పులుసు, చింతపండు పులుసు లతో చేస్తారని కాబోలు)
  • బొబ్బట్లని కర్నూలులో భక్ష్యాలు అనీ, మిగతా జిల్లాలలో పోళిగ/ఓళిగలనీ అంటారు. అయితే కర్నూలులో వీటి తయారీలో మైదా/గోధుమ పిండి కాకుండా ఫేనీ రవ్వని ఉపయోగిస్తారు. కర్నూలు అనంతపురం జిల్లాలలో వీటిని విక్రయించే ప్రత్యేక దుకాణాలు ఉంటాయి. బెంగుళూరులో బేకరీల్లోనూ, స్వీటు షాపులలోనూ, హోటళ్ళలోనూ వీటిని విక్రయిస్తారు.
  • సీమలో కాఫీ సేవనం ఎక్కువ. అయితే ఇప్పటి తరాలు ఉద్యోగరిత్యా పట్టణాలలో ఉండటం వలన టీకి కూడా కాస్త చోటు దక్కింది.

Break-Fast | అల్పాహారం

  • ఇడ్లీ: ఇడ్లీతో బాటు, కొబ్బరి పచ్చడి/పప్పుల పచ్చడి/వేరుశెనగ పచ్చడి, సాంబారు లని తింటారు. వీటికి నెయ్యి, ఇడ్లీ కారం, మినప వడలు తోడయితే ఇంకా రుచిగా ఉంటాయి.
  • దోశె: దోశెతో బాటు కొబ్బరి పచ్చడి/పప్పుల పచ్చడి/వేరుశెనగ పచ్చడి, సాంబారు లని తింటారు. మినప వడలు తోడయితే ఇంకా రుచిగా ఉంటాయి. ఒక్కోమారు ఆలుగడ్డ, ఉల్లిపాయలతో చేసిన కూర కూడా తింటారు. ఇటీవలె, ఉప్మా-పెసరట్టు వలె, ఉప్మా-దోశెలని కూడా తింటున్నారు. రాయలసీమలో గుడ్డు దోశె, ఉల్లికారం రాసిన కారం దోశెలు కూడా తింటారు.
  • ఉప్మా: గోధుమ నూక, బన్సీ రవ్వ, సేమియాలతో ఉప్మాని చేస్తారు. దీనిలోకి పప్పుల పచ్చడిని తింటారు. ఉప్మాలో జీడిపప్పు పడితే రుచిగా ఉంటుంది. ఉప్మాని పెసరట్టు, దోశెలతో బాటుగా కూడా తింటారు.
  • పూరీ: పూరితో బాటు ఆలుగడ్డ, ఉల్లిపాయలతో చేసిన కూర, పచ్చడిలని తింటారు.
  • వడ:వడతో బాటు పచ్చడి, సాంబారులని తింటారు.
  • పొంగలి: పొంగలితో బాటు పచ్చడి, సాంబారులని తింటారు. వీటిలోకి వడలని కూడా తింటారు.
  • పెసరట్టు: పెసరట్టుతో బాటు పచ్చడి తింటారు.
  • చపాతీ: చపాతీ లతో బాటు కాయగూరలు, పప్పు వంటివి తింటారు.

Sampoorna Andhra Meal | సంపూర్ణ ఆంధ్ర భోజనము

సంపూర్ణ ఆంధ్ర భోజనములో సహజంగా కలిగియుండునవి

in vegetarians | శాకాహారములలో

  • అన్నము
  • ఊరగాయ – ఆవకాయ (కారంగా ఉండే మామిడి కాయ ఊరగాయ), గోంగూర ఇందుకు ఉదాహరణలు.
  • పప్పు – అన్నంతో తినేది.
  • సాంబారు (బాగా కారంగా ఉండి 90 డిగ్రీల వరకు వేడి చేయబడింది) – అన్నంతో తినేది.
  • రసం (ఎలాంటి కూరగాయలు వేయని తేలికపాటి సాంబారు)
  • పులిహోర (చింతపులుసు అన్నం – సాధారణంగా హిందువులు దేవునికి ప్రసాదంగా నైవేద్యం పెడతారు)
  • అప్పడం, వడియములు
  • కారప్పొడి
  • మజ్జిగ పులుసు (మజ్జిగతో చేసిన ఒక రకమైన సాంబారు)
  • పెరుగు అన్నం
  • మునక్కాయల పులుసు
  • వంకాయకూర
  • బెండకాయ ఇగురు
  • దొండకాయ వేపుడు

In Non-Vegetarians | మాంశాహారములలో

  • చేపల పులుసు
  • కోడి కూర
  • మేక మాంసము
  • రొయ్యల ఇగురు

అంతే గాకుండా ఆంధ్ర ప్రదేశ్ అతి పెద్ద మిరప కాయల ఉత్పత్తిదారు. అందువలన ఊరగాయల తయారీలో ఆంధ్ర ప్రదేశ్ ప్రత్యేకమైనది.

Meal | భోజనం

  • శాకాహారం
  • అలంకరణ
  • వడ్డించు విధానం
  • కూరలు
  • పప్పు
  • పులుసులు
  • పచ్చళ్ళు
  • మాంసం హారం
  • చేపలకూర

Snacks | సాయంకాలపు చిరుతిండి

Sweets | మిఠాయిలు

  • సున్నుండ
  • పుతరేకులు
  • బూందీ లడ్డు
  • అరిసె
  • రవ్వ లడ్డు
  • బొబ్బట్టు
  • కాజాలు
  • పాయసము
  • కజ్జికాయ
  • చక్కెర పొంగలి
  • గవ్వలు

Other snacks | ఇతర చిరుతిళ్ళు

  • సకినాలు
  • చెకోడీలు
  • బూందీ
  • బజ్జీ
  • అలచంద వడలు
  • శెనగపప్పు వడలు
adda247

 

తాజా ఉద్యోగ ప్రకటనలు ఇక్కడ క్లిక్ చేయండి
ఉచిత స్టడీ మెటీరియల్ (APPSC, TSPSC) ఇక్కడ క్లిక్ చేయండి
ఉచిత మాక్ టెస్టులు ఇక్కడ క్లిక్ చేయండి

Sharing is caring!

FAQs

What is the main cuisine of Andhra Pradesh?

Some of the delicacies of Andhra Pradesh are Pulihara, Avakkya, Upma and Bagara Baingan

What is Andhra famous for?

Andhra Pradesh is one of the leading rice-growing states in the country and is a major producer of India's tobacco.

What do they eat in Rayalaseema culture?

Instead of the crispy puffed rice, Rayalaseema people soak it. It's also called borugula upma

What is the famous dish of Rayalaseema?

Some famous Rayalaseema food in Hyderabad includes Pachi Pulusu, Koora, Gongura Mutton, Kodi Vepudu, Ragi Sangati, Chegodilu, Ariselu, and Pandu Mirapakaya Bajji.