పలు దేశాల్లో చంద్రగ్రహణం (lunar eclipse) ప్రారంభమైంది

ఈ గ్రహణం ప్రపంచంలోని భారత్, అమెరికా, ఆస్ట్రేలియా సహా పలు ప్రాంతాల్లో ఈ గ్రహణం కనువిందు చేయనుంది.

భారత్‌లో మధ్యాహ్నం 2:39 గంటలకు గ్రహణం ప్రారంభమై సాయంత్రం 6:19 గంటలకు సమాప్తంకానుంది. మధ్యహ్నం 3:46 గంటల నుంచి సాయంత్రం 5:12 గంటల వరకు సంపూర్ణ చంద్రగ్రహణం ఏర్పడనుంది.

తెలుగు రాష్ట్రాల్లో (Telugu states) సాయంత్రం 5:40 గంటల నుంచి సాయంత్రం 6:19 వరకు పాక్షిక గ్రహణం ఏర్పడనుండగా... ఈశాన్య రాష్ట్రాల్లో చంద్రగ్రహణం సంపూర్ణంగా కనిపించనుంది

580 ఏళ్ల తర్వాత తొలిసారి సంపూర్ణ చంద్రగ్రహణం ఏర్పడింది. మళ్లీ 2025 మార్చి 14న సంపూర్ణ చంద్రగ్రహణం సంభవించనుంది.

మరోవైపు ఈ ఏడాది 15 రోజుల వ్యవధిలోనే రెండు గ్రహణాలు సంభవించాయి. అక్టోబర్‌లో దీపావళి పర్వదిన సమయంలో సూర్యగ్రహణం ఏర్పడగా....15 రోజుల తర్వాత ఈరోజు చంద్రగ్రహణం సంభవించింది. ఈ సంవత్సరం ఇదే చివరి సంపూర్ణ చంద్రగ్రహణం

For More News and Current affairs. & Job Updates