మరింత చదవండి | |
తాజా ఉద్యోగ ప్రకటనలు | ఇక్కడ క్లిక్ చేయండి |
ఉచిత స్టడీ మెటీరియల్ (APPSC, TSPSC) | ఇక్కడ క్లిక్ చేయండి |
ఉచిత మాక్ టెస్టులు | ఇక్కడ క్లిక్ చేయండి |
Adda247 తెలుగు APP | ఇక్కడ క్లిక్ చేయండి |
Top Performing
3 bird sanctuaries in AP will be converted into community reserve areas | APలో 3 పక్షుల సంరక్షణ కేంద్రాలను కమ్యూనిటి రిజర్వ్ ప్రాంతాలుగా మార్చనున్నారు

3 bird sanctuaries in AP will be converted into community reserve areas | APలో 3 పక్షుల సంరక్షణ కేంద్రాలను కమ్యూనిటి రిజర్వ్ ప్రాంతాలుగా మార్చనున్నారు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో, శ్రీకాకుళం జిల్లాలో ఉన్న తేలినీలాపురం పక్షుల కేంద్రం, గుంటూరు జిల్లాలో ఉన్న ఉప్పలపాడు పక్షుల కేంద్రం, అనకాపల్లి జిల్లాలో ఉన్న కాండకర్ల అవ సరస్సు లను కమ్యూనిటి రిజర్వ్ ప్రాంతాలుగా మార్చానున్నట్టు అటవీ అధికారులు తెలిపారు. ఈ మూడు పక్షుల కేంద్రాలను అభివృద్ధి చేయడం వలన వలస వచ్చే పక్షులకు ఎంతో ఉపయోగకరంతో పాటు పర్యాటకంగా కూడా అభివృద్ది అవుతుంది. స్థానికుల సహకారంతో ఈ మూడు జిల్లాలలో ఉన్న పక్షుల కేంద్రాలను కమ్యూనిటి రిజర్వ్ ప్రాంతాలుగా తీర్చి దిద్దేందుకు మార్గదర్శకాలను సిద్దం చేస్తున్నట్టు అధికారులు తెలిపారు. శ్రీకాకుళం జిల్లా తేలినీలాపురంలో 30 కిలోమీటర్లు విస్తీర్ణంలో ఉంది. ఇక్కడకి పక్షులు శీతాకాలంలో గూడు కట్టేందుకు దాదాపుగా 200 రకాలు పైగా పక్షి జాతులతో పాటు పెలికాన్, పేయింటెడ్ స్టార్క్ వంటివి సైబీరియా నుంచి వస్తాయి.
గుంటూరు జిల్లాలో ఉన్న ఉప్పలపాడు పక్షుల కేంద్రం 10 ఎకరాల విస్తీర్ణంలో మంచి నీటి సరస్సులో ఉంది. ఇక్కడకి 32 రకాల పక్షి జాతులు వస్తాయి. అనకాపల్లి జిల్లాలో ఉన్న కాండకర్ల అవ సరస్సుకి చిలుకలు, పెలికాన్, పేయింటెడ్ స్టార్క్ వంటివి శీతాకాలం లో వస్తుఉంటాయి. వీటిని పర్యాటక కేంద్రాలుగా కూడా అభివృద్ధి చేయనున్నారు.