Telugu govt jobs   »   TSPSC Group 1   »   TSPSC Group 1 Exam 2022 Last...

TSPSC Group 1 Exam 2022 Last Week Preparation Strategy | TSPSC గ్రూప్ 1 పరీక్ష చివరి వారం ప్రిపరేషన్ వ్యూహం

TSPSC Group 1 Exam 2022: The Telangana Public Service Commission (TSPSC) will conduct the preliminary examination, this is the first exam for recruitment to Group-I services after Telangana State Formation. TSPSC Group 1 2022 Prelims Exam will be Scheduled on 16th October 2022. Only six Days are left for TSPSC Group 1 Exam 2022. TSPSC released the Group 1 admit card on 9 October 2022 on its official Website. Everyone is well prepared for the exam. Let’s learn how the candidates who have been prepared so far from the examination point of view can give final touches to their preparation.

Click Here: TSPSC Group 1 Admit Card 2022

TSPSC గ్రూప్ 1 పరీక్ష 2022: తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (TSPSC) ప్రిలిమినరీ పరీక్షను నిర్వహిస్తుంది, తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత గ్రూప్-I సర్వీసులకు రిక్రూట్‌మెంట్ కోసం ఇది మొదటి పరీక్ష. TSPSC గ్రూప్ 1 2022 ప్రిలిమ్స్ పరీక్ష 16 అక్టోబర్ 2022న షెడ్యూల్ చేయబడుతుంది. TSPSC గ్రూప్ 1 పరీక్ష 2022కి కేవలం ఆరు రోజులు మాత్రమే మిగిలి ఉన్నాయి. TSPSC గ్రూప్ 1 అడ్మిట్ కార్డ్‌ను 9 అక్టోబర్ 2022న తన అధికారిక వెబ్‌సైట్‌లో విడుదల చేసింది. అందరూ పరీక్షకు బాగా సిద్ధమయ్యారు. పరీక్షల కోణం నుండి ఇప్పటివరకు ప్రిపేర్ అయిన అభ్యర్థులు తమ ప్రిపరేషన్‌కు తుది మెరుగులు దిద్దే విధానాన్ని తెలుసుకుందాం.

TSPSC Group 1 Exam 2022 Last Week Preparation Strategy_40.1

APPSC/TSPSC Sure shot Selection Group

TSPSC Group 1 Exam 2022 | TSPSC గ్రూప్ 1 పరీక్ష 2022

తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక జరిగే మొట్టమొదటి గ్రూప్-1 ప్రిలిమ్స్ కాబట్టి పరీక్షా కఠినత్వ స్థాయి, పరిధి ఎలా ఉంటుంది అనే ఆందోళన సీరియస్ గా సిద్దమైన అభ్యర్థుల్లో కనిపిస్తోంది. అయితే రాష్ట్రం ఏర్పడిన తర్వాత జూనియర్ పంచాయతీ ఆఫీసర్స్ గ్రూప్-2 మొదలైన పరీక్షల్ని సర్వీస్ కమిషన్ నిర్వహించింది. ఈ పరీక్షలన్నీ సగటు కఠినత్వ స్థాయితో ఉన్నాయి. అదేవిధంగా అన్ని సబ్జెక్టులనూ తగిన మోతాదులో ఇచ్చారు. అదే ధోరణి పునరావృతం అవుతుందని భావించవచ్చు. కాబట్టి అనవసరమైన కఠినత్వాన్ని ఊహించుకుని ఆందోళనపడటం అశాస్త్రీయం. ఇలాంటి ఆందోళనకు ఈ కొద్దిరోజుల సమయంలో ఏమాత్రం అవకాశం ఇచ్చినా నష్టపోయే ప్రమాదం ఉంది.

ప్రకటించిన పోస్టులు 503 కాబట్టి 150 నిష్పత్తిలో ప్రిలిమ్స్ నుంచి మెయిన్స్ కు ఎంపిక చేస్తారు. దాదాపుగా సీరియస్ అభ్యర్థులందరూ మెయి న్స్కు అర్హులయ్యే అవకాశం ఉంటుంది. ఈ వాస్తవాన్ని దృష్టిలో పెట్టుకొని ఎటువంటి ఒత్తిడీ లేకుండా ప్రశాంతంగా పరీక్షకు హాజరైతే సగం విజయం సాదించినట్లే.

TSPSC Group 1 Prelims Exam Pattern 2022 (TSPSC గ్రూప్ 1 పరీక్ష సరళి 2022)

పరీక్ష వివరాలు :

సబ్జెక్టు పరీక్షా సమయం (HOURS) మొత్తం  మార్కులు
ప్రిలిమినరీ టెస్ట్ 
జనరల్ స్టడీస్ & మెంటల్ ఎబిలిటీ (ఆబ్జెక్టివ్ టైప్)  150 ప్రశ్నలు
 2 ½ 150

TSPSC Group 1 Exam 2022 Last Week Preparation | TSPSC గ్రూప్ 1 పరీక్ష చివరి వారం ప్రిపరేషన్

  • కొంతమంది అభ్యర్థులు చివరిరోజు వరకు ‘అది చదవాలి. ఇది చదవాలి’ అని ఆందోళనకు గురవుతూనే ఉంటారు. ఇది సరైన పద్ధతి కాదు. ముఖ్యంగా ఆబ్జెక్టివ్ పరీక్షల్లో..
  • అబ్జెక్టివ్ పరీక్షలకు హాజరయ్యేటప్పుడు కనీసం వారం రోజులు ముందు నుంచీ తగినంత నిద్ర ద్వారా మెదడుకు ప్రశాంతతను అందించాలి. తద్వారా అభ్యర్థుల పెర్ఫార్మెన్స్ పెరుగుతుందని అనేక అధ్యయనాల్లో వెల్లడైంది. ఇదే విషయాన్ని అన్వయించుకుని కనీసం 10 గంటల సమయమైనా మెదడుకు విశ్రాంతినివ్వాలి.
  • సోషల్ మీడియాలో వచ్చే సమాచారానికి దూరంగా ఉంటూ ప్రశాం తంగా ఉండాలి. ప్రశాంతంగా నిద్రపోవాలి.
  • కొత్త కొత్త విషయాలను చదివే ఆలోచనకు ఫుల్ స్టాప్ పెట్టాలి. చదివిన పుస్తకాల్లో కూడా కొన్ని సబ్జెక్టులను ఇక చదవాల్సిన అవసరం లేదని నిర్ధారించుకుని వాటిని పక్కన పెట్టేసేయాలి.
  •  కరెంట్ అఫైర్స్, గణాంకాలు, ఆర్థిక గణాంకాలు మొదలైనవాటి పునశ్చరణ (రివిజన్) కు మాత్రమే ఇప్పటి సమయాన్ని కేటాయించాలి.
  • తెలంగాణ విధానాలు, తెలంగాణ భౌగోళిక అంశాలు, చారిత్రక సాంస్కృ తిక అంశాలు, తెలంగాణ ఉద్యమం, తెలంగాణ సమాజం, ఆర్ధిక వ్యవస్థ మొదలైన విభాగాలపై ఎక్కువ ప్రశ్నలు వచ్చే అవకాశం ఉంది. వీలైతే ఈ కొద్ది రోజుల్లో విహంగ వీక్షణ అధ్యయనానికి ప్రాధాన్యం ఇవ్వాలి.
  • పరీక్షకు 24 గంటల ముందు ఏదీ చదవకుండా ప్రశాంతంగా ఉండటం మేలు. దీనివల్ల మంచి ఫలితాలను రాబట్టవచ్చు.

TSPSC Group 1 Related Articles:

TSPSC Group 1 Syllabus
TSPSC Group 1 Exam Pattern
TSPSC Group 1 Age Limit
TSPSC Group 1 Recruitment 2022 Exam Dates
TSPSC Group 1 Admit Card 2022

Instructions in Examination Hall | పరీక్ష హాలులో సూచనలు

  • పరీక్ష పర్యవేక్షణాధికారి ఇచ్చే సూచనలను తప్పనిసరిగా పాటించాలి.
  • అభ్యర్థులు తమ వివరాలను పర్యవేక్షణాధికారి ఆదేశించిన రీతిలో నమోదు చేసుకోవాలి. హాల్ టికెట్ నంబర్, పరీక్షా పత్రం కోడ్ లాంటివి తప్పులు రాస్తూ చాలా సందర్బాల్లో నష్టపోయిన అభ్యర్థుల సంఖ్య ఎక్కువే.
  • సమాదానాలను గుర్తించే సందర్భంలో మొదట తెలిసిన సమాధానాలు అన్ని గుర్తించుకుంటూ వెళ్లి తర్వాతి రౌండ్లో నమ్మకం ఉన్న సమాధానాన్ని గుర్తించడం మంచిది.
  • తెలిసిన సబ్జెక్టు ప్రశ్నలు ఎక్కడ ఉన్నాయి అనే వెతుకులాట వల్ల లాభం కంటే నష్టమే ఎక్కువ. వరుస క్రమంలో సమాధానాలు గుర్తించుకుంటూ వెళ్లటమే మంచిది.

Jumbling In TSPSC Group 1 Exam | భారీగా ప్రశ్నల జంబ్లింగ్

ప్రభుత్వ పోటీపరీక్షలకు నిర్ణీత ప్రశ్నలను జంబ్లింగ్ చేసి ఇప్పటివరకు A, B, C, D సిరీస్ ల పేరిట నాలుగు ప్రశ్నపత్రాలు అభ్యర్థులకు వరుస క్రమంలో ఇచ్చేవారు. ఇకపై నాలుగుకు మించి వీలైనన్ని బహుళ సిరీస్ లు వచ్చేలా ప్రశ్నపత్రాలను కమిషన్ సిద్ధం చేస్తోంది. ఎంపిక చేసిన ప్రశ్నలకు కంప్యూటర్ సాఫ్ట్‌వేర్ తో సాధ్యమైనన్ని దఫాలుగా జంబ్లింగ్ చేసి, ఎక్కువ సంఖ్యలో సిరీస్ ల ప్రశ్నపత్రాలను ముద్రించనుంది. ఈ మేరకు A, B, C, D సిరీస్ ల స్థానంలో ఆరంకెల ప్రశ్న పత్రం నంబరుతో ప్రశ్నపత్రాలు అభ్యర్థులకు ఇవ్వనుంది. అభ్యర్థులు ఆరంకెల సిరీస్ తో కూడిన ప్రశ్నపత్రం కోడ్ ను OMR షీట్ లో నమోదు చేసి, ఆ మేరకు వృత్తాల్ని బ్లూ లేదా బ్లాక్ బాల్ పాయింట్ పెన్ తో బబ్లింగ్ చేయాలని కమిషన్ తెలిపింది. ప్రశ్నపత్రం బుక్ లెట్ సిరీస్ నంబరు OMRలో రాసి, వృత్తాల్ని సరిగా బబ్లింగ్ చేయకున్నా, వృత్తాల్ని సరిగా నింపి బుక్లెట్ సిరీస్ నంబరు రాయకున్నా.. ఒక్క అంకెను తప్పించినా ఆ OMR ను మూల్యాంకనానికి పరిగణనలోకి తీసుకోబోమని వెల్లడించింది.

Telangana Study Note:

Telangana History (తెలంగాణ చరిత్ర) Telangana State Formation – Movement (తెలంగాణ ఉద్యమ చరిత్ర -తెలంగాణ రాష్ట్ర అవతరణ)
Telangana Economy (తెలంగాణ ఎకానమీ) Telangana Government Schemes (తెలంగాణ ప్రభుత్వ పధకాలు)
Telangana Current Affairs (తెలంగాణ కరెంటు అఫైర్స్) Other Study Materials

 

TSPSC Group 1 Exam 2022 Last Week Preparation Strategy_50.1

మరింత చదవండి: 

తాజా ఉద్యోగ ప్రకటనలు  క్కడ క్లిక్ చేయండి
ఉచిత స్టడీ మెటీరియల్ (APPSC, TSPSC) ఇక్కడ క్లిక్ చేయండి
ఉచిత మాక్ టెస్టులు  ఇక్కడ క్లిక్ చేయండి

Sharing is caring!

Download your free content now!

Congratulations!

TSPSC Group 1 Exam 2022 Last Week Preparation Strategy_70.1

కరెంట్ అఫైర్స్ -ఏప్రిల్ 2022 మాస పత్రిక

Download your free content now!

We have already received your details!

TSPSC Group 1 Exam 2022 Last Week Preparation Strategy_80.1

Please click download to receive Adda247's premium content on your email ID

Incorrect details? Fill the form again here

కరెంట్ అఫైర్స్ -ఏప్రిల్ 2022 మాస పత్రిక

Thank You, Your details have been submitted we will get back to you.