Andhra Cuisine   ఆంధ్ర వంటకాలు

అన్నం, పరబ్రహ్మ స్వరూపం అనే తెలుగు నానుడి, తెలుగింటి  వంటలోని ప్రధాన ఆహార వస్తువు  ఏమిటో చెప్పకనే చెబుతుంది! తెలుగు వంట తెలుగు వారి ఇంటి వంట.

తూర్పు గోదావరి జిల్లా మండపేట  మండలం  తాపేశ్వరంలో  తయారయ్యే తాపేశ్వరం కాజా చాలా ప్రసిద్ధి చెందినది. ఇదే జిల్లాకి చెందిన ఆత్రేయపురం  పూతరేకులకు ఖ్యాతి.

ఆంధ్ర ప్రదేశ్,  తెలంగాణలకే ప్రత్యేకం అని కాకుండా తెలుగు వారు నివసించే అన్ని ప్రాంతాల్లో తెలుగు వంటలు ఉంటాయి. కర్నాటక,  తమిళనాడులలో ఉండే తెలుగు వారు కొద్దిపాటి ప్రాంతీయ ప్రభావాలతో కూడిన తెలుగు వంటలనే వండుకుని ఆస్వాదిస్తారు.