Telugu govt jobs   »   Daily Quizzes   »   General Knowledge Quiz In Telugu

Telangana State GK MCQs Questions And Answers in Telugu, 27th May 2023 For TSPSC Groups & TS Gurukulam

Telangana State GK MCQs Questions And Answers in Telugu : Practice General awareness Quiz Questions and Answers in Telugu, If you have prepared well for this section, then you can score good marks in the examination. Current Affairs Questions,  Static Awareness forms a part and parcel of General Awareness/ General Knowledge. Most of the questions asked in the general awareness sections are based on current affairs.

Telangana State GK MCQs Questions And Answers in Telugu : ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ లో అత్యంత ముఖ్యమైన మరియు ప్రతిష్టాత్మకమైన పరీక్షలు గ్రూప్-1,2,3 అలాగే SSC, సింగరేణి , రైల్వే లలోనికి చాలా మంది ఆశావహులు ఈ ప్రతిష్టాత్మక ఉద్యోగాల్లో కి ప్రవేశించడానికి ఆసక్తి చూపుతారు.దీనికి పోటీ ఎక్కువగా ఉండడం కారణంగా, అధిక వెయిటేజీ సంబంధిత సబ్జెక్టులను ఎంచుకుని స్మార్ట్ అధ్యయనంతో ఉద్యోగం పొందవచ్చు. ఈ పరీక్షలలో ముఖ్యమైన అంశాలు అయిన పౌర శాస్త్రం , చరిత్ర , భూగోళశాస్త్రం, ఆర్ధిక శాస్త్రం, సైన్సు మరియు విజ్ఞానం, సమకాలీన అంశాలు చాల ముఖ్యమైన పాత్ర పోషిస్తాయి. కాబట్టి Adda247, ఈ అంశాలకి సంబంధించిన కొన్ని ముఖ్యమైన ప్రశ్నలను మీకు అందిస్తుంది. ఈ పరీక్షలపై ఆసక్తి ఉన్న అభ్యర్థులు  దిగువ ఉన్న ప్రశ్నలను పరిశీలించండి.

Adda247 Telugu
APPSC/TSPSC Sure shot Selection Group

Telangana State GK MCQs Questions And Answers in Telugu.

Q1. సౌర విద్యుత్ విధాన లక్ష్యాలు కు సంబంధించి ఈ కింది ప్రకటనలో ఏది సరైనది?

  1. రాష్ట్రంలో విస్తారమైన సౌర విద్యుత్ అవకాశాలను గుర్తించి పెంపొందించడం.
  2. సౌర విద్యుత్ పార్కులను ప్రోత్సహించడం
  3. సౌర విద్యుత్ ఉత్పత్తిలో ప్రైవేటు ప్రభుత్వ పెట్టుబడిని ప్రోత్సహించడం.
  4. వికేంద్రీకృత, ఉత్పత్తి పంపిణీని ప్రోత్సహించడం
  5. గ్రిడ్ అనుసంధాన, గ్రిడ్ అనుసంధాన రహిత సౌర విధానాలను, ఇంధన పొదుపు సమర్ధ నిర్వహణను ప్రోత్సహించడం.

(a) 1, 3 , 4

(b) 1, 2, 3, మరియు 4

(c) 2, 3 మరియు 4

(d) 1, 2, 3, 4 మరియు 5

Q2. సూక్ష్మ, చిన్న పరిశ్రమల ప్రోత్సాహానికి సంబంధించి ఈ కింది వాటిలో ఏది సరైనది?

  1. పారిశ్రామిక వినియోగానికి అవసరమైన చేసిన భూమి కొనుగోలుపై పరిశ్రమ చెల్లించిన స్టాంపు డ్యూటీ, ట్రాన్సఫర్ డ్యూటీలకు 100% రీయింబర్స్మెంట్.
  2. వాణిజ్య ఉత్పత్తి మొదలైన తేదీ నుండి 5 సంవత్సరాల కాలం పాటు యూనిట్కు రూ. 00 చొప్పున విద్యుత్ వ్యయంలో స్థిరమైన రీయింబర్స్మెంట్.
  3. వాణిజ్యపరమైన ఉత్పత్తి ప్రారంభమైన తేదీ నుండి 5 సంవత్సరాల కాలం పాటు నికర వ్యాట్ / సిఎస్టి లేదా రాష్ట్ర సరుకులు మరియు సేవల పన్ను (State Goods and Services Tax (SGST)] 100% రీయింబర్స్మెంట్.

(a) 1 మరియు  3

(b) 2 మరియు  3 మాత్రమే

(c) 2 మరియు  1

(d) 1, 2, 3

Q3. శాస్త్ర, సాంకేతిక పరికరాల తయారీలో దిగ్గజ సంస్థగా ఖ్యాతిగాంచిన థర్మో ఫిషర్‌ సైంటిఫిక్‌ ఏర్పాటు చేసిన నూతన పరిశోధన, అభివృద్ధి కేంద్రం ‘ఇండియా ఇంజనీరింగ్‌ సెంటర్‌’ను ఎక్కడ ప్రారంభించారు?

(a) వరంగల్

(b) హైదరాబాద్

(c) రంగారెడ్డి జిల్లా

(d) నిజామాబాద్

Q4. కింది వాటిని జతపరుచుము.

జాబితా – I                                             జాబితా – II

1. 1930 నుంచి 1940                 1.  శాంతియుత రైతాంగ తిరుగుబాట్లు.

  1. 1940 నుంచి 1946                   2. వ్యక్తిగతమైన ఆందోళనలు.
  2. 1946 నుంచి 1948                   3. ప్రజా సాయుధ పోరాటాలు.
  3. 1948 నుంచి 1951                   4. రైతాంగ సాయుధ పోరాటాలు.

(a) A – 2, B – 1, C – 4, D – 3

(b) A – 4, B – 3, C – 1, D – 2

(c) A – 3, B – 4, C – 1, D – 2

(d) A – 4, B – 3, C – 2, D – 1

Q5. ప్రతిపాదన (A): నల్గొండ, ఖమ్మం, వరంగల్, కరీంనగర్, ఆదిలాబాద్ జిల్లాలలో వ్యాపించి ఉన్న ప్రాంతం వ్యవసాయానికి అనుకూలంగా ఉంటుంది.

కారణం (R): ఈ ప్రాంతం తెలంగాణ రాష్ట్రంలో ఎక్కువ విస్తీర్ణం కలిగి గోదావరి నదికి ఇరువైపులా వ్యాపించి సముద్రమట్టం నుంచి 300 మీటర్ల కంటే తక్కువ ఎత్తు గలదు.

సమాధానం :

(a) (A) మరియు (R) నిజం (R). (A) కు సరియైన వివరణ

(b) (A) మరియు (R) రెండూ నిజం కాని (R), (A) కు సరియైన వివరణ కాదు.

(c) (A) నిజం (R) తప్పు

(d) (A) తప్పు కాని (R) నిజం

Q6. ప్రాచీన కాలంలో భారతదేశంలో ఎంతో విజ్ఞానం అభివృద్ధిచెందింది. ఈ విజ్ఞానం చాలాకాలం వరకు ఒక తరం నుంచి మరొక తరానికి మౌఖిక మాధ్యమంలో అందచేయబడింది.సమాజంలోని కింది, ఉన్నత వర్గాలు కూడా ఆ విజ్ఞానాన్ని పొందే అవకాశం కలిగి ఉండాలని భావించారు. ఆయా వర్గాలకు ఈ విజ్ఞానం అందే విధంగా అభివృద్ధిచేశారు. ఈ విధంగా కింది వర్గాలకోసం  ఏ  పద్ధతిని రూపొందించారు?

(a) ‘దేశీ’ పద్ధతి

(b) ‘మార్గ’ పద్ధతి

(c) a మరియు b

(d) పైనవేవి కావు

Q7. కింది వాటిని జతపరుచుము

వన్యమృగ సంరక్షణ కేంద్రం                         ప్రాంతం
A. శివ్వారం                                               1.  నాగర్‌కర్నూల్, నల్లగొండ
B. పోచారం                                                2. కొత్తగూడెం
C. రాజీవ్ గాంధీ                                        3. మంచిర్యాల, పెద్దపల్లి
D. కిన్నెరసాని                                          4. మెదక్, కామారెడ్డి

(a) A – 2, B – 1, C – 4, D – 3

(b) A – 4, B – 3, C – 1, D – 2

(c) A – 3, B – 4, C – 1, D – 2

(d) A – 4, B – 3, C – 2, D – 1

Q8. బయో ఆసియా 19వ వార్షిక సదస్సు థీమ్‌ ఏమిటి?

(a) మూవ్ ది నీడల్

(b) ఫ్యూచర్‌ రెడీ

(c) టుడే ఫర్ టుమరో

(d) లైఫ్ సైన్సెస్0

Q9. టస్సర్ పట్టు సంస్కృతి కు సంబంధించి కింది ప్రకటనలో సరైంది ఏది?

  1. తెలంగాణ రాష్ట్రం దేశంలో టస్సర్ పట్టుకాయ ఉత్పత్తిలో నాలుగో స్థానంలో ఉంది.
  2. రాష్ట్రంలో 8200 ఎకరాల అటవి ప్రాంతంలో టి అర్జున్ అనే రకాన్ని ఆదిలాబాద్, కరీంనగర్, ఖమ్మం, వరంగల్ జిల్లాలో షెడ్యూల్డు తెగల వారు పండిస్తున్నారు.
  3. షెడ్యూల్డు తెగలవారికి ఈ టస్సర్ పంట వారి జీవనోపాదిలో ప్రధానమైంది.

(a) 1, 3 మాత్రమే

(b) 2, 3 మాత్రమే

(c) 1, 2 మాత్రమే

(d) 1, 2 & 3

Q10. ప్రతిపాదన (A): నైజాం హైదరాబాద్ సంస్థానం భారతదేశంలో విలీనమయ్యే సమయంలో సంస్థానం ఆర్థిక వ్యవస్థ చిన్నాభిన్నంగా ఉంది.

కారణము (R) : హైదరాబాద్ సంస్థానం భారతదేశంలో విలీనానికి పూర్వం నిజాం సంస్థానం దాదాపు 22 కోట్ల రూపాయలు ఆయుధాల కొనుగోలుకు, ప్రచారానికి ఉపయోగించినట్లు విమర్శకులు పేర్కొంటారు.

సమాధానం :

(a) (A) మరియు (R) నిజం (R), (A) కు సరియైన వివరణ

(b) (A) మరియు (R) రెండూ నిజం కాని (R), (A) కు సరియైన వివరణ కాదు.

(c) (A) నిజం (R) తప్పు

(d) (A) తప్పు కాని (R) నిజం

Solutions:

S1. Ans(d)

Sol: సౌర విద్యుత్ విధాన లక్ష్యాలు:

  • రాష్ట్రంలో విస్తారమైన సౌర విద్యుత్ అవకాశాలను గుర్తించి పెంపొందించడం.
  • సౌర విద్యుత్ పార్కులను ప్రోత్సహించడం
  • సౌర విద్యుత్ ఉత్పత్తిలో ప్రైవేటు ప్రభుత్వ పెట్టుబడిని ప్రోత్సహించడం.
  • వికేంద్రీకృత, ఉత్పత్తి పంపిణీని ప్రోత్సహించడం
  • గ్రిడ్ అనుసంధాన, గ్రిడ్ అనుసంధాన రహిత సౌర విధానాలను, ఇంధన పొదుపు సమర్ధ నిర్వహణను ప్రోత్సహించడం.

S2. Ans (d)

Sol: సూక్ష్మ, చిన్న పరిశ్రమల ప్రోత్సాహానికి సంబంధించి :

  • పారిశ్రామిక వినియోగానికి అవసరమైన చేసిన భూమి కొనుగోలుపై పరిశ్రమ చెల్లించిన స్టాంపు డ్యూటీ, ట్రాన్సఫర్ డ్యూటీలకు 100% రీయింబర్స్మెంట్.
  • వాణిజ్య ఉత్పత్తి మొదలైన తేదీ నుండి 5 సంవత్సరాల కాలం పాటు యూనిట్కు రూ. 00 చొప్పున విద్యుత్ వ్యయంలో స్థిరమైన రీయింబర్స్మెంట్.
  • వాణిజ్యపరమైన ఉత్పత్తి ప్రారంభమైన తేదీ నుండి 5 సంవత్సరాల కాలం పాటు నికర వ్యాట్ / సిఎస్టి లేదా రాష్ట్ర సరుకులు మరియు సేవల పన్ను (State Goods and Services Tax (SGST)] 100% రీయింబర్స్మెంట్.

S3. Ans (b)

Sol: శాస్త్ర, సాంకేతిక పరికరాల తయారీలో దిగ్గజ సంస్థగా ఖ్యాతిగాంచిన థర్మో ఫిషర్‌ సైంటిఫిక్‌ ఏర్పాటు చేసిన నూతన పరిశోధన, అభివృద్ధి కేంద్రం ‘ఇండియా ఇంజనీరింగ్‌ సెంటర్‌’ను ఏప్రిల్‌ 28న హైదరాబాద్‌లోని నాలెడ్జి సిటీలో తెలంగాణ ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కె.తారక రామారావు ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్‌ మాట్లాడుతూ. థర్మో ఫిషర్‌ ఆర్‌ అండ్‌ డీ కేంద్రం కొత్త ఉత్పత్తులు, విశ్లేషణాత్మక పరిష్కారాలకు కేంద్రంగా ఉండనుందన్నారు. ఈ సంస్థ ఇప్పటికే ఉత్పత్తి, భూనీటి వనరులపై పరిశోధన చేస్తోందని చెప్పారు. 2022, ఫిబ్రవరి నెల తాను చేపట్టిన అమెరికా పర్యటనలో భాగంగా బోస్టన్‌లో థర్మో ఫిషర్‌ సైంటిఫిక్‌ ప్రతినిధులను కలిసినట్లు వివరించారు.

S4. Ans (a)

Sol: తెలంగాణా రైతాంగ సాయుధ పోరాటాన్ని సరళంగా అర్థంచేసుకోవడానికి వీలుగా దాన్ని నాలుగు విధాలుగా విభజించడం జరిగింది. అవి

  • 1930 నుంచి 1940 వరకు భూస్వాములకు వ్యతిరేకంగా జరిగిన వ్యక్తిగతమైన ఆందోళనలు.
  • నుంచి 1946 వరకు భూస్వాములకు, దేశముఖకు, గ్రామాధికారులకు వ్యతిరేకంగా జరిగిన శాంతియుత రైతాంగ తిరుగుబాట్లు.
  • 1946 నుంచి 1948 వరకు భూస్వాములకు, దేశ్ముఖ్ కు, రజాకర్లకు, నిజాం ప్రభుత్వానికి వ్యతిరేకంగా కమ్యూనిస్టులు, హైదరాబాద్ స్టేట్ కాంగ్రెస్ వారు జరిపిన రైతాంగ సాయుధ పోరాటాలు.
  • 1948 నుంచి 1951 వరకు భారత ప్రభుత్వానికి వ్యతిరేకంగా కమ్యూనిస్టులు, తెలంగాణా ప్రజానీకం సాగించిన ప్రజా సాయుధ పోరాటాలు.

S5. Ans (a)

Sol: సముద్రమట్టం నుంచి 300 మీ॥ కంటే తక్కువ ఎత్తు గల ఈ ప్రాంతం తెలంగాణ రాష్ట్రంలో ఎక్కువ విస్తీర్ణం కలిగి గోదావరి నదికి ఇరువైపులా వ్యాపించి ఉంది. ఈ ప్రాంతం ప్రధానంగా నల్గొండ, ఖమ్మం, వరంగల్, కరీంనగర్, ఆదిలాబాద్ జిల్లాలలో వ్యాపించి ఉంది. ఈ ప్రాంతం వ్యవసాయానికి అనుకూలంగా ఉంటుంది.

S6. Ans (c)

Sol:  ప్రాచీన కాలంలో భారతదేశంలో ఎంతో విజ్ఞానం అభివృద్ధిచెందింది. ఈ విజ్ఞానం చాలాకాలం వరకు ఒక తరం నుంచి మరొక తరానికి మౌఖిక మాధ్యమంలో అందచేయబడింది. మన ప్రాచీనులు ఈ విజ్ఞానాన్ని భద్రపరచడానికి పలు విధానాలు అభివృద్ధిపరిచారు. సమాజంలోని కింది, ఉన్నత వర్గాలు కూడా ఆ విజ్ఞానాన్ని పొందే అవకాశం కలిగి ఉండాలని భావించారు. ఆయా వర్గాలకు ఈ విజ్ఞానం అందే విధంగా అభివృద్ధిచేశారు. కింది వర్గాలకోసం ‘దేశీ’ పద్ధతిని రూపొందించడం జరిగింది.

S7. Ans(c)

Sol:   వన్యమృగ సంరక్షణ కేంద్రం                               ప్రాంతం

  • శివ్వారం                                       –                            మంచిర్యాల, పెద్దపల్లి
  • పోచారం                                      –                                మెదక్, కామారెడ్డి
  • రాజీవ్ గాంధీ                               –                        నాగర్‌కర్నూల్, నల్లగొండ
  • కిన్నెరసాని                                  –                           కొత్తగూడెం

S8. Ans (b)

Sol: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏటా నిర్వహిస్తున్న ప్రతిష్టాత్మక కార్యక్రమం ‘‘బయో ఆసియా’’ 19వ వార్షిక సదస్సు(బయో ఆసియా–2022) ఫిబ్రవరి 24న ప్రారంభమైంది. హైదరాబాద్‌ వేదికగా ఫిబ్రవరి 25వ తేదీ వరకు వర్చువల్‌ పద్ధతిలో జరిగే ఈ సదస్సును తెలంగాణ ఐటీ, మున్సిపల్‌ శాఖల మంత్రి కల్వకుంట్ల తారక రామారావు ప్రారంభించారు. ఈ సదస్సులో 70కి పైగా దేశాల నుంచి సుమారు 30 వేలకు పైగా ప్రతినిధులతోపాటు పలువురు నోబెల్‌ గ్రహీతలు కూడా పాల్గొంటున్నారు. మైక్రోసాఫ్ట్‌ అధినేత బిల్‌గేట్స్‌ సదస్సులో పాల్గొని మంత్రి కేటీఆర్‌తో చర్చలు జరిపారు. ‘ఫ్యూచర్‌ రెడీ’ నినాదంతో బయో ఆసియా–2022 సదస్సు జరిగింది.

S9. Ans (d)

Sol: టస్సర్ పట్టు సంస్కృతి:

  • తెలంగాణ రాష్ట్రం దేశంలో టస్సర్ పట్టుకాయ ఉత్పత్తిలో నాలుగో స్థానంలో ఉంది.
  • రాష్ట్రంలో 8200 ఎకరాల అటవి ప్రాంతంలో టి అర్జున్ అనే రకాన్ని ఆదిలాబాద్, కరీంనగర్, ఖమ్మం, వరంగల్ జిల్లాలో షెడ్యూల్డు తెగల వారు పండిస్తున్నారు.
  • షెడ్యూల్డు తెగలవారికి ఈ టస్సర్ పంట వారి జీవనోపాదిలో ప్రధానమైంది. ఈ పంట అడవి ప్రాంతాల లోపల భాగా అభివృద్ధి చెందింది.
  • టస్సర్ సంస్కృతిలో టస్సర్ పట్టు పురుగుల పెంపకం, కాటన్ల సాగు, పట్టు ఉత్పత్తి మరియు టస్సర్ వెలికితీత అనే వివిధ పద్ధతులు కలవు.

S10. Ans (a)

Sol:  నైజాం హైదరాబాద్ సంస్థానం భారతదేశంలో విలీనమయ్యే సమయంలో సంస్థానం ఆర్థిక వ్యవస్థ చిన్నాభిన్నంగా ఉంది. హైదరాబాద్ సంస్థానం భారతదేశంలో విలీనానికి పూర్వం నిజాం సంస్థానం దాదాపు 22 కోట్ల రూపాయలు ఆయుధాల కొనుగోలుకు, ప్రచారానికి ఉపయోగించినట్లు విమర్శకులు పేర్కొంటారు.

TSPSC గ్రూప్-1 Score Booster Batch | Top 10 Mock Tests Discussion | Online Live Classes By Adda247
మరింత చదవండి: 
తాజా ఉద్యోగ ప్రకటనలు ఇక్కడ క్లిక్ చేయండి
ఉచిత స్టడీ మెటీరియల్ (APPSC, TSPSC) ఇక్కడ క్లిక్ చేయండి
ఉచిత మాక్ టెస్టులు ఇక్కడ క్లిక్ చేయండి

 

Sharing is caring!

FAQs

where can i found daily quizzes?

You can found different quizzes at adda 247 telugu website