Telugu govt jobs   »   Nobel Prize 2021   »   Nobel Prize 2021

List of Nobel Prize winners 2021 PDF in Telugu | నోబెల్ బహుమతి 2021 విజేతల పూర్తి జాబితా

List of Nobel Prize winners 2021 PDF in Telugu | నోబెల్ బహుమతి 2021 విజేతల పూర్తి జాబితా: నోబెల్ బహుమతులు భౌతిక శాస్త్రంలో, రసాయన శాస్త్రంలో, సాహిత్యంలో, వైద్యశాస్త్రంలో కృషి చేసిన శాస్త్రవేత్తలకు, ప్రపంచ శాంతికి కృషిచేసిన మహానుభావులకు ప్రతియేటా బహూకరిస్తుంటారు. ఈ ఐదు బహుమతులు ప్రఖ్యాత స్వీడిష్ శాస్త్రవేత్త అయిన ఆల్ఫ్రెడ్ నోబెల్ 1895 నాటి వీలునామా ప్రకారం 1901లో ప్రారంభించబడ్డాయి (నోబెల్ మరణించిన 5 సంవత్సరముల తరువాత). ఆల్ఫ్రెడ్ నోబెల్ గౌరవార్దం economics బహుమతి మటుకు 1969 నుండి బ్యాంక్ ఆఫ్ స్వీడన్ ద్వారా ఇవ్వడము జరుగుతోంది. ఈ ఆరు బహుమతులు అత్యధిక పారితోషికంతో పాటు పేరు ప్రఖ్యాతలకు నిదర్శనం. ప్రతీ సంవత్సరం, ఒక్క శాంతి బహుమానం తప్ప మిగతా ఐదు బహుమతులు నోబెల్ గారి వర్ధంతి అయిన డిసెంబరు 10 నాడు, స్టాక్ హోంలో ఇవ్వబడతాయి. వివిధ రంగములలో విశేషమైన కృషి/పరిశోధనలు చేసిన, విప్లవాత్మక విధానాలు/పరికరాలతో శాస్త్రాన్ని ముందంజ వేయించిన, మానవ సమాజానికి ఆ శాస్త్రంతో అత్యంత సహాయాన్ని అందించిన వ్యక్తులకు, సంస్థలకు (శాంతి బహుమతి మాత్రమే) ఇవ్వబడుతుంది.

List of Nobel Prize winners 2021 PDF in Telugu | నోబెల్ బహుమతి 2021 విజేతల పూర్తి జాబితా_40.1
nobel

Nobel-Economy (ఆర్ధిక శాస్త్రం)

సమాజం ఎదుర్కొంటున్న సమస్యలకు సహజ పరిశోధనలతో వినూత్న పరిష్కార మార్గాలను సూచించిన ముగ్గురు ఆర్థికవేత్తలు ఈ ఏడాది ఆర్థికశాస్త్రంలో ఇచ్చే నోబెల్ పురస్కారానికి ఎంపికయ్యారు. వలస కార్మిక విపణి గురించి లోతైన పరిజ్ఞానాన్ని అందించిన డేవిడ్ కార్డ్ (65), సహజ పరిశోధనల్లో కార్యకారణ సంబంధాల విశ్లేషణతో ఎలాంటి నిర్ధారణలకు రావచ్చో వివరించిన జోష్వా యాంగ్రిస్ట్(61), గైడో ఇంబెన్స్ (58) మా సరికొత్త మార్గదర్శనం చేశారని రాయల్ స్వీడిష్ అకాడమీ పేర్కొంది. వీరి విధానాలను ఇతర రంగాలకూ అనువర్తింపజేయవచ్చని తెలిపింది.

“సమాజంలో ఎదురయ్యే అనేక సమస్యలకు కార్యకారణ సంబంధం ఉంటుంది. వలస విధానం వేతనాలు, ఉపాద అవకాశాలపై ఎంత ప్రభావం చూపుతుంది. దీర్ఘకాలం కొనసాగే చదువులు ఒక వ్యక్తి భవిష్యత్తు ఆదాయాన్ని ఏ మేరకు ప్రభావితం చేస్తుంది? ఈ ప్రశ్నలకు సమాధానం ఇవ్వడం కష్టం. ఎందుకంటే తులనాత్మకంగా పరిశీలించి చెప్పడానికి మన వద్ద ముందస్తు ఆధారాలు లేవు. వలస కార్మికులు తగ్గిపోతే, ఒక వ్యక్తి చదువును కొనసాగించకపోతే ఏం జరుగుతుందో మనకు తెలియదు. అయితే, ఈ ఏడాది నోబెల్ పురస్కారాన్ని అందుకోబోతున్న ముగ్గురు ఆర్థిక శాస్త్రవేత్తలు తమ పరిశోధనల ద్వారా ఈ ప్రశ్నలకు సమాధానమిచ్చే మార్గాలను సూచించారు” అని రాయల్ స్వీడిష్ అకాడమీ సోమవారం ప్రకటనలో వివరించింది.

వలసలు, కనీస వేతనాలు..

కెనడాలో జన్మించి అమెరికాలో స్థిరపడిన డేవిడ్ కార్డ్ (65) వలస కార్మిక విపణి, కనీస వేతనాలు చూపే ప్రభావంపై 1990 నుంచి పరిశోధనలు కొనసాగించారు. ఈ రంగాల్లో ఉన్న సంప్రదాయ భావనలను సవాల్ చేసేలా వినూత్న విశ్లేషణలను, లోతైన పరిజ్ఞానాన్ని అందించారు. కనీస వేతనాలను పెంచడం వల్ల ఇతరులకు ఉద్యోగ అవకాశాలు తగ్గిపోతాయనే ఆందోళన అవసరంలేదని నిరూపించారు. వలస కార్మికుల వల్ల స్వదేశంలోని వ్యక్తుల ఆదాయం వృద్ధిచెందడంతోపాటు పలు ప్రయోజనాలు కలుగుతాయని స్పష్టం చేశారు. డేవిడ్ కార్డ్ ఈ అంశాన్ని నిరూపించే వరకు కొత్త వలసలపై ప్రతికూలమైన అభిప్రాయాలు ఉండేవి. డేవిడ్ కార్డ్ ప్రస్తుతం కాలిఫోర్నియా విశ్వవిద్యాలయంలో అర్థశాస్త్ర ప్రొఫెసర్గా ఉన్నారు. నోబెల్ బహుమతిగా లభించే 11.45 లక్షల డాలర్లలో సగం మొత్తం డేవిడ్ కార్డు, మిగతా సగాన్ని జోష్వా, గైడోలకు పంచుతారు.

IBPS PO 2021 నోటిఫికేషన్ విడుదల

 

చదువుల పొడిగింపు ప్రభావంపై..

అమెరికాలోని కొలంబన్లో జన్మించిన జోష్వా యాంగ్రెస్ట్(61), నెదర్లాండ్స్లో జన్మించి అమెరికాలో స్థిరపడిన గైడో ఇంబెన్స్ (58) … వ్యక్తులపై సుదీర్ఘ విద్య చూపే ప్రభావాన్ని విశ్లేషించారు. ఒక బృందంలోని వ్యక్తుల చదువును ఏడాదిపాటు పొడిగించినప్పుడు వారందరిపై పడే ప్రభావం ఒకే విధంగా ఉండదని, దీనిపై ఒక నిశ్చితాభిప్రాయానికి రాలేమని అప్పటి వరకు అనుకునేవారు. కానీ, 1990లో ఇదే అంశంపై సహజ పరిశోధనలను కొనసాగించిన యాంగ్రిస్ట్, గైడో ఇంటెన్స్ విధాన ప్రక్రియలో ఎదురవుతున్న సమస్యను పరిష్కరించారు. సహజ పరిశోధనల ద్వారా కార్యకారణ సంబంధాన్ని విశ్లేషిస్తూ కచ్చితమైన నిర్ధారణలకు రావచ్చని నిరూపించారు. జోష్వా.. మసాచుసెట్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో, గైడో ఇంటెన్స్, స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీలో ఆర్థికశాస్త్ర ప్రొఫెసర్లుగా ఉన్నారు.

List of Nobel Prize winners 2021 PDF in Telugu | నోబెల్ బహుమతి 2021 విజేతల పూర్తి జాబితా_50.1
nobel-in-economic-sciences-2021

ఆర్థిక శాస్త్రంలో నోబెల్ విజేతలు వీరే

డేవిడ్ కార్డ్:  1956లో కెనడాలో జన్మించారు. అమెరికాలోని ప్రిన్స్టన్ విశ్వవిద్యాలయం నుంచి బీహెచ్ (1983). ప్రస్తుతం కాలిఫోర్నియా విశ్వవిద్యాలయంలో ఆర్థికశాస్త్ర ప్రొఫెసర్,

జోష్వా డి.యాంగ్రిస్ట్: అమెరికాలోని కొలంబన్లో 1960లో జననం, ప్రిన్స్టన్ విశ్వవిద్యాలయం నుంచి పీహెచీ (1989). ప్రస్తుతం మసాచుసెట్స్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో ఆర్థికశాస్త్ర ప్రొఫెసర్,

గైడో డబ్ల్యు.ఇంబెన్స్: 1963లో నెదర్లాండ్స్లో జన్మించారు. అమెరికాలోని బ్రౌన్ విశ్వవిద్యాలయం నుంచి పీహెచ్ డీ(1991). ప్రస్తుతం స్టోన్ ఫోర్డ్ విశ్వవిద్యాలయంలో ప్రొఫెసర్ గా పనిచేస్తున్నారు.

 

Nobel-Literature(సాహిత్యం)

నిలువ నీడ కోల్పోయి పరాయి దేశాన్ని ఆశ్రయించే శరణార్థుల వ్యధ, వలసపాలన మిగిల్చిన చేదు. జ్ఞాపకాలకు అద్భుత రీతిలో అక్షర రూపాన్ని ఇచ్చిన టాంజానియా రచయిత అబ్దుల్ రజాక్ గుర్నా (73)ను ఈ ఏడాది సాహిత్య విభాగంలో నోబెల్ పురస్కారం వరించింది. “వలసవాద దుష్ప్రభావాలను రాజీలేని విధంగా, కరుణాత్మకంగా ఆయన స్పృశించారు” అని ఎంపిక కమిటీ గురువారం ప్రశంసించింది. ఈ బహుమతి కింద ఆయనకు 11.4 లక్షల డాలర్లు అందుతాయి. 1986లో వోల్ సోయింకా తర్వాత ఈ పురస్కారానికి ఎంపికైన తొలి నల్ల జాతి ఆఫ్రికన్గా అబుల్ గుర్తింపు పొందారు.

List of Nobel Prize winners 2021 PDF in Telugu | నోబెల్ బహుమతి 2021 విజేతల పూర్తి జాబితా_60.1
literature-nobel

భిన్న సంస్కృతులు, భౌగోళిక ఖండాల మధ్య ఉండే వైరుధ్యాల నేపథ్యంలో సాగే శరణార్థుల బతుకు పోరాటాన్ని అబ్దుల్ వెలుగులోకి తెచ్చారని నోబెల్ ఎంపిక కమిటీ ‘స్వీడిష్ అకాడమీ తెలిపింది. వలసపాలన అనంతర కాల రచయితల్లో అబ్దుల్ అత్యంత ప్రముఖుడని పురస్కార కమిటీ చైర్మన్ ఆండర్స్ ఆల్సన్ తెలిపారు. “అనేకమంది. పాఠకులకు తెలియని ‘మరో ఆఫ్రికా’ను అత్యంత స్పష్టంగా తన రచనల్లో సాక్షాత్కరింపచేశారు. పోర్చుగీసు నుంచి బ్రిటిషు వరకూ వివిధ దేశాల వలసపాలనలో బానిసత్వంతో మగ్గిన తీరును ఆయన ఆవిష్కరించారు అని. కొనియాడారు. ఆఫ్రికా ఖండంలోని టాంజానియాకు చేరువలో హిందూ మహాసముద్రంలో ఉన్న జాంజిబార్ అనే దీవిలో 1948లో అబుల్ జన్మించారు. అక్కడ అశాంతి ప్రజ్వరిల్లడంతో ఆయన 1968లో బ్రిటన్ కు వలస వెళ్లారు. అక్కడే ఉన్నత విద్యను అభ్యసించారు. కెంట్ విశ్వవిద్యాలయంలో ఇంగ్లిష్ ప్రొఫెసర్గా చేరారు. ‘వలసపాలన అనంతర సాహిత్యాన్ని బోధించారు. ఇటీవలే పదవీ విరమణ పొందారు. ఆయన 10 నవలలను రచించారు. ఇందులో ‘పారడైజ్, “డిజర్షన్ కూడా ఉన్నాయి. పారడైజ్ నవలను 1994లో ప్రచురించారు. 20వ శతాబ్దం ఆరంభంలో టాంజానియాలో పెరిగిన ఒక బాలుడి కథను ఇందులో వర్ణించారు. ఇది ప్రతిష్టాత్మక బుకర్ ప్రైజిక్కు తుది రౌండ్ వరకూ పోటీ పడింది. ఇంకా.. ‘మెమరీ ఆఫ్ డిపార్చర్, ‘పిలిగ్రిమ్స్ వే’, ‘బై ద సీ’ వంటి రచనలు చేశారు. ఆయన మాతృభాష స్వహిలి రచనలు మాత్రం ఆంగ్లంలో సాగాయి. ఆఫ్రికాలో జన్మించిన రచయిత ఒకరికి నోబెల్ రావడం ఇది ఆరోసారి.

AP High court Assistant Study Material

Nobel-Medicine (వైద్య శాస్త్రం)

ప్రపంచంలోనే అత్యున్నత పురస్కారమైన నోబెల్ బహుమతి వైద్యశాస్త్రంలో విశేష సేవలందించినందుకు ఈసారి ఇద్దరిని వరించింది. అమెరికాకు చెందిన డేవిడ్ జూలియస్, ఆర్డెమ్ పటాపొటియన్లు సంయుక్తంగా ఈ పురస్కారానికి ఎంపికయ్యారు. ఉష్ణ గ్రాహకాలు, శరీర స్వర్శపై వీరు చేసిన పరిశోధనలకు నోబెల్ బహుమతి ఇస్తున్నట్లు నోబెల్ జ్యూరీ వెల్లడించింది.

List of Nobel Prize winners 2021 PDF in Telugu | నోబెల్ బహుమతి 2021 విజేతల పూర్తి జాబితా_70.1
nobel-medicine

‘మానవ నాడీ వ్యవస్థలో ఉష్ణము, చలి, స్పర్శ వంటి సంకేతాలు ఎలా ప్రారంభమవుతాయనే విషయాన్ని ఈ ఇద్దరు శాస్త్రవేత్తల ఆవిష్కరణలు స్పష్టంగా వివరించాయి. ఈ ఆవిష్కరణలు ఎన్నో శరీరక వ్యవస్థలు, వ్యాధుల పరిస్థితులను తెలుసుకోవడంలో ఎంతో కీలకమైనవి’ అని నోబెల్ జ్యూరీ అభిప్రాయపడింది. రోజువారీ జీవితంలో ఈ అనుభూతులను చాలా తేలికగా తీసుకుంటాం. కానీ, ఉష్ణోగ్రత, పీడనాన్ని గ్రహించడానికి నరాలు ఎలా ప్రేరేపించబడతాయనే ప్రశ్నలకు తాజాగా ఈ ఇద్దరు శాస్త్రవేత్తలు సమాధానాన్ని కనుగొన్నారని నోబెల్ జ్యూరీ తెలిసింది.

డేవిడ్ జూలియన్ అమెరికాలోని యూనివర్సిటీ ఆఫ్ కాలిఫోర్నియాలో ప్రొఫెసర్గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు.. ఇక మరో శాస్త్రవేత్త ఆర్డెమ్ పటాపౌటియన్ కూడా కాలిఫోర్నియాలోని స్క్రీన్స్ రీసెర్చ్ కేంద్రంలో ప్రొఫెసర్గా ఉన్నారు.

Complete Static GK in Telugu

 

Nobel-Chemistry (రసాయన శాస్త్రం)

మానవజాతి మనుగడకు ఉపకరించే అద్భుత ప్రక్రియను ఆవిష్కరించిన ఇద్దరు శాస్త్రవేత్తలు రసాయన శాస్త్రంలో ఇచ్చే నోబెల్ బహుమతికి ఎన్నికయ్యారు. జర్మనీకి చెందిన బెంజమిన్ లిస్ట్ స్కాట్లాండ్ కు చెందిన డేవిడ్ మెక్మిలన్ సంయుక్తంగా ఈ పురస్కారాన్ని అందుకోనున్నారు పరమాణువుల అమరికను సరికొత్త మార్గంలో అభివృద్ధిపరిచే ‘అసిమెట్రిక్ ఆర్గానో కెటాలసిస్’ అనే విధానాన్ని ఆవిష్కరించినందుకు గాను వీరిద్దరినీ అవార్డుకు ఎంపిక చేసినట్లు రాయల్ స్వీడిష్ అకాడమీ ఆఫ్ సైన్సెస్ సెక్రెటరీ జనరల్ గౌరాన్ హాన్సన్ బుధవారం వెల్లడించారు. బెంజమిన్ లిస్ట్, మెకి మిలన్ విడివిడిగా నూతన కెటాలసిస్ ప్రక్రియను 2000 సంవత్సరంలో కనుగొన్నారని నోబెల్ కమిటీ తెలిపింది. వీరి ఆవిష్కరణ రసాయన శాస్త్రాన్ని పర్యావరణ హితంగా మార్చిందని.. ప్రశంసించింది.

List of Nobel Prize winners 2021 PDF in Telugu | నోబెల్ బహుమతి 2021 విజేతల పూర్తి జాబితా_80.1
chemistry-nobel

“పరమాణువులను ఒక ప్రత్యేక క్రమంలో అనుసంధానం చేసి అణువులను రూపొందించడం చాలా కష్టమైన ప్రక్రియ. అందుకు చాలా సమయం పడుతుంది. ఈ ప్రక్రియను వేగవంతం చేయడానికి 2000 సంవత్సరం ప్రారంభం వరకు రసాయన శాస్త్రవేత్తలు లోహ ఉత్ప్రేరకాలు లేదా ఎంజైములను ఉపయోగించారు. లోహ ఉత్ప్రేరకాలను ఉపయోగించినప్పుడు పర్యావరణానికి హాని కలిగించే విషపూరితాలు

వెలువడుతుంటాయి. అయితే, మ్యాక్స్ ప్లాంక్ ఇనిస్టిట్యూట్లో బెంజమిన్ లిస్ట్, ప్రిన్స్టన్ విశ్వవిద్యాలయంలో డేవిడ్ మెకి మిలన్ పరమాణువులను వినియోగించి ఎలాంటి దుష్ప్రభావాలు లేకుండానే కావాల్సిన ఫలితాన్ని సాధించే మూడో విధానాన్ని కనుగొన్నారు. ఆసిమెట్రిక్ ఆర్గానోకెటాలసిస్ అనే ఈ నూతన విధానం ఇప్పుడు విస్తృతంగా అందుబాటులోకి వచ్చింది. అత్యంత సులభమైన, ఎంతో ఉపయోగపడుతుంది. ఆహార ఉత్పత్తుల్లో రుచులను పెంపొందించే విధానాలకూ దోహదపడుతోంది’ అని నోబెల్ కమిటీ వివరించింది. వాహనాలు విడుదల చేసే ఇంధన కాలుష్యాల తీవ్రతను తగ్గించేందుకు నూతన పక్రియ తోడ్పడుతోందని నిపుణులు తెలిపారు. నోబెల్ బహుమతి కింద ఇద్దరు. రసాయన శాస్త్రవేత్తలు బంగారు పతకంతో పాటు 11 లక్షల అమెరికన్ డాలర్లను అందుకోనున్నారు.

How to crack APPSC Group-2 in First Attempt

 

NobelPeace prize (శాంతి బహుమతి)

భావ వ్యక్తీకరణ స్వేచ్ఛ కోసం కలం సాయంతో పోరు సాగించిన పాత్రికేయులు మరియా రెస్సా, దిమిత్రి మురాతోవ్ు ఈ ఏడాది నోబెల్ శాంతి బహుమతికి ఎంపికయ్యారు. విలేకరులు నిరంతర దాడులు, వేధింపులు, హత్యలు ఎదుర్కొనే దేశాల్లో వీరు వాక్ స్వాతంత్ర్యం కోసం శ్రమించారని ఎంపిక కమిటీ కొనియాడింది. ప్రజాస్వామ్యం, పాత్రికేయ స్వేచ్ఛకు ఇబ్బందులు ఎదురవుతున్న తరుణంలో భావ వ్యక్తీకరణ హక్కు కోసం దైర్యంగా నిలబడ్డ విలేకరులకు వీరు ప్రతినిధులని పేర్కొంది. శాంతిని పెంపొందించడానికి ఈ స్వేచ్ఛ చాలా ముఖ్యమని తెలిపింది. మరియాది ఫిలిప్పీన్స్ కాగా దిమిత్రి స్వస్థలం రష్యా. ఈ పాత్రికేయుల నోరు నొక్కేయడానికి ఆయా దేశాల్లోని ప్రభుత్వాలు చేయని ప్రయత్నమంటూ లేదు. ఫిలిప్పీన్సావాసి ఒకరు నోబెల్ శాంతి బహుమతికి ఎంపిక కావడం ఇదే మొదటిసారి. ఈ ఏడాది ఇప్పటివరకూ ప్రకటించిన నోబెల్ పురస్కారాల్లో చోటు దక్కించుకున్న తొలి మహిళ మరియానే కావడం విశేషం. ఈ బహుమతి కింద దక్కే 11.4 లక్షల డాలర్లను విజేతలిద్దరికీ సమానంగా పంచుతారు. భావవ్యక్తీకరణ, పత్రికాస్వేచ్ఛ లేకుంటే దేశాల మధ్య సోదరభావాన్ని పెంపొందించలేమని.. నిరాయుధీకరణ, మెరుగైన ప్రపంచ క్రమానుగతిని సాధించలేమని నార్వేజియన్ నోబెల్ కమిటీ చైర్మన్ బెరిట్ రెయిన్ ఆండర్సన్ పేర్కొన్నారు.

List of Nobel Prize winners 2021 PDF in Telugu | నోబెల్ బహుమతి 2021 విజేతల పూర్తి జాబితా_90.1
nobel-peace

రాఫర్ పేరుతో..

మరియా రెస్సా.. పరిశోధనాత్మక జర్నలిజం కోసం 2012లో ‘రాఫర్ పేరుతో ఒక వార్తా వెబ్సైట్ను ప్రారంభించారు. అధికార ఒత్తిళ్లను ఎదుర్కొంటూ ఎన్నో సంచలనాత్మక కథనాలను ధైర్యంగా ప్రచురించారు. అధ్యక్షుడు రోడ్రిగో డుటెర్తె తెచ్చిన వివాదాస్పద ‘యాంటీ డ్రగ్ కార్యక్రమంపై ఆమె సాహసోపేతంగా విమర్శనాత్మక కథనాలు రాశారు.  డ్రగ్ మాఫియా సభ్యులుగా పేర్కొంటూ వేల మందిని అంతమొందించిన తీరును వెలుగులోకి తెచ్చారు. తనకు నోబెల్ రావడం వల్ల ఫిలిప్పీన్స్ ప్రభుత్వం కచ్చితంగా అసంతృప్తికి గురై ఉంటుందని మరియా వ్యాఖ్యానించారు. ఈ వార్త తెలిసి మొదట నేను షాక్కు గురయ్యా. ఇవి నాకు ఉద్వేగభరిత క్షణాలు. మేం ఎదుర్కొంటున్న పరిస్థితులను గుర్తించిన నోబెల్ ఎంపిక కమిటీకి కృతజ్ఞతలు” అని చెప్పారు. ఫిలిప్పీన్స్లో నేను, నా సహచర పాత్రికేయులు నిరంతరం వేధింపులు, బెదిరింపులు ఎదుర్కొన్నాం. ప్రపంచవ్యాప్తంగా జర్నలిస్టులకు, పాత్రికేయ స్వేచ్ఛకు ఎదురవుతున్న ప్రతికూల పరిస్థితులకు ఇది ప్రబల ఉదాహరణ” అని పేర్కొన్నారు. ఫేస్బుక్ వంటి సామాజిక మీడియా దిగ్గజాలు విద్వేషంతో చేసే అసత్య ప్రచారాలకే ప్రాధాన్యం ఇస్తున్నాయని విమర్శించారు.

దశాబ్దాలుగా పోరాటం..

1993లో రష్యాలో ప్రారంభమైన ‘నవోయా గజెటా’ దినపత్రిక వ్యవస్థాపకుల్లో దిమిత్రి మురాతోవ్ ఒకరు. ఇది.. రష్యాలో అత్యంత స్వతంత్ర పత్రిక వాస్తవ ఆధారిత పాత్రికేయం, వృత్తిపరమైన నిబద్ధతను చాటింది. దేశంలో పేరుకుపోయిన అవినీతి, విధానపరమైన హింస, చట్ట వ్యతిరేక ఆరెస్టులు, ఎన్నికల్లో మోసాలు వంటి ఎన్నో సంచలనాత్మక కథనాలను ‘నవోయా గజెటా ప్రచురించింది. దీంతో ఎన్నోసార్లు ఈ పత్రికకు బెదిరింపులు వచ్చాయి. ఇప్పటివరకూ ఈ సంస్థకు చెందిన ఆరుగురు జర్నలిస్టులు హత్యకు గురయ్యారు. చెచెన్యాలో రష్యా సాగించిన పోరుపై కథనాలు రాసిన అన్నా పొలిటికోవోస్కయా కూడా వీరిలో ఉన్నారు. అయినప్పటికీ మురాతోవ్ వెనకడుగు వేయకుండా తన సిద్ధాంతాలను కొనసాగిస్తూ వచ్చారు. మీడియా స్వేచ్ఛ కోసం దశాబ్దాలుగా పోరాటం. సాగిస్తున్నారు.

1990లో నోబెల్ శాంతి బహుమతి గెల్చుకున్న నాటి సోవియట్ యూనియన్ నాయకుడు మిఖాయిల్ గోర్బచేవ్… తన బహుమతి మొత్తంలో కొంత భాగాన్ని ‘నవోయా గజెటా’ సంస్థకు కార్యాలయ ఉపకరణాలు, కంప్యూటర్ల కొనుగోలుకు వెచ్చించారు. గతంలోనూ పాత్రికేయులకు నోబెల్ శాంతి బహుమతి దక్కింది. 1907లో ఇటలీకి చెందిన ఎర్నెస్టో టియోడోరో మోనెటో, 1935లో జర్మనీకి చెందిన కార్ల్ వోన్ను ఈ పురస్కారాలు వరించాయి. పాత్రికేయులకు నోబెల్ శాంతి. బహుమతి రావడంపై పలు మీడియా హక్కుల సంస్థలు హర్షం వ్యక్తంచేశాయి.

1993లో రష్యాలో ప్రారంభమైన ‘నవోయా గజెటా’ దినపత్రిక వ్యవస్థాపకుల్లో దిమిత్రి ముఠాతోవ్ ఒకరు ఇది, రష్యాలో అత్యంత స్వతంత్ర పత్రిక వాస్తవ ఆధారిత పాత్రికేయం, వృత్తిపరమైన నిబద్ధతను చాటింది. దేశంలో పేరుకుపోయిన అవినీతి, విధానపరమైన హింస, చట్ట వ్యతిరేక ఆరెస్టులు, ఎన్నికల్లో మోసాలు వంటి ఎన్నో సంచలనాత్మక కథనాలను ‘సవోయా గజెటా ప్రచురించింది. దీంతో ఎన్నోసార్లు ఈ పత్రికకు బెదిరింపులు వచ్చాయి. ఇప్పటివరకూ ఈ సంస్థకు చెందిన ఆరుగురు జర్నలిస్టులు హత్యకు గురయ్యారు. చెచెన్యాలో, రష్యా, సాగించిన పోరుపై కథనాలు రాసిన అన్నా పొలిటికోవోస్కయా కూడా వీరిలో ఉన్నారు. అయినప్పటికీ మురాతోవ్ వెనకడుగు వేయకుండా తన సిద్ధాంతాలను కొనసాగిస్తూ వచ్చారు. మీడియా స్వేచ్ఛ కోసం దశాబ్దాలుగా పోరాటం సాగిస్తున్నారు.

Polity Study material

 

Nobel-Physics (భౌతిక శాస్త్రం)

ప్రకృతిలో గందరగోళంతో కూడిన, యాదృచ్ఛికంగా జరిగే సంక్లిష్ట వ్యవస్థలపై అద్భుత పరిశోధనలు. సాగించిన ముగ్గురు శాస్త్రవేత్తలను ఈ ఏడాది భౌతిక శాస్త్రంలో నోబెల్ పురస్కారం వరించింది. వీరి కృషి వల్ల వాతావరణ సంబంధ అంశాలను మెరుగ్గా అర్ధం చేసుకోవడానికి, కచ్చితత్వంతో ముందస్తు అంచనాలు వేయడానికి మార్గం సుగమమైంది. అలాగే సంక్లిష్ట భౌతిక వ్యవస్థల గురించి అవగాహన పెరిగింది. సుకురో మనాకీ (90), క్లాస్ హాజల్మాన్ (89), జార్జియో పార్టిసి (73)లకు ఈ గౌరవం దక్కింది. బహుమతి కింద దక్కే 11 లక్షల డాలర్ల నగదును ఈ ముగ్గురికి పంచుతారు. అందులో సగ భాగం సుకురో, క్లాన్లకు అందుతుంది. మిగతా సగభాగం జార్జియోకు దక్కుతుంది..

List of Nobel Prize winners 2021 PDF in Telugu | నోబెల్ బహుమతి 2021 విజేతల పూర్తి జాబితా_100.1
physics-nobel-2021

సంక్లిష్టమైన భౌతిక వ్యవస్థల్లో యాదృచ్ఛికత ఉంటుంది. ఒక క్రమపద్ధతి ఉండదు. వాటిని అర్ధం చేసుకోవడం. కష్టం. అలాంటి ప్రక్రియలను వివరించడానికి వాటి దీర్ఘకాల వ్యవహారశైలిని ముందుగా “హించడానికి దోహదపడే కొత్త విధానాలను కనుగొన్నందుకు ఈ ముగ్గురిని ఈ బహుమతికి ఎంపిక చేసినట్లు కమిటీ తెలిపింది. ఇలాంటి సంక్లిష్ట వ్యవస్థల్లో మానవాళికి అత్యంత ముఖ్యమైంది. భూ వాతావరణమని వివరించింది. ఈ అంశం, దానిపై మానవాళి ప్రభావానికి సంబంధించిన విజ్ఞానానికి సుకురో, క్లాస్లు పునాదులు వేశారని పేర్కొంది. వీరిద్దరూ భూ వాతావరణంపై భౌతిక మోడలింగ్ దానికి సంబంధించిన వైరుధ్యాలను లెక్కగట్టడం, భూతాపాన్ని అత్యంత కచ్చితత్వంతో అంచనా వేయడం వంటివి చేశారని తెలిపింది.

సుకురో పాత్ర:

గాల్లో కార్బన్ డై ఆక్సైడ్ స్థాయి పెరిగితే భూ ఉపరితలం మీద ఉష్ణోగ్రతలు ఎలా పెరుగుతాయన్నది సుకురో ప్రయోగపూర్వకంగా రుజువు చేశారు. 1960లలో ఆయన భూవాతావరణానికి సంబంధించిన భౌతిక మోడళ్ల అభివృద్ధి ప్రక్రియకు నేతృత్వం వహించారు. రేడియేషన్ సమతౌల్యం; గాలి కదలికల మధ్య చర్యలను తొలిసారిగా పరిశోధించారు. ఆయన కృషి వల్ల ప్రస్తుత వాతావరణ నమూనాలకు పునాదులు పడ్డాయి. సుకురో.. జపాన్లోని షింగులో జన్మించారు. ప్రస్తుతం ఆయన అమెరికాలోని ప్రిన్స్టన్ విశ్వవిద్యాలయంలో సీనియర్ వాతావరణ శాస్త్రవేత్తగా ఉన్నారు.

క్లాస్ హసల్ మన్ రూపొందించిన నమూనా:

క్లాస్ హాజల్మన్.. ఒక నమూనాను సృష్టించారు. శీతోష్ణ స్థితి మారుతున్నప్పటికీ వాతావరణ నమూనాలు ఎందుకు నమ్మశక్యంగా ఉంటున్నాయన్నది ఇది వివరించింది. ప్రకృతిసిద్ధమైన పోకడలు, మానవచర్యల వల్ల వాతావరణంపై పడే ముద్ర తాలుకు సంకేతాలను గుర్తించే విధానాలనూ ఆయన అభివృద్ధి చేశారు. మనుషుల చర్యలతో వెలువడుతున్న కార్బన్ డైఆక్సైడ్ వల్ల వాతావరణంలో ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయని రుజువు చేయడానికి క్లాస్ విధానాలు దోహదపడ్డాయి. ఆయన జర్మనీలోని హాంబర్గ్లో జన్మించారు. అదే నగరంలోని మాక్స్ ప్లాంక్ ఇన్స్టిట్యూట్ ఫర్ మెటీరియాలజీలో ప్రొఫెసర్గా పనిచేస్తున్నారు.

జార్జియో పాత్ర:

ఒక క్రమపద్ధతి లోపించిన పదార్ధాలు, యాదృచ్ఛిక ప్రక్రియలకు సంబంధించిన సిద్ధాంతంపై జార్జియో.. 1980లలో విప్లవాత్మక ఆవిష్కరణలు చేశారు. సంక్లిష్ట పదార్థాల్లోని నిగూఢ పోకడలను గుర్తించారు. గణిత, జీవ, నాడీ శాస్త్రాలు, మెషీన్ లెర్నింగ్ వంటి విభిన్న రంగాల్లో సంక్లిష్ట వ్యవస్థలను అర్థం చేసుకోవడానికి వీలు కల్పించిన భౌతిక, గణిత నమూనాను ఆయన నిర్మించారు. “జార్జియో.. స్పిన్ గ్లాస్’పై దృష్టిసారించారు. ఇది ఒకరకమైన మిశ్రమ లోహం. ఇందులో పరమాణువుల అమరిక భిన్నంగా ఉంటుంది. ఫలితంగా ఆ పదార్థ ఆయస్కాంత ధర్మాలు యాదృచ్ఛికంగా మారిపోతుంటాయి. అప్పట్లో ఇది శాస్త్రవేత్తలను ఆశ్చర్యానికి గురి చేసింది. ఈ వ్యవహారశైలి వెనుక దాగున్న ప్రక్రియలను జార్జియో కనుగొన్నారు. దీనికి సంబంధించిన సిద్ధాంతాన్ని ఇతర రంగాల్లోని పరిశోధనలకూ వర్తింపజేయవచ్చు” అని నోబెల్ కమిటీ పేర్కొంది జార్జియో. ఇటలీలోని రోమ్లో జన్మించారు. అక్కడి సాపియోంజా విశ్వవిద్యాలయంలో ప్రొఫెసర్ గా పనిచేస్తున్నారు.

Nobel winners list in Telugu Download Now

 

Also Download:

August Monthly CA PDF  August ToP 100 CA Q&A
July Monthly CA | జూలై కరెంట్ అఫైర్స్   july TOP 100 CA Q&A | జూలై టాప్ 100 CA Q&A
జూన్ నెలవారీ కరెంట్ అఫైర్స్ PDF తెలుగులో జూన్ top 100 కరెంట్ అఫైర్స్ PDF
ఆంధ్రప్రదేశ్ స్టేట్ GK PDF తెలంగాణ స్టేట్ GK PDF
తెలుగులో బ్యాంకింగ్ అవేర్నెస్ pdf  తెలుగులోకంప్యూటర్ అవేర్నెస్ pdf 

 

Sharing is caring!

Download your free content now!

Congratulations!

List of Nobel Prize winners 2021 PDF in Telugu | నోబెల్ బహుమతి 2021 విజేతల పూర్తి జాబితా_120.1

కరెంట్ అఫైర్స్ -ఏప్రిల్ 2022 మాస పత్రిక

Download your free content now!

We have already received your details!

List of Nobel Prize winners 2021 PDF in Telugu | నోబెల్ బహుమతి 2021 విజేతల పూర్తి జాబితా_130.1

Please click download to receive Adda247's premium content on your email ID

Incorrect details? Fill the form again here

కరెంట్ అఫైర్స్ -ఏప్రిల్ 2022 మాస పత్రిక

Thank You, Your details have been submitted we will get back to you.