Telugu govt jobs   »   Daily Quizzes   »   Aptitude Daily Quiz in Telugu |...

Daily Quiz in Telugu | 25 August 2021 Mathematics Quiz | For APPSC junior Assistant& Railways

Daily Quiz in Telugu – Overview

Daily Quizzes in Telugu : ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ లో అత్యంత ముఖ్యమైన మరియు ప్రతిష్టాత్మకమైన పరీక్షలు గ్రూప్-1,2,3 అలాగే UPSC లలోనికి చాలా మంది ఆశావహులు ఈ ప్రతిష్టాత్మక ఉద్యోగాల్లో కి ప్రవేశించడానికి ఆసక్తి చూపుతారు.దీనికి పోటీ ఎక్కువగా ఉండడం కారణంగా, అధిక వెయిటేజీ సంబంధిత సబ్జెక్టులను ఎంచుకుని స్మార్ట్ అధ్యయనంతో ఉద్యోగం పొందవచ్చు. ఈ పరీక్షలలో ముఖ్యమైన అంశాలు అయిన పౌర శాస్త్రం , చరిత్ర , భూగోళశాస్త్రం, ఆర్ధిక శాస్త్రం, సైన్సు మరియు విజ్ఞానం, సమకాలీన అంశాలు చాల ముఖ్యమైన పాత్ర పోషిస్తాయి. కాబట్టి Adda247, ఈ అంశాలకి సంబంధించిన కొన్ని ముఖ్యమైన ప్రశ్నలను మీకు ప్రతిరోజు క్విజ్ రూపంలో అందిస్తుంది. ఈ పరీక్షలపై ఆసక్తి ఉన్న అభ్యర్థులు  దిగువ ఉన్న ప్రశ్నలను పరిశీలించండి.

Daily Quiz in Telugu – ప్రశ్నలు

Q1. ఒక వ్యక్తి వద్ద కెమికల్ లీటరుకు రూ. 25 ఉంటుంది. నీటిని ఏ నిష్పత్తిలో కెమికల్ తో కలపడం ద్వారా మిశ్రమాన్ని లీటరుకు రూ. 20కు విక్రయించడం వలన అతడు 25% లాభాన్ని పొందగలగాలి?

(a) 14 : 9

(b) 16 : 9

(c) 9 : 14

(d) 9 : 16

Q2. కిలో కు రూ.280 ఖరీదు చేసే 7 కిలోల తేయాకుని కిలోకు రూ.240 ఖరీదు చేసే 9 కిలోల తేయాకుతో కలిపితే. మిశ్రమ తేయాకు యొక్క కిలో సగటు ధర ఎంత కనుగొనండి?

(a) రూ. 255.80

(b) రూ. 257.50

(c) రూ. 267.20

(d) రూ. 267.50

Q3. 45% ఆల్కహాల్ గాడత కలిగిన  మిశ్రమాన్ని పొందడం కొరకు 30% ఆల్కహాల్ గాడత గల మిశ్రమాన్ని 50% ఆల్కహాల్ గాడత కలిగిన మిశ్రమంతో ఏ నిష్పత్తిలో కలపాలి కనుగొనండి?.

(a) 1 : 2

(b) 1 : 3

(c) 2 : 1

(d) 3 : 1

Q4. 729 లీటర్ల పాలు మరియు నీటి మిశ్రమంలో, పాలు మరియు నీటి నిష్పత్తి 7: 2. పాలు మరియు నీటిని కలిగి ఉన్న కొత్త మిశ్రమాన్ని 7: 3 నిష్పత్తిలో పొందడానికి, జోడించాల్సిన నీటి మొత్తం ఎంత కనుగొనండి?

(a) 81 లీటర్లు

(b) 71 లీటర్లు

(c) 56 లీటర్లు

(d) 50 లీటర్లు

Q5. ఒక మిశ్రధాతువులో, జింక్ మరియు రాగి 1 : 2 నిష్పత్తిలో ఉంటాయి. రెండవ మిశ్రమంలో, అదే మూలకాలు 2 : 3 నిష్పత్తిలో ఉంటాయి. ఈ రెండు మిశ్రమాలను కలిపి ఒక కొత్త మిశ్రమలోహాన్ని ఏర్పరిచారు, ఇలా ఏర్పడిన దానిలో రెండు మూలకాలు 5 : 8 నిష్పత్తిలో ఉంటే, కొత్త మిశ్రమలోహములలో ఈ రెండు మిశ్రమాల నిష్పత్తి ఎంత ఉంటుంది కనుగొనండి?

(a) 3 : 10

(b) 3 : 7

(c) 10 : 3

(d) 7 : 3

Q6. ఒక జాడీలో A మరియు B అనే రెండు ద్రవాల మిశ్రమం 4: 1 నిష్పత్తిలో ఉంటుంది. 10 లీటర్ల మిశ్రమాన్ని బయటకు తీసి, 10 లీటర్ల ద్రవాన్ని B జాడీలో పోసినప్పుడు. ఈ నిష్పత్తి 2 : 3 గా మారింది. జాడీలో ఉండే ద్రవం A యొక్క పరిమాణం ప్రాథమికంగా ఎంత ఉండేది కనుగొనండి?

(a) 4 లీటర్లు

(b) 8 లీటర్లు

(c) 16 లీటర్లు

(d) 40 లీటర్లు

Q7. 75 లీటర్ల మిశ్రమంలో, పాలు మరియు నీటి నిష్పత్తి 2 : 1. పాలు మరియు నీటి నిష్పత్తి 1 : 2 గా చేయడం కొరకు మిశ్రమంలో జోడించాల్సిన నీటి మొత్తం ఎంత కనుగొనండి?

(a) 45 లీటర్లు

(b) 60 లీటర్లు

(c) 75 లీటర్లు

(d) 40 లీటర్లు

Q8. A మరియు B అనే మిశ్రమాలను బంగారం మరియు రాగి లోహాలను వరుసగా 5: 3 మరియు 5: 11 నిష్పత్తిలో కలపడం ద్వారా తయారు చేస్తారు. ఈ మిశ్రమాల సమాన పరిమాణంలో కలపడం ద్వార మూడవ మిశ్రమం C ఏర్పడుతుంది. మిశ్రమం C లో బంగారం మరియు రాగి నిష్పత్తి ఎంత ఉంటుంది కనుగొనండి?

(a) 25 : 13

(b) 33 : 15

(c) 15 : 17

(d) 17 : 15

Q9. రెండు రకాల మిశ్రధాతువులు బంగారం మరియు వెండిని 7 : 22 మరియు 21 : 37 నిష్పత్తిలో కలిగి ఉంటాయి. బంగారం మరియు వెండి 25: 62 నిష్పత్తిలో ఉండే కొత్త మిశ్రధాతువును కలిగి ఉండటానికి ఈ మిశ్రమాలను ఏ నిష్పత్తిలో కలపాలి కనుగొనండి?

(a) 13 : 8

(b) 8 : 13

(c) 13 : 12

(d) 6 : 9

Q10. సంవత్సరానికి 7 1/2% చొప్పున 15 నెలల కు ఒక నిర్దిష్ట మొత్తం సాదారణ వడ్డీకి ఇవ్వగా వచ్చిన సాధారణ వడ్డీ, సంవత్సరానికి 12 1/2% చొప్పున 8 నెలల పాటు అదే మొత్తంపై సాదారణవడ్డీకి ఇచ్చినప్పుడు వచ్చిన వడ్డీ కంటే  రూ. 32.50 ఎక్కువగా ఉన్నది, అప్పుడు ఆ ఇచ్చిన మొత్తం (రూ.లో) ఎంత కనుగొనండి:

(a) 312

(b) 312.50

(c) 3120

(d) 3120.50

Daily Quiz in Telugu – జవాబులు

S1. Ans.(b)

S2. Ans.(b)

S3. Ans.(b)

S4. Ans.(a)

S5. Ans.(a)

S6. Ans.(b)

S7. Ans.(c)

S8. Ans.(c)

S9. Ans.(a)

S10. Ans.(c)

Daily Quiz in Telugu : Conclusion

APPSC మరియు TSPSC గ్రూప్-1,2,3,SI,కానిస్టేబుల్ అలాగే UPSC పరీక్షలలో ముఖ్యమైన అంశాలు అయిన పౌర శాస్త్రం , చరిత్ర , భూగోళశాస్త్రం, ఆర్ధిక శాస్త్రం, సైన్సు మరియు విజ్ఞానం, సమకాలీన అంశాలపై పట్టు కోసం Adda247, ఈ అంశాలకి సంబంధించిన కొన్ని ముఖ్యమైన ప్రశ్నలను మీకు ప్రతిరోజు క్విజ్ రూపంలో అందిస్తుంది.

Daily Quiz in Telugu : FAQs

Q1.తెలుగు లో కరెంట్ అఫైర్స్(సమకాలీన అంశాలు)కు ఉత్తమ వెబ్‌సైట్ ఏది?

: తాజా  సమకాలీన అంశాలను కవర్ చేయడానికి ఉత్తమ మార్గం రోజువారీ వార్తాపత్రికను చదవడం మరియు కొన్ని విశ్వసనీయ వెబ్‌సైట్‌లను అనుసరించడం. రోజువారీ సమకాలీన అంశాలు Adda247  ఉత్తమ వెబ్‌సైట్-adda247/te లో అందించబడుతుంది. ఇది adda247/te వెబ్‌సైట్‌ తో పాటు యప్ లో కూడా అందుబాటులో ఉంటుంది.

Q2. Adda247 కరెంట్ అఫైర్స్ PDF తెలుగులో అందిస్తుందా?

:అవును, Adda247  తెలుగు భాషలలో కూడా వారం,నెలవారీ కరెంట్ అఫైర్స్ PDFలను అందిస్తుంది.

Q3. తెలుగులో Adda247 యప్ ను వీక్షించడం ఎలా?

జ: యప్ డౌన్లోడ్ చేసుకొని,స్టేట్ ఎగ్జామ్స్ ఎంచుకొని,ఆంధ్రప్రదేశ్ & తెలంగాణ పై క్లిక్  చేసి బాష ను తెలుగు లోకి మార్చడం ద్వారా వీక్షించగలరు.

ఆన్లైన్ లైవ్ క్లాసుల వివరాల కొరకు ఇక్కడ క్లిక్ చేయండి 

ఉచిత స్టడీ మెటీరియల్ పొందండి:

జూలై నెలవారీ కరెంట్ అఫైర్స్ PDF జూలై top 100 కరెంట్ అఫైర్స్ PDF
ఆంధ్రప్రదేశ్ స్టేట్ GK PDF తెలంగాణ స్టేట్ GK PDF
తెలుగులో బ్యాంకింగ్ అవేర్నెస్ pdf తెలుగులోకంప్యూటర్ అవేర్నెస్ pdf
తెలుగులో పాలిటి స్టడీ మెటీరియల్ pdf  తెలుగులో ఎకానమీ స్టడీ మెటీరియల్ pdf

Sharing is caring!