అమెరికన్ వ్యోమగామి- పైలట్ మైకేల్ కొల్లిన్స్ కన్ను మూసారు
అమెరికన్ వ్యోమగామి, మైఖేల్ కాలిన్స్, చంద్రుడి పైకి అపోలో 11 మిషన్ కోసం వెళ్ళిన కమాండ్ మాడ్యూల్ పైలట్, క్యాన్సర్తో పోరాడిన తరువాత కన్నుమూశారు. 1969 లో ముగ్గురు వ్యక్తుల అపోలో 11 సిబ్బంది మిషన్ సమయంలో, కాలిన్స్ కమాండ్ మాడ్యూల్ చోధకుడిగా ఉండగా , మిగతా ఇద్దరు సభ్యులు, నీల్ ఆర్మ్‌స్ట్రాంగ్ మరియు బజ్ ఆల్డ్రిన్ చంద్రునిపై నడిచిన మొదటి మానవులుగా గుర్తింపు పొందారు. కాలిన్స్ తన జీవితంలో ఏడు సంవత్సరాలు నాసాతో వ్యోమగామిగా పనిచేసాడు.