Telugu govt jobs   »   Current Affairs   »   Height measurements of SI candidates will...

Height measurements of SI candidates will be taken in presence of High Court Today | ఇవ్వాళ హైకోర్టు సమక్షంలో SI అభ్యర్ధుల ఎత్తు కొలతలు తీసుకొనున్నారు

Height measurements of SI candidates will be taken in presence of High Court Today| ఇవ్వాళ హైకోర్టు సమక్షంలో SI అభ్యర్ధుల ఎత్తు కొలతలు తీసుకొనున్నారు

ఎత్తు కొలతలు విషయంలో గతంలో ఇచ్చిన తీర్పుకి అనుగుణంగా కోర్టుని ఆశ్రయించిన అభ్యర్ధుల ఎత్తు, ఛాతీ కొలతలను మంగళవారం హైకోర్టు సమక్షంలో తీసుకుంటాము అని తెలిపారు. 2018 నోటిఫికేషన్ లో పరీక్ష రాసిన 24 మంది అభ్యర్ధులను అనర్హులుగా పోలీసు రిక్రూట్మెంట్ బోర్డ్ తేల్చిన వారికి  తిరిగి ఎత్తు, ఛాతీ కొలతలు తీసుకొనున్నారు. గతంలో జరిగిన వాదనలలో విచారణను ఈ రోజుకి వాయిదా వేశారు కావున ఇవ్వాళ హైకోర్టు సమక్షం లో పోలీసు రిక్రూట్మెంట్ బోర్డు అభ్యర్ధుల ఎత్తు, ఛాతీ కొలతలు తీసుకొనున్నారు.

గతంలో జరిగిన వాదనలు

ఆంధ్రప్రదేశ్ సబ్-ఇన్‌స్పెక్టర్ (SI) ఉద్యోగాల నియామక ప్రక్రియలో అభ్యర్థుల ఎత్తును కొలవడానికి డిజిటల్ మెషీన్లను ఉపయోగించడంపై అమరావతి హైకోర్టు ఆందోళన వ్యక్తం చేసింది. ఈ ప్రక్రియ కోసం నోటిఫికేషన్ లో ఎత్తు కొలతల కోసం డిజిటల్ పరికరాల వినియోగాన్ని పేర్కొనలేదు అని తెలియజేసింది. 2018లో అర్హత ఉన్న అభ్యర్థులు 2023లో డిజిటల్ కొలతల ఆధారంగా ఎందుకు అనర్హులుగా ప్రకటిస్తారని కోర్టు ప్రశ్నించింది, ప్రత్యేకించి కాలక్రమేణా ఎత్తు వైవిధ్యాలు సంభవిస్తాయ అని ప్రభుత్వ తరపు న్యాయవాదిని ప్రశ్నించింది.

ఈ ఆందోళనలను పరిష్కరించడానికి, 95 మంది పిటిషనర్ల ఎత్తును మాన్యువల్‌గా కొలవాలని పోలీసు రిక్రూట్‌మెంట్ బోర్డ్‌కు ఆదేశించారు, అర్హత ప్రమాణాలకు అనుగుణంగా ఉన్నవారు ప్రధాన వ్రాత పరీక్షకు వెళ్లవచ్చని నిర్ధారించింది. ఈ ఎత్తు కొలత ప్రక్రియను మూడు రోజుల్లో పూర్తి చేయాలి అని తెలుపుతూ వివాదాలకు తావు లేకుండా ఎత్తు కొలవాలి అని తెలిపింది.

అక్టోబర్ 14, 15 తేదీల్లో AP SI మెయిన్ రాతపరీక్ష జరగనుందని, తుది ఫలితాల్లో అర్హులైన పిటిషనర్లు ఉంటారని భావిస్తున్నారు. ఎత్తు కొలవడానికి డిజిటల్ పరికరాలను ఉపయోగించడాన్ని సవాల్ చేస్తూ 95 మంది అభ్యర్థులు వేసిన పిటిషన్‌పై జస్టిస్ వి.సుజాత ఈ తీర్పును వెలువరించారు. ఈ తీర్పుతో 95 మంది విధ్యార్ధులు కూడా రాత పరీక్షకి అర్హులయ్యే అవకాశం ఉంది. మరియు పిటిషనర్లలో అర్హత సాధించిన వారిని కలుపుకొని ఒకేసారి తుది ఫలితాలు ప్రకటించాలని తేల్చిచెప్పింది. హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ వి.సుజాత శుక్రవారం ఈ మేరకు తీర్పు వెలువడించారు.

pdpCourseImg

మరింత చదవండి:
తాజా ఉద్యోగ ప్రకటనలు  ఇక్కడ క్లిక్ చేయండి
ఉచిత స్టడీ మెటీరియల్ (APPSC, TSPSC) ఇక్కడ క్లిక్ చేయండి
ఉచిత మాక్ టెస్టులు  ఇక్కడ క్లిక్ చేయండి

Sharing is caring!