Telugu govt jobs   »   TSPSC   »   New job Recruitment Notification in Telangana

తెలంగాణాలో త్వరలో విడుదల కానున్న ఉద్యోగ నోటిఫికేషన్లు 2021 | New Job Notifications in Telangana 2021

తెలంగాణాలో త్వరలో విడుదల కానున్న ఉద్యోగ నోటిఫికేషన్లు | New Job Notifications in Telangana : తెలంగాణా రాష్ట్రంలో త్వరలో 50000 ఉద్యోగాలకు పైగా నోటిఫికేషన్లు విడుదల చేయడానికి రంగం సిద్దంగా ఉన్నట్లు అధికారిక సమాచారం. రాష్ట్రపతి ఆదేశాలను అనుసరించి ప్రభుత్వం ఇప్పటికే శాఖల వారీగా ఖాళీల వివరాలను వివిధ ప్రభుత్వ విభాగాల నుండి సేకరించినట్లు ప్రభుత్వం పేర్కొంది. ఈ ఖాళీలన్నికి సంబంధించి నోటిఫికేషన్లను నవంబర్ నెలకు ముందే విడుదల చేయనున్నట్లు తెలుస్తోంది. Adda247 తెలుగు New Job Notifications in Telangana కు  సంబంధించిన సమాచారాన్ని మీకు ఇక్కడ అందించడం జరిగింది.

 

New Job Notifications in Telangana | Highlights(ప్రధాన అంశాలు)

 

స్థానికతపై రాష్ట్రపతి నూతన ఉత్తర్వుల మేరకు జిల్లా, జోనల్, మల్టీ జోనల్‌ కేడర్ల వారీగా, మంజూరైన పోస్టులు, అందులో పనిచేస్తున్న ఉద్యోగుల విభజనకు సంబంధించిన వివరాలను నిర్దేశిత నమూనాలో వివిధ శాఖల నుండి ప్రభుత్వం సమాచారం సేకరణ పూర్తి చేసింది.

  • రాష్ట్రపతి నూతన ఉత్తర్వుల అమలుకు సర్వం సిద్ధం చేసిన తెలంగాణా రాష్ట్ర ప్రభుత్వం.
  • వివిధ స్థాయి ఉద్యోగ కేడర్లను ఆధారంగా చేసుకొని వివరాల సేకరణ జరిగింది.
  • ఈ ఖాళీల సమగ్ర సమాచారం పై ప్రభుత్వ స్థాయిలో మూడు రోజుల పాటు సమావేశం జరగనున్నది.
  • త్వరలో భర్తీలపై సమీక్షించి నిర్ణయం తీసుకోనున్న ముఖ్యమంత్రి.

 

Read More : తెలంగాణా చరిత్ర PDF 

 

రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగాల ఖాళీలను జోన్లలోని కేడర్ల వారీగా భర్తీ చేసేందుకు కసరత్తు పూర్తయింది. అన్ని శాఖలు తమతమ పరిధిలోని ఖాళీల సంఖ్యతో సిద్ధంగా ఉన్నాయి. దాదాపు 65 వేలకు పైగా ఖాళీలున్నట్టు ఇప్పటికే ప్రభుత్వం ప్రాథమికంగా గుర్తించింది. ఈ నేపథ్యంలో 50 వేల నుంచి 65 వేల వరకు పోస్టుల భర్తీకి ఏకకాలంలో నోటిఫికేషన్లు ఇచ్చే అవకాశాలున్నట్టు ప్రభుత్వ వర్గాలు తెలిపాయి.

 

New Job Notifications in Telangana | 50000+ఉద్యోగాలకు నోటిఫికేషన్లు

 

ఆర్థిక శాఖ సమర్పించనున్న ప్రతిపాదనలతో ముఖ్యమంత్రి సంతృప్తి చెందితే భర్తీకి మార్గం సుగమం కానుంది. ఈ నెల 10 లేదా ఆ తర్వాత సీఎం కేసీఆర్‌ ఉన్నతాధికారులతో సమావేశమై ప్రత్యక్ష నియామకాల ద్వారా భర్తీ చేయాల్సిన పోస్టులకు సంబంధించిన ప్రతిపాదనలను పరిశీలించి నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. శాఖల వారీగా ఖాళీ పోస్టులకు సంబంధించిన వివరాలతో రాష్ట్ర ఆర్థిక శాఖ నివేదికను సిద్ధం చేయనుంది.

Read more: TS SI exam Pattern

 

రాష్ట్ర ఆర్థిక శాఖ మంగళ, బుధ, గురువారాల్లో ఆయా ప్రభుత్వ శాఖలతో వరుసగా మూడు రోజులపాటు సమావేశాలు నిర్వహించి రాష్ట్రపతి నూతన ఉత్తర్వుల ప్రకారం ఉద్యోగుల విభజనకు తుది రూపు ఇవ్వనుంది. దీంతో పాటు ఆయా కేడర్ల వారీగా ఖాళీగా ఉన్న పోస్టుల వివరాలను సంబంధిత శాఖల నుంచి సేకరించనుంది. ఈనెల 9తో అన్ని శాఖల్లోని కేడర్‌ల వారీగా ప్రభుత్వానికి స్పష్టమైన సమాచారం రానుంది. దానికితోడు రిక్రూట్‌మెంట్‌ ఇతరత్రా సర్వీసు నిబంధనలు తదితర అంశాలన్నింటిపై ఆర్థిక శాఖ ఉన్నతాధికారులు అన్ని శాఖల అధికారులతో సమీక్షించనున్నారు.

New Job Notifications in Telangana | అభ్యర్ధులకు ముఖ్య సూచన

తెలంగాణా రాష్ట్ర ప్రభుత్వం ఏదో ఒక సమయంలో ఖచ్చితంగా నోటిఫికేషలను విడుదల చేయడం ఖాయం. కాని నోటిఫికేషన్ కోసం ఎదురు చూడకుండా మీ సాధనలో మరింత ముందుకు వెళ్ళే ప్రయత్నమే మిమ్మల్ని ప్రభుత్వ ఉద్యోగులను చేస్తుంది తప్ప, అనుకున్న సమయానికి వచ్చే నోటిఫికేషన్ అయితే ఏ మాత్రం కాదు. కాబట్టి సమయంతో సంబంధం లేకుండా మీ సాధన మీద దృష్టి పెట్టండి. ఇప్పటికీ సాధన మొదలుపెట్టకపోతే ఇకమీధనైనా మొదలు పెట్టండి. మన విజయం మన చేస్తుల్లోనే ఉంటుంది.

 

Shathabdhi Batch RRB NTPC CBT-2
For RRB NTPC CBT-2

ఆన్లైన్ లైవ్ క్లాసుల వివరాల కొరకు ఇక్కడ క్లిక్ చేయండి 

Also Download:

August Monthly CA PDF  August ToP 100 CA Q&A
July Monthly CA | జూలై కరెంట్ అఫైర్స్   july TOP 100 CA Q&A | జూలై టాప్ 100 CA Q&A
జూన్ నెలవారీ కరెంట్ అఫైర్స్ PDF తెలుగులో జూన్ top 100 కరెంట్ అఫైర్స్ PDF
ఆంధ్రప్రదేశ్ స్టేట్ GK PDF తెలంగాణ స్టేట్ GK PDF
తెలుగులో బ్యాంకింగ్ అవేర్నెస్ pdf  తెలుగులోకంప్యూటర్ అవేర్నెస్ pdf 

New Job Notifications in Telangana : FAQs

 

Q1. తెలంగాణాలో వచ్చే latest government job notifications 2021 ఏమిటి?
Ans. ప్రభుత్వం latest government job notifications 2021  పై కసరత్తు చేస్తోంది. త్వరలో నోటిఫికేషన్ విడుదల కానున్నది.
Q2. TSPSC లో వివిధ ఉద్యోగాలు ఏమిటి?

Ans.

Name of the Post Salary
Deputy Collector Rs 20,680 – Rs 46,980
District Registrar Rs. 18,030 – Rs 43,630
Deputy Superintendent of Police Rs 20,680 – Rs 46,960
Divisional Fire Officer Rs 19,050 – Rs 45,850
District Backward Caste Welfare Officer Rs 19,050 – Rs 45,850
Municipal Commissioner Rs 16,150 – Rs 42,590
Commercial Tax Officer Rs 20,680 – Rs 46,960
Assistant Audit Officer Rs 16,150 – Rs 42,590
District Panchayat Raj Officer Rs 19,050 – Rs 45,850
Assistant Treasury Office Rs 18,030 – Rs 43,630
Mandal Parishad Development Officer Rs 16,150 – Rs 42,590

 

 

 

Sharing is caring!