Telugu govt jobs   »   TS TET Score Validity

TS TET Score Validity and Applicability , TS TET సర్టిఫికేట్ కాల పరిమితి

TS TET Score Validity and Applicability : Telangana State Teacher Eligibility Test (TS TET)  The Department of School Education has issued a notification for the Telangana State Teacher Eligibility Test (TS TET) 2022. The department in its notification stated that the TS TET examination is scheduled to be held on June 12. 

In This article the candidates who are preparing for TSTET can get information about TSTET 2022 Notification, How to Apply Online for TSTET, check ts tet eligibility criteria, the application process, exam pattern, syllabus, TS TET Score Validity and Applicability and more in detail 

TS TET Score Validity and Applicability , TS TET సర్టిఫికేట్ కాల పరిమితి

ఉపాధ్యాయుల నియామకానికి ముందు నిర్వహించే ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టెట్‌) నోటిఫికేషన్‌ను తెలంగాణ ప్రభుత్వం విడుదల చేసింది. మార్చి 26 నుంచి ఏప్రిల్‌ 16వ తేదీ వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తులను స్వీకరించనున్నారు. జూన్‌ 12న టెట్‌ పరీక్ష జరుగుతుంది. టెట్‌ను సాధ్యమైనంత త్వరగా నిర్వహించాలని విద్యాశాఖ కార్యదర్శి సందీప్‌కుమార్‌ సుల్తానియా బుధవారం పాఠశాల విద్యాశాఖ సంచాలకురాలిని ఆదేశించిన విషయం తెలిసిందే. టెట్‌కు ప్రభుత్వం అనుమతి ఇచ్చిన నేపథ్యంలో పరీక్ష నిర్వహణకు అవసరమైన చర్యలు చేపట్టాలని సూచించారు. స్పందించిన పాఠశాల విద్యాశాఖ తాజాగా టెట్‌ నోటిఫికేషన్‌ను విడుదల చేసింది.

TS TET Score Validity and Applicability |_40.1APPSC/TSPSC Sure shot Selection Group

TS TET Score Validity and Applicability – Overview

TS TET Notification 2022
Name of Exam TS TET (Telangana State Teachers Eligibility Test)
Conducting Authority Department of School Education, Telangana Government
Exam Level State Level
Exam Frequency Annually
Mode of application Online
Application Fees INR 300
Mode of Examination Offline
Number of Papers 2
Duration of Exam
  • Paper-I – 150 minutes
  • Paper-II – 150 minutes
Purpose of Exam Shortlisting eligible candidates for teaching posts at schools under the Telangana government
Official Website http://tstet.cgg.gov.in/

TS TET Notification 2022 PDF Telangana Tet tstet.cgg.gov.in Apply Online 

TS TET 2022

2015 డిసెంబరు 23న టెట్‌కు సంబంధించి జారీ చేసిన జీఓ 36లో ప్రధానంగా రెండు సవరణలు చేస్తూ ప్రభుత్వం తాజాగా జీఓ 8 ఇచ్చింది. జాతీయ ఉపాధ్యాయ విద్యా మండలి (ఎన్‌సీటీఈ) మార్గదర్శకాల ప్రకారం ఈ మార్పులు చేశారు. పాఠశాల విద్యాశాఖలో 13,086 కొలువులను భర్తీ చేస్తామని ఇటీవల ప్రభుత్వం ప్రకటించిన సంగతి తెలిసిందే. అందులో 10 వేల వరకు ఉపాధ్యాయ కొలువులు ఉన్నాయి. అందులో ఎస్‌జీటీ కొలువులు 6,700 వరకు ఉంటాయి. ఆదర్శ పాఠశాలల ఖాళీలూ కలుపుకొంటే గరిష్ఠంగా 11 వేల వరకు ఉండొచ్చని చెబుతున్నారు. మే నెలలోనే టెట్‌ నిర్వహించవచ్చని తెలుస్తోంది. రాష్ట్ర ఆవిర్భావం తర్వాత టెట్‌ నిర్వహించడం ఇది మూడోసారి. గతంలో 2016 మే, 2017 జులైలో ఆ పరీక్ష జరిపారు.

TS TET 2022 Latest Changes

ఇప్పటివరకు బీఈడీ అభ్యర్థులు 6-10 తరగతులు బోధించేందుకు మాత్రమే అర్హులు. అందుకు టెట్‌లో పేపర్‌-2 రాసేవారు. ఇక నుంచి వారు 1-5 తరగతులకు బోధించేందుకు ఎస్జీటీలుగా నియమితులు కావొచ్చు. అంటే వారు టెట్‌లో పేపర్‌-1 రాయవచ్చు. కాకపోతే ఉద్యోగంలో చేరిన రెండేళ్లలోపు ప్రాథమిక విద్య బోధనలో ఆరు నెలల బ్రిడ్జి కోర్సు పూర్తి చేయాలి. ఇప్పటివరకు పేపర్‌-1కు కేవలం డీఈడీ వారు మాత్రమే అర్హులు.

TS TET Score Validity and Applicability |_50.1

TS TET Pass Criteria & Weightage & Certificate Validity 

  • ఒకసారి టెట్‌లో అర్హత సాధిస్తే ఆ ధ్రువపత్రానికి ఇప్పటివరకు ఏడేళ్ల కాలపరిమితి ఉండేది. ఆ తర్వాత దానికి విలువ ఉండదు. మళ్లీ టెట్‌ రాసుకోవాల్సిందే. అందుకు భిన్నంగా ఒకసారి టెట్‌లో అర్హత సాధిస్తే జీవితాంతం విలువ ఉండేలా మార్పు చేయాలని ఎన్‌సీటీఈ రెండేళ్ల క్రితమే నిర్ణయించింది.
  • ఈ క్రమంలో విద్యాశాఖ ఆ ప్రకారం మార్పు చేసింది.
  • 2011 ఫిబ్రవరి 11వ తేదీ నుంచి ఆ మార్పు వర్తిస్తుంది. అప్పటినుంచి జరిగిన టెట్‌లో అర్హత సాధించిన వారి ధ్రువపత్రం ఇప్పుడూ చెల్లుబాటవుతుంది.
  • రాష్ట్రంలో ఇప్పటికే టెట్‌ పాసైన వారు సుమారు 3 లక్షల మంది ఉంటారని అంచనా.
  • టెట్‌ను 150 మార్కులకు నిర్వహిస్తారు. జనరల్‌ కేటగిరీ విద్యార్థులకు 90 మార్కులు (60 శాతం), బీసీలకు 75 మార్కులు (50 శాతం), ఎస్‌సీ, ఎస్‌టీ, దివ్యాంగులకు 60 మార్కులు (40 శాతం) మార్కులు వస్తే అర్హత సాధించినట్లుగా పరిగణిస్తారు.
  • టెట్‌లో వచ్చిన మార్కులకు ఉపాధ్యాయ నియామకాల్లో భాగంగా నిర్వహించే పరీక్షలకు 20 శాతం వెయిటేజీ ఇచ్చి ర్యాంకు కేటాయిస్తారు.

TS TET Exam Pattern 

Exemption from appearing in the TS TET Exam 2022

నేషనల్ కౌన్సిల్ ఫర్ టీచర్ ఎడ్యుకేషన్ (NCTE) నోటిఫికేషన్‌కు ముందు సమర్థ స్థానిక అధికారం/ప్రభుత్వంచే నియమించబడిన ప్రాథమిక మరియు మాధ్యమిక ఉపాధ్యాయులు తెలంగాణ రాష్ట్ర ఉపాధ్యాయ అర్హత పరీక్షకు హాజరు కాకుండా  మినహాయించబడ్డారు. అయితే, ఇప్పటి వరకు కాంపిటెంట్ అథారిటీ ద్వారా నియామకాలు ఆమోదించని ఉపాధ్యాయులు మరియు ప్రైవేట్ పాఠశాలల్లో ఉద్యోగం చేస్తున్న ఉపాధ్యాయులు టెట్‌కు దరఖాస్తు చేసుకోవడానికి మినహాయింపు లేదు.

TS TET 2022 – Pass Criteria

QUALIFYING MARKS IN TSTET, ISSUE OF MEMOs/CERTIFICATES

వివిధ కేటగిరీల అర్హత మార్కుల శాతం క్రింద చూపిన విధంగా ఉన్నాయి:

S.No Category Pass Marks
1 General 60% and above
2 BCs 50% and above
3 SC/ST/Differently abled 40% and above

TS TET Score Validity and Applicability |_60.1

Validity period of TS TET Certificate / Marks Memo

నియామకం కోసం టెట్ అర్హత సర్టిఫికేట్‌ల చెల్లుబాటు వ్యవధి, తెలంగాణ ప్రభుత్వం నోటిఫై చేయకపోతే, జీవితాంతం చెల్లుబాటు అవుతుంది.

WEIGHTAGE OF TSTET SCORES IN THE TEACHER RECRUITMENT OF THE   

G.O.Ms.No.36, స్కూల్ ఎడ్యుకేషన్ (Trg) Dept., dt.23.12.2015 ref.1 క్రింద ఉదహరించిన ప్రకారం, తెలంగాణ రాష్ట్రంలో టీచర్ రిక్రూట్‌మెంట్ టెస్ట్‌లో TET స్కోర్‌కు 20% వెయిటేజీ ఇవ్వబడింది.
ఏది ఏమైనప్పటికీ, కేవలం TETలో అర్హత సాధించడం వలన నియామకం/ఉద్యోగం కోసం ఏ వ్యక్తికి హక్కు లభించదు, ఎందుకంటే ఇది నియామకానికి సంబంధించిన అర్హత ప్రమాణాలలో ఒకటి మాత్రమే.

TS TET Syllabus 2022 Subject wise Syllabus PDF

Telangana TET Exam Pattern 2022

TSTET 2022 పరీక్షలో పాఠశాల విద్య యొక్క వివిధ స్థాయిలలో ఉపాధ్యాయులను నియమించడానికి రెండు పేపర్లు ఉంటాయి:

  1. TSTET పేపర్-I (ప్రైమరీ టీచర్ కావాలనుకునే అభ్యర్థుల కోసం, అంటే క్లాస్ I-V నుండి.)
  2. TSTET పేపర్-II (సెకండరీ టీచర్ కావాలనుకునే అభ్యర్థులకు, అంటే క్లాస్ VI-VIII)

అభ్యర్థులు అర్హత ప్రమాణాలను బట్టి పేపర్-I లేదా పేపర్-II లేదా రెండు పేపర్‌లకు హాజరుకావచ్చు. ప్రశ్నపత్రం ఎంచుకున్న భాష I మరియు ఆంగ్లంలో ప్రశ్నలతో కూడిన ద్విభాషా ఆకృతిలో రూపొందించబడింది.

 

TS TET 2022 Paper 1 Exam Pattern

TS-TET యొక్క నిర్మాణం మరియు కంటెంట్ క్రింది పేరాల్లో ఇవ్వబడింది. అన్ని ప్రశ్నలు మల్టిపుల్ చాయిస్ ప్రశ్నలు (MCQలు) ఉంటాయి, ఒక్కొక్కటి ఒక్కో మార్కును కలిగి ఉంటాయి, నాలుగు ప్రత్యామ్నాయాలతో ఒక సమాధానం సరైనది. నెగెటివ్ మార్కింగ్ ఉండదు.

(a) Paper- I: No. of Multiple-Choice Questions (MCQs) – 150 Duration of Examination: 2 hours and 30 minutes: Structure and Content (All Compulsory)

S. No. Subject No. of MCQs Marks
 i Child Development and Pedagogy  30 MCQs  30 Marks
Ii Language I 30 MCQs 30 Marks
iii Language II English 30 MCQs 30 Marks
Iv Mathematics 30 MCQs 30 Marks
V Environmental Studies 30 MCQs 30 Marks
Total 150 MCQs 150 Marks

TS TET Score Validity and Applicability |_70.1

TS TET 2022 Paper 2 Exam Pattern

Paper II : No. of Multiple Choice Questions (MCQs)– 150:

Duration of Examination: 2 hours and 30 minutes Structure and Content (All Compulsory):

S. No. Subject No. of  MCQs Marks
i Child Development & Pedagogy 30 MCQs 30 marks
ii Language I 30 MCQs 30 marks
iii Language II – English 30 MCQs 30 marks
iv a) For Mathematics and Science teachers: Mathematics and Science.

b)For Social Studies Teacher : Social

Studies

c)for any other teacher – either iv (a) or iv (b)

60 MCQs 60 marks
Total 150 MCQs 150 Marks

 

More Important Links on TSPSC :

Telangana State GK 
Polity Study Material in Telugu
Economics Study Material in Telugu

 

TS TET Score Validity and Applicability |_80.1

Adda247 App for APPSC, TSPSC, SSC and Railways

Read In English: TS TET Notification 2022

Sharing is caring!

Download your free content now!

Congratulations!

TS TET Score Validity and Applicability |_100.1

కరెంట్ అఫైర్స్ -ఏప్రిల్ 2022 మాస పత్రిక

Download your free content now!

We have already received your details!

TS TET Score Validity and Applicability |_110.1

Please click download to receive Adda247's premium content on your email ID

Incorrect details? Fill the form again here

కరెంట్ అఫైర్స్ -ఏప్రిల్ 2022 మాస పత్రిక

Thank You, Your details have been submitted we will get back to you.