భారతదేశ జిడిపి వృద్ధి రేటు FY22 లో 11% ఉంటుందని అంచనా వేసిన ADB
మనీలా ఆధారిత ఆసియా అభివృద్ధి బ్యాంకు (ADB) తన తాజా ఫ్లాగ్ షిప్ ఆసియా డెవలప్ మెంట్ అవుట్ లుక్ (ADO) 2021లో భారతదేశ ఆర్థిక వ్యవస్థ వృద్ధి రేటును ఈ క్రింది విధంగా అంచనా వేసింది:
- FY22 (2021-22): 11%
- FY23 (2022-23): 7%
ఎడిబి దేశవ్యాప్తంగా చేపట్టిన “బలమైన వ్యాక్సిన్ డ్రైవ్” పై రేటును ఆధారం చేసుకుంది, అయితే, ఇటీవల కోవిడ్ కేసుల పెరుగుదల దేశ ఆర్థిక పునరుద్ధరణను “ప్రమాదంలో” ఉండవచ్చని కూడా హెచ్చరించింది.
అన్ని పోటీ పరీక్షలకు ముఖ్యమైన అంశాలు:
- ADB అధ్యక్షుడు: మసాట్సుగు అసకవా; ప్రధాన కార్యాలయం: మనీలా, ఫిలిప్పీన్స్.
- ADB స్థాపించబడింది: 9 డిసెంబర్ 1966.