Telugu govt jobs   »   Article   »   ప్రాచీన చరిత్ర మౌర్యానంతర యుగం

Ancient History Study Notes Post Mauryan Era for APPSC, TSPSC Groups | ప్రాచీన చరిత్ర మౌర్యానంతర యుగం APPSC, TSPSC, స్టడీ నోట్స్

ఏపిపిఎస్సి, టిఎస్పిఎస్సి గ్రూప్స్, పోలీస్ పరీక్షలకి సన్నద్దమయ్యే అభ్యర్ధుల కోసం ప్రాచీన చరిత్ర లో మౌర్యుల పతనం తర్వాత మరియు గుప్తుల సామ్రాజ్య స్థాపనకి ముందు అనేక సామ్రాజ్యాలు భారత దేశాన్ని పరిపాలించాయి. క్రీశ 200 నుంచి 350 మధ్య జరిగిన ఈ కాలం లో ఉన్న ముఖ్య రాజ్యాలు వాటి స్థితి గతులు ప్రజలు, మతాలు, యుద్దాలు గురించిన పూర్తి సమాచారం ఈ కధనం లో తెలుసుకోండి. ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్విస్ కమిషన్ నిర్వహించే గ్రూప్ I, II పరీక్షల్లో కూడా ఈ విభాగం నుంచి ప్రశ్నలు  వచ్చే అవకాశం ఉంది.

APPSC Group 4 Junior Assistant Hall Ticket 2022 |_60.1APPSC/TSPSC Sure shot Selection Group

మౌర్యులు మరియు మౌర్యులనంతర పాలకులు

చంద్రగుప్త మౌర్య (322 BCE – 298 BCE): చంద్రగుప్త మౌర్య నంద రాజవంశాన్ని ఓడించడం ద్వారా మౌర్య సామ్రాజ్యాన్ని స్థాపించాడు. అతను తన గురువు, ప్రఖ్యాత రాజకీయ వ్యూహకర్త చాణక్య (కౌటిల్య అని కూడా పిలుస్తారు)చే మార్గనిర్దేశం చేయబడ్డాడు.

బిందుసార (298 BCE – 273 BCE): చంద్రగుప్త మౌర్యుని కుమారుడు బిందుసారుడు తన తండ్రి బాటలోనే పాలన కొనసాగించాడు. సామ్రాజ్యాన్ని మరింతగా దక్కన్ ప్రాంతంలోకి విస్తరించాడు.

అశోక (273 BCE – 232 BCE): అశోక ది గ్రేట్ అని కూడా పిలువబడే అశోకుడు అత్యంత ప్రసిద్ధ మౌర్య చక్రవర్తులలో ఒకరు. ప్రారంభంలో, అతను సైనిక విజయాల ద్వారా పాలించాడు, కానీ 261 BCEలో జరిగిన కళింగ యుద్ధం అతనిపై తీవ్ర ప్రభావాన్ని చూపింది.

దశరథ మౌర్య (232 BCE – 224 BCE): దశరథుడు అశోకుని కుమారుడు. అతని పాలన సాపేక్ష స్థిరత్వం మరియు అశోకుని విధానాల కొనసాగింపుగా జరిగింది.

సంప్రతి (224 BCE – 215 BCE): సంప్రతి అశోకుని మనవడు మరియు బౌద్ధమతం మరియు సంక్షేమ చర్యలపై అశోకుని ప్రాధాన్యతను కొనసాగించాడని నమ్ముతారు.

సాలిసుక (215 BCE – 202 BCE): సాలిసుక పాలనలో మౌర్య సామ్రాజ్యం క్షీణించింది, రాజ్యం అనేక భాగాలుగా విడిపోయి ప్రావిన్స్ లుగా ఏర్పడ్డాయి. ఇతని పరిపాలన తర్వాత కూడా మౌర్యుల సామ్రాజ్యం మరింతగా విచ్ఛిన్నమైంది.

దేవవర్మన్ (202 BCE – 195 BCE): దేవవర్మన్ పాలనలో కూడా సామ్రాజ్యం మరింతగా విచ్ఛిన్నమయ్యింది.

శతధన్వన్ (195 BCE – 187 BCE): మౌర్యుల చివరి పాలకులలో శతధన్వన్ ఒకడు, మరియు అతని పాలన మరింత క్షీణించి సామ్రాజ్యం మెల్లిమెల్లిగా విడిపోయింది.

APPSC Group 2 Prelims Quick Revision MCQs Batch | Online Live Classes by Adda 247

శుంగ వంశం

ఈ వంశాన్ని స్థాపించింది పుష్యమిత్ర శుంగుడు ఇతను మౌర్యవంశంలో చివరి చక్రవర్తి అయిన బృహద్రదున్ని హత్యమర్చి మౌర్యవంశాన్ని పతనం చేసాడు. శుంగుల చరిత్ర గురించి మహాభాస్యం, హర్షచరిత్ర మరియు కాళిదాసు రచించిన మాళవికాగ్నిమిత్రం గ్రంధాలు తెలుపుతాయి. శుంగుల రాజ భాష సంస్కృతం, మరియు వీరు పాటించే మతం వైదిక మతం. వీరి పరిపాలనలో విదిశ, పాటలీపుత్రలు  రాజధానులుగా ఉన్నాయి. మధ్యప్రదేశ్లోని ప్రముఖ బార్సుత్ బౌద్ధస్థూపం వీరి కాలంలోనే నిర్మించబడింది.

పుష్యమిత్ర శుంగుడు:

ఇతను మౌర్య సామ్రాజ్యంలో సేనాపతి మరియు శుంగవంశంలో సుప్రసిద్ధ రాజు. ఇతని కాలంలోనే  రాజధానిని పాటలీపుత్రం నుండి విదిశకు మారింది. ఇతని కాలంలో వైదిక మతం పునరుద్ధరణ జరిగింది. పాణిని మరియు పతంజలి ఇద్దరు ప్రముఖ కవులు.

గార్గిసంహిత అనే గ్రంధంలో పుష్యమిత్రుల విజయాలు తెలియజేస్తుంది. గ్రీకుల దండయాత్రల నుండి మగధ సామ్రాజ్యాన్ని ఇతను రక్షించాడు. పుష్యమిత్ర శుంగున్ని ఓడించి మగధ నుండి జైన విగ్రహంను కళింగరాజైన భారవేలుడు తీసుకెళ్ళాడు. ధనదేవుడు వేయించిన అయోధ్య శాసనాన్ని బట్టి పుష్యమిత్రు శుంగుడు రెండు అశ్వమేధ యాగాలను నిర్వహించాడు.

అగ్ని మిత్రుడు

కాళిదాసు రచించిన మాళవికాగ్నిమిత్రం అనే నాటకంలో పుష్యమిత్ర శుంగుని కుమారుడు పుష్యమిత్ర శుంగుని కాలంలో విదర్భలో యజ్ఞసేనుడు తిరుగుబాటు చేయగా, అగ్నిమిత్రుడు ఆ తిరుగుబాటును అణచివేసి యజ్ఞసేనుడి కుమార్తె అయిన మాళవికను వివాహం చేసుకున్నాడు అనే నాటకాన్ని రచించాడు. శుంగుల కాలంనాటి ప్రముఖ కళాకేంద్రంగా విదిశ వర్ధిల్లినది. ఈ కాలంలో సంస్కృత సాహిత్యం బాగా అభివృద్ధి చెందినది. మధుర వాస్తుశైలి వీరికాలంలో ప్రవేశపెట్టబడింది.

శుంగరాజు భాగభద్రుని కాలంలో తక్షశిల గ్రీకు రాజు అంటియాల్కిడస్ ఆస్థానం నుండి ఇండో-గ్రీకు రాయబారి హీలియోడోరస్ శుంగ రాజ్యానికి వచ్చాడు. హీలియోడోరస్ కాశీనగరం సందర్శించి, భాగవత మతం స్వీకరించి, బేస నగర్లో (మధ్యప్రదేశ్) గరుడ స్థంభం (Stone Column) ప్రతిష్టించాడు. దీనినే ఖంజ్ బాబా లేదా హీలియోడోరస్ పిల్లర్ అంటారు. ఇతని తర్వాత సుజ్యేష్ట, వసుమిత్ర, వజ్రమిత్ర, భాగవత, దేవభూతి మొదలగు రాజులు పాలించారు. శుంగరాజులలో చివరివాడు అయిన దేవభూతిని, అతని మంత్రి అయిన వాసుదేవుడు సంహరించి కణ్వ వంశమును స్థాపించాడని బాణుని హర్షచరిత్ర తెలుపుతుంది.

కణ్వ వంశం (క్రీ.పూ. 75-28)

ఈ వంశాన్ని స్థాపించింది వాసుదేవ కణ్వ ఇతను బ్రాహ్మణ వర్ణానికి చెందిన కణ్వాయన గోత్రజులు. ఇతను రాజధానిని విదిశ నుండి పాటలీపుత్రమునకు మార్చాడు. కణ్వవంశంలో పరిపాలన సాగించిన నలుగురు రాజులు వరుసగా వాసుదేవుడు, భూమి మిత్ర, నారాయణ, సుశర్మ, శాతవాహన రాజు శ్రీముఖుడు కణ్వవంశ పాలనకు తెరదించి తాత్కాలికంగా పాటలీపుత్రంపై ఆధిపత్యం నెలకొల్పాడు. కణ్వవంశ చివరి రాజైన సుశర్మను శాతవాహన రాజు పులోమావి సంహరించాడు దాంతో కణ్వవంశంను అంతరించింది.

ఛేది వంశం

ఛేదివంశ ఈ వంశంకు మరోపేరు మహామేఘవాహన వంశం దీనిని స్థాపించింది మహామేఘవాహనుడు. ఇతని పరిపాలన కళింగనగరిని రాజధానిగా ఆధారంగా సాగింది. మౌర్యచక్రవర్తి అయిన అశోకుడు కళింగ యుద్ధం తర్వాత, కళింగ రాజ్యాన్ని మౌర్య సామ్రాజ్యంలో విలీనం చేశాడు.

భారవేలుడు:

ఛేదివంశంలో గొప్పవాడు భారవేలుడు. ఇతను జైన మతాన్ని ఆచరించేవాడు. ఇతను నివసించే భవనం పేరు మహా విజయ. ఇతనికి అనేక బిరుదులు కలవు (కళింగాధిపతి, భిక్షురాజు, కళింగ చక్రవర్తి, ముషికాధిపతి, మహా విజయుడు)

శకులు

శకులు హిమాలయాలలోని బోలాన్ కనుమల ద్వారా భారతదేశంలోకి ప్రవేశించారు చైనాలో వీరిని స్కిథియన్లు అంటారు. విరిగురించి “డేరియస్” శాసనంలో ప్రస్తావించారు. భారతదేశంలో 5 రాజ్యాలుగా ఏర్పడి పాలన సాగించారు. శకులని స్థాపించింది మావుజ్/ మొగ తక్షశిల ఇతనికి మహారాజ మహాత్మ అనే బిరుదు కలదు. శకులు తక్షశిల (పాకిస్తాన్) రాజధానిగా పరిపాలన కొనసాగించారు. శకులలో అతి గొప్పవాడైన రుద్రదమనుడు (కార్థమాక వంశం) వేయించిన జునాఘడ్ శాసనం లేదా గిర్నార్ శాసనం భారతదేశంలో మొట్టమొదటి సంస్కృత శాసనంగా ప్రసిద్ధి చెందినది. ఈ శాసనం ప్రకారం చంద్రగుప్తుని కాలంలో సుదర్శన తటాకాన్ని రుద్రదమనుడు మరమ్మత్తు చేయించాడని తెలుస్తున్నది.

పారియన్లు

వీరు భారతదేశంపై దండెత్తి స్కిథియన్స్ను (శకులు) అంతంచేసి ఇండియాలోని వాయువ్య ప్రాంతంలో రాజ్యస్థావన చేసి పహ్లవులుగా పిలవబడ్డారు. వీరి వంశ మూలపురుషుడుగా వోవోనీజ్ పిలవబడగా, ఈ వంశంలో గొప్పవాడుగా గొండోఫర్నిస్ పిలవబడతాడు. గొండోఫర్నిస్ శకుల ప్రాబల్యంను తుదముట్టించి పార్థియన్ రాజ్యాన్ని పటిష్టపరిచాడు. సిరియా గ్రంథం ‘యాక్ట్స్ ఆఫ్ థామస్’ ప్రకారం గొండోఫర్నిస్ కాలంలో క్రైస్తవ మత ప్రచారకుడు సెయింట్ థామస్ (సిరియా) పర్యటించాడు.

కుషాణులు

కుషాణులు గురించి పాన్-కూ రచించిన “పాన్ వంశ చరితము”లో తెలిపారు వీరు యూచీ తెగకు చెందిన వారు, మరియు వీరు 5 తెగలుగా విడిపోయారు అందులో ప్రముఖులు కుషాణులు. కుషాణులు హిందుకుష్ పర్వతాల మీదుగా సింధునది వరకు రాజ్యాన్ని విస్తరించి శకులు, పార్టియన్లను ఓడించారు. వీరికి మరొక పేరు కారియన్లు, కుషాణ రాజులను భగవతపుత్రులు అని అనేవారు. ఈ బిరుదు చైనా నుంచి స్వీకరించారు. మౌర్యుల తదనంతరం భారతదేశానికి వచ్చిన విదేశీయులలో కుషాణులు గొప్పవారు. కుషాణులు మౌర్యులకు మరియు గుప్తులకు మధ్య కాలంలో భారతదేశంలో సమర్ధవంతమైన రాజ్యపాలన వ్యవస్థను స్థాపించారు.

Indian Geography Ebook for APPSC GROUP-1, GROUP-2, AP Grama Sachivalayam, JL, DL, DEO and other APPSC Exams by Adda247.

శాతవాహన రాజవంశం

శాతవాహనులు దక్కన్ ప్రాంతం మరియు దక్షిణ భారతదేశంలోని కొన్ని ప్రాంతాలలో పాలించారు. వారు వాణిజ్యం మరియు పరిపాలనకు చేసిన కృషికి, అలాగే బౌద్ధమతానికి వారి ప్రోత్సాహానికి ప్రసిద్ధి చెందారు. శాతవాహన పాలకులు తమ వాణిజ్య మార్గాల నియంత్రణ ద్వారా భారతదేశంలోని ఉత్తర మరియు దక్షిణ ప్రాంతాలను అనుసంధానించడంలో కీలక పాత్ర పోషించారు.

వకాటక రాజవంశం:

శాతవాహనుల తర్వాత దక్కన్ ప్రాంతంలో వాకాటకులు పాలించారు. రాజవంశం అజంతాలో గుర్తించదగిన గుహ దేవాలయాలతో, నిర్మాణ విజయాలకు ప్రసిద్ధి చెందింది. డెక్కన్ యొక్క సాంస్కృతిక మరియు మతపరమైన అభివృద్ధిలో వాకాటకులు పాత్ర పోషించారు.

 

బౌద్ధమతం

1900 సంవత్సరాల క్రితం పాలించిన కనిష్కుడు అత్యంత ప్రసిద్ధ కుషాణ పాలకుడు మరియు బౌద్ధ మండలిని ఇతను ఏర్పాటు చేశాడు. బుద్ధుని జీవిత చరిత్ర, బుద్ధచరితాన్ని రచించిన కవి అశ్వఘోష అతని ఆస్థానంలో నివసించాడు. మహాయాన బౌద్ధమతం అని పిలువబడే బౌద్ధమతం యొక్క కొత్త రూపం ఇప్పుడు అభివృద్ధి చేయబడింది. బౌద్ధమతం యొక్క పాత రూపం, థెరవాడ బౌద్ధమతం అని పిలుస్తారు, ఇది శ్రీలంక, మయన్మార్, థాయిలాండ్ మరియు ఇండోనేషియాతో సహా ఆగ్నేయాసియాలోని ఇతర ప్రాంతాలలో బాగా ప్రాచుర్యం పొందింది. ప్రసిద్ధ చైనీస్ బౌద్ధ యాత్రికులు ఫా జియాన్, అతను సుమారు 1600 సంవత్సరాల క్రితం ఉపఖండానికి వచ్చాడు, జువాన్ జాంగ్ 1400 సంవత్సరాల క్రితం వచ్చాడు మరియు జువాన్ జాంగ్ తర్వాత 50 సంవత్సరాల తర్వాత వచ్చిన ఐ-క్వింగ్.

APPSC GROUP-2 2024 Complete Study Kit for APPSC GROUP-2 Prelims

 మరింత చదవండి
తాజా ఉద్యోగ ప్రకటనలు ఇక్కడ క్లిక్ చేయండి
ఉచిత స్టడీ మెటీరియల్ (APPSC, TSPSC) ఇక్కడ క్లిక్ చేయండి
ఉచిత మాక్ టెస్టులు ఇక్కడ క్లిక్ చేయండి

Sharing is caring!