Telugu govt jobs   »   Article   »   TS TET సిలబస్ 2023

TS TET సిలబస్ 2023 మరియు పరీక్షా సరళి పూర్తి వివరాలు, డౌన్‌లోడ్ సిలబస్ PDF

TS TET సిలబస్ 2023

TS TET సిలబస్ 2023 : TS TET 2023 నోటిఫికేషన్ ని అధికారిక వెబ్‌సైట్‌ www.tstet.cgg.gov.in లో 1 ఆగస్టు 2023న తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం, పాఠశాల విద్యా శాఖ విడుదల చేసింది. TS TET పరీక్షకు సిద్ధమవుతున్న అభ్యర్థులు తప్పనిసరిగా TS TET సిలబస్ 2023 మరియు పరీక్షా సరళి గురించి తెలుసుకోవాలి. అభ్యర్థులకు TS TET సిలబస్ 2023 మరియు పరీక్షా సరళిపై స్పష్టమైన ఆలోచన ఉంటే, పరీక్షలో మంచి స్కోర్ పొందడానికి మీకు సహాయం చేస్తుంది. ఈ వ్యాసంలో మేము TS TET సిలబస్ మరియు పరీక్షా సరళి గురించి చర్చిస్తున్నాము. TS TET  సిలబస్ మరియు పరీక్షల నమూనా గురించి మరిన్ని వివరాలను తెలుసుకోవడానికి, కథనాన్ని పూర్తిగా చదవండి.

TS TET సిలబస్ 2023 అవలోకనం 

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం, పాఠశాల విద్యా శాఖ TS TET 2023 నోటిఫికేషన్ ని విడుదల చేసింది. TS TET సిలబస్ యొక్క అవలోకనాన్ని దిగువ పట్టికలో అందించాము.

TS TET సిలబస్ 2023 అవలోకనం 
సంస్థ పాఠశాల విద్యా శాఖ, తెలంగాణ ప్రభుత్వం
పోస్ట్ TS TET 2023
వర్గం సిలబస్
TS టెట్ 2023 నోటిఫికేషన్ విడుదల తేదీ 1 ఆగస్టు 2023
TS టెట్ 2023  పరీక్ష తేదీ 15 సెప్టెంబర్ 2023
TS టెట్ 2023 పరీక్ష విధానం ఆఫ్ లైన్ / ఆన్ లైన్
అధికారిక వెబ్సైట్ www.tstet.cgg.gov.in

TS TET పరీక్షా సరళి 2023

TSTET 2022 పరీక్షలో పాఠశాల విద్య యొక్క వివిధ స్థాయిలలో ఉపాధ్యాయులను నియమించడానికి రెండు పేపర్లు ఉంటాయి:

  1. TS TET పేపర్-I (ప్రైమరీ టీచర్ కావాలనుకునే అభ్యర్థుల కోసం, అంటే క్లాస్ I-V )
  2. TS TET పేపర్-II (సెకండరీ టీచర్ కావాలనుకునే అభ్యర్థులకు, అంటే క్లాస్ VI-VIII)

అభ్యర్థులు అర్హత ప్రమాణాలను బట్టి పేపర్-I లేదా పేపర్-II లేదా రెండు పేపర్‌లకు హాజరుకావచ్చు. ప్రశ్నపత్రం ఎంచుకున్న భాష I మరియు ఆంగ్లంలో ప్రశ్నలతో కూడిన ద్విభాషా ఆకృతిలో రూపొందించబడింది.

TS TET 2023 పేపర్ I- పరీక్షా సరళి

TS-TET పరీక్షా ప్రశ్నలు మల్టిపుల్ చాయిస్ ప్రశ్నలు (MCQలు) ఉంటాయి, ఒక్కొక్కటి ఒక్కో మార్కును కలిగి ఉంటాయి, మొత్తం 150 మార్కులకు పరీక్షా ఉంటుంది. పరీక్షా వ్యవది 2 గంటల 30 నిముషాలు

నెం. సబ్జెక్ట్ ప్రశ్నల సంఖ్య మార్కులు
 1 పిల్లల అభివృద్ధి మరియు బోధన  30 MCQs  30 మార్కులు
2 లాంగ్వేజ్ – I 30 MCQs 30 మార్కులు
3 లాంగ్వేజ్- II ఇంగ్లీష్ 30 MCQs 30 మార్కులు
4 గణితం 30 MCQs 30 మార్కులు
5 పర్యావరణ అధ్యయనాలు 30 MCQs 30 మార్కులు
మొత్తం 150 MCQs 150 మార్కులు

TS TET 2023 పేపర్ II – పరీక్షా సరళి

TS-TET పరీక్షా ప్రశ్నలు మల్టిపుల్ చాయిస్ ప్రశ్నలు (MCQలు) ఉంటాయి, ఒక్కొక్కటి ఒక్కో మార్కును కలిగి ఉంటాయి, మొత్తం 150 మార్కులకు పరీక్షా ఉంటుంది. పరీక్షా వ్యవది 2 గంటల 30 నిముషాలు

నెం. సబ్జెక్ట్ ప్రశ్నల సంఖ్య మార్కులు
i పిల్లల అభివృద్ధి మరియు బోధన 30 MCQs 30 మార్కులు
ii లాంగ్వేజ్ – I 30 MCQs 30 మార్కులు
iii లాంగ్వేజ్- II ఇంగ్లీష్ 30 MCQs 30 మార్కులు
iv a) గణితం మరియు సైన్స్ ఉపాధ్యాయుల కోసం: గణితం మరియు సైన్స్.

బి) సోషల్ స్టడీస్ టీచర్ కోసం : సోషల్ స్టడీస్

సి) ఇతర ఉపాధ్యాయుల కోసం – iv (a) లేదా iv (b)

60 MCQs 60 మార్కులు
మొత్తం 150 MCQs 150 మార్కులు

TS TET సిలబస్ 2023

TS టెట్‌లో రెండు పేపర్లు ఉంటాయి. అందులో పేపర్‌-1 సెకండరీ గ్రేడ్‌ టీచర్లుగా నియామకానికి, పేపర్‌-1 స్కూల్‌ అసిస్టెంట్‌ పోస్టుల కోసం అర్హత సాధించేందుకు నిర్వహిస్తారు. ఒక్కో పేపర్‌ 150 మార్కులకు ఉంటుంది. పేపర్‌-1కు 1-8 తరగతులు, పేపర్‌-2కు 6-10 తరగతుల ప్రామాణికంగా ప్రశ్నలు ఉంటాయి.

Telangana State GK MCQs Questions And Answers in Telugu |_70.1

APPSC/TSPSC Sure shot Selection Group

TS TET పేపర్ I సిలబస్ – సబ్జెక్ట్ వారీగా 

TS TET పరీక్షకు సిద్ధమవుతున్న అభ్యర్థులు తప్పనిసరిగా TS TET సిలబస్ 2023 మరియు పరీక్షా సరళి గురించి తెలుసుకోవాలి. ఇక్కడ మేము TS TET పేపర్ I సిలబస్ సబ్జెక్ట్ వారీగా పట్టిక రూపంలో అందించాము.

సబ్జెక్ట్ సిలబస్
శిశు అభివృద్ధి, బోధన శాస్త్రం (30 మార్కులు):
  •  శిశు అభివృద్ధి నమూనాలు,
  • నేర్చుకునే సామర్థ్యం,
  • బోధన శాస్త్ర అవగాహన
తెలుగు భాష (30 మార్కులు) :
  • పఠనావగాహన,
  • తెలంగాణ సాహిత్యం,
  • సంస్కృతి, పదజాలం, భాషాంశాలు,
  • బోధన పద్ధతులు
ఆంగ్ల భాష (30 మార్కులు) :
  • ఆంగ్లభాష విషయాలు,
  • వ్యాకరణం (24 మార్కులు),
  • ఆంగ్ల బోధన శాస్త్రం (6 మార్కులు)
గణితశాస్త్రం (30 మార్కులు) :
  • సంఖ్యామానం, భిన్నాలు, అంకగణితం,
  • రేఖాగణితం, కొలతలు, డేటా అప్లికేషన్స్‌,
  • ఆల్‌జీబ్రా (24 మార్కులు),
  • గణిత బోధన పద్ధతులు (6 మార్కులు)
పర్యావరణ అధ్యయనం (30 మార్కులు) :
  • నా కుటుంబం, పని, ఆటలు,
  • మొక్కలు, జంతువులు,
  • మన ఆహారం, వసతి, గాలి, ఇంధనం, నీరు,
  • ఆరోగ్యం, పరిశుభ్రత, భౌగోళిక మ్యాపులు, భారత దేశ
  • చరిత్ర- సంస్కృతి,
  • భారతదేశం- తెలంగాణ సంస్కృతి, పట్టణాలు,
  • జీవన విధానం, సహజవనరులు, నదులు,
  • నాగరికత, భారత రాజ్యాంగం,
  • భద్రత (భూకంపాలు, వరదలు, ఆగ్నిమాపక,
  • ప్రాథమిక చికిత్స, 108, 104 వాహనాలు) (24 మార్కులు), పర్యావరణ బోధన శాస్త్రం (6మార్కులు)

TS TET పేపర్ II సిలబస్ – సబ్జెక్ట్ వారీగా 

TS TET పరీక్షకు సిద్ధమవుతున్న అభ్యర్థులు తప్పనిసరిగా TS TET సిలబస్ 2023 మరియు పరీక్షా సరళి గురించి తెలుసుకోవాలి. ఇక్కడ మేము TS TET పేపర్ II సిలబస్ సబ్జెక్ట్ వారీగా పట్టిక రూపంలో అందించాము.

సబ్జెక్ట్
సిలబస్
శిశు అభివృద్ధి, బోధన శాస్త్రం(30 మార్కులు): 
  • శిశు వికాసం,
  • వ్యక్తిత్వ వికాసం,
  • ప్రవర్తనా సమస్యలు,
  • నేర్చుకునే సామర్థ్యం,
  • మానసిక ఆరోగ్యం బోధన శాస్త్ర అవగాహన తదితర అంశాలు ఉంటాయి.
తెలుగు భాష( 30 మార్కులు): 
  • పఠనావగాహన(పద్యం, గద్యం),
  • 2015లో రూపొందించిన పాఠ్య పుస్తకాల ఆధారంగా తెలంగాణ సాహిత్యం,
  • సంస్కృతి(ప్రాచీనం, ఆధునికం),
  • పదజాలం, బోధనా అంశాలు , బోధన పద్ధతులు
ఆంగ్ల భాష (30 మార్కులు) :
  • ఆంగ్లంలోని పార్ట్స్‌ ఆఫ్‌ స్వీచ్‌, టెన్సెస్‌,
  • యాక్టివ్‌ వాయిస్‌, పాసివ్‌ వాయిస్‌, డిగ్రీస్‌ ఆఫ్‌ కంపారిజన్‌
  • వెర్బ్‌లు తదితర మొత్తం 20 రకాల వ్యాకరణాంశాలు.
  • వాటికి 24 మార్కులు.
  • మరో 6 మార్కులు ఆంగ్ల బోధనా పద్ధతులకు ఉంటాయి.
గణితం, సైన్స్‌( 60 మార్కులు):
  • గణితానికి 30, సైన్స్‌కు 30 మార్కులుంటాయి.
  • గణితంలో సంఖ్యామానం, అంకగణితం, సెట్స్‌,
  • అల్‌జీబ్రా,
  • రేఖాగణితం(జామెట్రీ),
  • మెన్సురేషన్‌, డేటా హ్యాండ్లింగ్‌,
  • త్రికోణమితి,
  • గణిత బోధన పద్ధతులు.
సైన్స్‌ 
  • ప్రకృతి వనరులు,
  • మన విశ్వం,
  • మెకానిక్స్‌,
  • మేగ్నటిజం అండ్‌ ఎలక్ట్రిసిటీ,
  • మూలకాల వర్గీకరణ,
  • రసాయన బంధం,
  • పదార్థం, అణు నిర్మాణం,
  • జీవశాస్త్రం తదితర అంశాలు.
పేపర్‌-2 సోషల్‌ స్టడీస్‌(60 మార్కులు):
  • భూ వైవిధ్యం,
  • ఉత్పత్తి- వలసలు,
  • జీవనోపాధి,
  • రాజకీయ వ్యవస్థలు, సామాజిక అసమానతలు,
  • మతం- సమాజం, సంస్కృతి-కమ్యూనికేషన్‌ తదితర అంశాలకు 48 మార్కులు ఉంటాయి.
  • మరో 12 మార్కులు బోధన పద్ధతులకు ఉంటాయి.

TS TET పేపర్ I సిలబస్ – తెలుగు

తెలుగు పేపర్ -1

ఎ) విషయం

 1. పఠనావగాహన (పద్యం, గద్యం)

2. తెలంగాణ సాహిత్యం , సంస్కృతి (ప్రాచీనం, ఆధునికం) 2015లో రూపొందించిన పాఠ్యపుస్తకాల ఆధారంగా

  • తెలంగాణ కవులు, రచయితలు, నూతన పాఠ్యపుస్తకాలలోని ఇతర తెలుగు కవులు, రచయితలు
  • ప్రక్రియలు
  • శతకాలు
  • కళలు, కళాకారులు
  • వేడుకలు
  • క్రీడలు | పాటలు

3. పదజాలం

  • సామెతలు
  • జాతీయాలు
  • పొడుపు కథలు
  • తెలంగాణ పదజాలం
  • అర్థాలు
  • నానార్థాలు
  • పర్యాయ పదాలు
  • వ్యుత్పత్యర్థాలు
  • ప్రకృతి వికృతులు

4. భాషాంశాలు :

  • ద్విత్వ, సంయుక్త సంశ్లేష అక్షరాలు, వాక్యాలు, వర్గయుక్కులు, పరుషాలు, సరళాలు, భాషా భాగాలు, లింగాలు, వచనాలు, కాలాలు, విభక్తులు, అవ్యయాలు, విరామ చిహ్నాలు, తెలుగు సంస్కృత సంధులు, సమాసాలు, క్రియలు (సమాపక, అసమాపక), వాక్యాలు రకాలు – ఆశ్చర్యార్ధక, విధ్యర్థక, ప్రశ్నార్థక, సందేహార్థక, అనుమత్యర్థక, నిషేధార్థక, ప్రత్యక్ష పరోక్ష,కర్తరి – కర్మణి – ఛందస్సు, అలంకారాలు, అర్థవిపరిణామం. బి)

బి) బోధనా పద్ధతులు 

  1. భాష, మాతృభాష, మాతృభాష బోధన లక్ష్యాలు
  2. భాష – వివిధ భావనలు, స్వభావం, తరగతి గది అన్వయం.
  3. భాషా నైపుణ్యాలు / సాధించాల్సిన సామర్థ్యాలు, తరగతి గది అన్వయం.
  4. బోధన పద్ధతులు. 
  5. ప్రణాళిక రచన, వనరుల వినియోగం, సహపాఠ్య కార్యక్రమం.
  6. బోధనాభ్యసన ఉపకరణాలు.
  7. నిరంతర సమగ్ర మూల్యాంకనం-నిర్మాణాత్మక మూల్యాంకనం-సంగ్రహణాత్మక మూల్యాంకనం.

గమనిక : TS TET పేపర్ II సిలబస్ కూడా పేపర్ Iలో ఉన్న అంశాలే ఉంటాయి.

TS TET సిలబస్ PDF

TS TET పరీక్షకు సిద్ధమవుతున్న అభ్యర్థులు తప్పనిసరిగా TS TET సిలబస్ 2023 మరియు పరీక్షా సరళి పై అవగాహన కలిగి ఉండాలి. అభ్యర్థులకు TS TET సిలబస్ 2023 మరియు పరీక్షా సరళిపై స్పష్టమైన ఆలోచన కలిగి ఉంటే, పరీక్షలో మంచి స్కోర్ పొందడానికి మీకు సహాయం చేస్తుంది. ఇక్కడ TS TET పేపర్ I సిలబస్ PDF ను అందించాము. దిగువ ఇచ్చిన లింక్ క్లిక్ చేయడం ద్వారా TS TET పేపర్ I సిలబస్ PDFను డౌన్లోడ్ చేసుకోగలరు.

TS TET సిలబస్ PDF
పేపర్/భాష TS TET సిలబస్ PDF
పేపర్-I ఉర్దూ ఇక్కడ  క్లిక్ చేయండి
పేపర్-I తెలుగు ఇక్కడ  క్లిక్ చేయండి
పేపర్-I తమిళం ఇక్కడ  క్లిక్ చేయండి
పేపర్-I మరాఠీ ఇక్కడ  క్లిక్ చేయండి
పేపర్-I హిందీ ఇక్కడ  క్లిక్ చేయండి
పేపర్-I గుజరాతీ ఇక్కడ  క్లిక్ చేయండి
పేపర్-I కన్నడ ఇక్కడ  క్లిక్ చేయండి
పేపర్-I బెంగాలీ ఇక్కడ  క్లిక్ చేయండి
పేపర్-II తెలుగు ఇక్కడ  క్లిక్ చేయండి
పేపర్-II తమిళం ఇక్కడ  క్లిక్ చేయండి
పేపర్-II మరాఠీ ఇక్కడ  క్లిక్ చేయండి
పేపర్-II కన్నడ ఇక్కడ  క్లిక్ చేయండి
పేపర్-II ఉర్దూ ఇక్కడ  క్లిక్ చేయండి
పేపర్-II హిందీ ఇక్కడ  క్లిక్ చేయండి
పేపర్-II సంస్కృతం ఇక్కడ  క్లిక్ చేయండి
పేపర్-II మరాఠీ ఇక్కడ  క్లిక్ చేయండి

TS TET 2023 Paper-2 (Science and Mathematics) online Test Series in Telugu and English by Adda247

TS TET 2023 Related Articles
TS TET పరీక్షా తేదీ 2023 
TS TET పరీక్షకు ఎలా సిద్ధం కావాలి? TET ప్రిపరేషన్ చిట్కాలు
TS TET 2023 నోటిఫికేషన్
TS TET పరీక్షా విధానం 2023 
TS TET ఉత్తమ పుస్తకాలు 2023
TS TET మునుపటి సంవత్సరం ప్రశ్న పత్రాలు 
TS TET ఆన్ లైన్ దరఖాస్తు 2023 
TS TET హాల్ టికెట్ 2023 విడుదల

Telangana TET 2023 Paper-2 Complete Batch Recorded Video Course By Adda247

మరింత చదవండి:
తాజా ఉద్యోగ ప్రకటనలు క్కడ క్లిక్ చేయండి
ఉచిత స్టడీ మెటీరియల్ (APPSC, TSPSC) ఇక్కడ క్లిక్ చేయండి
ఉచిత మాక్ టెస్టులు ఇక్కడ క్లిక్ చేయండి

Sharing is caring!

FAQs

TS Tet 2023 నోటిఫికేషన్ 2023 విడుదలైందా?

TS TET 2023 నోటిఫికేషన్ ని అధికారిక వెబ్‌సైట్‌ www.tstet.cgg.gov.in లో 1 ఆగస్టు 2023 విడుదల చేసింది

నేను TS Tet 2023 సిలబస్‌ని ఎలా పొందగలను?

మీరు ఈ కథనంలో TS Tet 2023 సిలబస్‌ని పొందవచ్చు.