ఓడీఎఫ్ ప్లస్ ర్యాంకింగ్స్‌లో తెలంగాణ అగ్రస్థానంలో నిలిచింది

ఓడీఎఫ్ ప్లస్ ర్యాంకింగ్స్‌లో తెలంగాణ అగ్రస్థానంలో నిలిచింది

స్వచ్ఛ్ భారత్ మిషన్ గ్రామీణ ఫేజ్-2లో భాగంగా భారతదేశంలోని అన్ని గ్రామాలలో 50% బహిరంగ మలవిసర్జన రహిత (ఓడిఎఫ్ ప్లస్) జాబితాలో చేర్చినట్లు ప్రభుత్వం మే 10 న  ప్రకటించింది.

సాలిడ్, లిక్విడ్, వేస్ట్ మేనేజ్‌మెంట్ సిస్టమ్‌లను అమలు చేసి ఓడీఎఫ్ రహిత హోదా సాధించిన గ్రామాలను ఓడీఎఫ్ ప్లస్ జాబితాలో చేర్చినట్లు కేంద్ర జలవనరుల శాఖ నివేదించింది.

100% స్కోర్‌తో మొదటి స్థానంలో నిలిచి, అన్ని గ్రామ పంచాయతీలు ODF ప్లస్‌గా ఉన్న ఏకైక రాష్ట్రంగా అవతరించడం ద్వారా తెలంగాణ అద్భుతమైన ఘనత సాధించింది.